Search This Blog

Lalitha sahasram 501-750


501Mamsanishta
మాంసనిష్ఠా
She who gives shakti to 'Mamsa' Dhatu of our body. All muscles are formed with this 'Mamsa' dhatu. Those who are weak can meditate upon this devata with the mantra 'Om Mamsanishtaai namah'. Then she blesses with good strength.
మణిపూరము మాంసధాతువుకు స్థానము. ఇక్కడ ఉండే దేవత మాంస ధాతువునకు అధిష్ఠాత్రి. శరీరానికి మాంసమే పుష్టి. ఇది అన్నిజీవుల శరీరాలయందు ఉంటుంది. ఎవరికైనా శరీరంలో మాంసము సరిగా లేకపోయినప్పుడు 'ఓం మాంసనిష్టాయై నమః' అని జపం చేసినట్లైతే ఈ దేవత అనుగ్రహం కలుగుతుంది. సాధకుని శరీరంలో మాంసవృద్ధి జరుగుతుంది.
502Gudanna preethamanasa
గుడాన్న ప్రీతమానసా
1 ser Rice, 1/4 ser jaggery, Milk 2 sers, Ghee 1/2 ser
Mix coconut, ripe banana with the above to prepare Gudanna. Such rice has to be offered to this devata and then consumed as her prasad. This gives good strength.
ఒక శేరు బియ్యం, బెల్లం పావుశేరు, పాలు రెండు శేర్లు, నెయ్యి అర్ధశేరు, వీటికి కొబ్బరి, అరటిపండు కలిపి వండిన పదార్థమే గుడాన్నము. ఈ రకంగా వండిన అన్నాన్ని ఈ దేవతకు నివేదన చెయ్యాలి. ఈ ఆహారము శరీరపుష్టినిస్తుంది.
503Samastha bhaktha sukhadha
సమస్త భక్త సుఖదా
By worshipping as the above, Vayovastha vivarjita is pleased and gives boons.
ఈ రకంగా ఉపాసన చేసినట్లైతే వయోవస్థావివర్జితా అనబడే ఈ దేవత భక్తుల యొక్క కోరికలు తీర్చి వారికి సమస్త సుఖాలను ఇస్తుంది.
504Lakinyambhaswaroopini
లాకిణ్యంబాస్వరూపిణి
The beeja, Shakti, Keelaka of Vayovastha vivarjita are represented by 'La'. Hence she is called 'Lakini'. 
మణిపూరాధిష్టా దేవత యొక్క బీజము, శక్తి కీలకము అన్నీ కూడా ల కార సంకేతంగానే ఉంటాయి. కాబట్టి ఈ దేవతను లాకిన్యంబా అంటారు.
505Swadhishtanambujagatha
స్వాధిష్టానాంబుజగతా
Swadishtana is a six petalled lotus situated below the belly button. It has letters from 'Ba' to 'La' in its petals. Its element is Fire. Brahmi is the adidevata and Siddheswari is the adishtana devata of this chakra.
మూలాధార చక్రానికి కొద్దిగా పైభాగాన ఉంటుంది. స్వాధిష్ఠానచక్రము. ఇది ఆరుదళాలు గల పద్మము. అగ్నితత్త్వాత్మకము. దీనిలోని ఆరుదళాలలోను బ నుంచి ల వరకు అక్షరాలుంటాయి. ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధేశ్వరి'.
506Chathurvakthramanohara
చాతుర్వక్త్రమనోహరా
She who has four beautiful faces
ఈ దేవతకు నాలుగుముఖాలుంటాయి.
507Shulayudhasampanna
శూలాయుధసంపన్నా
Siddheswari has 4 hands. She holds Spear, the noose as the weapon of Yama, skull and Abhaya mudra.
సిద్ధేశ్వరి అనే దేవతకు నాలుగుచేతులు ఉంటాయి. ఈ చేతులయందు శూలము, పాశము, కపాలము, అభయముద్రలు ఉంటాయి. అందుకనే ఈమె శూలాద్యాయుధ సంపన్నా అనబడుతుంది.
508Peethavarna
పీతవర్ణా
She who is of golden yellow colour
ఈ దేవి పసుపుపచ్చని శరీరవర్ణము గలిగి ఉంటుంది.
509Athigarvitha
అతిగర్వితా
She who is very proud. She represents abundance of beauty and wealth.
ఈమె మహాసౌందర్యవతి. సౌందర్యము సంపదలతో కూడి అతిశయము కలది. కాబట్టి అతి గర్వితా అనబడుతుంది.
510Medhonishta
మేదోనిష్టా
Medha means grey matter in the brain. Siddheswari is present in the grey matter. She can be pleased by chanting 'Om Medhonishtayai namah'. One can improve brain power by pleasing her.
తల లోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్నే మేదస్సు అంటారు. ఇదే మెదడు. ఈ సిద్ధేశ్వరీ దేవత మేదోధాతువు నందు ఉంటుంది. మేదస్సు కావలసినవారు 'ఓం మేదోనిష్టాయై నమః' అని జపంచేసి ఆ దేవతను తృప్తి పరచినట్లైతే మేదస్సువృద్ధి అవుతుంది.
511Madhupreetha
మధుప్రీతా
Goddess Siddheswari likes honey. Honey helps in improving brain power.
సిద్ధేశ్వరీదేవి మధువు అంటే తేనె యందు ప్రీతి గలది. తేనె మేదస్సును పెంచుతుంది. తేనె, నెయ్యి, పంచదారలను త్రిమధురములు అంటారు. 
512Bhandinyadhisamanvitha
బంధిన్యాదిసమన్వితా
Goddess Siddheswari is at the center of this chakra. She is surrounded by 1. Bandhini, 2.Bhadrakali, 3.Mahamaaya 4. Yashaswini, 5 Rama 6.Lamboshtitha
సిద్ధేశ్వరీదేవి ఈ పద్మము మధ్యలో ఉండగా బందిని మొదలైన దేవతా శక్తులు చుట్టూ ఉన్న ఆరు దళాలలోనూ ఉంటారు. వారు 1. బందిని 2 భద్రకాళి 3. మహామాయ 4. యశస్విని 5. రమా 6. లంబోష్ఠితా
513Dhadyannasaktha hridhaya
దధ్యన్నాసక్త హృదయా 
Goddess Siddheswari likes rice mixed with curd(yoghurt)
దధ్యన్నమునందు ఆసక్తి గలది. దధ్యన్నము అంటే పెరుగుతో కలిపిన అన్నము.
514Kakiniroopadharini
కాకినీరూపధారిని
Goddess Siddheswari's beeja, shakti, keelaka are all represented by 'Ka'. Hence she is called “Kakini”
స్వాధిష్ఠాన చక్రానికి అధిదేవత అయిన సిద్ధేశ్వరీదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ కకార సంకేతంగానే ఉంటాయి అందుచేత ఆమె కాకిన అనబడుతుంది. 
515Mooladrambujarooda
మూలాధారాంబుజారూఢా
This is called the base chakra. It located below the spinal cord.
దీన్నే ఆధారచక్రము అంటారు. మూల అంటే - గుదస్థానం.
516Panchavakthra
పఞ్చవక్త్ర
Siddha vidya devi has 5 faces. They are 'Sadyojata', 'Vaama deva', 'Aghora', 'Tatpurusha' 'Eesaana'
ఈ చక్రాధిష్ఠానదేవత అయిన సిద్ద విద్యాదేవికి ఐదుముఖాలుంటాయి. అవే ఐదుతలలు. ఈ ఐదుతలలే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు.
517Asthisamsthitha
అస్థిసంస్థితా
Siddha vidya devi is present in 'Asthi - Bones' dhatu. She can be pleased by chanting 'Om Asthi samsthitaayai namah'. She helps in improving bone strength.
సిద్ధ విద్యాదేవత అస్థి ధాతువు నందు ఉంటుంది. ఎముకలు పుష్టిగా లేనివారు,ఎముకలు విరిగినవారు త్వరగా కోలుకోవాలంటే 'ఓం అస్థి సంస్థితాయై నమః' అని జపం చెయ్యాలి.
518Ankusadi praharana
అంకుశాది ప్రహరణా 
Goddess Siddha vidya holds an elephant goad, lotus flower, book and Gnana mudra in her four hands. 
సిద్ధ విద్యాదేవత తన నాలుగుచేతులయందు అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ధరించి ఉంటుంది.
519Varadadhinishevitha
వరదాదినిషేవితా
Goddess Siddha vidya is surrounded by 4 shakthis. They are: 1.Varadha, 2.Sri, 3.Shanda and 4.Saraswati
ఈ సిద్ధవిద్యాదేవి ఆధారచక్రంలోని మధ్య ప్రదేశంలో ఉండగా, ఆమె చుట్టూ 1. వరద  2. శ్రీ 3. షండా  4. సరస్వతి అనే శక్తులు పరివేష్టించి ఉంటాయి.
520Mudgoudanasakthachittha
ముద్గౌదాన్నసక్తచిత్తా
Mudgoudanna means rice mixed with green gram dal.
Goddess Siddha vidya likes it very much.
ముద్గౌదాన్నము అంటే - పెసరపప్పు కలిపి వండిన అన్నము. ఈ ముద్గౌదాన్నము లేక సిద్ధాన్నము నందు ఈ దేవికి మక్కువ ఎక్కువ.
521Sakinyambha swaroopini
సాకిన్యంబా స్వరూపిణీ
Goddess Siddha vidya's beeja, Shakti and keelaka are all represented by the syllable 'Sa'. Hence she is called  “Sakini”
మూలాధార చక్రాధిదేవత అయిన సిద్ధవిద్యాదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ సకార సంకేతంగా ఉంటాయి. కాబట్టి ఈమెను సాకిని అంటారు. 
522Agnachakrabjanilaya
ఆజ్ఞాచక్రాబ్జానిలయ
Agna chakra is present in between the two eyebrows. All sense organs receive orders from this chakra. Agna means order. Hence this is called Agna chakra. 
భ్రూమధ్యభాగంలో రెండు దళాలు కలిగి ఉన్న స్థానాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. అన్ని ఇంద్రియాలకు ఇక్కడి నుంచే ఆజ్ఞలు జారీచేయబడతాయి. కాబట్టి దీన్ని ఆజ్ఞాచక్రము అంటారు.
523Shuklavarna
శుక్లవర్ణా 
She who is white coloured
ఆజ్ఞాచక్రమందుండు సిద్ధిమాత వర్ణము తెలుపు.
524Shadanana
షడాననా 
She who has six faces
సిద్ధమాతకు ఆరుముఖాలుంటాయి. వాటినే ఆరు శిరస్సులు అంటారు.
525Majjasamstha
మజ్జాసంస్థా
Majja means bone marrow. This is one of the 7 elements with which the body is formed. Those with bone marrow related problems can cure their ailments by chanting 'Om Majjasamsthayai namah'. 
ఈ సిద్ధేశ్వరీదేవత మజ్జ యందుంటుంది. మజ్జ అంటే - ఎముకల యందు ఉండే గుజ్జులాంటి పదార్ధము. 'ఓం మజ్ఞాసంస్థాయై నమః' అని జపం చేస్తే మజ్జ అనే పదార్ధం లోపించిన వారికి అది కలుగుతుంది.
526Hamsavathimukhya shakthisamanvitha
హంసవతీముఖ్యశక్తి సమన్వితా
As Siddhamaata is at the center of Agna chakra, two shaktis, 1. Hamsavati, 2. Kshamavati are present in its two petals. These shaktis are nothing but 1. Inhalation 2. Exhalation
సిద్ధమాత అనబడే ఈ దేవత ఆజ్ఞాచక్ర కర్ణికలో ఉండగా రెండు దళాలయందు హంసవతీ క్షమావతి అని రెండు శక్తులు పరివేష్టించి ఉంటాయి. ఈ రెండు శక్తులే ఉచ్ఛ్వాసనిశ్వాసలు.
527Haridrannaika rasika
హరిద్రాన్నైక రసికా
She who likes rice mixed with turmeric powder (Pulihora)
సిద్ధమాతకు హరిద్రాన్నమునందు('పులిహోర') మక్కువ ఎక్కువ.
528Hakiniroopadharini
హాకినీరూపధారిణీ
Siddha maata's Shakti, beeja and keelaka are represented by the syllable 'Ha'. Hence, she is called Hakini.
ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత అయిన సిద్ధమాత యొక్క మంత్రానికి శక్తి, బీజము, కీలకము అన్నీ హకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెను హాకినీ అంటారు.
529Sahasradhalapadhmastha
సహస్రదళపద్మస్ధా

There is a 1000 petalled lotus near the topmost part of our head. It has 8 large petals in each of the 8 directions. In each of these there are 125 small petals. hence it is called 1000 petalled lotus.
షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రదళపద్మమున్నది. ఇందులో ఎనిమిది దిక్కులకు ఎనిమిది దళాలుంటాయి. ఒక్కొక్క దళంలోనూ 125 చిన్నచిన్న దళాలుంటాయి. ఈ రకంగా మొత్తం వేయిదళాలుంటాయి. అందుకే దీన్ని సహస్రదళపద్మము అంటారు.
530Sarvavarnopishobitha
సర్వవర్ణోపిశోభితా
Goddess Yashaswini shines in all colours. In the 6 chakras, each chakra has a colour and a few letters. This is the 7th and final chakra. So, it has all the colours and letters in it.
సహస్రారంలో యశస్విని అనే ఈ దేవత అన్ని వర్ణములు అంటే రంగులతోనూ ప్రకాశిస్తుంటుంది. అన్ని అక్షరములతోనూ ప్రకాశిస్తుంటుంది. పైన చెప్పిన షట్చక్రాలలోను అక్షరాలు విడివిడిగా ఉంటాయి అని చెప్పాం. కాని ఇక్కడ అ నుంచి క్ష వరకు అన్ని అక్షరాలు ఉంటాయి.
531Sarvayudhadhara
సర్వాయుధధరా
The goddesses of the 6 chakras behold a few weapons in their hands. But Yashaswini has infinite hands. She has all the weapons that are created by Brahma. There is no weapon in this whole universe that Yashaswini doesn't possess.
ఇంతవరకు చెప్పిన చక్రాలలో దేవతలు తమ నాలుగుచేతులయందు ఆయుధాలు ధరించి ఉంటారు. కాని ఇక్కడ ఉండేది పరమేశ్వరి. ఆవిడకు అనేక చేతులు ఉంటాయి. 
కాబట్టి అన్ని చేతులయందు అన్నిరకాల ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆమె చేతిలో లేని ఆయుధం లోకంలో లేనేలేదు.
532Shuklasamsthitha
శుక్లసంస్థితా 
Shukla is the essense of all the other dhatus(elements). It is present all over the body. Yashaswini is present in Shukla Dhatu. She can be pleased by chanting Om Shukla Samsthitayai namah.
ఈ దేవత సర్వధాతుసారమైన శుక్లమందుంటుంది. ఇది శరీరమంతా వ్యాపించి ఉండే ధాతువు. కాబట్టి ఈ దేవత జీవకోటి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ధాతుపుష్టి లేని వాళ్ళు ఓం శుక్ల సంస్థితాయై నమః అని జపం చేస్తే ధాతువృద్ధి కలుగుతుంది.
533Sarvathomukhi
సర్వతోముఖీ
She who has faces everywhere
ఈ దేవతకు అన్ని వైపులా ముఖాలుంటాయి. 
534Sarvoudhanapreetha chittha
సర్వాయుధానప్రీతచిత్తా 
She who likes all types of foods
అన్నిరకాలయిన ఆహారములందు ఈమెకు ప్రీతి ఉంటుంది.
535Yakinyambaswaroopini
యాకిన్యంబాస్వరూపిణీ
The beeja, shakti and keelaka of Goddess Yashaswini are represented by the syllable 'Ya'. So she is named as “yakini”
యశశ్వినీ అనబడే ఈ దేవత యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ యకార సంకేతముగానే ఉంటాయి. అందుకే ఆమెను యాకినీ అంటారు.
536Swaha
స్వాహా
She who is personification of Swaha ( the manthra chanted during fire sacrifice ).
యజ్ఞాలలో వేసే హవిస్సులను దేవతలకు అందించే స్వాహా దేవి అమ్మ స్వరూపమే.
537Swadha
స్వధా
 
Brahma created 'Swadha' and assigned her the job of carrying tarpanas to pitru devatas. పితృదేవతలకు తర్పణలు అర్పించేటప్పుడు కుడిచేతి బ్రొటనవేలు కిందికి ఉంచి నువ్వులు నీళ్ళు వదులుతూ స్వధాంతర్పయామి అంటారు. ఆ వదిలిన తర్పణ స్వధాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతుంది. 
538Amathi
అమతి
She who is ignorance
అవిద్యాస్వరూపము
539Medha
మేధా
She who is knowledge
మేధ అంటే - బుద్ధి అని అర్ధం. సకలశాస్త్రసారమైనది మేధ. సర్వభూతాలయందు ఆ పరమేశ్వరి మేధారూపంలో ఉన్నది.
540Sruthi
శృతి
She who is the Rig, Yajas, Sama and Atharvana Vedas
ఋగ్ యజు స్సామ అధ్వరణ వేదాలు శ్రుతులనబడతాయి.
541Smrithi
స్మృతి
Learning Vedas are not everyone's cup of tea. However, the knowledge of vedas will benefit everyone. Hence rishis like, Manu, Yagnavalkya, parasara gave us smritis. These are the essence of all the vedas. If the one that can be learnt by listening is called 'Sruthi', then the one that should be kept in active memory through continuous repetition is called 'Smriti'
వేదాలన్నింటిని అందరూ చదవలేరు. చదివినా అర్థం కావు. అందుకే మనువు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులు వేదసారాన్ని స్మృతులుగా కూర్చారు. శ్రవణం ద్వారా తెలుసుకునేది వేదం అయితే ఎల్లప్పుడూ స్మరిస్తూ స్మ్రుతి పధంలో ఉంచుకోవాల్సినవి స్మృతులు. 
542Anuthama
అనుత్తమ
Goddess Yashaswini is in Sahasrara. She is Yakini. She is infinite. She is swaha and swadha. She is intellect. Shrutis and smruthis are her forms. She is above all. There is nothing greater than her.
సహస్రారంలో ఉండే దేవత యశస్విని. ఆమె యాకిని అనే పేరుతో పిలువబడుతుంది. ఆమె అనంతమైనది శాశ్వతమైనది. దేవతలకు హవిస్సులర్పించే స్వాహాదేవి ఆమె. పితృదేవతలకు తర్పణలందించే స్వధాదేవి ఆమె. జగత్తుకు మూలకారణమైన మూలప్రకృతి ఆమె. ఆ దేవతయే బుద్ధి, వేదమాత, శ్రుతులు స్మృతులు కూడా ఆమెయే. ఈరకంగా ఆమె ఉత్తమమైనది. ఆమెకన్న అధికులుగాని, ఆమెతో సములుగానిలేరు 
543Punyakeerthih
పుణ్యకీర్తిహ్
Virtuous means actions that accrue Punya. Virtue is the advantage gotten by virtuous actions (Punya phala). Punya keerthi means those who pray Divine mother have lot of fame due to their virtuous deeds
నిత్యం లలితా సహస్రం అధ్యయనం చేసే వారికి ఎంతో గొప్ప  పుణ్యం తద్వారా కీర్తి కలుగుతుంది. 
544Punyalabhya
పుణ్యలభ్యా

Virtuous means actions that accrue Punya. Virtue is the advantage gotten by virtuous actions (Punya phala). Punya Labhya means one should have accrued a decent amount of Punya even to be qualified to listen and sing about Divine Mother. So You should feel blessed if you are reading this Nama.
అసలు లలితా సహస్రం అధ్యయనం చేయాలంటేనే ఎంతో గొప్ప పుణ్య బలం ఉండాలి. కాబట్టి మీరు నామం చదువుతున్నారంటే ఇంతకముందు ఏంటో గొప్ప పుణ్యం చేసి ఉంటారని గ్రహించాలి. 
545Punyasravanakeerthana
పుణ్యశ్రవణకీర్తన
Virtuous means actions that accrue Punya. Virtue is the advantage gotten by virtuous actions (Punya phala). Punya sravana keerthana means one accrues Punya just by listening or singing about Divine Mother.
లలితా సహస్రం విన్నా, చదివినా, చెప్పినా ఎంతో గొప్ప పుణ్య ఫలం కలుగుతుంది. 
546Pulomajarchita
పులోమజార్చితా
She who is worshipped by Sachi devi. Wife of Indra, daughter of Puloma.
పులోముని కుమార్తె అయిన శచీదేవిచే పూజించబడినది. ఈమె ఇంద్రుని భార్య.
547Bandhamochini
బంధమోచనీ
She who removes the bonds caused due to ignorance. She who helps in our triumph over Arishadvarga. She who protects her children from Raga and Dwesha. Please click on the Nama for more information on this nama.
అవిద్యాసంబంధమైన బంధాలను విడిపించేది. లౌకిక బంధాల నుండి విముక్తి కలిగించేది. అరిషడ్వర్గాలను జయింపచేసేది. రాగద్వేషాల నుండి తన భక్తులకు విడుదల కలిగించేది. 
ఈ నామం యొక్క పూర్తి వివరం తెలుసుకొందుకు నామం పై క్లిక్ చేయండి.
548Barbharalaka
బర్బరాలకా 
She who has forelocks which resembles waves
మనోహరమై, దట్టమై, వంకరలు తిరిగిన ముంగురులు గలది.
549Vimarsaroopini
విమర్శరూపిణి
Shakti cannot be perceived by senses. You can see the hand moving. But can you see the energy behind that action. This whole universe has emerged from that un perceivable Shakti. If parameswara is the prakaashamsa, Divine mother is the shakti(Vimarshaamsha).
వెనుకనుండి కదిలించే శక్తి పరమాత్మ యొక్క విమర్శరూపం. శక్తిని ఇంద్రయాలతో తెలుసుకోలేము. కదిలే చేయి కనిపిస్తుంది. కానీ దాన్ని కదిలించే శక్తి కనపడుతుందా? ఈ జగత్తు విమర్శ రూపమైన శక్తి నుంచే ఆవిర్భవించింది. పరమేశ్వరుడు ప్రకాశాంశ అయితే ఆయనను కదిలేంచే శక్తి విమర్శంశ. 
550Vidhya
విద్య
She who is embodiment of true knowledge. She who helps in liberation.
విద్య అంటే జ్ఞానరూపమైనది, మోక్షదాయకమైనది విద్య.
551Viyadhadhijagatprasooh
వియదాదిజగత్ప్రసూహ్
Viyath means sky (space). She who gave birth to this universe that has the sky, the earth, the water etc.  
వియత్ అంటే ఆకాశము. ఆకాశము మొదలైన జగత్తులను ప్రసవించినది, లేక సృష్టించినది.
552Sarvavyadhiprasamani
సర్వవ్యాధిప్రశమనీ
Divine mother cures all diseases. 
సమస్తమైన వ్యాధులను నాశనము చేయునది. అమ్మ తన పిల్లల యొక్క వ్యాధులన్నింటినీ శమింపచేస్తుంది.
553Sarvamrutyunivarini
సర్వమృత్యునివారినీ
Those who believe in Parameswara have no death. In vedas, it is described that 'Those who know Mahadeva are overcoming over death".
వరమేశ్వరుణ్ణి నమ్మినవాడికి మృత్యువుండదు. వేదంలో 'మహాదేవుని తెలుసుకున్నవాడు మృత్యువును జయిస్తున్నాడు' అని చెప్పబడింది.
554Agraganya
అగ్రగణ్యా
She who is above and beyond all and everything. The whole creation came from her womb. She is the first one.
ఆమె నుంచే ఈ జగత్తంతా సృష్టించబడింది. కాబట్టి అందరికన్నా ఆది, అనాది అయినది ఆ పరమేశ్వరియే అందుకే అగ్రగణ్యా అనబడుతోంది. 
555Achintyaroopa
అచింత్యరూపా
She who is beyond thought. 
పంచభూతభావనలేనిది. ఆవాంగ్మాన గోచరమైనది.
556Kalikalmashanashani
కాలికల్మషనాశనీ
Divine Mother can help us wash out all sins.
అమ్మను స్మరిస్తేనే చాలు సకల పాపాలు నశిస్తాయి.
557Kathyayini
కాత్యాయనీ
She is the sum total of the effulgence (tejas) of all gods and goddesses. Kathyayini is the presiding deity of Odyana peetha, situated at Agna cakra.
సమస్త దేవతల  తేజస్సుతో ఉద్భవించిన దేవి కాత్యాయని. ఆమె ఓడ్యాన పీఠమందు ఉంటుంది. 
558Kalahanthri
కాలహంత్రీ
At the beginning of creation, both space and time emerge. At the end of creation, they both submerge into Paramatma. Paramatma is absolute. There is no notion of space or time until the creation begins again. Kala hanthri denotes this phenomenon. 
సృష్టి ఆదిలో కాలము ఉద్భవిస్తుంది. మహా ప్రళయానంతరం అది పరమాత్మలో లీనమైపోతుంది. మళ్ళీ సృష్టి జరిగే వరకు  కాలముండదు. బిందు రూపంలో పరమాత్మే ఒక్కడే ఉంటాడు. కాలాన్ని కూడా తనలో కలిపేసుకుంటుంది కనుక కాల హంత్రి. 
559Kamalakshanishevitha
కమలాక్షనిషేవితా
She who is being worshipped by the lotus eyed Vishnu. By worshipping Divine Mother, Vishnu got his position.
కమలాక్షుడు అంటే - విష్ణువు. అతనిచే ఎక్కువగా సేవించబడినది.పద్మపురాణంలో 
ఇంద్రనీలమయమైన పరమేశ్వరిని అర్చించి విష్ణువు విష్ణుత్వం పొందినాడు అని చెప్పబడింది.
560Thamboolapoorithamukhi
తాంబూలపూరితముఖీ
She whose mouth is filled with pan (betel leaves, betel nut and lime). If mother is having pan, then it indicates that rest all in the house had already finished their food. Divine mother is mother of 84 lakh species. A pan in her mouth is to indicate that she feeds them daily.
తాంబూలముచే నిండిన ముఖము గలది. అమ్మ తాంబూలం వేసుకుంది అంటే ఇంట్లో మిగతావారంతా కడుపునిండా భోజనం చేసేశారని అర్ధం. మన అమ్మ అన్నపూర్ణేశ్వరి. 84 లక్షల జీవ రాశులను పోషిస్తుంది. ఆవిడ తాంబూల చర్వణం దీనికి నిదర్శనం. 
561Dhadimikusumaprabha
దాడిమీకుసుమప్రభా
One who glows in the color of a Pomegranate flower. 
అమ్మ  శరీరవర్ణం, దానిమ్మపూలరంగు రెండూ ఒకటిగానే ఉంటాయి.
562Mrgakshi
మృగాక్షి
She who has eyes like deer. The eyes of deer are big and wide. They are not stable. The eye ball oscillates frequently.
జింకవంటి కనులు గలది. పరమేశ్వరి లేడివంటి కనులు గలది. లేడికళ్ళు పెద్దగా ఉంటాయి. స్థిరంగా ఉండవు. చంచలమైనవి
563Mohini
మోహిని
She who bewitches. 
మోహింపచేయునది కాబట్టి మోహిని అనబడుతుంది. 
564Mukhya
ముఖ్యా
She who is the chief. The first.
అన్నింటికన్న ముఖ్యమైనది. ముందుగా పుట్టినది. 
565Mridani
మృడానీ 
Mrida means the one who enjoys the bliss of Atman always. Mridani is his Shakti.
ఎల్లవేళలయందు ఆత్మజ్ఞానంలో తేలియుండేవాడు మృడుడు. ఆనందస్వరూపుడు. 
ఆ మృడుని యొక్క శక్తి మృడానీ
566Mithraroopini
మిత్రరూపిణీ
She who is of the form of Sun. Each of the 12 Adityas has their own tejas(glow). It is form of Divine mother. 
మిత్రుడు అంటే - సూర్యుడు. ద్వాదశాదిత్యులకు ద్వాదశ కళలు ఉన్నాయి. ఈ కళలు అన్ని అమ్మ స్వరూపాలే అందుకే మిత్రరూపిణి అని అన్నారు.
567Nithyatruptha
నిత్యతృప్తా 
She who is always satisfied
సర్వకాల సర్వావస్థలయందు తృప్తి గలిగినది.
568Bhakthanidhi
భక్తనిధి 
Nava(Nine) Treasures:1. Kaala, 2. Shanka, 3.Vaisarpa, 4.Maanavaka, 5.Mahaakaala, 6.Padma, 7.Panduka, 8.Sarwaratna, 8.Pingalaka.With the intention to fulfil all our wants, Divine mother keeps Shanka and Padma nidhis with her always. These are the most precious of all the 9 Nidhis.
నవనిధులు: 1.కాళ, 2.శంఖ, 3.వైసర్ప, 4.మాణవక, 5.మహాకాళ, 6.పద్మ 7.పాండుక, 8.సర్వరత్న, 9.పింగళక అమ్మ ప్రక్కన శంఖ పద్మ నిధులు ఉన్నాయి. అవి నవనిధులలోకీ శ్రేష్ఠమైనవి.మరియు ఎంత సంపద తీసుకున్నా తరిగిపోనివి. మనందరి కోరికలు తీర్చటానికే ఆవిడ ఈ నిధులను తన దగ్గర ఉంచుకున్నది.
569Niyanthri
నియంత్రీ
Divine mother is the chief administrator. She assigns jobs to all the devatas, dikpalakas, grahas, nakshatras such that the administration of the whole universe goes smoothly.
లోకాలను నియమించునది. సమస్తదేవతలను, దిక్పాలకులను, గ్రహాలను, నక్షత్రాలను నియమించి లోకపాలన సజావుగా జరిగేటట్లు చూస్తుంది.
570Nikhileswari
నిఖిలేశ్వరీ 
The word eswari is used to represent command over something. It is used in the context of kings, rulers etc. Divine mother is the eswari of all the millions of galaxies.
ఈశ్వర అనే శబ్దం నాయకత్వాన్ని సూచిస్తుంది. రాజరికాన్ని, ప్రభుత్వాన్ని సూచిస్తుంది. రాజు, చక్రవర్తి అనే అర్ధంలో వాడబడుతుంది. అమ్మ సకల ప్రపంచాలకు, చతుర్దశభువనాలకు, అనేకకోటి బ్రహ్మాండాలకు ఈశ్వరి. 
571Maitryadhivasanalabhya
మైత్ర్యాదివాసనాలభ్యా
 
This name explains the four tendencies that help us in the path of liberation. They are 1.Friendship, 2.Mercy, 3.Respect, 4.Discretion. Divine mother helps in the path of liberation to those with these tendencies.
మైత్రి మొదలగు చతుర్విధ వాసనలతో పొంద దగినది. అవి 1. మైత్రి, 2. కరుణ, 3. ముదిత, 4. ఉపేక్ష. ఈ నాలుగు రకాల వాసనలచేత పొందదగినది. భాగవతంలో వీటిని వివరించటం జరిగింది.
572Mahapralayasakshini
మహాప్రళయసాక్షిణీ
God is eternal. But not his creation. The creation starts with evolution and ends with involution. During evolution it comes from God and at the end of the involution it dissolves in God. So technically, only God can know and witness all the evolutions and involutions.
మహాప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవరాశీ అంతా లయమైపోతుంది. ఆ మహాప్రళయానికి ఏకైక సాక్షి ఆ పరమేశ్వరియే అప్పుడు ఉండేది చిత్కలారూపమైన ఆమె తప్ప ఇంకెవరూ కాదు.
573Parashakthi
పరాశక్తి
Our body is made of 9 basic elements. They all came from Divine Mother.
శరీరం తొమ్మిది ధాతువులతో ఏర్పడింది. పదవధాతువు సాక్షాత్తూ పరమేశ్వరి.
574Paranishta
పరానిష్టా
All actions, all heavenly bodies, all beings dissolve in Divine Mother.
అన్ని కర్మలు, అన్ని జగత్తులు కూడా అమ్మ యందే లయం చెందుతాయి.
575Prgnanaghanaroopini
ప్రజ్ఞానఘనరూపిణీ
She who is the personification of knowledge and consciousness. నిత్యము జ్ఞానమయమైనది. అవిద్యా లేక అజ్ఞానముచేత ఏ మాత్రమూ తాకబడనిది.
576Madhvipanalasaa
మాధ్విపానలాసా
She who is imbued in the bliss of Atman. That is Pragnana Ghanaroopa. In this state, the mind and the senses lose consciousness. There is no sense or notion of I or Me. Everything is God and he is the only one.
నిరంతరము బ్రహ్మానందానుభవము పొందుతూ విశ్రాంతిగా నిర్వికారస్థితిలో ఉండేటటువంటిది. అదే ప్రజ్ఞాన ఘనరూపము. ఆ స్థితిలో బాహ్యేంద్రియాలు పని చెయ్యవు. ద్వైతభావన ఉండదు. అంతా బ్రహ్మమయమే. 
577Mattha
మత్త
Mattha is a state of trance. One loses the consciousness of mind and senses. Like explained above, it cannot be described in words. A yogi who raised kundalini to Sahasrara is in this state.
మత్త అంటే బాహ్యేంద్రియ జ్ఞానం కోల్పోయిన స్థితి. శరీరం  తేలిపోతున్నట్లుగా,  కొత్తగా, చాలా గొప్పగా ఉంటుంది. పైన  చెప్పిన విధంగా అది అనుభవైకవేద్యం. అనిర్వచనీయం. కుండలిని సహస్రారం చేరుకున్న తరువాత యోగి స్థితి ఇదే. 
578Mathrukavarnaroopini
మాతృకావర్ణరూపిణీ
Matruka means letters from 'Aa' to 'Ksha'. She who has these letters as her shape and form.
మాతృకలు అంటే అకారాది క్ష కారాంతము ఉండే అక్షరాలు. క్షరము కానిది నాశనము లేనిది అక్షరము. ఆ అక్షరముల రూపం కలది.
579MahaKailasanilaya
మహాకైలాసనిలయ
Sri chakra is kailasa. Maha kailasa is the center dot of Sri chakra. Divine mother stays in maha kailasa.
శ్రీచక్రమే కైలాసము. అందులో బిందువు మహాకైలాసము. ఆ బిందువు నందుండునది.
580Mrinalamrudhudhorlatha
మృణాలమృదుదోర్లతా
She who has arms as tender as lotus stalk
తామరతూడులోని దారంలాగా మృదువైన హస్తములు గలది.
581Mahaneeya
మహనీయ
She who is fit to be venerated. Divine mother is worshipped by the great devatas like Indra.
పూజించతగినది కాబట్టి మహనీయా అనబడుతున్నది. అమ్మ  ఇంద్రాది దేవతలచే ఆరాధించబడుతుంది.
582Dhayamoorthi
దయామూర్తి
She who is personification of mercy. She is the mother of 84 lakh species. So her love towards us is unconditional and boundless.
దయయే రూపముగా గలది. పరమేశ్వరి జగత్తులో ఉండే జీవరాసికంతటికీ మాత. అందుచేత ఆమెయొక్క దయకు ప్రేమకు హద్దులు ఉండవు. కేవలము దయయే మూర్తిగా గలది కాబట్టి దయామూర్తి
583Mahasamrajyashalini
మహాసామ్రాజ్యశాలిని
She who is the chef of the world of Atman
మహా సామ్రాజ్యము అంటే ఆత్మ సామ్రాజ్యము. ఈ ఆత్మ సామ్రాజ్యానికి ప్రభ్వి.
584Atmavidhya
ఆత్మవిద్యా
Atma means the soul. As it describes the knowledge of soul, it is called atmavidhya
ఆత్మ జ్ఞాన రూపము గలది కావటంచేత ఇది ఆత్మవిద్య అనబడుతుంది.
585MahaVidhya
మహావిద్యా
Atma Vidhya is the greatest knowledge. It is brahma vidhya. It removes all bad and negative stuff and gives good.
ఆత్మవిద్యే మహావిద్య, అదే బ్రహ్మ విద్య. సర్వ అనర్ధాలను తొలగిస్తుంది కాబట్టి అది మహతత్త్వము గలిగినది. 
586Srividhya
శ్రీవిద్యా
Sri represents Parameswari. That which explains the yantras, mantras and tantras of all the shaktis is called vidhya. Srividhya means the knowledge of all the Yantras, Mantras and Tantras of Parameswari.
శ్రీ అంటే పరమేశ్వరి. స్త్రీ దేవతల గురించి చెప్పే యంత్ర తంత్ర మంత్ర విషయాలను 'విద్య' అని అంటారు. కాబట్టి శ్రీవిద్య అంటే ఆ పరమేశ్వరి యొక్క యంత్ర మంత్ర తంత్ర విభాగము. 
587Kamasevitha
కామసేవిత
She who is worshipped by Kama, the God of love. 
కామదేవుడైన మన్మథుడిచే ఉపాసించ బడినది.
588SriShodasaksharividhya
శ్రీషోడశాక్షరీవిద్యా
The sixteen lettered mantra is the most significant part of srividhya. It is not presented here because it has beejaaksharas. Request any srividhya enthusiasts to approach learned Gurus for the knowledge.
శ్రీవిద్యలో ప్రధానమైన మంత్రము షోడశాక్షరి. ఇది పదహారు అక్షరాలు గల మంత్రము. బీజాక్షరాలు ఉన్నందున మంత్రాన్ని ఇచట ఆవిష్కరించుట లేదు. శ్రీవిద్యాసక్తులు గురువులను ఆశ్రయించి జ్ఞానము సముపార్జించాలని ప్రార్ధన. 
589Trikoota
త్రికూటా
She who is divided in to three parts. 1.Head(Vaagbhava koota), 2.Neck to waist(kamaraja koota), 3.waist to feet(Shakti koota).
1.శిరస్సు - వాగ్భవకూటమి, 2.కంఠము నుండి కటి వరకు కామరాజకూటమి, 3.కటి నుండి క్రింది భాగము శక్తి కూటమి ఈ మూడింటినీ త్రికూటములు అంటారు. ఇదే అమ్మ యొక్క  మంత్ర స్వరూపం.  
590KamaKotika
కామకోటికా
This naama talks about Ardhanaarīshvara form, where one vertical form is Shiva and another is Shaktī.
శివుడు శక్తి నిటారుగా నిలుచుని ఉంటారు. శక్తిలోని ఎడమ భాగం శివుడిలోని కుడి భాగంతో కలిసి ఉంటుంది.
591Katakshakimkaribhootha kamalakotisevitha
కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా
Crores of Lakshmi devi's serve those who are blessed by Divine mother.
లలితమ్మ యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎవరియందుంటాయో వారిని కోటిమంది లక్ష్మీదేవులు సేవిస్తుంటారు.
592Shirasthitha
శిరస్థితా
Brahma randhram is the topmost point in our head. Divine mother stays at Brahma randhra. The Bindu of Sri Chakra is Brahma randhra
శిరసున బ్రహ్మరంధ్రం దగ్గర గురురూపంతో ఉండేది. శ్రీ చక్రంలోని బిందువే ఉపాసకులకు బ్రహ్మరంధ్రము.
593Chandranibha
చంద్రనిభా
Divine mother is glowing with the radiance of crores of suns and moons. Hence she is called Chandra Nibha.
అమ్మ కోట్లకొలది సూర్యచంద్రుల కాంతులతో ప్రకాశిస్తున్నది. అందుచేతనే చంద్రనిభా - చంద్రుని కాంతులతో ప్రకాశించునది అని చెప్పబడింది.
594Phalastha
ఫాలస్థా 
The agna chakra is in the forehead between the eyebrows. Divine mother stays here as Hrimkari. That is why gurus advise yogis to concentrate on this point during meditation.
ఆజ్ఞాచక్రము లలాటంలో కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఇక్కడ మన అమ్మ హ్రీమ్కరి రూపంలో ఉంటుంది. అందుకే జపం చేసేటప్పుడు భృకుటి మధ్య దృష్టి నిలపమని గురువులు బోధిస్తుంటారు. 
595IndraDhanuPrabha
ఇంద్రధనుప్రభా
We learnt about Hrimkari of Agna chakra in 594th name. Ardha chandra is situated above this. It shines like a rainbow.
ఆజ్ఞా చక్రంలో హ్రీమ్కరి గురించి 594వ  నామంలో తెలుసుకున్నాం. దీని పైన అర్ధ చంద్రము ఉంటుంది. అది  ధనుస్సులా మెరుస్తూ ఉంటుంది. 
596Hridayastha
హృదయస్థా 
She who is in the heart. Just like how the essence of the seed is spread through out the tree, the shakti present in the heart is spread in the whole world. Those who pray Divine mother in the noon should worship the shakti present in the heart.
హృదయస్థానంలో ఉండేది. మర్రి విత్తనంలో గల శక్తి అంతటా వ్యాపించినట్లే హృదయస్థానంలో ఉన్న ఈ శక్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఉపాసకులు మధ్యాహ్నకాలంలో హృదయంలో ఉండే శక్తిని ఉపాసించాలి.
597Raviprakhya
రవిప్రఖ్యా
There is a surya mandala in heart. Aadhaara and Swaadishtana are Agni mandala. Manipura and Anahata are Surya mandala. Vishuddhi and Agna chakra are Chandra mandala. Divine mother stays in heart and glows with the luster of Sun.
హృదయమందు సూర్యమండలమున్నది. ఆధారస్వాధిష్టానాలు - అగ్ని మండలం. మణిపూర అనాహతాలు - సూర్యమండలం. విశుద్ధి ఆజ్ఞాచక్రాలు - చంద్రమండలం. హృదయ స్థానంలో అమ్మ, సూర్యునివలె కాంతిపుంజమై విరాజిల్లుతూ ఉంటుంది. 

598Trikonantharadeepika
త్రికోణాంతరదీపికా
There is a triangle in Moolaadhaara. There is agni mandala in the middle of it. Divine mother Lalitha is the lamp shining in the middle of that triangle.
మూలాధార చక్రంలో త్రికోణమున్నది. దాని మధ్యలో అగ్నిమండలమున్నది. ఆ త్రికోణము మధ్యలో ప్రకాశించు దీపశిఖయే లలితమ్మ.
599Daakshaayani
దాక్షాయిని
Daughter of Daksha prajapathi. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె.
600Dhaithyahanthri
దైత్యహంత్రీ
She who killed demons like Bhandasura, Mahishasura, Shumbha, Nishumbha etc. భండాసురాది దైత్యులను సంహరించినది. భండాసుర, మహిషాసుర, శుంభ, నిశుంభ, మొదలగు దైత్యులను సంహరించినది.
601Dakshayagnavinasini
దక్షయఙ్ఞవినాశిని
Divine mother is the reason for desctruction of Daksha yagna.
దక్షుని యజ్ఞం నాశనం కావటానికి కారణమైంది కాబట్టి ఆవిడ దక్ష యజ్ఞ వినాశినీ అనబడింది.
602Dharandholitha deergakshi
ధరాందోళిత దీర్గాక్షి
Divine mother has long eyes that are spread till ears. Her eye balls oscillates slightly.The fear caused by ignorance is shattered when those eyes look at you.
కొంచెము చంచలమై, చెవులవరకు వ్యాపించిన కనులు గలది. ఆమెయొక్క కడకంటి చూపు సోకినంత మాత్రం చేతనే భయాలు తొలగిపోతాయి. 
603Darahaasojwalanmukhi
దరహాసోజ్వలన్ముఖీ
The happiness in heart is expressed on the face. Divine mother's face expresses the bliss of Atma.
హృదయంలో ఉన్న ఆనందం ముఖంలో కనిపిస్తుంది కాబట్టి దరహాసో జ్వలన్ముఖి అనబడుతుంది. అమ్మ ముఖంలోని ఆనందం ఆత్మనందానికి సూచికము.
604Gurumoorthi
గురుమూర్తి
If you want to learn you should approach a teacher. Guru is required for both para or apara vidya. A mother who teaches how to take baby steps is the first guru of our life. A Dad who teaches how to live is the second guru. One who teaches vidya is the third guru. God himself came in the avatar of Guru many times. Such is the significance of a Guru.
విద్య నేర్చుకోవాలంటే గురువులను ఆశ్రయించాలి. పరా విద్య అయినా అపరా విద్య అయినా గురువు దగ్గర శిష్యరికం చేసి నేర్చుకోవాలి. నడక నేర్పిన అమ్మ మొదటి గురువు. ఎలా బ్రతకాలో నేర్పిన తండ్రి రెండవ గురువు. విద్య నేర్పిన వాడు మూడవ గురువు. భగవంతుడే అనేకమార్లు గురువుగా అవతరించి లోకాన్ని ఉద్ధరించాడు. గురువు స్థానం  గొప్పది. 
605Gunanidhi
గుణనిధి
She who is the treasure house of good qualities
లోకంలోని గుణములన్ని అమ్మనుండి వచ్చినవేఆమె  నిధి. 
606Gomatha
గోమాతా
She who is the mother of cows. Kamadhenu
ధేనువులకు తల్లి. కామధేను రూపమయినది.
607Guhajanmabhoo
గుహజన్మభూ
Guha means ignorant. All beings are ignorant at birth. So we have to try hard with dedication and determination to acquire sacred knowledge
అవిద్యతో కూడిన వారు గుహులు. వీరే జీవులు అటువంటి జీవులకు జన్మస్థానమైనది. పుట్టుకతో ఎవ్వరూ జ్ఞానులు కాలేరు. సాధన, శ్రద్ధ మొదలైన వాటితో ప్రయత్నించి జ్ఞానాన్ని ఆర్జించాలి.  
608Deveshi
దేవేశీ
Divine mother is the leader and protector of devatas. Hence she is called Deveshi. She is worshipped by many devatas. She helped and protected them multiple times. 
దేవతలకు ఈశ్వరి కాబట్టి దేవేశీ అనబడుతుంది. ఎందరో దేవతలతో ఆరాధించబడింది మన అమ్మ. ఎన్నో మార్లు వారిని ఆపదలనుండి గట్టెక్కించింది.
 
609Dhandaneethistha
దండనీతిస్థా
Divine mother judges and punishes those who sin. Her punishment is to bring her children back to the right path.
అధర్మ మార్గంలో ఉన్న వారిని దండించి వారిని ధర్మ మార్గంలోకి తిప్పుతుంది. అమ్మ దండన మనకు సన్మార్గము చూపటం కొరకు మాత్రమే. 
610Dhaharakasaroopini
దహరాకాశరూపిణీ
Here space is being described as mahadaakasha (out side body) ghataakaasha (inside body) and Dharaakaasha (inside heart). Divine mother is present in Dharaakaasha.
జగత్తులో పైన కనిపించే ఆకాశము మహదాకాశము. ఘటంలోని (శరీరంలో) ఆకాశము ఘటాకాశము. హృదయస్థానంలో ఉండే ఆకాశము దహరాకాశము. ఆ దహరాకాశమే రూపంగా గలది. కాబట్టి దహరాకాశ రూపిణీ అనబడుతోంది.
611Prathipanmukhya rakanthathidhimandala poojitha
ప్రతిపన్ముఖ్యరాకాంత
తిథిమండలపూజితా 
She who is being worshipped on all the fifteen days from full moon to new moon.
పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు గల తిథులయందు పూజింపబడునది.
612Kalathmika
కళాత్మికా
All the 16 kalas are forms of Divine mother. Hence she is called kalatmika.
పదహారుకళలూ అమ్మ స్వరూపాలే. అందుచేత కలాత్మికా అనబడుతుంది.
613Kalanadha
కళానాధ
She who is the chief of arts
కళలకు అధిపతి
614Kavyalaapavinodhini
కావ్యాలాపవినోదినీ
Divine mother enjoys the songs that praise/describe the Brahman, explanation of names of Brahman, illustrations about Brahman
అమ్మ తన ఆస్థానంలో వశిన్యాది వాగ్దేవతలు చేసే  విచారము రహస్య నామాలాపము సంగీతాలాపము వింటుంది. కాబట్టి కావ్యాలాప వినోదిని అనబడుతుంది. 
615Sachamararamavani savyadhakshinasevitha
సాచామరారామావాణీ సవ్యదక్షిణసేవితా
She who is served by Lakshmi the goddess of wealth and Saraswathi the goddess of knowledge
సర్వైశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మి, సర్వజ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతి హృదయపూర్వకంగా  ప్రపత్తులతో అమ్మను సేవిస్తూ ఉంటారు. 
616Adishakthi
ఆదిశక్తి
She who is the primeval force. 
సకలసృష్టికీ కారణమైన మొదటి శక్తి, మాయాశబలితరూపము. 
617Ameya
అమేయ
She who cannot be measured.
కొలవటానికి వీలు కానిది.
618Atma
ఆత్మ
Its like a lamp on the stage. The drama continues as long as the lamp is on. If the lamp is off, the drama stops. But the lamp is never influenced by anything that's happening on the stage. Body is the stage and life is the drama. Atma is the lamp. 
ఆత్మ వేదికపైన ఉన్న దీపం వంటిది. దీపం ఉన్నంత వరకే నాటకం జరుగుతుంది. అది ఆరిపోతే నాటకం ఆగిపోతుంది. కానీ నాటకంలో జరిగే ఏ విషయం దీపాన్ని ప్రభావితం చేయలేదు. వేదిక మన శరీరం. జీవితం నాటకం. ఆత్మయే  దీపం. 
619Parama
పరమా
She who is better than all others
అన్నింటికన్నా గొప్పది. 
620Pavanakrithi
పావనాకృతీ
Divine mother is the embodiment of all pure and sacred things.
జగత్తులో పవిత్రమైనవన్నీ ఒక ఆకారం ధరిస్తే, ఆ స్వరూపమే మన అమ్మ. ఆవిడ శ్రేష్టమైన వాటి సముదాయము. 
621Anekakotibrahmanda janani
అనేకకోటిబ్రహ్మాండజననీ 
She who is the mother of several billions of universes. 
అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టించింది లలితమ్మ.
622DivyaVigraha
దివ్యవిగ్రహ 
Div means sky. Vigraha means body. Divya vigraha means the one whose body is spread across the space.
దివ్యమైన రమణీయమైన దేహము గలది. దివ్యము అంటే - ఆకాశము. విగ్రహము- దేహము. ఆకాశమువలె విస్తారమైన దేహము గలది.
623Klimkaree
క్లిమ్కరీ 
She who is personification of the “Klim” beeja.
క్లీం అనేది కామరాజబీజము. క్లీం అంటే శివకాముడు. అతని భార్య శివకామేశ్వరి. క్లీం కారబీజస్వరూపురాలు.
624Kevalaa
కేవలా 
She is the absolute. The only one that exists. Rest all are forms of her.The whole universe is filled and embedded with Paramatma. This is adwaita philosophy on which the Sanatana dharma is based upon.
ఉన్నది అమ్మ ఒక్కతే. ఆవిడే పరబ్రహ్మ. అన్నీ ఆవిడ స్వరూపాలే. అంతా బ్రహ్మ మయమే. ఇదే అద్వైతం. సనాతన ధర్మానికి మూలం. 
625Guhya
గుహ్యా 
Though she is the only one that exists, she is not conspicuous. She expresses herself with her other subtle forms. But her true form is the bliss of Atma. Only yogis with rigorous practice can experience it. 
ఉన్నది ఆమె ఒక్కతే అయినా ఆవిడ మన కంటికి కనిపించదు. మనసుకు అందదు. ఆవిడ మాయా స్వరూపాల ద్వారా మనకు వ్యక్తమవుతుంటుంది. కానీ ఆవిడ నిజ స్వరూపం ఆత్మానందం. అది ఎంతో సాధన చేస్తే తప్ప తెలియదు. 
626KaivalyaPadhadhayini
కైవల్యపదదాయిని
Those who pray Divine mother attain both material comforts and liberation (Moksha).
అమ్మను ఉపాసించే వారికి ఇహము పరము కూడా లభిస్తుంది. 
627Tripura
త్రిపురా
Everything that is explained as 3 aspects is called Triputi. Because Divine Mother is the personification of all these, she is called Tripura.
మూడుగా ఉన్నవన్నీ త్రిపుటి. అదే త్రిపుర. వాటి స్వరూపమే కాబట్టి ఆమె త్రిపురా అనబడుతుంది.
628Trijagatvandhya
త్రిజగత్వంద్య
She who is worshipped by all in three worlds. Not just humans. Even yaksha, kinneras, kimpurushas and gandharvas worship her.
ముల్లోకములచే నమస్కరించబడునది. 
మనకు కనిపించే మానవులే కాకుండా యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వాదులచేత కూడా నమస్కరింపబడునది.
629Trimurthi
త్రిమూర్తి
She who is the trinity - Brahma, Vishnu and Maheswara. 
త్రిమూర్తిల స్వరూపమైనది. 
630Tridaseswari
త్రిదశేశ్వరీ
She is the Lord of the 3 states, 13 Vishwedevatas, 33 ganas.
దేవతలకు, మూడు అవస్థలకు, పదముగ్గురు విశ్వేదేవతలకు, ముఫ్ఫైమూడుగణాలకు ఈశ్వరి.
631Tryakshari
త్య్రక్షరి
Iim - Vagbeejam - Gives Moksha. Kleem - Manmadha beejam - Kama roopini. Souh - Shaktibeejam - Parashakti. Tryakshari is none other than maha tripura sundari.
ఐం - వాగ్భవబీజము 
మోక్షప్రదం. క్లిo - మన్మథబీజము కామరూపిణీ. సౌః - శక్తిబీజము పరాశక్తి శివరూపిణీ. ఈ రకంగా త్ర్యక్షరియే మహాత్రిపురసుందరి.
632DivyaGandhadya
దివ్య గంధాడ్యా
1. Sandal, 2.Inscent sticks, 3.Camphor, 4.Zedoary, 5.Saffron, 6.OX-gall, 7.Indian Spikenard and 8.Kundurushka. Divya gandha is made out of these. Divine mother is adorned with it.
1. చందనము, 2. అగరు, 3. కర్పూరము, 4. కచోరము, 5. కుంకుమపువ్వు, 6. గోరోచనము, 7. జటామాంసి, 8. కుందురుష్కము ఈ ద్రవ్యాలు కలిపిన గంధాన్ని దివ్యగంధము అంటారు. అటువంటి దివ్యగంధముచే అలంకరించబడినది.
633Sindhurathilakanchidha
సిందూరతిలకాంచితా
She who wears sindhura at the parting of the hair on the forehead.
సిందూరము అంటే - ఎర్రని చూర్ణము. పాపటయందు సింధూరము ధరించునది. ఇది సౌభాగ్య చిహ్నము.
634Uma
ఉమా
'Uu' means Shiva. "Ma' means Parvati. Uma means Shiva and Shakti.
ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం.
635SailendraThanaya
శైలేంద్రతనయా
She who is the daughter of the king of mountains. 
పర్వతరాజు యొక్క కుమార్తె.
636Gowri
గౌరీ
She who is white in color. The Shailendra thanaya explained in the above name is Gowri. KaLi is dark in color. Shiva once teases her calling 'O! dark one'. But she does not like that. So she meditates for Brahma and takes rebirth as Gowri.
గౌరవర్ణము గలది గౌరి. పై నామంలో చెప్పిన శైలేంద్రతనయయే గౌరి. కాళి నల్లగా ఉంటుంది. పరమేశ్వరుడు ఆమెను నల్లనిదానా అంటాడు. ఈ పరిహాసం భరించలేక కాళి బ్రహ్మను గురించి తపస్సు చేసి గౌరవర్ణముతో ఉండేటట్లు వరం పొందింది.
637Gandharwasevitha
గంధర్వసేవితా
She who is worshipped by gandharwas.
గంధర్వులచేత సేవింపబడునది. 
638Viswagarbha
విశ్వగర్భా
She who carries the universe in her womb.
విశ్వము గర్భమునందు గలది.
639Swarnagarbha
స్వర్ణగర్భా
Parabrahma - The supreme being
 అంతటికి మూలమైన పరమాత్మ 
640Avaradha
ఆవరదా
She who punishes/kills demons/bad people
అవరులు అనగా - అనార్యులైన రాక్షసులు. వారిని చంపుతుంది కాబట్టి అవరదా అనబడుతుంది.
641Waagadheeswari
వాగధీశ్వరి
Divine mother is the Lord of all these Waak devatas. 
వాక్కులకు అధీశ్వరి. వాక్కుకు మూలమైన పరాశక్తి.
642Dhyanagamya
ధ్యానగమ్యా
Divine mother can be known by meditation.
ధ్యానముచేత ఎరుగబడినది.
643Aparichedya
అపరిచేద్యా
She is beyond everything that can be perceived. ఇటువంటిది అని చెప్పటానికి వీలులేనిది. 
644Gnanadha
జ్ఞానదా
Gnanadha means one who gives this Gnana.
జ్ఞానమనే దాన్ని భక్తులకు ఇచ్చేది జ్ఞానదా.
645Gnanavigraha
జ్ఞానవిగ్రహా
She who is personification of Gnana.
జ్ఞానమే శరీరముగా గలది. జ్ఞానమే పరబ్రహ్మ.
646Sarva vedhantha samvedya
సర్వవేదాంత సంవేద్య
The essence of all the Upanishads is Divine Mother. Hence, she is called sarva vedanta samvedya.
ఉపనిషత్సారమే బ్రహ్మవిద్య. అందుచేతనే అమ్మ 'సర్వవేదాంత సంవేద్యా' అనబడుతున్నది.
647Satyananda swaroopini
సత్యానంద స్వరూపిణీ
She who is personification of truth and happiness. 
సత్యము ఆనందము స్వరూపముగా గలది.
648Lopamudrarchitha
లోపాముద్రార్చితా
She who is worshipped by Lopa Mudhra the wife of Agasthya
అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర, శ్రీవిద్యను ఉపాసించినవారిలో 12 మంది శ్రేష్ఠులున్నారు అని చెప్పబడింది. వారిలో లోపాముద్ర ఒకరు.
649Leelakluptha brahmanda mandala
లీలాక్లుప్త బ్రహ్మాండ మండల
She who created the whole universe as a simple act of play.
తన సంకల్ప మాత్రం చేతనే అఖిలాండకోటి బ్రహ్మాండాలు సృష్టించబడుతున్నాయి. అందుచేత పరమేశ్వరి లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా అనబడుతోంది.
650Adrushya
అదృశ్యా
She who cannot be perceived
ఇంద్రియ గోచరము కానటువంటిది. 
651Drusyarahitha
దృశ్యరహితా
She who does not perceive things
ఇంద్రియ వ్యాపారములు లేనటువంటిది. 
652Vignathree
విఙ్ఞాత్రీ
She who knows all sciences. 
సకల శాస్త్రములు ఎరుగునది. 
653Vedyavarjitha
వేద్యవర్జితా
She who does not have any need to know anything. 
సాక్షి రూపముగా సకల విషయాలు ఎరుగునది. తెలుసుకోవడానికి ఇంకేమి మిగలనిది. 
654Yogini
యోగినీ 
There are 576 crore Yogini shaktis serving Divine Mother in sri chakra. Those who untap the power of these yoginis achieve yoga - Union of Jeevatma and Paramatma.
శ్రీచక్రంలో 576 కోట్ల యోగిని శక్తులు అమ్మను సేవిస్తూ ఉంటారు.ఏ యతి/సాధకుడికైతే ఈ యోగిని శక్తుల బలం సమకూరుతుందో అతడికి యోగం (అంటే జీవాత్మ-పరమాత్మల కలయిక) కలుగుతుంది. 
655Yogadha
యోగదా 
Divine Mother helps us in the path of Yoga through these shaktis.
ఈ యోగిని శక్తుల ద్వారా అమ్మ మన యోగ ప్రస్థానంలో సహాయపడుతూ ఉంటుంది.
656Yogya
యోగ్య 
Divine mother is capable of helping and ensuring success in our path of Yoga.
యోగం కలుగజేయగలదు కనుక యోగ్య 
657Yogananda
యోగానంద
She is the unexplainable bliss one experiences in Yoga
యోగము కలిగిన తరువాత పొందే అనిర్వచనీయమైన ఆనందం కూడా అమ్మే. 
658Yugandhara
యుగంధర 
She who wears the yuga (Division of eons of time). means she takes the time forward.
కాలమును ధరించునది. అంటే సమయమును ముందుకు నడిపించేది. 
659Icchashakthi-Gnana shakthi-Kriyashakthi swaroopini
ఇచ్చాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి స్వరూపిణీ
She who has knowledge as her head, desire as her body and energy as her feet.
కంఠము నుంచి కటి వరకు ఇచ్ఛాశక్తి, శిరస్సు - జ్ఞానశక్తి,
కటి నుంచి పాదాలవరకు క్రియాశక్తి.
660Sarvaadhara
సర్వాధార
She who is the basis of everything.
సమస్త జగత్తుకూ ఆధార రూపమైనది.
661Suprathishta
సుప్రతిష్ఠ
She is the foundation of all existence
సమస్త జగత్తుకూ పునాది రూపమైనది.
662Sadasadroopa dharini
సదసద్రూప ధారిణి
All the perceivable things are Asat(perishables). The Para Brahma from which the whole creation came is Sat(imperishable). Both Sat and Asat are forms of Divine Mother.
నామరూపాత్మకమైన ఈ జగత్తు (అసత్తు). ఈ జగత్తు దీనినుంచి వచ్చిందో ఆ పరబ్రహ్మ సత్తు. అది అవ్యక్తం. ఈ సత్తు అసత్తు రెండూ కూడా అమ్మ స్వరూపాలే. 
663Ashtamoorthy
అష్టమూర్తి
She who has eight forms.
ఎనిమిది మూర్తులు  సమూహంగా ఉన్నది.
664Ajajethree
అజాజైత్రీ
She who has won over ignorance.
అజ్ఞానాన్ని జయించినది.
665Lokayathra vidahyini
లోకయాత్రా విధాయినీ 
she conducts the journey to liberation.
జీవులు తాము చేసిన కర్మలననుసరించి వారికి మానవులు, పశువులు, పక్షులు, గంధర్వులు, యక్షులు. ఇలా వారికి జీవనవిధానం ఏర్పరుస్తుంది. వారందరూ ఆ విధంగా కర్మఫలం అనుభవించేటట్లు చూస్తుంది.
666Ekaakini
ఏకాకినీ
She who is only herself and alone
ఒంటరిగా ఉండేది. ఇంకొకరు ఎవరూలేనిది. 
667Bhoomaroopa
భూమరూపా
Bhooma means multiple. Though Divine mother is alone, she has multiple forms. Everything that is perceivable and not perceivable is her form.
భూమ అంటే అనేకము అని అర్ధం. ఏకాకి అయినప్పటికీ అనేకరూపాలు గలది. కంటికి కనిపించేది కనిపించనిది అంతా అమ్మే 
668Nirdwaitha
నిర్ద్వైతా
Nirdwaita means one that cannot be divided. 
రెండు కానిది. 
జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమె. అంతకుమించినది ఏదీలేదు.
669Dwaithavarjitha
ద్వైతవర్జితా
There actually has no scope for Dwaita. It can never be true.
ద్వైతభావనకు ఆశ్రయం ఇవ్వనిది. ద్వైతులను వర్ణించినది.
670Annadha
అన్నదా
She who gives food.
జనులకు అన్నము ఇచ్చేది.
671Vasudha
వసుధా
She who gives wealth
వసు అంటే ధనము. ధనాన్ని ఇచ్చేది. 
672Vriddha
వృద్ధా
She who gives growth. With her blessings, our wealth, respect etc grows leaps and bounds. She gives moksha ultimately.
వృద్ధినిచ్చునది. ధనం, సంతానం, గౌరవం మొదలైన వాటిని వృద్ధి చేయునది. 
ధనము, ఆహారము, ఆరోగ్యము అన్నిటికీ మించి ఉత్తమమైన మోక్షాన్ని కూడా ఇస్తుంది.
673Brhamatmykya swaroopini
బ్రహ్మాత్మైక్య స్వరూపిణి 
Jeevatma is same as paramaatma. The below statements explain the same.
1.Pragnanam brahma, 2.Ahambrahmasmi, 3.Tatwamasi, 4.Ayamaatmaa brahma
జీవాత్మ పరమాత్మ రెండూ ఒక్కటే.ఈ క్రింది మహా వాక్యాలు దీన్నే ప్రతిపాదిస్తున్నాయి.
1.ప్రజ్ఞానం బ్రహ్మ, 2.అహంబ్రహ్మాస్మి,
3.తత్త్వమసి, 4.అయమాత్మా బ్రహ్మా
674Brihathi
బృహతి
She who is great.
చాలా గొప్పది 
675Brahmani
బ్రాహ్మణి
One who is aware of para-brahma is a Brahmin. Means Eshwar. Divine mother is his shakti.
బ్రహ్మ జ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు. అంటే ఈశ్వరుడు. అతని శక్తి బ్రాహ్మణి. 
676Brahmi
బ్రహ్మి
A feminine name of para-brahma.
పరబ్రహ్మనయొక్క స్త్రీలింగ నామము 
677Brahmananda
బ్రహ్మానంద
The real and ultimate happiness
అసలైన, అన్నింటికన్నా గొప్పదైన ఆనందం 
678Balipriya
బలిప్రియా
Bali means shunning the darkness of ignorance and rising to the light of knowledge. To win over the Arishadvarga. Such people are called 'Jitendriya'. Divine mother likes such people. Hence she is called Bali priya. 
బలి అంటే - అజ్ఞానాన్ని విడిచి, అరిషడ్వర్గాలను జయించినవారు. అట్టివారి యందు ప్రీతి గలది. అరిషడ్వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియలు.
679Bhasharoopa
భాషారూపా
Divine mother is Matrukavarna roopini. All letters from 'Aa' to 'Ksha' are her forms. Language is formed with these letters. All languages are her forms. Hence she is called Bhasha Roopa.
అమ్మ మాతృకావర్ణరూపిణి. అకారాది క్షకారాంతము అక్షరాలన్నీ ఆమె రూపాలే. భాష అంతా ఈ అక్షరములతోనే ఉంటుంది. అన్ని భాషలరూపము ఆమే. అందుకే భాషారూపా అనబడుతుంది.
680Brihatsena
బృహత్సేనా
She has a big army. All devatas are her army.
గొప్ప సైన్యం కలది. దేవతలంతా ఆమె సైన్యం. 
681Bhavabhavavivarjitha
భావాభావావివర్జితా
She is free from existence as well as non-existence. 
భావ అంటే ఉండటం. అభావ అంటే లేకపోవడం. అమ్మ ఈ రెండింటికీ అతీతమైనది.
682Sukharadhya
సుఖారాధ్యా
She can be pleased very easily.
చాలా సులభముగా ఆరాధించవచ్చు.
683Shubhakaree
శుభకరీ
She does good to all her devotees. She fulfills their wishes. She gives them Moksha.
భక్తులకు ఎల్లవేళలయందు కూడా మంచినే చేసేది. సకలశుభాలను, మంగళకరములను చేయునది.
684Shobhanasulabhagathi
శోభనాసులభాగతి
She can be attained easily. All you need is purity in heart. She does only good to all her devotees. This aspect is being repeated in successive names to add more emphasis. 
సర్వమంగళా. భక్తులకు సదా శుభము జరిగేటట్లు చూసేది. అతి సులభంగా ఆమెను ఆరాధించి పొందవచ్చు. ఏ విధమైన నిష్ఠలు నియమాలు అవసరంలేదు. కావలసినదల్లా త్రికరణ శుద్ధి, మనసారా ఆమెను ప్రార్ధిస్తేచాలు భక్తుని యొక్క కోరికలు అన్నీ తీరినట్లే. 
685Rajarajeswari
రాజరాజేశ్వరీ
She is worshipped by kings, emperors, yakshas, garuda, kinneras and kimpurushas.
రాజులు, మహారాజులు, చక్రవర్తులు, యక్షగరుడకిన్నెర కింపురుషులకు దేవతలకు కూడా ఈమె ఈశ్వరి.
686Rajyadaayini
రాజ్యదాయిని
She gives kingdoms like Heaven, Vaikunta, kailasa etc.
రాజ్యమును ప్రసాదించునది. స్వర్గాధిపత్యము నిచ్చునది.
687Rajyavallabha
రాజ్యవల్లభా
All the kingdoms discussed in the above name are in her control. She loves them. She is the ultimate ruler of those kingdoms.
పైన చెప్పిన రాజ్యములు ప్రియముగా గలది. రాజ్యములకు వల్లభా. అంటే ప్రభవి.
688Rajatkrupa
రాజత్కృపా
She is unconditionally compassionate to everyone.
అపారమైన దయ గలది. ఆమె కృపకు కారణములు, హేతువులు, హద్దులు ఉండవు. 
689Rajapeethanivesitha nijasritha
రాజపీఠనివేశితనిజాశ్రితా 
Those who pray Divine Mother get the throne of the kingdom. 
రాజులు కూర్చునే సింహాసనములయందు తనను ఆశ్రయించిన వారిని ఉంచునది. 
690Rajyalakshmi
రాజ్యలక్ష్మి
Divine mother is the ultimate ruler of all the kingdoms. She gives wealth and prosperity to them.
రాజ్యాలన్నీ ఆమె యొక్క అధీనంలోనే ఉంటాయి. 
 రాజ్యముల యొక్క వైభవానికి కారణమైనది.
691Koshanatha
కోశనాథా
Divine mother is the owner of all the Treasuries that exist in this universe.
లోకంలోని ధనాగారం మొత్తానికి అధిపతి. 
692Chathurangabaleswari
చతురంగబలేశ్వరీ
Antahkarana means tools inside our body. One has to offer these to Divine mother. Then she gives moksha.
అంతఃకరణములు నాలుగూ ఆమె ఆధీనంలో ఉంటాయి. వీటిని అమ్మకు అర్పిస్తే  ఆవిడ మోక్షం ఇస్తుంది. 
693Samrajyadhayini
సామ్రాజ్యదాయిని
Brahma vidya or Atma vidya is the knowledge of Brahman. One who practices it becomes emperors of the Atma Samrajya. Divine mother is the giver of such Atma Samrajya.
బ్రహ్మ విద్యయే ఆత్మవిద్య. ఆత్మవిద్యనుపాసించినవారు ఆత్మసామ్రాజ్యానికి అధిపతులు. అటువంటి ఆత్మసామ్రాజ్యాన్ని ప్రసాదించేది అమ్మే.
694Sathyasandha
సత్యసంధా
Divine mother has determination towards truth. This nama talks about the importance of truth in her administration. Only truth can prevail and she ensures it.
సత్యమందు దాటరాని ప్రతిజ్ఞ గలది. ఆమెచే వ్యవహరింపబడుతున్న ఈ జగత్తునందు ఎల్లప్పుడూ సత్యమే నిలుస్తుంది. 
695Sagaramekhala
సాగరమేఖలా
Just like how a belt surrounds the waist, this infinite universe surrounds Divine Mother.
కటి ప్రదేశం చుట్టూ మొలనూలు ఏ విధంగా ఉంటుందో అలాగే అమ్మ చుట్టూ ఈ అనంత విశ్వం ఉంది. 
696Deekshitha
దీక్షిత
The last step in Sri Vidya is purna deeksha. There is no difference between Divine Mother and one in purna deeksha. One who is in purna deeksha will have knowledge and experience of all the mantras.
శ్రీవిద్యలో అఖరుది పూర్ణదీక్ష. పూర్ణదీక్షపరులకు, అమ్మకు భేదంలేదు. పూర్ణదీక్షాపరుడు అన్ని మంత్రాలమీద అధికారం కలిగి ఉంటాడు.
697Dhaityashamani
దైత్యశమనీ
Daitya Shamani means one who destroys Daityas.
దైత్యులను నాశనము చేసేది.
698Sarvaloka vasamkari
సర్వలోక వశంకరీ
ఆ పరమేశ్వరిని ఆరాధించేవాడు ముల్లోకాలను సమ్మోహనం చెయ్యగలుగుతాడు. అష్టైశ్వర్యాలు పొందుతాడు. లోకంలోని పాలకులు, రాజులు, అధికారులు అందరూ కూడా అతని పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. Those who worship Divine mother can mesmerize everyone in this world. They possess all kind of worldly pleasures. All the kings, rulers, ministers bow in front of them.
699Sarvarthadhatri
సర్వార్థదార్త్రీ
Divine mother is the giver of all the purusharthas.
సకల పురుషార్థాలను ఇచ్చేది.
700Savithri
సావిత్రీ
Savita is the one who is motivates buddhi and karma. Savitri is his shakti
జీవుల యొక్క బుద్ధిని, కర్మను ప్రేరేపించువాడు సవిత అనబడతాడు. 
అతని శక్తి సావిత్రి.
701Sachidanandaroopini
సచ్చిదానందరూపిణీ
Sat, Chit and Ananda are the true forms of Savitri. She is para-brahman.
సత్ చిత్ ఆనందరూపము గలది. పరబ్రహ్మ స్వరూపిణి.
702Desakalaparischinna
దేశకాలపరిశ్చిన్న
Parabrahma is not constricted to a particular period or place. It is everlasting. Boundless.
దేశముచేతగాని, కాలముచేతగాని కొలవబడినదికాదు. హద్దులు లేనిది. ఎల్లలులేనిది.
703Sarvaga
సర్వగా
Divine mother is not confined to a period or place. So, she is called sarvantaryaami.
పరమేశ్వరికి దేశము, కాలము వంటి హద్దులులేవు. కాబట్టి ఆమె సర్వాంతర్యామి. 
704Sarvamohini
సర్వమోహినీ
The entire world is subject to delusion caused by Divine mother. It is called Maya.
సర్వులను మోహింపచేయునది.
705Saraswathi
సరస్వతి
Saraswathi is the goddess of gnana (knowledge and wisdom). She holds gnana mudra. This nama describes the goddess that gives gnana.
సరస్వతి జ్ఞానాధిష్ఠానదేవి. జ్ఞానముద్రాస్వరూపిణి. ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి గురించి చెబుతున్నారు.
706Sasthramayi
శాస్త్రమయి
ఏదైనా ఒక విషయం నిర్ధారణ చెయ్యాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది. అన్ని శాస్త్రాలు పరమేశ్వరి నుంచే ఆవిర్భవించాయి. కాబట్టి ఆమె శాస్త్రమయీ అనబడుతోంది.
Shastras are the base to validate/authenticate anything. All the sciences came from Divine mother. Hence she is called Shastramayi.
707Guhamba
గుహాంబా
Daharaakaasha is a cave in heart inside which Divine mother stays. It is neither a physical body nor a meta physical body. She stays in it as jeevaatma.
హృదయము అనే గుహలో ఛాయా రూపంతో ఉండేది.
708Guhyaroopini
గుహ్యరూపిణీ
అమ్మ దహరాకాశరూపంలో ఉంటుంది. కాబట్టి గుహ్యరూపిణీ అనబడుతుంది.
Divine Mother stays in Daharaakasha. So, she is called Guhya roopini.
709Sarvopadhivinirmuktha
సర్వోపాధివినిర్ముక్తా
Divine mother is Paramatma. Does not need a body.
ఏ రకమైన ఉపాదులు (శరీరములు) లేనట్టిది. అద్వైతమూర్తి. 
710Sadashivapathivritha
సదాశివపతివ్రతా
ఎల్లకాలములందు శివుడే భర్తగా గలది. భూతభవిష్యద్వర్తమానాలలో కూడా శివుని భర్తగా పొందినది. 
A pativrata is a wife whose thoughts are always aligned with her husband. Divine mother is such pathivratha.
711Sampradhayeshwari
సంప్రదాయేశ్వరీ
Traditionally Srividya is to be learned from a guru. One can't acquire divine knowledge of Mother by learning various subjects/siences. It has to be taught by a learned guru. 
శ్రీవిద్యా సంప్రదాయము గురుశిష్య పరంపరగా వస్తున్నది. 
వేదాలు వల్లెవేస్తేనో శాస్త్రాలు చదివితేనో  బ్రహ్మజ్ఞానం అబ్బదు.  కేవలము గురూపదేశం వల్లనే అది వస్తుంది. అటువంటి గురుసంప్రదాయానికి మూలమైనది ఆ జగన్మాత 
712Sadhu
సాధు
Sadhu means a person who does not cause or even intends to harm anybody. That is Divine mother.
అమ్మ వల్ల ఎవ్వరికీ ఎన్నటికీ ఎటువంటి హాని ఉండదు. అందుకే సాధు అని  వచ్చింది. 
713Ee
'Ee' is kaamakaala beeja. We learnt about it in the name kaama kalaa roopa (322)
'ఈ' కామమలా బీజము,  గురించి మనము కామకలా రూప అనే నామంలో(322) చదివాము. 
714Gurumandalaroopini
గురుమండలరూపిణి
Worshipping this gurumandala is same as worshipping Divine Mother. Those who do archana to SriChakra should keep this gurumandala in the 5th corner of the octagon and do archana to the gurumandala first.
గురు మండలాన్ని పూజించటమంటే పరమేశ్వరిని అర్చించటమే. అందుకే చక్రార్చన చేసేటప్పుడు ముందుగా గురుమండలాన్ని అర్చించాలి. శ్రీచక్రంలో అష్టకోణం మీద గురుమండలాన్ని పెట్టాలి. 
715Kulotteerna
కులోత్తీర్ణ
Kulamu represents all the sensory organs. They are tools given to us for perception. Divine mother is beyond perception. Senses can't reach there కులము అంటే ఇంద్రియాల గుంపు. ఆ ఇంద్రియాలను దాటినది. అతీంద్రియమైనది.
716Bhagaradhya
భగారాధ్యా
715th name says mother is beyond perception. This name says what she is. She is a self luminous bright star like sun. It emits golden yellow light. Yogis who practice srividya see this light with in the body. They worship that brilliance.
715వ నామం అమ్మ ఇంద్రియగోచరం కాదు అని చెప్తోంది. ఈ నామం అసలు ఆవిడ ఏమిటో చెప్తోంది. ఆవిడ బంగారు కాంతులతో దైదీప్యమానంగా వెలిగే తార. శ్రీవిద్యోపాసన  చేసే యోగులు ఈ కాంతిని తమ శరీరంలోనే అనుభవిస్తారు. దానినే అమ్మగా ఆరాధిస్తారు.
717Maya
మాయ
She who is illusion.
మాయ స్వరూపమైనది.
718Madhumathi
మధుమతీ
Mathi means gnanam = wisdom, intellect. When it is finely polished, the sheath of Maya disappears. Then a yogi sees the brilliant golden yellow light. That light is like honey to all the devatas.
మతి అంటే జ్ఞానం , వివేకం. అది బాగా పండినప్పుడు మాయ తొలగిపోతుంది. అప్పుడు యోగికి బంగారు వన్నెగల దివ్యమైన వెలుగు కనపడుతుంది. అది దేవతలకు మధువు వంటిది. 
719Mahee
మహీ
Mahee represents the perceivable nature that is spread everywhere. Though divine mother is unperceivable as explained in previous names, she is omnipresent like the nature.
మహీ అంటే ప్రకటితమై అంతటా కనిపించే ప్రక్రుతి. 
పైన నామాల్లో  చెప్పినట్లుగా రహస్యమైనది అయినప్పటికీ అమ్మ  ప్రక్రుతి వలె ప్రకటితమైనది.
720Ganamba
గణాంబా
Gana means group of devatas. Mother Lalitha acts as mother to these ganas. That means they draw strength from her.
గణములు అంటే దేవతల సమూహాలు. ఈ గణములకు తల్లి మన అమ్మ లలితమ్మ. అంటే  గణములకు శక్తిని ఇచ్ఛేది. 
721Guhyakaradhya
గుహ్యకారాధ్యా
గుహ్యము అంటే - రహస్యము. రహస్య ప్రదేశాలయందు ఆరాధించబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్యా అనబడుతుంది.
Guhya means secret, Unrevealed. Divine mother is worshipped in secret places.
722Komalangi
కోమలాంగి
Various branches of Vedas like 1.Siksha 2.Vyaakarana 3.Chandassu 4.Niruktamu, 5.Jyotishamu 6.Kalpamu are also regarded as limbs of mother
అమ్మ వేదస్వరూపిణి. వేదానికి ఆరు అంగాలున్నాయి అవి 1. శిక్ష 2 వ్యాకరణము 3. ఛందస్సు 4. నిరుక్తము 5.. జ్యోతిషము 6. కల్పమువీటినే షడంగాలు అంటారు. ఈ షండంగాలు కలది. కాబట్టి కోమలాంగి అనబడుతోంది.
723Gurupriya
గురుప్రియా
గురువునందు ప్రీతి గలది. Divine mother is passionate about Gurus.
724Swathanthra
స్వతంత్ర
Divine mother enjoys absolute independence.
అమ్మ సంపూర్ణ స్వతంత్రురాలు. 
725Sarwa thanthresi
సర్వ తంత్రేశీ
Divine mother is goddess to all thanthras. Thanthra include a process along with mantra. There are various types of thanthras to help on various types of objectives(sankalpa). Srividya tantra is used when the objective is liberation(Moksha)
అరవైనాలుగు తంత్రాలను సమర్థించినది. తంత్రములో మంత్రముతోపాటు క్రియ కూడా ఉంటుంది. సంకల్పాన్ని బట్టి వాడ వలసిన తంత్రం నిర్ణయిస్తారు. మోక్షానికి శ్రీవిద్య తంత్రం.
726Dakshinamoorthiroopini
దక్షిణామూర్తిరూపిణీ
దక్షిణామూర్తి రూపం గలది. Divine mother takes the form of Dakshina Murthy.
727Sanakadhi samaradhya
సనకాది సమారాధ్యా
సనక సనందన సనత్కుమార సనత్సుజాతలతో పాటుగా వీరితో సమానమైన జ్ఞానులచే ఆరాధించబడుతుంది ఆ పరమేశ్వరి. Divine mother is worshipped not only by the great sages like Sanaka, Sananda etc. but also other great rishis.
728Sivagnana pradhayini
శివజ్ఞాన ప్రదాయిని
Irrespective of how you pray to God (in which form or method), the giver of the ultimate Shiva gnana is Divine Mother Lalitha.
భగవంతుణ్ణి ఏరూపంతో, ఏ పేరుతో ఆరాధించినప్పటికీ జ్ఞానాన్నిచ్చేది మాత్రం అమ్మే.
729Chithkala
చిత్కల 
All the beings in this universe are born with Para brahma's item 'chithkala'. That is the root of chaitanya (supreme consciousness) లోకంలోని సమస్తజీవులు పరమాత్మ అంశలే. ఈ చిత్కలయే చైతన్యము. దీని స్వరూపమైనది మన అమ్మ.
730AanandaKalikaa
ఆనందాకలికా
Divine mother is in the form of happiness in beings.
జీవులందరిలోనూ ఆనంద స్వరూపముగా ఉండునది 
731Premaroopa
ప్రేమరూపా
Divine mother spreads her love equally to all beings. అమ్మ దృష్టిలో అన్ని జీవులూ ఒకటే. అన్నిటియందు సమానమైన ప్రేమ, వాత్సల్యము ఉంటాయి.
732Priyamkaree
ప్రియంకరీ
She not only gives material possessions but also gives moksha(liberation). Those who pray Her get both material pleasures and liberation. She gives all these out of her affection.
అమ్మ ప్రేమ స్వరూపి కాబట్టి ప్రియంకరి. భక్తుల యొక్క కోరికలన్నింటినీ తప్పక తీరుస్తుంది. 
733Namaparayanapreetha
నామపారాయణప్రీతా
She likes those who meditate upon her various names.
ఆమె నామాలు పారాయణ చేసే వారంటే అమ్మకు ఇష్టం. 
734Nandhividhya
నందివిద్యా
Nama parayana vidya is practiced by nandikeswara. (The bull god on whom shiva rides)
నందికేశ్వరునిచే ఉపాసించబడిన విద్యాస్వరూపిణి. నామపారాయణ విద్య -  నందివిద్య అనబడుతుంది.
735Nateshwaree
నటేశ్వరీ
Lord shiva is a great dancer. He is called Nataraja. Divine mother is his consort - Nateshwaree
నటరాజు అయిన పరమశివుని అర్ధాంగి కాబట్టి నటేశ్వరి 
736MithyaJagatathishtana
మిథ్యాజగదధిష్టాన
This world is an illusion. Maya is the reason for this illusion.
అసత్యమైనది ఈ జగత్తు. ఇదంతా మిధ్య. మిధ్యయైన జగత్తునకు ఆధారమైనది.
737Mukthida
ముక్తిదా
Mukthida means one who gives Mukthi. Mukthi means liberation. Liberation from all worldly bonds, the Arishadvargas, the feeling of I and mine, ego and selfishness.
ముక్తి నిచ్చునది. ముక్తి అంటే - విముక్తి ఐహిక బంధనాల నుంచి విముక్తి, అరిషడ్వర్గాల నుంచి విముక్తి. నేను నాది అనే అహంకార, మమకారాల నుంచి విముక్తి.
738Mukthiroopini
ముక్తిరూపిణీ
మోక్షమే రూపంగా గలది. అమ్మ రూపము జ్ఞానము. Mukthi means Liberation. Divine mother is the embodiment of consciousness.
739Lasyapriya
లాస్యప్రియా
లాస్య(నర్తన) మందు ప్రేమ గలది. Divine mother likes Laasya.
740Layakaree
లయకరీ
అమ్మ భక్తుల హృదయాంతరాళలలో ఆత్మ అనే భావన కలుగచేస్తుంది. Divine mother ignites the thought of Atma.
741Lajja
లజ్జా
Divine mother is present in all beings in the form of shy/modesty.
అమ్మ అన్ని జీవులయందు లజ్జారూపంలో ఉంటుంది. లజ్జ అంటే - నమ్రత.
742Rambhaadhivandhitha
రంభాదివందితా
Divine mother is worshipped by the celestial dancers like Rambha
రంభాది అప్సరాంగనలచే నమస్కరింపబడేది.
743Bhavadhavasudhavrishti
భవదావసుధావృష్టి
Divine mother douses the forest fire of the sad life of mortals with a rain of Amruth (Divine nectar).
సంసార మనే దావానలాన్ని అమృతవర్షం కురిపించి శమింపచేసేది.
744Paparanyadhavanala
పాపారణ్యదవానలా
Divine mother will burn all Sanchita karma in the fire of consciousness. Then you will be liberated.
అమ్మను ప్రార్ధిస్తే ఆవిడ సంచిత కర్మను జ్ఞానమనే అగ్నిలో దహించి వేస్తుంది. అప్పుడు మోక్షం వస్తుంది. 
745Daurbhagyathoolavathoola
దౌర్భాగ్యతూలవాతూలా
అమ్మ ప్రేమ దౌర్భాగ్యము అనే గడ్డిని దూరంగా విసిరి పారేసే గాలి వంటిది Mother's love is the strong wind that will blow away all the miseries. 
746Jaradwantharaviprabha
జ్వరద్వాన్తరవిప్రభా 
Those who pray Divine mother never feel helpless in oldage. Like sunlight to darkness, her love swallows all their sorrows.
అమ్మను నమ్ముకున్న వారికి ముసలితనం కూడా హాయిగా గడచిపోతుంది. ఉదయించే సూర్యుడు చీకటిని మింగేసినట్లు ఆమె వారి కష్టాలన్నింటినీ మింగేస్తుంది.  
747Bhagyabdhichandrika
భాగ్యాబ్దిచంద్రికా
The waxing and waning of moon has an effect on the height of tides in the sea. Similarly, Divine mother's compassion impacts our good luck. By her will you become the luckiest.
చంద్రుని యొక్క వృద్ధి క్షయాలను బట్టి సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. అలాగే భక్తుల యొక్క భాగ్యము పరమేశ్వరి కృపా కటాక్ష వీక్షణాలను బట్టి పెరుగుతూ ఉంటుంది. అందుచేతనే ఆమె భాగ్యాబ్ది చంద్రికా అనబడుతుంది.
748BhakthaChittaKeki Ghanaghana
భక్తచిత్తకేకిఘనాఘనా
A peacock dances at the sight of black clouds. Similarly, our hearts feel elated and happy the moment sparks of devotion are ignited in our minds. Love and devotion towards Mother is the most pleasurable feeling.
మేఘాలను చూడగానే నెమళ్ళు సంతోషంతో పురివిప్పి నాట్యమాడతాయి. అలాగే భక్తుని హృదయంలో అమ్మ మీద భక్తిభావం పొడచూపగానే, అతడి/ఆమె హృదయం ఆనందడోలికలలో తేలిఆడుతుంది.
749RogaparvathaDhambolih
రోగపర్వతధంభోలిహ్
Divine mother cuts all our diseases with her gnana khadga (sword of consciousness).
అమ్మ తన జ్ఞానఖడ్గంతో మన రోగాలన్నింటినీ నాశనం చేస్తుంది.
750MrutyuDharuKuthaarikah
మృత్యుదారుకుఠారికాః
Those who pray Divine mother done fell prey to death
అమ్మనుని ఉపాసించిన వారికి మరణం ఉండదు



No comments:

Post a Comment

Popular