లలితాసహస్రం కామితార్థ ప్రదాయిని. ఎటువంటి కొరికైన సరె, ఎటువంటి సందెహమైనా సరె, ఎటువంటి సమస్యైనా సరె, ఈ స్తొత్ర పరాయనతొ తీరిపొతుంది. అంతటి గొప్ప మహిమ కలది ఈ స్తొత్రం.
సాధారణంగా భోగభాగ్యాలు అనుభవించే వారికి మోక్షము లభించదు. మోక్ష కాముకులకు సిరిసంపదలు ఉండవు. కాని లలితాసహస్రం పారాయన చెయువారికి ఇహము, పరము రెండు సిద్ధిస్తాయి.
సౌందర్య లహరి మొదటి శ్లోకంలో శంకర భగవతపాదులు ఇలా అన్నారు
ప్రణన్తుమ్ స్తోతుంవా కథమకృత పుణ్యహ్ ప్రభవతి
ఎదో ఒక గొప్ప పుణ్య కర్మ (పూర్వ జన్మలలోనైనా సరె) చేయకుంటే అమ్మా! నిన్ను ఆరాదించాలనే బుద్ధి, నీ గురించి తెలుసుకునే భాగ్యం కలుగుతుందా!అంత గొప్పది ఈ స్తోత్రం.
ఏవో ఒక 1000 సంస్కృత నామాలు చదివితే అన్ని సమస్యలు ఎలా తీరిపోతాయి? నాకు ఫిజిక్స్ లో కైనెమాటిక్స్ లెక్కలు సరిగా అర్థమవ్వలేదు. లలితా సహస్రం చదివితే అది బోధపడుతుందా? మా ఆఫీసులో మా బాస్ నా మాట పట్టించుకోవట్లేదు. నేను లలితా సహస్రం చదివితే వాడు నా మాట వింటాడా? నేను సుఖంగా బ్రతకాలంటే నాకు ఇంకొన్ని డబ్బులు కావాలి. వస్తాయా?
వీటికి సమాధానం 'అవును' అనే చెప్పాలి. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. అసలు ఒక సమస్య ఎలా ఉంటుందో పరిశీలిద్దాం
ఉపాయం: ఏ పరిష్కారానికైనా బీజ రూపంలో ఉంటుంది ఉపాయం. ఉపాయం తెలిసిపోతే మనం చకచకా పరిష్కారం ఆల్లేసి సమస్య దాటేయగలము. ఏ సందర్భంలోనైనా పరిష్కారం అంతు చెక్కట్లేదంటే దాని కారణం ఉపాయం తెలియట్లేదు అని అర్థం.
పధ్ధతి: ఒక్కొక్కసారి పరిష్కారం తెలిసినా దానిని ఎలా అనుసరించాలో తెలియదు. అటువంటి సమయంలో మనకు అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి.
స్థైర్యం: పరిష్కారం పధ్ధతి తెలిసినా ఒక్కోసారి బలం లేక ధైరం సరిపోదు.
అదృష్టం: అన్నీ ఉన్నా అదృష్టం లేక పోతే ప్రయత్నం ఫలించదు.
ఇప్పుడు లలితా సహస్రనామం తో వీటిని ఎలా సాధించగలమో చూద్దాము.
మనుషులు తమ విజ్ఞానాన్ని తమ మేధస్సులో ఒక గ్రాఫ్ మాదిరిగా దాచుకుంటారు. ఈ గ్రాఫ్ లో విషయాలను నోడ్స్ గానూ వాటి మధ్య సంబంధాలను ఎడ్జెస్ గానూ ఏర్పరచుకుంటారు. ఈ క్రింది బొమ్మ చూస్తే మీకు ఈ గ్రాఫ్ పైన సరైన అవగాహన కలుగుతుంది.
ఇలా దాచుకున్న తరువాత మనిషి బుద్ధి రంధ్రాన్వేషణ చేస్తుంది. ఈ రంధ్రం ఏర్పడే ప్రక్రియ గ్రాఫ్ లో విషయాల అమరికను మీద ఆధారపడుతుంది. గ్రాఫ్ అమరిక నేర్చుకునే విషయంపై ఆధార పడుతుంది.
సింహావలోకనం: మనం నేర్చుకునే విషయాన్ని బట్టి మేధస్సులోని గ్రాఫ్ యొక్క అమరిక నిర్ధారణ అవుతుంది. బుద్ధిలోని రంధ్రం ఏ మాదిరిగా ఉంటుందో ఈ గ్రాఫ్ యొక్క అమరిక నిర్దేశిస్తుంది.
మీ బుద్ధిలో ఎటువంటి సమస్యకైనా ఉపాయం చెప్పగలిగే విధంగా రంధ్రాలు ఏర్పడిపోయాయి అనుకోండి (తెనాలి రామలింగడు లాగ). అప్పడు మీరు ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కారం కనుగొన గలరు. లలితా సహస్రంలోని నామాలు ఎలా ఉంటాయంటే, వాటిని శ్రద్ధతో చదివితే, ఆ నామాల యొక్క వివరాలు మన బుద్ధిలో అద్భుతమైన రంధ్రాలు ఏర్పరుస్తాయి. ఉదాహరణకి వ్యోమకేశీ నామం తీసుకోండి. వ్యోమకేశుని అవతారం గురించి సరిగ్గా తెలుసుకుంటే కీనేమాటిక్స్ బోధపడవలిసిందే. మహాలావణ్య శేవధి నామంలోని అమ్మవారి నడక ఊహకందితే బ్రహ్మాండంలో ఎంట్రోపీ తెలిసిపోయినట్లే. అద్భుతం కదా. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురుకోవలసి వస్తుందో తెలియదు. అయినా మరేం ఫరవాలేదు. కేవలం లలితా సహస్రనామం చదివితే చాలు. ఏ సమస్యకైనా పరిష్కారం ఇట్టే పసికట్టగలిగే సామర్ధ్యం సంపాదించుకుంటారు. మీరు విజయులవుతారు.
లలితా సహస్రనామంలో అనేక కధలు ఉంటాయి. ఈ కధల ద్వారా ఎవరెవరు ఏ ఏ పరిస్థితులలో ఏ పద్ధతులు పాటించారో మీకు తెలుస్తుంది. ఈ విషయాలు పెద్దలతో చర్చిస్తే వారి జీవితానుభవంతో మీకు మరింత చక్కటి సలహాలు దొరుకుతాయి.
మనిషని తన అహమే కుదించేస్తుంది. ఓటమిని అవమానకరంగా భావించేలా చేస్తుంది. ప్రయత్నము, ఓటమి ఎదుగుదలకు మెట్లు అనే భావన కలగనివ్వదు. శ్రీచక్రం, సృష్టి క్రమం, యోగిని దేవతలు మొదలైన విషయాలు తెలుసుకుంటే అహం అణుగుతుంది. సాధారణంగా మనుషులను తమ అహం శాశిస్తుంది. కానీ తన అహాన్ని సైతం శాశించగలిగిన వారే పురుషోత్తములు అవుతారు. విధి లోకం వారి గుప్పెట్లో ఉంటుంది. అదే మీరవుతారు. ఇది తప్పక జరుగుతుంది లలితా సహస్రంతో.
పుణ్యం వలన అదృష్టం కలుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ ఎంతో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ఆ విషయాలు పలువురితో చర్చిస్తే వెలకట్టలేనంత పుణ్యం వస్తుంది. పైగా మీరు సమస్త బ్రహ్మాన్దాలకు నాయిక అయిన అమ్మకు చేరువవుతారు. ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మీ జన్మ మంగళ ప్రదంగా మారుతుంది.
విజయం సాధించడం ఎలా - ఈ పోస్ట్ కూడా చదవ గలరు