Search This Blog

728. Shiva gnana pradaayani

శివసంబంధమైన జ్ఞానాన్ని గొప్పగా ఇచ్చేది. సరస్వతీ విద్యను అనుష్టానం చేస్తే వచ్చే ఫలితము శివజ్ఞానము. జ్ఞానస్వరూపిణి అయిన లలితమ్మ తన భక్తులకు పరిపూర్ణమయిన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుణ్ణి ఏరూపంతో, ఏ పేరుతో ఆరాధించినప్పటికీ జ్ఞానాన్నిచ్చేది మాత్రం అమ్మే. శివుడు పరమానందస్వరూపుడు. నిర్వికారుడు. ఆయనకు తెలిసిన జ్ఞానము - ఆత్మజ్ఞానము. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

వాయుపురాణంలో ...

స్పందన లక్ష్యతే వాయుః, వహ్ని రౌణేన లక్ష్యతే
చిన్మాత్ర మమలం శాంతం శివం ఇత్యుదితం తు యత్ ||


వాయువు చల్లని గాలిచే తెలియబడతాడు. అగ్ని ఉష్ణమువలన తెలియబడతాడు. కాని శివుడు జ్ఞానమువల్లనే తెలియబడతాడు. శివుడంటే జ్ఞానస్వరూపమన్నమాట. అటువంటి శివజ్ఞానాన్ని తన భక్తులకు ఇచ్చేది కాబట్టి, శివజ్ఞాన ప్రదాయినీ అనబడుతుంది.

ఈ నామంతో సరస్వతీ విద్య వివరణ పూర్తి అయ్యింది.

It is said like this in Vaayu puraana ...

Spandana lakshyate vaayuh, vahni rounena lakshyate
chinmaatra mamalam shaantam shivam ityuditam tu yath

The air is known by its breeze. Fire can be known it's heat. Shiva can be known only through gnana (knowledge and wisdom). Divine mother gives such gnana to us. So she is called Shiva gnana pradaayani.

Those who learn and practice Saraswathi vidya attain Shiva gnana(Gnana that leads to Shiva). Irrespective of how you pray to God (in which form or method), the giver of the ultimate Shiva gnana is Divine Mother Lalitha.

With this nama, the description of Saraswathi vidya is complete.

No comments:

Post a Comment

Popular