Search This Blog

643. Aparichedya

పరిచ్ఛేదము - ఇటువంటిది, ఇంతటిది అని చెప్పతగినది. అపరిచ్ఛేదము - ఇటువంటిది అని చెప్పటానికి వీలులేనిది. లోకంలోని ప్రతివస్తువూ కంటికి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని గురించి చెప్పవచ్చు. అందుకే అది పరిచ్ఛేదము. అయితే అమ్మ కంటికి కనపడదు. ఆమె ఇటువంటిది అనిగాని, ఆమెను గురించి ఇంకేమైనాగాని చెప్పలేము. అందుకే ఆమె అపరిచ్ఛేద్యమైనది. సత్యము జ్ఞానము అనంతమయమైనది పరబ్రహ్మ. జ్ఞానము ఎంత ? అంటే అపరిచ్ఛేద్యము. అనంతమైనది.

ఆవిడ రూపము లేనిది. జగత్తంతా వ్యాపించి ఉన్నది. జగత్తులోని ప్రతి వస్తువూ ఆమె రూపమే. కళ్ళు ఆమె స్వరూపం. కాని కళ్ళే ఆమె రూపం కాదు. చెవులు ఆమె స్వరూపం. అలా అని చెవులే ఆమెరూపం కాదు. ఈ రకంగా జగత్తులోని ప్రతి వస్తువూ ఆమె స్వరూపమే. అందుచేత ఆమె రూపాన్ని నిర్ణయించటంకాని, వర్ణించటంకాని చేయలేము. అందుకే ఆమె అపరిచ్ఛేద్యా అనబడుతోంది.

Paricheda - That which can be confined to 'This' or 'This much'. Aparicheda is the one that cannot be confined. All perceivable things in this world can be described as 'like this'. But Divine Mother cannot be perceived. So she cannot be explained completely.

We can say that Eyes, Mind, Five elements etc are forms of Divine Mother. But it is not possible to confine her to anyone of these or even all of these. Because she is beyond everything that can be perceived.

No comments:

Post a Comment

Popular