Search This Blog

729. Chithkala

ఇక్కడినుండి 750 వ నామం వరకూ నంది విద్య వివరించబడింది.

చిత్తేషు చిత్కలా నామశక్తిః సర్వశరీరిణామ్
లోకంలో ఉండే జీవులందరి శరీరాలలోనూ చిత్కల అనే శక్తి ఉంటుంది. అది అఖండాకారుడైన ఆ పరమేశ్వరుని యొక్క కల.

ఐతరేయోపనిషత్తులో చెప్పినట్లుగా
పరమేశ్వరుడు విరాట్స్వరూపాన్ని పోలిన మానవుణ్ణి సృష్టించాడు. ఆ తరువాత బ్రహ్మరంధ్రం ద్వారా అతనిలో ప్రవేశించాడు. ఈ రకంగా ప్రవేశించిన పరమేశ్వరరూపమే చిత్కల.

భగవద్గీతలో
మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
నా అంశయే లోకమందు సనాతనుడైన జీవుడు అని చెప్పబడింది. లోకంలోని సమస్తజీవులు అతని అంశలే. ఈ చిత్కలయే చైతన్యము. దీని స్వరూపమైనది మన అమ్మ.

Let us know learn Nandi vidhya. It is explained from namas 729 to 750

Chitteshu chitkalaa naamashakthih sarvashareerinaam
Chitkala is present in all the beings in this universe. It is an item of the omni present parabrahma.

Aithateyopanishath:
Parabrahma created the human being. It resembled his supernatural form. Then he entered into it through the Brahma randhra (pinnacle of the head).

The Bhagavadgita:
Maamaivaamsho jeevaloke jeevabhoota ssanaatanah
"I am present in all the beings in this universe that lived, currently living and going to be born. My item 'chitkala' is present in all of you." That is the root of Chaitanya (the supreme consciousness). That is Divine mother.

No comments:

Post a Comment

Popular