1 | Sri matha శ్రీమాత | O Divine mother! You are the mother of all beings. You are the one who showers happiness on all of us. ఓ అమ్మా! సకల జీవాలకు అమ్మవు నీవు. అందరికి అమితానందము ప్రసాదించుదానవు. |
2 | Sri maharajni శ్రీ మహారాజ్ఞి | You are the one who is protecting and nourishing this entire creation. సమస్త లోకాలకు రక్షణ పోషణ ఇచ్చేదానవు. |
3 | Sri math simasaneshwari శ్రీమత్ సింహాసనేశ్వరి | You are the one who governs this whole creation. సమస్త లోకాలను పరిపాలించే దానవు. |
4 | Chidagni Kunda Sambootha చిదగ్నికుండ సంభూత | When devatas prayed for rescue, Divine mother emerges from chit agni to kill bhandasura. దేవతల ప్రార్ధన విని అమ్మ భండాసురుని వధించడానికి చిదగ్ని కుండములోంచి ఉద్భవించింది. |
5 | Devakarya samudhyatha దేవకార్య సముద్యుత | Divine mother came out of Chidagni to help devatas in their pursuit. దేవతల కార్యంలో తోడ్పడటానికి అమ్మ చిదగ్ని నుండి బయటకు వచ్చింది. |
6 | Udyath bhanu sahasrabha ఉద్యత్భాను సహస్రాభా | Mother glitters like thousand rising suns అమ్మ వర్చస్సు వేల సూర్యులు ఉదయింస్తున్నట్లు మెరుస్తూ ఉంటుంది. |
7 | Chaturbahu samanvitha చతుర్బాహు సమన్విత | Mother has four arms అమ్మకు నాలుగు చేతులు |
8 | Ragasvarupa pashadya రాగస్వరూప పాశాఢ్యా | Mother carries a pasha(rope) that can help you overcome Raga and Dwesha. రాగ ద్వేషాలను తరిమికొట్టగల పాశం పట్టుకుంది. |
9 | krodhakarankushojvala క్రోధాకారాంకుశోజ్వల | Mother carries a restraint that can control the Arishadvargas. అరిషడ్వర్గాన్ని అణిచివేయగల అంకుశం పట్టుకుంది. |
10 | Mano Rupekshu Kodanda మనోరూపేక్షు కోదండ | She who has the bow of sweet cane which is her mind-in one of her left hands. అమ్మ ధనుస్సు చెరుకుతోచేయబడిందిట. బాణాలేమో పంచతన్మాత్రలుట. |
11 | Panchathanmathra sayaka పంచతన్మాత్ర సాయక | The word thanmathra explains the subtle relation between the senses and the five elements. అమ్మ ఈ సృష్టిని పంచభూతాలతో సృష్టిచింది. తన్మాత్రలు ఈ పంచభూతాలకు పంచేంద్రియాలకు ఉన్న సంబంధాన్ని చెబుతాయి. |
12 | Nijaruna prabha poora majjath brahmanda mandala నిజారున ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాన్డ మండల | It seems as if all the heavenly bodies are submerged in the reddish orange glow coming from Divine mother ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారి అరుణవర్ణ కాంతిలో మునిగి ఉన్నాయిట |
13 | Champaka shoka punnaga saogandhika lasatkacha చమ్పకాశోక పున్నాగ సౌగంధిక లాసాత్కచ | Mother's hair is embellished with flowers like Champaka, Ashoka, Punnaga and Sowgandhika చంపక, అశోక, పున్నాగ మొదలగు సుగంధ భరితమైన పువ్వులు కేశములలో ధరించినది. |
14 | Kuru vinda mani –sreni-kanath kotira manditha కురువిందమణిశ్రేణి కానత్కోటీరమండిత | Mother's whose crown glitters with rows of inlaid precious stones (Kuruvindas) కురువిందములనే మణుల వరుసలతో అలంకరించిన కిరీటం ధరించి ఉంటుంది |
15 | Ashtami chandra vibhraja dalikasthala shobhitha అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత | She who has a beautiful forehead like the half moon (visible on eighth day from new moon) అష్టమి నాటి చంద్రుని వాలే దివ్యముగా వెలుగుతోంది అమ్మ నుదురు |
16 | Mukha chandra kalankabha mriganabhi viseshaka ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక | She who has the thilaka(dot) of Musk in her forehead which is like the black shadow in the moon అమ్మ నొసటన బొట్టు చంద్రునిపై మృగ నాభిని పోలి ఉన్న మచ్చ వాలే ఉంది. |
17 | Vadanasmara mangalya grihathorana chillika వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లికా | If Mother's face is like an all auspicious home, her eyebrows are like Toranas tied to its main door అమ్మ ముఖం సర్వమంగళ ప్రదమైన గృహమయితే కనుబొమ్మలు దాని ముందు కట్టిన తోరణములవలె ఉన్నాయిట |
18 | Vakthra lakshmi parivaha chalanminabha lochana వక్త్ర లక్ష్మి పరీవాహ చాలన్ మీనాభ లోచనా | Mother's eyes fulfill all our desires by her mere looks. అమ్మ చూపు సోకితే చాలు. కోరికలన్నీ తీరిపోతాయి. |
19 | Navachampaka pushpabha nasadhanda virajitha నవచంపక పుష్పాభా నాసాదండ విరాజితా | Mother's nose is like newly blooming flowers of Champaka. అప్పుడే వికసిస్తున్న చంపక పుష్పపు రేకు వలే ఉంటుంది అమ్మవారి ముక్కు |
20 | Tarakanti tiraskari nasabharana bhasura తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | Mother's nose ring shines brighter than the brightest of the stars తారలు సైతం చిన్న బుచ్చుకునేలా మెరుస్తుంది అమ్మ నాసాభరణం |
21 | Kadamba manjarikluptha karnapoora manohara కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర | Mother's ears are decorated with kadamba flowers and are looking very beautiful. అమ్మ చెవులు కదంబ పువ్వుల గుత్తితో మనోహరముగా ఉన్నాయి |
22 | Thatanka yugalibhuta tapanodupa mandala తాటంక యుగళీభూత తపనోడుప మండల | Mother's ear studs have the sun and the moon in them. Thatankas are regarded as auspicious. They help in husband's long life. అమ్మవారి తాటంకములలో సూర్య చంద్రులు ఉన్నారు. సౌభాగ్యవతులు తాటంకములు ధరించుట వారి భర్తలకు ఆయుః కారణము |
23 | Padmaraga shiladarsha paribhavi kapolabhuh పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు | Mother's cheeks shine like a mirror made of Padmaraga stones. పద్మరాగముల వలే నున్నగా మెరిసిపోతున్న బుగ్గలు |
24 | Navavidhruma bimbhasri nyakkari radanachhadha నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా | She whose lips are like beautiful new corals. Mother's lips get the reddish color because of pan. ఎర్రని పగడముల వంటి పెదవులు. తాంబూలం వలన ఎరుపెక్కిన పెదవులు. |
25 | Shudha vidyankurakara dvijapankti dvayojvala శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా | Mother's teeth resemble a line brahmins sitting in the shape of a grass shoot and practicing brahma vidya బ్రహ్మ విద్యను ఉపాసించే బ్రాహ్మణులు అంకురాకారంలో వరుసగా కూర్చుంటే ఎలా ఉంటుందో అలా రెండు పళ్ళ వరుసలు ఉన్నాయిట అమ్మకి |
26 | karpuravitikamoda samakarshadigantara కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా | Mother chews betel leaf with edible camphor. It's fragrance spread in all directions పచ్చ కర్పూరం ఉన్న తాంబూలం వలన సువాసన దిక్కులన్నిట వ్యాపించింది |
27 | Nijasallapa madhurya vinirbhatsita kachapi నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ | Mother's voice is melodious than the notes of Sarawathi Devi's Veena (This is called Kacchapi) అమ్మ పలుకులు సరస్వతీ దేవి వీణ అయిన కచ్ఛపి యొక్క నాదం కన్నా మధురంగా ఉన్నాయిట. |
28 | mandasmita prabhapura majatkamesha manasa మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా | Maha Kameshwara is filled in her heart. When she thinks about Him, she gives a nice smile. మనస్సు అంతా మహాకామేశ్వరునితో నిండి ఉంది. ఆయన గుర్తుకు వస్తే అమ్మ పెదవిపై చిరునవ్వు వస్తుంది. |
29 | Anakalita sadrusya chubuka sri virajita అనాకలితసాదృశ్య చుబుక శ్రీ విరాజితా | She has a beautiful chin which has nothing else to compare. అమ్మ గడ్డముతో పోల్చ గలిగిన వస్తువు లేదుట. |
30 | Kameshabaddha mangalya sutra shobitha kandhara కామేశబద్ధ మాంగల్యసూత్రశోభిత కంధరా | Mother's neck shines with the sacred thread tied by Lord Kameshwara అమ్మ కంఠము మహాకామేశ్వరుడు కట్టిన మనగళసూత్రంతో శోభాయమానంగా ఉంది |
31 | Kanakangada keyura kamaniya bhujanvita కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా | Mother wears golden Armlets. Her arms look beautiful. బంగారముతో చేయబడిన కేయూరములతో అమ్మ భుజములు కమనీయంగా ఉన్నాయి |
32 | Ratnagraiveya chintakalolamukta phalanvita రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా | Mother wears necklace with moving pearls and dollar inlaid with gems. రత్నములతో చెక్కబడిన బంగారు కంఠాభరణములు కలది. దానిలో మువ్వలు వేలాడుతున్న పతాకము ఉంది |
33 | Kameswara premarathnamani prathipana sthani కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణ స్థనీ | The names from 33-36 explain Mother's eagerness to feed all the beings. 33-36 వరకూ ఉన్న నామాలు అమ్మ జీవములన్నిటినీ పోషించడానికి ఎంత ఉత్సాహపడుతుందో వర్ణిస్తాయి. |
34 | Nabhyalavalaromali lathaphalakucha dwayi నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ | as explained above |
35 | Lakshyaromalathadharatha samunneyamadhyama లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా | as explained above |
36 | Sthanabharadalanmadhya pattabandhavalithraya స్థనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా | as explained above |
37 | Arunarunakausumbavasthra bhaswatkatithati అరుణారుణకౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ | Mother wears a light reddish silk cloth around her waist. It glows like rising sun or saffron. అరుణుడు అంటే ఉదయించే సూర్యుడు. కౌసుంభ అంటే కుంకుమపువ్వు. కటి ప్రదేశంలో ఈ రంగు వస్త్రం కట్టుకుంది. |
38 | Rathnakinkinikaramya rasanadhamabhushitha రత్నకింకిణీకారమ్య రాశనాదామభూషిత | Mother wears a golden thread below her waist decorated with bells made of precious stones. రత్నాలు పొదగబడిన బంగారుగంటలచే అలంకరింపబడిన మొలనూలు గలది. |
39 | Kameshagnathasowbhagya mardaworudwayanvitha కామేశజ్ఞాతసౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా | Only Kameshwara, Mother's consort, knows about good qualities of her thighs. కామేశ్వరునికి మాత్రమే తెలియదగిన సౌభాగ్యమార్దవము, లావణ్యము, కోమలములయిన తొడలు కలది. |
40 | Manikyamukutakaara janudwayavirajitha మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజిత | Mother's knee joints look like the crown made of precious stones. అమ్మ మోకాళ్ళు మాణిక్యములు పొదగబడిన మకుటములు వలే ఉన్నాయి |
41 | Indragopaparikshiptha smarathunabha janghika ఇంద్రగోపపరిక్షిప్తా స్మరతూణాభ జంఘికా | Manmatha's quiver is embellished with red gemstones that glow like a bunch of arudra worms. It resembles Mothers' forelegs. మన్మథుని బాణ తూణీరం ఇంద్రగోపములు(ఆరుద్ర పురుగులు) వంటి మణులు పొదిగి ఉంటుంది. అమ్మ కాలి పిక్కలు కూడా అదే రంగులో మెరుస్తుంటాయి. |
42 | Gudagulpha గూఢగుల్ఫా | She has strong and round ankles. బలమైన చీలమండలు గలది. |
43 | Kurmaprashta jayishnu prapadanvitha కూర్మపృష్ఠ జయిష్ణుప్రపదాన్వితా | Mother's upper feet are better than a tortoise's back. తాబేలు వీపుకన్నా గొప్పవైనా కాలి మడమలు కలది. |
44 | Nakhadhidhithisanchanna namajjana thamoguna నఖదీధితిసంఛన్న నిమజ్జనతమోగుణా | When we pay oblations to Mother's feet, the light emitting from her nails will shatter all our ignorance అమ్మ పాదములకు నమస్కరిస్తున్నపుడు ఆమె వెలిగోళ్ళ నుండి వచ్చే కాంతులు మన అజ్ఞానాన్ని తరిమికొడతాయి |
45 | Padadwaya Prabhajala parakrutha saroruha పాదద్వయప్రభాజాల పరాకృతసరోరుహా | She who has two feet which are much more beautiful than lotus flowers అమ్మ పాదముల సౌష్ఠవము తామరపువ్వుల కన్నా అధికమైనది |
46 | Shinjaanamanimanjiramanditha sri pamambuja శింజానమణిమంజీరమండిత శ్రీ పదాంబుజా | The sweet music from Mother's anklets outsmarts the sound of Om. Her ankets are embellished with gem stones and pendants అమ్మ పద మంజీరములు రాళ్లు పొదగబడి మువ్వలు వేలాడుతూ ఉన్నాయి. వాటి ధ్వని ప్రాణవాన్ని అధికమిస్తోంది |
47 | Marali Mandhagamana మరాళి మందగమనా | Mother's gait is slow and gracious అమ్మ చాలా మెల్లగా మనోహరంగా నడుస్తుంది |
48 | MahaLavanya Sewadhih మహాలావణ్య శేవధిహ్ | This Nature is a form of Mother. We have to protect this treasure. ఈ ప్రకృతే అమ్మ. ఇది మనము ఏంతో శ్రద్ధతో కాపాడుకోవలసిన నిధి. |
49 | Sarvaruna సర్వారుణ | She has light reddish color of the dawn in all her aspects అమ్మ అంతటా అరుణకాంతులతో మెరుస్తూ ఉంటుంది |
50 | Anavadhyangi అనవద్యాంగి | She is impeccable. అమ్మలో ఒక్క దోషం కూడా ఉండదు. |
51 | Sarvabharana Bhooshita సర్వాభరణ భూషిత | She who wears all the ornaments. These ornaments represent good qualities of her children. అనేక రకమైన ఆభరణాలు ధరిస్తుంది. తన పిల్లల సుగుణాలే ఆవిడ ఆభరణాలు. |
52 | Shivakameswarangastha శివకామేశ్వరాంకస్థా | Mother sits on the left lap of Lord Kameswara(shiva) అంకము అంటే తొడ. కామేశ్వరుని తొడపై కూర్చుని ఉంటుంది. |
53 | Shiva శివ | Shakti is the personification of Shiva. That is Divine Mother శివుడే శక్తి. ఆ శక్తే మన అమ్మ. |
54 | Swadheena Vallabha స్వాధీన వల్లభ | There is no scope for a conflict or disagreement between Shiva and Shakti శివ శక్తుల మధ్య భేదాభిప్రాయానికి తావులేదు |
55 | Summeru madhya sringastha సుమేరు మధ్య శృంగస్థా | Meru means Srichakra. It has 9 stages. The center of the 9th stage is called Bindu. That is Mother's abode. From top view it would be clear that this Bindu is the center of entire Srichakra. శ్రీచక్రమే మేరువు. అందులో 9 ఆవరణలు ఉన్నాయి. 9వ ఆవరణలో అమ్మ ఉంటుంది. అదే బిందువు. పైనుంచి చుస్తే ఈ బిందువు శ్రీచక్రం మధ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. |
56 | Srimannagara nayika శ్రీమన్నగర నాయికా | Sri means limitless pleasure. Those who see Bindu in meditation experience it. Bindu is Mother's abode. శ్రీ అంటే అవధులు లేని హాయి. ధ్యానములో బిందువును చూసినవారు ఈ హాయిని పొందుతారు. ఆ బిందువే అమ్మ నివాస స్థానం. |
57 | Chinthamani grihanthastha చింతామణి గృహాంతస్థా | అమ్మ గృహం చింతామణులతో నిర్మించబడింది Mother's abode is built with Chintamani gemstones. |
58 | Pancha brahmasanasthitha పంచ బ్రహ్మాసనస్థితా | Mother sits on a throne supported by the five brahmas viz. , Brahma, Vishnu, Rudra, Esana and Sadashiva పంచ బ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు అమ్మ సింహాసనాన్ని మోస్తుంటారు. |
59 | Mahapadmatavi samstha మహాపద్మాటవీ సంస్థ | Mother lives a big garden of 1000 petalled lotus flowers. అమ్మ ఒక పెద్ద సహస్రదళ పద్మముల వనములో నివసిస్తుంది. |
60 | Kadamba vanavasini కదంబ వనవాసినీ | Mother lives in a big garden of Kadamba trees అమ్మ కదంబ వనములో నివసిస్తుంది. |
61 | Sudhasagara madhyastha సుధాసాగర మధ్యస్థా | Divine mother lives in the middle of the milky ocean పాల సముద్రము మధ్యలో నివసించునది |
62 | Kamakshi కామాక్షి | She who has her eyes as Lord Kameswara శివుడు లేదా కామేశ్వరుడే కన్నులుగా కలది |
63 | Kamadayini కామదాయిని | She who gives us Lord Kameswara to us మహాకామేశ్వరుడిని మనకు అందిచునది |
64 | Devarshigana sanghata stuyamanatmavaibhava దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవా | Divine Mother has all the qualities that should be praised by Devatas and Rishis దేవగణములచే ఋషిగణములచే కొనియాడబడే వైభవము కలది. |
65 | Bhandasuravadodyuktha shakthisenasamavitha భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత | Mother is surrounded by army set ready to kill Bandasura. భండాసురుని వధించుటకొరకు శక్తి సైన్యాన్నంతా సమన్వయ పరచి సిద్ధంగా ఉంది. |
66 | Sampathkari samarooda sindhoora vrija sevitha సంపత్కరీ సమారూఢా సింధూర వ్రజసేవిత | Goddess Sampathkari (that which gives wealth) is the master of elephant brigade అమ్మవారి గజదళానికి అధిపతి సంపత్కరీ దేవి. కొన్ని కోట్ల ఏనుగులు ఈమెను అనుసరించి ఉంటాయి. |
67 | Aswarudhadishitashwa kotikoti bhiravrutha అశ్వరూఢాధిష్టితాశ్వకోటికోటి భిరావృతా | Asvarudha - She rides on a horse named Aparajita. She is the master of Mother's cavalry అశ్వారూఢా - ఈమె అపరాజిత అనె గుఱ్ఱం ఎక్కి వాయువేగ మనోవేగాలతో తిరుగుతూ ఉంటుంది. అశ్వదళానికి అధిపతి |
68 | Chakrarajaratharooda sarvayudha parishkritha చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతా | Chakrarajam - This is the name of mother's chariot. It houses all sorts of weaponry in it. చక్ర రాజం - ఇది అమ్మవారి రథం. ఇందులో సర్వాయుధాలు ఉంటాయి. |
69 | Geyachakraratharooda manthrini parisevitha గేయచక్రరథారూఢా మంత్రిణి పరిసేవితా | Mother's cabinet has 16 ministers. They ride on a chariot built with geyachakras. గేయచక్రమనే రథం ఎక్కి అమ్మ మంత్రిగణం కుడివైపు నడుస్తున్నది. |
70 | Kirichakra ratharooda dhandanatha puraskrutha కిరిచక్ర రథారూఢా దండనాథా పురస్కృత | Varaahi is the commander of mother's armies. She rides on a chariot made of kiri chakras. వారాహి అమ్మవారి సేనానాయకి. ఆమె కిరి చక్రములతో చేసిన రధము అధిష్టించి ఉంటుంది. |
71 | Jwalimalikakaksiptha vahniprakara madhyaga జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా | Jwaalamaalini is daughter of fire god. Mother ordered Jwaalamaalini to create a fire wall to protect mother's armies. జ్వాలామాలిని అగ్ని దేవుని కుమార్తె. అమ్మ జ్వాలామాలినిని అగ్ని జ్వాలను సృష్టించమని ఆజ్ఞాపించింది. ఈ అగ్గ్ని వలయం అమ్మ సైన్యానికి రక్షణ కవచంలా పనిచేసింది. |
72 | Bhandasainya vadodyuktha shakthi vikrama harshitha భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత | She who was pleased by the valor of Shakthis who helped in killing the army of Bhandasura శక్తి సైన్యం భండుని సైన్యాన్ని వధిస్తుంటే అమ్మ వారి ప్రతాపాన్ని చూసి హర్షించింది. |
73 | Nithya parakramatopa nireekshana samutsuka నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా | She who is interested and happy in observing the valour of Nithya devathas యుద్ధంలో నిత్య దేవతల పౌరుష పరాక్రమాలు చూడడం అమ్మకు చాలా ఇష్టం. |
74 | Bandaputhravadodyuktha balavikramanandhita భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమనందిత | Mother is pleased with the valor of Bala Tripura Sundari in destroying the sons of Bandasura. బాలాత్రిపురసుందరి భండుని పుత్రులను వధించింది. ఆ చిన్నారి పరాక్రమాన్ని చూసి అమ్మ ఎంతో సంతోషించింది. |
75 | Manthrinyambavirachitha vishangavathadoshitha మంత్రిణ్యంబావిరచిత విషంగవధతోషితా | Mother became very happy when Goddess Manthrini killed Vishanga. మంత్రిణి విషంగుడిని సంహరించినపుడు అమ్మ చాలా సంతోషించింది. |
76 | Vishukra pranaharana varahi viryanandita విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా | Vishukra is born from Bhandasura's right shoulder. Varaahi kills him. భండాసురుడు తన తన కుడి భుజంనుంచి విశుక్రుడిని సృష్టిస్తాడు. వారాహి వాడిని సంహరిస్తుంది |
77 | kameshvara mukhaloka kalpita sriganeshvara కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా | Lord Ganesha is born when Mother looked at the pleasant and smiling face of Lord Kameshwara అమ్మ పరమ సంతోషంతో ఉన్న కామేశ్వరుడి ముఖం నుంచి విఘ్నేశ్వరుడిని సృష్టించింది. |
78 | Mahaganesha nirbhinna vighnayantra praharshita మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా | She who became happy at seeing Lord Ganesha destroy the Vigna Yanthra (contraption meant to delay ) created by Vishukra. విశుక్రుడు స్థాపించిన విఘ్న యంత్రాన్ని మహా గణేశుడు నాశనం చేసాడు. అది చూసి అమ్మ చాలా సంతోషించింది. |
79 | Bhandasurendranirmuktha shastrapratyasthravarshani భండాసురేంద్రనిర్ముక్తా శస్త్రప్రత్యస్త్రవర్షిణీ | Mother rained arrows in reply to the arrows of Bhandasura. అమ్మ భండాసురుని పై బాణాల వర్షం కురిపించింది. |
80 | Karaangulinakhothpanna narayanadasakrithi కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతి | The ten avatharas of Narayana came from Mother's nails to kill rakshasas like Hiranyaaksha, hiranyakasipa, raavana, kumbhakarna, somaka etc. These rakshasas emerged from Bhanda's Sarvasurastra. యుద్ధంలో భండాసురుడు అమ్మమీదకి సర్వాసురాస్త్రం విసిరాడు. అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణ, కుంభకర్ణ, సోమకాదులు. వారిని సంహరించడానికి అమ్మ గోళ్ళ నుండి నారాయణుడి దశావతారాలు వచ్చాయి. |
81 | Mahapasupathasthragni nirdagdhasurasainika మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనికా | Mother destroyed the army of asuras by the Maha pasupatha arrow. ఒక మహాపాశుపతాస్త్రంతో అమ్మ భండాసురుని సైన్యం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. |
82 | Kameshwarastranirdhagdha sabhandasurashunyaka కామేశ్వరాస్త్రనిర్దగ్ధ సభండాసురశూన్యక | She who destroyed Bhandasura and his city called Shunyaka by the Kameshwara arrow. మహాశక్తివంతమైన కామేశ్వరాస్త్రంతో అమ్మ భండాసురుని వధించింది. అతని నగరమైన శూన్యక నగరాము కుడా దగ్ధమైపోయింది. |
83 | Brahmopendramahendradhi devasamsthuthavaibhava బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవసంస్తుతవైభవ | She who is prayed by Lord Brahma, Vishnu, indra and other devas భండాసుర వధ తరువాత బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు అమ్మను కీర్తించారు. |
84 | Haranethragni sandhagdha kamasanjeevanoushadhih హరనేత్రాగ్నిసందగ్ధ కామసంజీవనౌషధిహ్ | Mother brought back to life the God of love Manmatha who was burnt to ashes by the fire from the eyes of Shiva. పరమశివుని మూడవకంటి అగ్నికి మన్మధుడు భస్మమైన మన్మధుడిని అమ్మ సూక్ష్మ రూపం ఇచ్చి బ్రతికించింది. |
85 | srimadvagbhavakutaika svarupa mukhapankaja శ్రీమద్వాగ్భావకూటైక స్వరూప ముఖపంకజా | Mother's lotus face is Vagbhava Koota. అమ్మ ముఖం వాగ్భవ కూటమి |
86 | Kantadhahkatiparyanta Madhyakootaswaroopini కంఠాధఃకటిపర్యంత మధ్యకూటస్వరూపిణీ | The portion from neck to hips is Madya koota. కంఠము నుండి కటి ప్రదేశము వరకు ఉన్న భాగము మధ్య కూటము |
87 | Sakthikootaikataapanna Katyathobhaagadhaarini శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ | The portion below hips is the Shakthi koota. కటి ప్రదేశము నుండి క్రిందకు ఉన్న భాగము శక్తి కూటమి |
88 | Moolamanthrathmikha మూలమంత్రాత్మికా | అమ్మవారి పంచదశాక్షరి మంత్రం చతుర్విద పురుషార్ధాలను సిద్ధింపజేసేది కనుక దానిని మూలమంత్రం అని అంటారు. By chanting Mother's panchadasi mantra is we can achieve all the four purushardas. That is why it is called the root mantra or moola mantra. |
89 | Moolakootathrayakalebara మూలకూటత్రయకళేబరా | The three parts of the panchadasakshari manthra are the three kutas of Mother's meta physical body. పంచదశి మంత్రంలోని మూడు పాదాలు అమ్మవారి సూక్ష్మ శరీరములోని మూడు కూటములు. |
90 | Kulamruthaikarasika కులామృతైకరసికా | Mother takes pleasure in drinking the nectar flowing from the thousand petaled lotus. సహస్రారంలో ఉన్న అమృతాన్ని ఆస్వాదించటంపై ఆశక్తి ఉన్నది మన అమ్మ. |
91 | kulasanketapalini కులసంకేతపాలినీ | Mother protects the sacred principles of Srividya from falling into unsuitable people. శ్రీవిద్యోపాసనలోని గొప్ప రహస్యాలను అర్హులు కాని వారి నుంచి అమ్మ ఎల్లపుడూ కాపాడుతూ ఉంటుంది. |
92 | Kulangana కులాంగనా | Sacred principles of Srividya are protected like just like how a woman belonging rich family heritage is protected. అమ్మ చక్కటి వంశ గౌరవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మహా పతివ్రత. అటువంటి స్త్రీ ఎలా కాపాడబడుతుందో శ్రీవిద్య కూడా అదే విధంగా కాపాడబడుతోంది. |
93 | Kulanthastha కులాంతస్థా | Mother is worshipped by those who follow Koulachara. They meditate her upon Muladhara and swadishtana. Its main goal is to possess all sorts of material comforts. కౌళాచారతత్పరులచే ధ్యానింపబడుతున్నది. ఆధార స్వాధిష్టానములందు అమ్మను ధ్యానించు వారు కౌళాచారులు. ఐహిక సుఖాలను పొందడమే దీని ప్రధాన లక్ష్యం. |
94 | Koulini కౌళినీ | The process of drawing Srichakra on an outer surface and worshipping it is called Koulachara. బాహ్యప్రదేశములో శ్రీచక్రాన్ని వ్రాసి పూజించే పద్ధతిని కౌళాచారము అంటారు. |
95 | Kulayogini కులయోగినీ | Koulachara is followed only by kshapanas, kapalikas, digambaras, itihasas, tantravadas and vamaacharas. కౌళాచారము క్షపణులు, కాపాలికులు, దిగంబరులు, ఇతిహాసాలు, తంత్రవాదులు, వామాచారులు మాత్రమే పాటిస్తారు. |
96 | Akula ఆకులా | There are two 1000 petalled lotuses in the human body. 1. Beneath the Muladhara chakra. This is called kula. 2. Above the Agna chakra. This is Akula మానవ శరీరంలో రెండు సహస్రదళ పద్మములు ఉన్నాయి. ఒకటి ఆధార చక్రం క్రింద ఉంటుంది. ఇది కులము. ఇంకొకటి ఆజ్ఞ చక్రం పైన ఉంటుంది. ఇది ఆకుల. |
97 | Samayanthastha సమయాంతస్థా | Those who align their actions to vedic prescriptions are called followers of Samayaachaara. Mother lives in such actions. వైదిక కర్మలు చేసే సమయాచారుల అంతస్థమున ఉండునది. |
98 | Samayacharathatpara సమయాచారతత్పరా | Smrutis written by sages like Vyaasa, Paanini, Surya, Pingala, Yaaska, Manu, Yaajnavalkya, Apastamba and Goutama explain samayachaara. Their main goal is self - realization. Mother likes them. వ్యాస, పాణిని, సూర్య, పింగళ, యాస్కా, మను, యాజ్ఞవల్క్య, ఆపస్తంబ, గౌతమ రుషులు వ్రాసిన స్మృతులు సమయాచారన్ని బోధిస్తాయి. మోక్షమే వాటి ప్రధాన లక్ష్యం. ఈ సమయాచారమునందు ఆసక్తి కలది మన అమ్మ. |
99 | Muladharaikanilaya మూలాధారైకనిలయ | Mother lives in Mooladhara chakra in the form a four petalled lotus అమ్మ మూలాధార చక్రంలో నాలుగురేకుల కాలువపువ్వులా ఉంటుంది. |
100 | Brhamagranthi Vibhedini బ్రహ్మగ్రంథి విభేదినీ | After leaving Muladhara during its ascent, the kundalini unties the Brahma granthi. కుండలినీ నిద్రలేచి పైకి ఎగబాకుతున్నపుడు మందుగా బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది. |
101 | Manipoorantharudhitha మణిపూరాంతరుదితా | Mother lives in Manipoora which is a lotus with 10 petals. It is situated near the belly button. This is full of gems. మణిపూర చక్రం నాభి స్థానంలో ఉంటుంది. ఇది మణులతో పొదగబడిన 10 దళముల పద్మంలా మెరుస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మ ఉంటుంది. |
102 | Vishnugrandhivibedhini విష్ణుగ్రంధివిభేదినీ | The rising kundalini unties Vishnu grandhi after crossing manipura and anahata chakras పైకి ఎగబాకుతున్న కుండలిని మణిపూర అనాహతాలను దాటిన పిదప విష్ణు గ్రంధిని భేదిస్తుంది. |
103 | Agnachakarantharalastha ఆజ్ఞాచక్రాన్తరాళస్థా | Agnachakra is situated in between the two eybrows. It is in the form of a 2 petaled lotus. Instructions/orders to the whole body goes from here. It is also called Odyanapeetam or Prayaga Kshetram. Ida, Pingala and Shushumna nadis merge at this point. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో రెండు దళముల పద్మంలా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఇక్కడినుంచే ఆజ్ఞలు జారీ అవుతుంటాయి. దీనిని ఓడ్యాణపీఠం అని కూడా అంటారు. దీనికి ప్రయాగ క్షేత్రం అని పేరుకూడా కలదు. ఇడా, పింగళ, శుషుమ్న నాడులు ఇక్కడ సంగమిస్తాయి. |
104 | Rudragrandhivibhedini రుద్రగ్రంధివిభేదినీ | Mother unties the Rudra grandhi i,e she helps us cross the hurdles caused due to our violent thoughts and nature షట్చక్రాలలో అరవదైన ఆజ్ఞా చక్రం తరువాత రుద్ర గ్రంధి వస్తుంది. అమ్మ కృపతో కుండలిని రుద్ర గ్రంధిని విభేదిస్తుంది. |
105 | Sahararambhujarooda సహస్రాంబుజారూఢా | 1000 petaled lotus is situated above agnaachara and slightly below the Brahma randhra. This is mother's abode. A yogi who reached this state will experience the ultimate bliss. ఆజ్ఞాచక్రం పైన బ్రహ్మరంధ్రానికి కొద్దిగా కింద సహస్రదళ పద్మం ఉంటుంది. ఇది అమ్మ నివాసం. ఈ స్థాయిని చేరుకున్న యోగి మహానందాన్ని పొందుతాడు. |
106 | Sudhasarabhivarshini సుధాసారాభివర్షిణీ | Ambrosia is present in solidified form in the pericarp of the 1000 petaled lotus. When kundalini reaches there, its heat liquefies ambrosia and makes it flow down the body. సహస్రదళ పద్మం యొక్క కర్ణికలో అమృతం ఘనీభవించి ఉంటుంది. అదే క్షీర సముద్రం. కుండలినిది అగ్నితత్వం. ఆ వేడికి అమృతం ద్రవీభవించి ధారలా వర్షిస్తుంది. |
107 | Thatillata samaruchih తటిల్లతా సమరుచిహ్ | She who shines like the streak of lightning. మెరుపు తీగ వంటి కాంతి కలది. |
108 | Shatchakropari samshitha షట్చక్రోపరి సంస్థితా | Mother lives in the 1000 petaled lotus that is present on top of the six chakras. అమ్మ షట్చక్రాలపైన ఉన్న సహస్రదళ కమలంలో ఉంటుంది. |
109 | Mahasaktih మహాసక్తిహ్ | Kundalini is very eager to reach the sahasradala padma at Sahasrara chakra. కుండలిని సహస్రారంలోని సహస్రదళ పద్మము చేరుకోవాలని అత్యంత ఆసక్తితో ఉంటుంది. |
110 | Kundalini కుండలినీ | Kundalini is in the form of a snake at Mooladhara. It makes three and half rounds and sleeps there with head downwards కుండలిని సర్పాకారంలో మూలాధార చక్రంలో మూడు చుట్టలు చుట్టుకుని అధోముఖంగా నిద్రిస్తూ ఉంటుంది. |
111 | Bisatantutaniyasi బిసతంతుతనీయసీ | Kundalini is very think like thread in lotus stem తామర తూడులోని దారం లాగ చాలా సన్నగా ఉంటుంది. |
112 | Bhavani భవానీ | 'Bhava' represents the whole creation. 'Bhavani' is wife of 'Bhava'. భవుని పత్ని భవాని. ఈ సమస్త స్థావరజంగమ స్వరూపమే భావుడు. |
113 | Bhavanagamya భావనాగమ్యా | Bhavana means feeling. Recollecting the feeling one experiences while performing several forms of worship is Bhavana. Mother can be attained throught Bhavana భగవదోపాసలో కలిగే అనుభూతులను స్మృతిపథంలో ఉంచుకుని మరల మరల తలచుకోవడమే భావన. భావనచే పొందదగిన అమ్మ. |
114 | Bhavaranyakutharika భవారణ్యకుఠారికా | Mother will cut the shackles that bound us to this world with her axe. ఆర్తితో అమ్మను తలచుకుంటే ఆవిడ తన గొడ్డలితో మన రాగద్వేషాలను నరికివేస్తుంది. |
115 | Bhadrapriya భద్రప్రియా | Mother is always interested in doing good to her children అమ్మ తన బిడ్డలకు సర్వ మంగళములు కలుగజేయుటయందు ఆసక్తి కలది. |
116 | Bhadramurthy భద్రమూర్తి | She is personification of all that is good things and qualities అమ్మ స్వరూపమే సర్వ మంగళ స్వరూపం. |
117 | Bhakthasoubhagyadaayini భక్తసౌభాగ్యదాయనీ | If her children ask for anything, she will give them more than what they asked for. That is motherhood. అడిగిన పిల్లలకి అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం అమ్మతనం. మన అమ్మ సర్వ సౌభాగ్యాలు కలుగజేసే జగజ్జనని. |
118 | Bhakthipriya భక్తిప్రియ | Mother likes devotion. She is eager to help us. She wants to reach to us. తన బిడ్డలలో ఉన్న భక్తి భావన అంటే అమ్మకు చాలా ఇష్టం. |
119 | Bhakthigamya భక్తిగమ్యా | Easiest path to reach Mother is devotion. భక్తి ద్వారా మనం అమ్మను సునాయాసంగా చేరుకోగలము. |
120 | Bhakthivasya భక్తివశ్యా | When a child yearns for her with devotion, Helping that child will be her first and topmost priority. అమ్మ భక్తికి వశమవుతుంది. |
121 | Bhayapaha భయాపహా | If such mother is with us, then what do we fear for? అటువంటి అమ్మ మనవద్ద ఉంటె ఇక భయానికి చోటెక్కడుంది? |
122 | Shambhavi శాంభవి | 'Sham' represents boundless joy. 'Shambhavi' means one who shows the way to 'Sham'. 'శం' అంటే అంతులేని అవధులులేని ఆనందము. 'శం' కు దారిచూపునది శాంభవి. |
123 | Sharadaradhya శారాదారాధ్యా | Sarada represents wisdom. 'Saradulu' represents those people whose wisdom is complete, whose intellect is flawless. They seek mother Lalitha's abode. శారద అంటే జ్ఞానం. జ్ఞానంగలవారు శారదులు. అటువంటివారు ఆత్మానందమే నిజమైన సుఖమని తెలుసుకుని లలిత అమ్మను ప్రార్ధిస్తారు. |
124 | Sharvani శర్వాణీ | She who is the consort of Lord Shiva in the form of Sarva చరాచర జగత్తును భరించేవాడు శర్వుడు. ఆయన అర్ధాంగి శర్వాని. |
125 | Sharmadayini శర్మదాయినీ | Sarma means everlasting joy. She who gifts such joy is Sarmadayini శర్మ అంటే శాశ్వతమైన సుఖం అని అర్ధం. అటువంటి సుఖాన్ని మనకు ప్రసాదించేది కనుక శర్మదాయిని. |
126 | Shaankari శాంకరీ | Sham karoti iti shankarah - Lord Shankara is personification of 'auspiciousness'. Our mother is the consort of Shankara. శం కరోతి ఇతి శంకరః - శం అంటే ఇక్కడ మంగళములు అని అర్ధం. శంకరుని ధర్మపత్ని శంకరి. |
127 | Shrikari శ్రీకరీ | She who gives all forms of wealth and happiness. శ్రీ అంటే శుభ సూచికం. తన భక్తులకు శుభములు కలుగజేయునది కనుక శ్రీకరి. |
128 | Sadhvi సాధ్వి | Mother always acts in such a way that God parameshwara's purpose is served. ఎల్ల వేళలా భర్త అభీష్టాన్ని కోరడమే సాధ్వి లక్షణం. అమ్మ పరమ సాధ్వి. |
129 | Sharatchandranibhanana శరత్చంద్రనిభాననా | Mother's face is pleasant like the autumn moon అమ్మ ముఖం శరత్కాలంలో(ఆస్వయుజ, కార్తీక) చంద్ర బింబంలా అందంగా ప్రసన్నంగా ఆహ్లాదంగా ఉంటుంది. |
130 | Shaathodhari శాతోదరీ | 'Satha' means contracted. 'Udara' means belly. Mother's belly is contracted and very thin. శాతము అంటే కృశించినది అని అర్ధం. అమ్మ ఉదరము సన్నగా కృశించిపోయి ఉంటుంది. |
131 | Shanthimathi శాంతిమతీ | She who is peace personified. ఆవిడ మూర్తీభవించిన శాంతి స్వరూపము. |
132 | Niradhara నిరాధారా | She who does not need any support to herself అమ్మే ఈ సృష్టి మొత్తానికి ఆధారం. ఆవిడకి వేరే ఆధారం అని ఏది ఉండదు. |
133 | Niranjana నిరంజనా | Anjana means coating or mask. It coversup the originality of the thing it is applied on. Our divine mother has no such anjanas. She is always pure and original. అంజనము అంటే కాటుక, పూత, ఆవరణ అని అర్ధం. అంజనము సహజత్వాన్ని కమ్మేస్తుంది. అటువంటి అంజనములులేనిది మన అమ్మ. |
134 | Nirlepa నిర్లేపా | She who is beyond illusion. మాయకు ఆమె అతీతురాలు. |
135 | Nirmala నిర్మలా | The soul is always pure and no impurity can ever change it. ఆత్మ నిర్మలమైనది. |
136 | Nithya నిత్యా | Mother is eternal. ఎల్లప్పుడూ ఉండునది |
137 | Niraakaara నిరాకార | It is not possible to assign any specific shape or form to Paramatma పరమాత్మకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఉందని చెప్పలేము. |
138 | Niraakula నిరాకులా | Ignorance leads to confusion. Divine mother shatters all the ignorance and removes all the confusion. అజ్ఞానం వల్ల కలిగే కలవరపాటు లేనిది అమ్మ. ఆమెను ప్రార్ధించే బిడ్డలకు ఆ కలవర్పాటును తొలగిస్తుంది. |
139 | Nirguna నిర్గుణా | She who is beyond any characteristics. All characteristics emerged out of her. So it is not possible to describe her with a characteristic. గుణములన్ని అమ్మనుండి ఉద్భవించాయి. అందుకని గుణములతో ఆమెను వర్ణించడం కుదరదు. |
140 | Nishkala నిష్కలా | She who is not divided. Meaning it is a continuous ocean of cosmic energy. భాగించడం కుదరని తత్త్వం. పరబ్రహ్మం అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అని చెప్పడం కుదరదు. |
141 | Shantha శాంతా | She who is personification of peace శాంతమును మానవీకరణ చేస్తే అమ్మ రూపం వస్తుంది. |
142 | Nishkama నిష్కామా | She who does not have any desires. కోరికలకు అతీతమైనది మన అమ్మ. |
143 | Nirupaplava నిరుపప్లవా | 'upaplava' indicates destruction. Divine mother is eternal. She cannot be destroyed. ఉపప్లవము అంటే నాశనము. అమ్మ ఆద్యన్తరహితము. నాశనము లేనిది. కనుకనే నిరుపప్లవ అని పిలవబడుతోంది. |
144 | Nithyamuktha నిత్యముక్తా | 'Muktha' means liberated. Free. She who is forever free of various bonds of the world. ముక్తా అంటే విడుదలచేయబడిన అని అర్ధం. అమ్మ ఎల్లప్పుడూ స్వతంత్రురాలు. |
145 | Nirvikara నిర్వికారా | Our body undergoes several changes. It has birth, death, growth, maturity etc. But soul never changes. మన శరీరానికి ఆరు రకముల మార్పులు ఉంటాయి. అవి 1. జన్మ. 2. స్థితి 3. వృద్ధి 4. విపరిణామము 5. క్షయము 6. నాశనము. కానీ ఆత్మకు ఈ మార్పులు ఏవి ఉండవు. |
146 | Nishprapancha నిష్ప్రపంచా | The word prapancha represents the whole creation. Divine mother existed even beyond 'OM'. So she is 'Nisprapancha'. ప్రపంచం అంటే ఓం నుండి ఇప్పటివరకు వచ్చినదంతా. కానీ 'ఓం' వచ్చిందే అమ్మనుండి కదా. అందుకే ఆవిడ నిష్ప్రపంచ - వీటన్నింటికీ అతీతం. |
147 | Nirashraya నిరాశ్రయా | Divine mother (Shakti) is the base for the whole creation. So she neither have nor need a base. సమస్త జగత్తు అమ్మని ఆధారంగా చేసుకుని ఉన్నది. అలాంటప్పుడు ఆవిడకి వేరే ఆధారం ఏముంటుంది. ఆమె అన్నింటికీ ఆశ్రయం. ఆవిడ నిరాశ్రయ. |
148 | Nithyashuddha నిత్యశుద్ధా | 'Shuddha' means pure. The soul is always pure. శుద్ధము అంటే మాలిన్యములేనిది. ఆత్మ నిత్యశుద్ధము. |
149 | Nithyabhuddha నిత్యబుద్ధా | Nithya buddha represents a state of mind in which wisdom is ripened and hence focuses only on inner peace. నిత్యం పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండే స్థితిని నిత్య బుద్ధ అంటారు. |
150 | Niravadhya నిరవద్యా | 'Avadhya' means flaw. Flaws appear due to ignorance. Niravadya means flawless. అవద్య అంటే దోషము. ఇది అవిద్య లేదా అజ్ఞానము వలన కలుగుతుంది. నిరవద్య అంటే ఎటువంటి దోషము లేనిది. |
151 | Niranthara నిరంతరా | 'Anthara' means limit or boundary. Divine mother is without any limits. Paramatma is boundless. 'అంతరం' అంటే హద్దు, అవధి. పరమాత్మ సర్వాంతర్యామి. అందుకే నిరంతర. |
152 | Nishkarana నిష్కారణా | Divine mother is the cause for the whole creation. But there is no cause for her existence. So she is called Nishkarana సృష్టి మొత్తానికి ఆవిడే కారణం. ఆవిడ వల్ల సృష్టి వచ్చింది. మరి ఇక ఆవిడ రావడానికి ఇంకో కారణం లేదు. అందుకే నిష్కారణ. |
153 | Nishkalanka నిష్కలంకా | 'kalankam' means sin. Sin cannot touch Divine Mother కళంకం అంటే పాపం. అమ్మను పాపం అంటలేదు |
154 | Nirupadhih నిరుపాధిహ్ | 'Upadhi' means a body. Divine mother does not have any karma. So she does not need a body. ఉపాధి అంటే శరీరం. అమ్మ కర్మ చేయదు. కనుక ఆమెకు శరీరం అవసరం లేదు. |
155 | Nirishvara నిరీశ్వరా | Nireeswara means she who does not have any one controlling her అమ్మే అన్నింటికీ ఈశ్వరి(ప్రభువు). ఆమె కన్నా పైన ఎవరు లేరు. అందుకే నిరీశ్వర. |
156 | Niraga నీరాగా | 'Raga' means affinity. 'Dwesha' is the opposite. Niraga means not having either Raaga or Dwesha. రాగము అంటే ఇచ్ఛ. ద్వేషము దీనికి విరుద్ధము. ఈ రాగ ద్వేషాలు లేకుండుట నీరాగ. |
157 | Ragamadhani రాగమదనీ | By praying divine mother, we can overcome Raga dwesha and there by 'Arishadvarga' అమ్మను మస్ఫూర్తిగా ప్రార్దించిన వారు రాగ ద్వేషాలను జయించగలుగుతారు. |
158 | Nirmada నిర్మదా | We learnt about 'Mada' in 156th name. But Divine mother is 'Nirmada'. She does not have any of these vices మదము గురించి మనం 156వ నామంలో తెలుసుకున్నాం. వీటన్నింటికి దూరంగా అమ్మ నిర్మద అయి ఉంటుంది. |
159 | Madanashini మదనాశినీ | Because she does not have 'Mada', she will remove it from our mind as well. మదం లేనిది కాబట్టి మనలో మదాన్ని కూడా తీసివేయగలదు. |
160 | Nischintha నిశ్చింతా | 'Chinta' means worry. Those who perform karma will have worries because they seek results. But divine mother does everything for others benefit. She does not seek anything for herself. So she is 'nischintha'. చింత అంటే దుఃఖం. కర్మలు చేయువారు ఎప్పుడైతే వాటి ఫలితాలపై దృష్టి సారిస్తారో అప్పుడు వారికి చింత మొదలవుతుంది. కానీ మన అమ్మ కర్మలు లోక కళ్యాణం కొరకు చేస్తుంది. తన స్వార్థం ఎన్నడూ చూసుకోదు. అందుకే నిశ్చింత అని పిలవబడుతోంది. |
161 | Nirahankara నిరహంకారా | Ego is formed out of the three gunas. Divine mother is beyond ego. అహంకారం త్రిగుణాత్మకమైనది. అహంకారములేవి లేక పోవడమే నిరహంకారం. అది శుద్ధ సత్వం. అదే మన అమ్మ. |
162 | Nirmoha నిర్మోహా | We get confused due to 'Moha'. Divine mother is beyond this. Hence she is called 'Nirmoha' మోహము వలన ధర్మం అధర్మం గాను అధర్మం ధర్మం గాను అనిపిస్తుంది. అమ్మకు రాగ ద్వేషాలు ఉండవు. మోహము ఉండదు. అందుకే నిర్మోహ. |
163 | Mohanasini మోహనాశినీ | Because she is beyond 'Moha' she can save us from the confusion caused by 'Moha' ఆమె మోహము లేకుండా ఉంటుంది కనుక మనలోని మొహాన్ని కూడా త్రుంచివేస్తుంది. |
164 | Nirmama నిర్మమ | 'Mama' the notion of I and Mine. Divine mother is beyond such notion. మమ అంటే నాది అనే భావన. ఆత్మకు తన పర అనే భేదం వర్తించదు. అందుకే నిర్మమ అని అన్నారు. |
165 | Mamathahanthri మమతాహంత్రీ | When you pray divine mother, she will give you the strength required to overcome mamatha అమ్మను ప్రార్ధిస్తే మనం నేను నాది అనే భావనను తొలగించగలుగుతాము. |
166 | Nishpapa నిష్పాప | 'Papa' means sin. Divine mother is 'Nishpapa'. అమ్మకు ఎటువంటి పాపం ఉండదు. ఎందుకంటే ఆవిడ కర్మలు చేయదు. |
167 | Papanashini పాపనాశినీ | By praying divine mother, we overcome arishadvarga and destroy all the sins. అమ్మను ప్రార్ధిస్తే పాపాన్ని తుడిచివేయ గలుగుతాము. |
168 | Nishkrodha నిష్క్రోధా | Krodha is the second one in Arishadvarga. Divine mother is beyond Arishadvarga. అరిషడ్వార్గాలలో రెండవది క్రోధం. అమ్మ అరిషడ్వార్గాలకు అతీతం. అందుకే నిష్క్రోధ. |
169 | Krodhashamani క్రోధశమనీ | 'shama' means to douse. When we pray divine mother with love and devotion, she will douse the 'krodha' within us as well. ప్రేమ-భక్తిలతో అమ్మను ఆరాధిస్తే ఆవిడ మనలోని క్రోధాన్ని కూడా శమింపచేస్తుంది. |
170 | Nirlobha నిర్లోభా | Divine mother is beyond 'raga' or 'dwesha'. So she has no 'lobha'. She is very merciful. రాగద్వేషాలకు అతీతమైన అమ్మకు లోభముండదు. ఆవిడది అపారమైన దయ. |
171 | Lobhanashini లోభనాశినీ | When we pray divine mother, she give us the inner calmness. The 'lobha'(greed) dissolves in this inner calmness. అమ్మను ప్రార్ధించిన సాధకుడికి శాంతి లభిస్తుంది. ఆ శాంతిభావనలో లోభం దగ్ధం అయిపోతుంది. |
172 | Nissamsaya నిస్సంశయా | 'Samsaya' means doubt. Doubts arise due to misconceptions. Divine mother is personification of pure consciousness. She is the complete knowledge. So she does not have any doubts. మిడిమిడి జ్ఞానం వలన సందేహములు వస్తాయి. తద్వారా భ్రాంతి కలుగుతుంది. కానీ అమ్మ శుద్ధ జ్ఞాన స్వరూపం. పరిపూర్ణ జ్ఞానానికి స్త్రీరూపమే అమ్మ. అందుకే ఆమె నిస్సంశయ. |
173 | Samsayaghni సంశయాఘ్నీ | To clear doubts, one has to approach a well learned guru. By praying divine mother who is the personification of complete knowledge, we can clear all our doubts. సందేహములు పోగొట్టాలంటే విషయాన్ని క్షుణ్ణంగా తెలిసిన గురువులని ఆశ్రయించాలి. అమ్మది పరిపూర్ణ జ్ఞానం కనుక ఆమెను ప్రార్ధిస్తే మన సందేహాలన్నీ తీరిపోతాయి. |
174 | Nirbhava నిర్భవ | Divine mother does not have 'raaga/dwesha'. So samasara is not problematic for her. She is 'Nirbhava' అమ్మకు రాగద్వేషాలు ఉండవు. అందుకే ఆవిడకి భవబాధలు ఉండవు. |
175 | Bhavanashini భావనాశినీ | Mother will remove our raga/dwesha and hence navigating through the samsara will become easy. అమ్మను మన దేహతాదాప్యతను, రాగద్వేషాలను తొలగించి వేస్తుంది. అప్పుడు మనకు సంసారము భారమనిపించదు. |
176 | Nirvikalpa నిర్వికల్పా | ఎటువంటి అలజడి లేని నిర్వికల్ప స్థితి అమ్మది. Mother is the calmness in the still mind. |
177 | Nirabadha నిరాబాధా | Baadha means sorrow. Divine Mother does not have any sorrows. So she is Nirabadha. అసలు రాగద్వేషాలే లేని అమ్మకు బాధలేందుకు ఉంటాయి? ఆమె నిరాబాధ. |
178 | Nirbhedha నిర్భేదా | 'Bheda' means difference. Sanatana dharma is based on advaita. 'Advaita' means not two. As there is no difference it is 'Nirbheda' సనాతన ధర్మానికి అద్వైతమే ఆధారం. రెండవదంటూ లేనపుడు ఇంక భేద భావనకి చోటేది. అసలు భేదమే లేదు కనుక నిర్భేద. |
179 | Bhedhanashini భేదనాశినీ | By praying divine mother, we can realize the oneness (advaita). అమ్మను ప్రార్ధిస్తే భగవంతునితో ఏకత్వాన్ని సాధించగలుగుతాము. |
180 | Nirnaasha నిర్నాశా | 'Naasha' means destruction. The soul can not be destroyed. Divine mother is the soul. so she is 'Nirnaasha' ఆత్మ నాశనము లేనిది. అమ్మది ఆత్మ స్వరూపం. అందుకే నిర్నాశా అన్నారు. |
181 | Mrityumadhani మృత్యుమథనీ | When we pray divine mother, she sheds the light (consciousness) with which we will overcome the fear of death. మృత్యు భయం పోగొట్టే వెలుగు(జ్ఞానం) అమ్మ మనకు ప్రసాదిస్తుంది. |
182 | Nishkriya నిష్క్రియా | Divine mother is beyond karma. So she does not need any of this. She is 'Nishkriya' అమ్మకు కర్మ చేసే అవసరం లేదు. ఆమె నిష్క్రియ. |
183 | Nishparigraha నిష్పరిగ్రహ | 'Parigraha' means to accept. Divine mother does not/need not accept anything from others. 'పరిగ్రహము' అంటే పుచ్చుకొనుట, స్వీకరించుట అని అర్ధం. అమ్మకు ఇవ్వడమే కానీ తీసుకోవలసిన అవసరంలేదు. ఆవిడ నిష్పరిగ్రహ. |
184 | Nisthula నిస్తులా | 'Tula' means to compare. There is nothing else to describe divine mother with comparison. She is the only one. She is everything. So she is 'nistula' ఉపమానాలతో అమ్మను వర్ణించడం కుదరదు. ఎందుకంటే ఉన్నది ఆమె ఒక్కతే. రెండవది లేదు. అన్నీ ఆమె స్వరూపాలే. అటువంటప్పుడు ఇక దేనితో పోల్చి ఆమెను వర్ణిస్తాము? అందుకే ఆమె నిస్తులా. |
185 | Neelachikura నీలచికురా | 'Chikura' means forelocks. Divine mother has dark black forelocks. This indicates that she is ever youthful. చికురములు అంటే ముంగురులు. అమ్మ నల్లని ముంగురులు కలది. ఇవి ఆమెయొక్క నిత్య యవ్వనాన్ని సూచిస్తాయి. |
186 | Nirapaya నిరపాయా | 'Apaya' means danger or trouble. It pertains to physical body. Not for atma (soul). Divine mother is Paramatma. Hence she is called 'Nirapaya'. అపాయము లేదా ఆపద భౌతిక శరీరానికే వర్తిస్తాయి. ఆత్మకు కాదు. అమ్మది ఆత్మ స్వరూపం మన అమ్మ.అందుకే ఆవిడ నిరపాయ. |
187 | Nirathyaya నిరత్యయా | Nobody can outsmart Paramatma. We have to submit ourselves to it with devotion. నిరత్యయ అంటే అతిక్రమించుటకు లేదా గెలుచుకొనుటకు వీలు కానిది. అదే పరమాత్మ. మనం దానికి భక్తి పూర్వకంగా లొంగిపోవాలి. |
188 | Durlabha దుర్లభా | Only those with steadfast devotion and determination can do this attain Moksha సుదీర్ఘమైన సాధన, భక్తి, శ్రద్ధ, దీక్ష, పట్టుదల ఉన్నవాళ్లే మోక్షం పొందగలుగుతారు. |
189 | Durgama దుర్గమా | 'Durgama' means not easily reachable. As explained in previous name, it is not easy to reach DivineMother's state of consciousness. One has to approach learned gurus who already possessed it and willing to teach. One can't do it on his own. దుర్గమ అంటే సులువుగా పొంద సఖ్యము కానిది. అమ్మ సాయుజ్యమును పొందిన జ్ఞానులను, గురువులను ఆశ్రయించి వారి శిక్షణతో ఆ స్థితిని చేరుకో గలుగుతాము. |
190 | Durga దుర్గా | She is called as Durga because she killed a demon called Durgama. Durga is the nine year old girl we pray during Navaratri. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కనుక దుర్గ అని పిలవబడుతోంది. దేవినవరాత్రులలో 9 సంవత్సరాల బాలిక కొలిచేది దుర్గనే. |
191 | Dhukhahanthri దుఃఖహంత్రీ | 'Dhukha hantri' means she who removes sorrows దుఃఖ హంత్రి అంటే దుఃఖములను హరించేది అని అర్ధం. |
192 | Sukhaprada సుఖప్రదా | She bequeths all auspicious things and lot of happiness. సర్వ సుఖములను ఇచ్చునది |
193 | Dushtadura దుష్ఠదూరా | Those striving for self-realization should keep away from company of people who think I am this body. శరీరమే నేను అనే భావనలో ఉండేవారు దుష్టులు. వారు అహంకారులు. అటువంటి వారితో స్నేహం మీ సాధనకి ప్రమాదకరం. వారిని దూరంగా ఉంచడమే ఉత్తమం. |
194 | Duracharashamani దురాచారశమనీ | Doing karma with out following achara can accrue sin. If you realize your mistakes and beg pardon, Divine mother will rid you of all the sin accrued. దురాచారం వలన పాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరిన బిడ్డల పాప భారాన్ని అమ్మ తొలగించేస్తుంది. |
195 | Doshavarjitha దోషవర్జితా | 'Dosha varjita' means defectless. Foolproof. 'Raaga' and 'Dwesha' are the seeds for defects within us. From these arise the 'Arishadvarga' due to which we are misguided and our actions become flawed. But divine mother does not have these. Hence she is 'Dosha varjita' దోషవర్జితా అంటే దోషములు లేనిది అని అర్ధం. మనలోని దోషాలకు రాగ ద్వేషాలే మూలకారణం. వీటి నుండి అరిషడ్వార్గములు పుట్టుకొస్తాయి. వాటి వలన మనలో దోషములు పుట్టుకొస్తాయి. కానీ అమ్మ రాగ ద్వేషాలకి అతీతం. అందుకే దోష వర్జితా అన్నారు. |
196 | Sarvagnya సర్వజ్ఞా | 'Sarvagna' means having knowledge of everything. 'సర్వజ్ఞత' అంటే సర్వము తెలిసి ఉండటం. |
197 | Sandrakaruna సాంద్రకరుణా | Sandra karuna means full of mercy. Mother's love is unconditional for any living being. సాంద్ర కరుణ అంటే అపారమైన దయ కలది. |
198 | Samanadhikavarjitha సమానాధికవర్జితా | 'Samana' means equal. 'Adhika' means superior. 'Varjita' means null or void. There is nothing or nobody that is either equal or superior to Divine mother. So she is 'Samanadhikavarjita' అమ్మకు సమానముగా కానీ, అధికులు కానీ ఎవరు/ఏదీ ఉండదు. అందుకే సమానాధిక వర్జిత అని అన్నారు. |
199 | Sarvashakthimayi సర్వశక్తిమయీ | Divine Mother is the personification of all the powers in this universe. So she is Sarva Shaktimayi శక్తులన్నీ అమ్మనుంచి వచ్చినవే. అందుకే సర్వ శక్తిమాయి అని అన్నారు. |
200 | Sarvamangala సర్వమంగళా | Divine mother ensures that wishes of those who follow the dharma of 'varna' and 'Ashrama' are fulfilled. వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవారి మనో రధము ఈడేర్చేది కనుక సర్వ మంగళ అని అన్నారు. |
201 | Sadgathiprada సద్గతిప్రదా | what gives moksha can't give worldly pleasures. And that which give worldly pleasures can't give moksha. But by praying divine mother, you can achieve whatever you want. సాధారణంగా మోక్షము దొరికేచోట భోగము దొరకదు. భోగము దొరికేచోట మోక్షము దొరకదు. కానీ అమ్మను ధ్యానించే వారికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. |
202 | Sarveshwari సర్వేశ్వరీ | She is the goddess of all. So she is called 'Sarveshwari' అందరికీ అమ్మే ఆరాధ్యదైవం. అందుకే సర్వేశ్వరి అన్నారు. |
203 | Sarvamayi సర్వమయీ | Divine Mother is filled in every second of time and every inch of space. భూతభవిష్యత్వర్తమాన కాలములలోనూ సమస్త బ్రహ్మాండాలనూ నిండి నిబిడీకృతమై ఉన్నది అమ్మే. |
204 | Sarvamantraswarupini సర్వమంత్రస్వరూపిణీ | There are 7 crore mantras. Divine mother is personification of all these mantras. Hence she is called Sarvamantra swaroopini. మనకు మొత్తం 7 కోట్లు మంత్రాలు ఉన్నాయి. అవన్నీ అమ్మ స్వరూపాలే. అందుకే సర్వ మంత్రస్వరూపిణి అన్నారు. |
205 | Sarvayantrathmika సర్వయంత్రాత్మికా | There are 3 types of Yantras. Divine Mother is the personification of all these yantras. So she is called Sarva yantratmika. యంత్రములు మూడు రకములు. అన్ని యంత్రాలు ఆ పరమేశ్వరి యొక్క ఆత్మ స్వరూపాలే. అందుకే సర్వ యంత్రాత్మిక అన్నారు. |
206 | Sarvatantrarupa సర్వతంత్రరూపా | There are total 64 tantras to help us satisfy our wants. The 65th one is Srividya tantra. This helps us to attain moksha. These tantras form the body of out Divine mother. మొత్తం 64 తంత్రాలు ఉన్నాయి. ఈ తంత్రాలవల్ల లోకంలో కావలిసినవన్నీ మనం సాధించుకోవచ్చు. శ్రీవిద్యా తంత్రం 65వది. అది మోక్షప్రదము. ఈ తంత్రములే శరీరముగా కలది మన అమ్మ. |
207 | Manonmani మనోన్మనీ | Divine Mother is beyond the reach of the Mind. మనస్సుకు అందనటువంటిది. |
208 | Maheswari మహేశ్వరీ | Maheswari means 'Maya/Illusion'. She is the consort of Lord Maheswara. She is the one who decides the next birth of a living being based on his/her karma(past actions). మహేశ్వరి అంటే మాయ, ప్రక్రుతి అని అర్ధం. ఆమెను పొంది ఉన్నవాడు మహేశ్వరుడు. జగత్తులోని జీవ రాశులకు వారి వారి కర్మఫలానుసారం ఉత్తర జన్మలను ఇచ్చేది మహేశ్వరి. |
209 | Mahadevi మహాదేవీ | Divine mother's body is infinite. Its boundless, unending. ప్రమాణానికి - కొలతకి అందనంత శరీరం కలది. |
210 | Mahalakshmih మహాలక్ష్మీహ్ | She who gives wealth and prosperity to people based on their actions. జీవులకు వారివారి కర్మానుసారం సిరి సంపదలను అందించేది మహాలక్ష్మి. |
211 | Mridapriya మృడప్రియా | 'Mrida' means boundless joy. Everlasting happiness. That is 'Shivam'. Divine mother likes it. Hence she is called 'Mrida priya'. మృడ అంటే ఆనందము అని అర్ధం. ఇక్కడ ఆనందం అంటే శాశ్వతమైన ఆత్మానందం అని అర్ధం చేసుకోవాలి. అదే శివం. ఆ ఆనందముపై ప్రీతి కలది. |
212 | Maharupa మహారూపా | All forms in this creation are forms of Divine Mother. Hence, she is Maharupa. ఈ సృష్టి అంతా అమ్మ రూపాలే. అందుకే ఆమె మహారూపా. |
213 | Mahapujya మహాపూజ్యా | Great people like Brahma, Indra, Upendra did poojas for divine mother. Hence, she is called Mahapujya. బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలగు వారిచే పూజించబడింది మన అమ్మ. అందుకే మహా పూజ అన్నారు. |
214 | Mahapathakanashini మహాపాతకనాశినీ | Those who meditate upon Divine mother and experience her bliss are rid of all sins త్రికరణశుద్ధితో క్షమాపణ చెప్పి అమ్మను పూజించి, ఆమె దివ్య దర్శనం పొందినవారి పాపమంతా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది. |
215 | Mahamaya మహామాయా | It is not easy to outsmart Mother's sheath of illusion అమ్మది మాయా స్వరూపం. దానిని భేదించడం చాలా కష్టం |
216 | Mahasatva మహాసత్వా | Divine mother is beyond the three gunas అమ్మ గుణాతీతమైనది. |
217 | Mahasakthih మహాశక్తిహ్ | She is the prower behid every action and stimulus in this world. చలనం ఉన్న ప్రతీచోటా దానిని కలిగించే శక్తిలో ఉండేది అమ్మే. |
218 | Maharathih మహారతిహ్ | The desire to experience the bliss of Atma is very strong. It does not go even after taking hundreds of thousands of rebirths. Hence it is termed as 'Maharathi' ఆత్మానందంపై కోరిక అత్యంత బలవత్తరమైనది. ఎన్ని జన్మలు ఎత్తిన, ఎన్ని కర్మలు చేసినా అది పోదు. అందుకే 'మహారతి' అన్నారు. |
219 | Mahabhoga మహాభోగా | The bliss of self realization is the greatest of all pleasures. Hence is it called 'Maha bhoga'. ఆత్మానందం చాల గొప్పది. అన్ని సుఖాలకన్నా శ్రేష్టమైనది. అందుకే మహాభోగా అన్నారు. |
220 | Mahaishwarya మహైశ్వర్యా | Aishwayra means having wealth and Gods grace. Divine mother gives us both. ఐశ్వర్యము అంటే ఈశ్వతము, సంపద. అమ్మ రెండింటిని ఇస్తుంది. |
221 | Mahaveerya మహావీర్యా | To overcome maya(ego) means to overcome oneself. It requires great valor i,e Mahaveerya to overcome oneself. తనను తాను అధికమించాలి అంటే వీరత్వం ఉండాలి. మాయను ఛేదించడం అంటే తనను తాను అధికమించడమే. |
222 | Mahabala మహాబలా | She who is very strong. Refer this page for description of various types of strengths. ఏంతో గొప్ప బలము కలిగి ఉన్నది. |
223 | Mahabhudhih మహాబద్ధిహ్ | Our intellect(buddhi) is driven by karma. Divine mother diverts buddhi towards Atma. From then onwards, buddhi will be driven by Atman and not karma. Hence she is called Maha buddhi. బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. అమ్మను ప్రార్ధిస్తే ఆవిడ వారి బుద్ధిని ఆత్మచే ప్రేరేపింపజేస్తుంది. అందుకే ఆవిడ మహాబుద్ధి. |
224 | Mahasidhih మహాసిద్ధిహ్ | Siddhi are of two types. 1) Kaarya Siddhi, 2) Deva Siddhis. The super set of all kaarya and deva siddhis is Maha siddhi. సిద్ధులు రెండు రకాలు. 1) కార్య సిద్ధులు, 2) దైవ సిద్ధులు. ఈ కార్య సిద్ధులు, దైవ సిద్ధులు రెండు కలిస్తే మహా సిద్ధి అవుతుంది. |
225 | Mahayogeswareswari మహాయోగీశ్వరేశ్వరీ | A yogeeswara is one who mastered one of these yogas. Divine mother is the master of all the yogeeswaras. Hence she is Maha yogeswareswari యోగవిద్యలో నిష్ణాతులను యోగీశ్వరులంటారు. అటువంటి యోగీశ్వరులకు ఈశ్వరి కాబట్టి మహా యోగీశ్వరీస్వరి. |
226 | Mahatantra మహాతంత్రా | Divine mother is the main deity of all the tantras. Hence she is called mahatantra తంత్రాలన్నింటికీ అధిష్టాత్రి మన అమ్మ. అందుకే ఆమెను మహాతంత్ర అని అన్నారు. |
227 | Mahamantra మహామంత్రా | Because all the mantras came from Divine mother, she is called Mahamantra. అన్ని మంత్రాలూ ఆమెనుండే వచ్చాయి కనుక అమ్మను మహా మంత్రం అన్నారు. |
228 | Mahayantra మహాయంత్రా | Yantras are forms given to mantras. If Divine mother is the origin of all mantras, then she is the origin for all the yantras and tantras aswell. యంత్రాలు మంత్రాల యొక్క రూపాలు. సర్వమంత్రరూపిణి అయిన అమ్మ సర్వయంత్రరూపిణి, సర్వతంత్రరూపిణి కూడా. |
229 | Mahasana మహాసనా | 'Mahasana' means one that has very great throne. The great sri chakra is Divine mother's throne. Hence she is called 'mahasana' శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉన్నది కాబట్టి మహాసనా అని అన్నారు. అంటే ఏంతో గొప్పదైన ఆసనం కలది అని అర్ధం. |
230 | Mahayagakramaradhya మహాయాగక్రమారాధ్యా | Sri yaga, ambayaga, agnishtoma, paakayagna etc are called maha(great) yagas. Because divine mother is the master of all these yagas, she is called Mahayagakramaradhya. శ్రీయాగము, అమ్బయాగము, అగ్నిష్టోమము, పాకాయజ్ఞము మొదలైన వాటిని మహాయాగాలంటారు. ఈ మహాయాగాలన్నింటికీ అధిపతి అమ్మే కనుక మహాయాగక్రమారాధ్యా అనబడుతుంది. |
231 | Mahabhairavapujita మహాభైరవపూజితా | Divine mother is worshipped by Maha Bhairava. Hence she is called Maha bhairava pujita మహా భైరవునిచే పూజింపబడింది కనుక అమ్మను మహాభైరవ పూజిత అన్నారు. |
232 | Maheswaramahakalpamaha tandavasakshini మహేశ్వరమహాకల్పా మహాతాండవసాక్షిణీ | At the end of Maha kalpa, there will be an apocalypse. Shiva will be do the dance of destruction (pralaya tandavam). Divine mother is the only witness to it. మహా కల్పాంతరములో మహా ప్రళయంలో వస్తుంది. అప్పుడు శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. దానికి అమ్మ ఒక్కతే సాక్షిగా ఉంటుంది. |
233 | Mahakameshamahishi మహాకామేశమహిషీ | Kama means desire. There are many types of desires. Of all these, moksha is the greatest, strongest and toughest to achieve. Maha kameswara is the one who helps us attain moksha. Maha Kameswari is the shakti we have to worship for it. కామము అంటే కోరిక. ఈ కోరికలు అనేక రకాలు. కోరికలలో అన్నింటికన్నా గొప్పదీ, బలమైనది, దుర్లభమైనదీ మోక్షము. అందుకే అది మహాకామము. ఆ కోరికను తీర్చేవాడు మహా కామేశ్వరుడు. ఆ కోరిక తీరడానికి కావలిసిన శక్తి, యుక్తి, జ్ఞానం మహాకామేశ్వరి. |
234 | Mahatripurasundari మహాత్రిపురసుందరీ | From OM came Shakti. This Shakti expressed itself as a triology. The corners of this triangle are called Tripuras. Because all these Tripuras came from Divine mother (OM), she is called Maha Tripura sundari. బిందు స్వరూపుడైన పరబ్రహ్మ నుండి కొంత శక్తి బయటకు వచ్చి త్రికోణంగా ఏర్పడింది. ఆ త్రికోణముయొక్క మూడు కోణములలో త్రిపురాలు ఉంటాయి. త్రిపుటి అంతా బిందువు నుండే వచ్చింది కాబట్టి బిందురూపిణి అయిన అమ్మను మహా త్రిపురసుందరి అని పిలిచారు. |
235 | Chatustatyupacharadya చతుషష్ట్యుపచారాఢ్యా | 'Upacahara' means to offer our possessions to God. In 'Chatushastyupachara' we offer 64 possessions to God. It is done only to Divine mother. మనకున్న దానిని భగవంతునికి అర్పించడమే ఉపచారము. చతుషష్ట్యుపచార(64) పూజ కేవలం అమ్మకే చేస్తారు. |
236 | Chathushashtikalamayi చతుషష్టికాలమయి | Arts are classified into two types. 1) Art of Studies 2)Fine arts. There are 64 arts in each of these. All these are forms of Divine mother. కళలు రెండు రకాలుగా ఉన్నాయి. 1) విద్య కళలు, 2) వృత్తి కళలు. ఇవి ఒక్కొక్కటి 64 ఉన్నాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలే. |
237 | Mahachathusashtikotiyogini ganasevitha మహాచతుషష్టికోటియోగినీ గణసేవితా | శ్రీచక్రంలో అమ్మ 64 కోట్ల యోగిని గణములతో సేవించబడుతుంది. Divine Mother is served by 64 crore yoginis in Sri Chakra |
238 | ManuVidya మనువిద్యా | Human species emerged from Manu. He is the first one to learn and worship Divine mother through Sri Vidya. Hence it got the name manu vidya మనువునుండి మానవ జాతి వచ్చింది. శ్రీవిద్యను మొట్టమొదటిసారి ఉపాసించిన వాడు మనువు. అందుకే మను విద్య అని అన్నారు. |
239 | ChandraVidya చంద్రవిద్యా | Chandra also worshipped divine mother with upaasana of panchadashi mantra. This method is called chandra vidya పంచదశి మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో చంద్రుడు ఒకడు. అతని ఉపాసనా విధానాన్ని చంద్ర విద్య అంటారు. |
240 | ChandramandalaMadhyaga చంద్రమండలమధ్యగా | Sri chakra is also called 'chandra mandala'. Because Divine Mother is at the center of it, she is called 'Chandra mandala madhyaga' శ్రీచక్రమే చంద్రమండలం. దాని మధ్యలో, బిందు స్థానంలో ఉంటుంది కనుక అమ్మను చంద్ర మండల మధ్యగ అని అన్నారు. |
241 | CharuRoopa చారురూపా | She who is very beautiful అందమైన రూప లావణ్యము కలది In the names 241 and 242, we have to understand that Divine Mother attracts all her children towards her. Humans, birds, animals etc are all being attracted towards her. |
242 | CharuHasa చారుహాసా | She who has a beautiful smile మనోహరమైన మందహాసము కలది 241, 242 నామాలలో మనం గమనించ వలసినదేమిటంటే అమ్మ తన బిడ్డలనందరిని తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది. మనుషులు, పక్షులు, జంతువులూ మొదలైనవన్నీ ఆమెచే ఆకర్షించ బడతాయి. |
243 | CharuChandraKaladhara చారుచంద్రకలాధరా | All 15 glows of the moon came from Divine mother's Nityakala (Eternal glow). This is the 16th glow. To denote her eternal glow, Divine mother wears a crescent moon on her crown. This moon never changes. చంద్రకళలు 15. ఇవన్నీ అమ్మనుండే వచ్చ్చాయి. ఆవిడది నిత్యకళ. అది 16వ కళ. దానిని సూచించడానికి అమ్మ తన కిరీటానికి వృద్ధిక్షయాలు లేని నెలవంకను తగిలించుకుంటుంది. |
244 | CharacharaJagannatha చరాచరజగన్నాథ | This jagat is filled with Chara(Movable) and Achara(Stationary). 'Natha' means master. So she is called Charachara Jagannatha. ఈ జగత్తు చరాచరములతో నిండి ఉన్నది. వీటన్నింటికీ అధీశ్వరీ మన అమ్మ. అందుకే చరాచరజగన్నాథ అని అన్నారు. |
245 | ChakraRajaNikethana చక్రరాజనికేతనా | Sri chakra has 9 stages. The 9th stage of Sri chakra is called 'Bindu'(Dot). Shiva and Shakti are in this bindu. Hence Divine mother is called 'Chakra raja niketana' శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. అందులో 9వ ఆవరణ బిందు స్థానం. అందులో శివశక్తుల ఉంటారు. అందుకే ఆమ్మను చక్రరాజనికేతన అన్నారు. |
246 | Parvathi పార్వతీ | In a grand plan to kill demon Taarakaasura, Divine mother takes birth as daughter of 'parvata raja' (king of mountains) Himavanta. 'Kumaraswami' - son of Lord Shiva and Parvati kills Taarakaasura. Because she is born as daughter of 'Parvata raja', she got the name 'Parvati' తారకాసురుని సంహారం కొరకై అమ్మ పర్వత రాజైన హిమవంతునికి కుమార్తెగా జన్మిస్తుంది. అప్పుడు శివపార్వతులకు పుట్టిన కుమారస్వామి తారకాసురుడిని హతమారుస్తాడు. పర్వతరాజు కుమార్తె కనుక పార్వతి అని పిలవబడుతోంది. |
247 | Padmanayana పద్మనయనా | Divine mother has big eyes like lotus flower. Lotus flowers are in two colors. 1) Red 2) White. It is said that the sun and the moon are two eyes of Divine mother. Red represents sun and white represents moon. అమ్మ కనులు పద్మములవలే విశాలంగా ఉంటాయి. పద్మములు రెండు రంగులలో ఉంటాయి. 1. ఎరుపు 2. తెలుపు. అమ్మకు సూర్యచంద్రులే కన్నులుగా కలది అని పేరు కూడా ఉంది. ఎరుపు రంగు సూర్యనేత్రము, తెలుపు రంగు చంద్ర నేత్రము. |
248 | Padmaragasamaprabha పద్మరాగసమప్రభా | She who shines like the Padma Raga gem stone పద్మరాగముల వలే ఎర్రని శరీర కాంతి కలది. |
249 | Panchaprethasanasina పంచప్రేతాసనాసీనా | Divine mother's throne is supported by lifeless bodies of Brahma, Vishnu, Rudra, Eesa and Sadasiva. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అమ్మ సింహాసనానికి కోళ్ళుగా నిర్జీవంగా ఉన్నారు అని ఈ నామానికి అర్ధం. |
250 | Panchabrahmaswarupini పంచబ్రహ్మస్వరూపిణీ | 'Para Brahma' personified as Brahma, Vishnu, Rudra, Eswara, Sadasiva. Divine mother is the shakti behind these five. పరబ్రహ్మ తన శక్తితో 5 స్వరూపాలుగా ఉన్నాడు. వారే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరి స్వరూపమే మన అమ్మ. |
List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
Search This Blog
Lalitha sahasram 1 - 250
Subscribe to:
Posts (Atom)
Popular
-
Dhyana means meditation. A Dhyana sloka explains the form on which one has to fix his/her mind during dhyanam(meditation) Shloka1 Sindh...
-
Chit is a part of our brain that seeks pleasure . It causes chaitanya. It is self-motivated and always at work. First it records our experie...
-
Karma is the conjunction of desire and effort. If there is no desire but only effort then it is not karma. It will be selfless service. When...
-
Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka , this na...
-
దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. పండు దానిమ్మ పువ్వు దానిమ్మ పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు....
-
Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In India...
-
Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair. Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key ...
-
Pancha thanmathra sayaka is 11th name of the 1000 names of Lalitha Devi. This explains a very important concept behind self-improvement. ...
-
Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donot...
No comments:
Post a Comment