The passage of time is not the same throughout the universe. It means that if 10 minutes pass in one place, decades may pass in another. In the past, scientists used to think that time is the same throughout the universe. An incorrect concept of 'universal time constant' was also coined. But in the 20th century, Albert Einstein, a great scientist, proposed the 'Theory of Relativity' and corrected that mistake.
In fact, time and space cannot be imagined separately. That is, movement from one place to another cannot happen without a time difference, and movement from one time to another cannot happen without being somewhere. That's why when Einstein combined space and time with a mathematical process called conjunction, he got an ellipse. Based on that he "proposed that the universe is bent in the form of an ellipse". Vedic scientists also described the universe as Brahmandas (egg shaped subunits).
Similarly, they suggested that creation is divided into 14 lokas based on differences in these spacetime movements. Divine mother is the ruler of these 14 lokas. Divine Mother is the ruler of all of these. There are 7 lokas inside or under. They are called Adholokas. They are: 1. Atala, 2.Vitala, 3. Sutala, 4.Talaatala, 5. Rasaatala, 6. Mahaatala, and 7. Pataala.
There are 7 lokas outside. These are called Oordhvalokas. They are: 1. Bhoo, 2. Bhuva, 3.Suva, 4.Maha, 5.Jana, 6.Tapo and 7.Satya.
కాలగమనం విశ్వమంతటా ఒకేలా ఉండదు. అంటే ఒక చోట 10 నిమిషాలు గడిస్తే మరొకచోట కొన్ని దశాబ్దాలు గడిచిపోవచ్చు. పూర్వం శాస్త్రవేత్తలు ఇది తెలియక విశ్వమంతటా సమయం ఒకటే ఉంటుంది అని తలచి కొన్నాళ్ళు తప్పుడు ఆలోచనలు చేశారు. 'యూనివర్సల్ టైం కాన్స్టాంట్' అనే ఒక తప్పుడు ప్రక్రియను కూడా రూపొందించారు. కానీ 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఐంస్టీన్ అనే గొప్ప శాస్త్రవేత్త 'థియరీ అఫ్ రిలేటివిటీని' ప్రతిపాదించి ఆ తప్పును సరిదిద్దారు.
నిజానికి సమయాన్ని ప్రదేశాన్ని విడివిడిగా ఊహించడం కుదరదు. అంటే ఒక ప్రదేశమునుండి మరొక ప్రదేశానికి కదలడం సమయ వ్యత్యాసం లేకుండా జరగనేరదు మరియు ఎదో ఒక ప్రదేశంలో లేకుండా ఒక సమయం నుండి మరొక సమయానికి జరగడం కుదరదు. అందుకే ఐంస్టీన్ ఒక గణిత ప్రక్రియతో ప్రదేశాన్ని సమయాన్ని కలిపినప్పుడు అండాకారంలో ఉన్న దీర్ఘవృత్తాకారం ఏర్పడింది. దాని అనుసంధానంగానే ఆయన "ఈ విశ్వం అండాకారంలో ఉంది అని ప్రతిపాదించారు" వైదిక శాస్త్రవేత్తలు కూడా అందుకే విశ్వాన్ని బ్రహ్మాండాలుగా వర్ణించారు.
అలాగే వారు ఈ దేశకలాగమనాలలో వ్యత్యాసాల ఆధారంగా ఈ సృష్టి 14 లోకాలుగా విభజించబడింది అని సూచించారు. ఈ చతుర్దశ భువనాలకూ అధిపతి మన అమ్మ. అవి 7 అధోలోకాలు: 1. అతల, 2 వితల, 3. సుతల, 4. తలాతల, 5. రసాతల, 6. మహాతల, 7. పాతాళములు.
ఏడు ఊర్ధ్వలోకాలు . అవి 1. భూలోక, 2 భువర్లోక, 3. సువర్లోక, 4. మహాలోక, 5 జనలోక, 6. తపోలోక, 7.సత్యలోకాలు
వీటన్నింటికీ ఈశ్వరి అమ్మ లలితమ్మ. అందుకే భువనేశ్వరి అనబడింది.