నారాం రక్షోతి ఇతి రాక్షసః. అంటే ప్రాణాన్ని రక్షించేవారు రాక్షసులు. ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మన ప్రాణాలను కాపాడటానికి పోరాడే అంశాలు రాక్షస గణాలు. ఇవి కూడా మన శరీరంలోనే ఉంటాయి.
కాబట్టి దేవ గణాలు మరియు రాక్షస గణాలు రెండూ ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యంతో మన శరీరంలో అమర్చబడ్డాయి. వారికి భౌతిక శరీరం లేదు. అవి కేవలం సుక్ష్మా షరీరంతోనే వ్యవహరిస్తాయి.
దేవతలు ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఔదార్యం, మానవత్వం మొదలైన భావాలను ఉత్పత్తి చేస్తారు. రాక్షసులు భయం, కోపం, అభద్రత, బద్ధకం, నిర్లక్ష్యం వంటి భావాలను ఉత్పత్తి చేస్తారు. పరిస్థితుల అవసరాన్ని బట్టి సంకల్ప శక్తి వీటియందు ప్రవేశిస్తుంది. ఉదాహరణకు, అకస్మాత్తుగా మీరు ఒక సింహాన్ని చూస్తే, దాని నుండి పారిపోవడానికి మీరు వల్నమాలిన పరుగు తీస్తారు. దీనికి కారణం భయం మరియు అభద్రత. సాధారణ పరిస్థితులలో మీరు అంత లాఘవంగా పరుగెత్తలేరు. రాక్షస గణాల ప్రోద్బలం వల్లనే అది సాధ్యపడుతుంది. అలాగే నష్టం కలుగుతుందని తెలిసినా నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. అది దేవతలా ప్రోద్బలం వల్లనే కలుగుతుంది.
ఈ రెండు గణాలు ఒకదానినొకటి అణచివేయడానికి మరియు ఆధిపత్యం చెలాయించటానికీ ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి రాక్షసులలో సంకల్ప శక్తి ప్రవేశించినపుడు, వారు రక్షణ కొరకు పోరాటంతోపాటు, దేవగణాలను అణచివేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవతలలో సంకల్ప శక్తి ప్రవేశించినపుడు, వారు రాక్షసులను అణచివేస్తూ వారి విహిత కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు.
ఒక కీలకమైన విషయం ఇక్కడ అమలులోకి వస్తుంది. దేవ గణాలు ఎక్కువ కాలం ఆధిపత్యంలో ఉండడం వలన మనకు హాని ఉండదు. ఎందుకంటే అవి సానుకూలతను నింపి విముక్తి మార్గంలోకి నడిపిస్తాయి. కానీ రాక్షసులు ఎక్కువ కాలం ఆధిపత్యం చెలాయించినట్లయితే, అవి మన చుట్టూ ప్రతికూలతను నింపేస్తాయి. భయం, అభద్రతా, అసూయ మొదలైన భావాల వల్ల జీవితం నరకం అవుతుంది. అవి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రమాదం పొంచి ఉన్నపుడు అవి అవసరం. కానీ ప్రమాదం నుండి బయటపడిన వెంటనే, అవి బలహీనం అయిపోవాలి. సంకల్ప శక్తిని తిరిగి దేవతలు స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇది ఎల్లప్పుడూ జరగదు. ముఖ్యంగా భండాసురుడు వంటి రాక్షసులు రంగంలోకి దిగినప్పుడు. అతనికి శక్తి లభించిన వెంటనే అన్ని దేవ గణాలను బలహీనపరిచేస్తాడు. వాటిని దారుణంగా అణిచివేస్తాడు. దేవతలు ఎవ్వరూ అతనిని ఎదుర్కోలేరు.
భండాసురుని బారి నుండి దేవతలను రక్షించడానికి, మీరు లలితమ్మను ప్రార్థించాలి. భండాసూరుడు ఆమె శక్తికి సరిపోలలేడు. ఆమె 1.శ్రీమత. 2. శ్రీమహరాజ్ని. 3.శ్రీమత్ సింహనేశ్వరి. భండాసురుడిని బారి నుండి రక్షించమని ప్రార్థించినప్పుడు, ఆమె చిదగ్ని నుండి ఉద్భవించి, భండాసూరుడిని విధించటం ద్వారా విముక్తి (దేవ కార్య సముయుత) మార్గంలో మీకు సహాయం చేస్తుంది.