వేదాంతము వేదముల చివర చెప్పబడినది. ఉపనిషత్తు. వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది.
1. సంహితలు : ఇది మంత్రభాగం. ఇందులో స్తోత్రాలు ఆవాహనలు ఉంటాయి.2. బ్రాహ్మణాలు : సంహితలో ఉన్న విషయాన్ని వివరించేవి బ్రాహ్మణాలు. యజ్ఞయాగాదులు ఎలా చెయ్యాలి? యజ్ఞాల విలువ ఏమిటి? అనే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి.
3. అరణ్యకాలు : బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవికూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రతిపాదిస్తాయి. కాని వీటిలో కర్మల భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక గల నిగూఢమైన తత్త్వం మీద ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏకాంతవాసం చేసేవారు, అరణ్యాలలో నివశించే వారికోసం ఇవి నిర్దేశించబడ్డాయి.
4. ఉపనిషత్తులు : ఇది బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షముల గురించి వివరించేవి. పరమేశ్వర స్వరూపము అనేది ఉపనిషద్వాక్యాలచే తనే ఎరుగబడునది. ఉపనిషత్సారమే బ్రహ్మవిద్య. అందుచేతనే అమ్మ 'సర్వవేదాంత సంవేద్యా' అనబడుతున్నది.
Upanishads come at the end of vedas. Vedas have 4 parts.
1. Samhita: This has all the mantras and stotras
2. Braahmanas: This explains various aspects of samhitas. It explains how to perform Yagnas and Yagas and various benefits of them.
3. Aranyakas: It also explains various karmas like Braahmanaas. But it focuses more on internal meaning of these karmas than the physical interpretation. They are applicable to those who meditate in soltitude.
4. Upanishad: This is Brahma vidya. It explains about jeevatma, paramatma, gnana and moksha. They try to explain various aspects of Divine Mother. The essence of all the upanishaths is Divine Mother. Hence she is called sarwa vedanta vedya.
No comments:
Post a Comment