ముక్తి నిచ్చునది. ముక్తి అంటే - విముక్తి ఐహిక బంధనాల నుంచి విముక్తి, అరిషడ్వర్గాల నుంచి విముక్తి. నేను నాది అనే అహంకార, మమకారాల నుంచి విముక్తి. ఎప్పుడైతే సాధకుడు అహంకార, మమకారాల నుంచి విముక్తుడైనాడో, అప్పుడతడు శివ సాయుజ్యం పొందుతాడు. పరబ్రహ్మలో లీనమవుతాడు. అతడే సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపుడవుతాడు.
వేదాలను వల్లించటం వల్ల ముక్తిరాదు. శాస్త్రపాండిత్యంవల్ల ముక్తిరాదు. అధికారం పొందటంవల్ల ముక్తిరాదు. యజ్ఞయాగాది కర్మలవల్ల ముక్తిరాదు. కేవలము ఆత్మజ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. మనస్సును స్వాధీనపరచుకుని, ఇంద్రియాలను బంధించి దృష్టిని అంతర్ముఖం చేసినట్లైతే ఆత్మసాక్షాత్కారమవుతుంది. అంటే తానెవరో తెలుస్తుంది. తానే పరబ్రహ్మ. ఈ లోకాలు అన్నీ తనలోనే ఉన్నాయి. అన్ని జీవరాశులు తననుంచే ఉద్భవించాయి. సర్వస్వమూ తనయందే ఉన్నది. అనే విషయం తెలుస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం అటువంటి వ్యక్తికి సాయుజ్యం లభిస్తుంది.
బ్రహ్మపురాణంలో
యేర్చంతి పరాం శక్తిం విధినా విధినా పివాన తే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయః ||
క్రమం తప్పకుండా నియమ నిష్ఠలతో పరమేశ్వరిని ఆరాధించినవారు ముక్తజీవులు. పరమేశ్వరుణ్ణి తెలియకుండా అర్చించినా ముక్తి కలుగుతుంది అని చెబుతోంది పురాణం. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఏనుగు, పాము, సాలెపురుగు. ఈ మూడు పరమేశ్వరుని అలంకారం కోసం జీవితాన్ని బలిఇచ్చాయి. ఆ ఫలితంగా వాటికి ముక్తినిచ్చాడు పరమేశ్వరుడు. అలాంటప్పుడు క్రమం తప్పకుండా అర్చించేవారి సంగతి చెప్పేదేమీ లేదు.
No comments:
Post a Comment