Search This Blog

382. Rahastarpanatarpitha

శ్రీ విద్యోపాసనలో ప్రవేశించాలి అనుకునేవాడు. ఏ కాంతమును కోరే ప్రవేశించాలి. శ్రీవిద్యలో ముఖ్యమైన విషయం ఏమంటే పుణ్యపాపాలను, ధర్మాలను ప్రకాశ విమర్శలనే చేతులతో, ఉన్మని అనే సృక్కుతో జ్ఞానమనే అగ్నిలో హోమం చెయ్యాలి. ఇక్కడ హోమగుండంలోని అగ్నికి కట్టెలు అవసరం లేదు. అది జ్ఞానాగ్ని సర్వదా మండుతూనే ఉంటుంది. అటువంటి అగ్నిలో శివాది క్షితి పర్యంతము సర్వస్వాన్ని హోమం చెయ్యాలి. ఇలా చెయ్యటాన్నే రహస్తర్పణము అంటారు. దీనివల్ల దేవి తృప్తి చెందుతుంది. ఈ రకంగా సకలభూతాలను, పుణ్యపాపాలను, ధర్మాధర్మాలను, సకలకర్మలను జ్ఞానాగ్నిలో హోమంచేసి ఆ పరమేశ్వరిని తృప్తి పరచినవాడు మోక్షం పొందుతాడు. అంటే శ్రీవిద్య బ్రహ్మవిద్య. శ్రీవిద్యోపాసకుడికి ధనధాన్యాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు, పదవులు, సన్మానాలు, గౌరవము మొదలైన ఐహికమైన వాంఛలు తీరటమేకాదు. సాయుజ్యం కూడా లభిస్తుంది.

ఐహికమైన కోరికలు తీరాలి అంటే పూజలు, అర్చనలు, వ్రతాలు చెయ్యాలి. కాని సాయుజ్యం కావాలంటే అంతర్యాగం చెయ్యాలి. దానివల్ల జగన్మాత తృప్తి చెందుతుంది. అంతర్యాగము అంటే పరమేశ్వరుడనేవాడు ఎక్కడో లేడు. చరాచరజగత్తంతా ఆవరించి ఉన్నాడు. విశాలమైన విశ్వంలోని ప్రతి అణువు పరబ్రహ్మస్వరూపమే. సాధకుడు కూడా పరబ్రహ్మయే. అయమాత్మా బ్రహ్మ. నాలోనే ఈ పరమేశ్వరుడున్నాడు. నేనే పరబ్రహ్మను అని భావించి, ఐహికమైన, సంసారబంధనాలు అన్నీ వదిలించుకోవాలి. అంటే కర్మలనుంచి విముక్తుడు కావాలి. ఈ జన్మలో కర్మలు చేయడు సరే. మరి గతంలో చేసిన కర్మలతాలూకు ఫలితం ఏమవుతుంది ? సాధారణంగా అయితే కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటం చేతనే క్షయం చెయ్యాలి. ఈ రకంగా కల్పాంతము అనుభవించినప్పటికీ కర్మఫలం క్షయంకాదు. ఇక రెండో మార్గం పరమేశ్వరోపాసన. మనోవాక్కాయ కర్మలచే ఆ భగవంతుణ్ణి ప్రార్ధించటం. ఆ ప్రార్ధనలో తాదాత్మ్యముండాలి. అప్పుడు అతని కర్మక్షయం అవుతుంది. అంటే జ్ఞానాగ్నిలో అతడు చేసిన పాపపుణ్యాలన్నీ హోమం చెయ్యబడతాయి. కర్మలన్నీ క్షయం అయిపోతాయి. ఇదే రహస్తర్పణము. గజేంద్రమోక్షంలో మొసలి కర్మను అనుభవించ లేక గజేంద్రుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించాడు. రహస్తర్పణవల్ల పరమేశ్వరి ఆనందిస్తుంది. అప్పుడు సాధకుడికి ముక్తి లభిస్తుంది. అయితే అంతర్యాగప్రక్రియలో షట్చక్రభేదనము, చతుర్విధైక్యసంధానము వంటివి గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ఇది యోగప్రక్రియ. చతుర్విధైక్యసంధానము అంటే

పిండ బ్రహ్మాండయో రైక్యం లింగసూత్రాత్మనో రపి
స్వాపా వ్యాకృతయో రైక్యం క్షేత్రజ్ఞ పరమాత్మనోః ||

1. పిండ బ్రహ్మాండాలకు ఐక్యము
2. సూక్ష్మ శరీరానికి సూత్రాత్మకు ఐక్యము
3. స్వాపావ్యాకృతులకు ఐక్యము
4. క్షేత్రజ్ఞ పరమాత్మలకు ఐక్యము

ఇవన్నీ గురుముఖైకవేద్యము

He who wants to practice SriVidya should live in solitude. The important thing in Srividya is that sins and virtues should be burnt in the fire of consciousness with the two hands of Prakasa & Vimarsa and the srukku of Unmani. Here the fire of homagunda does not come from firewood. It comes from the fire of consciousness that is always burning. One should offer everything that one possess into that fire. Doing this is called Rahastarpana. This pleases Divine mother. Such person attains salvation. Srividya is Brahmavidya. A practitioner of SriVidya does not desire for worldly riches, pleasures, positions, honours, respect etc.

One has to do Pujas, Archanas and Vratas to satisfy worldly desires. But if you want a salvation, you have to do internal worship. Jaganmata gets satisfied with that. Antaryagam means that feeling that the Supreme Lord pervades the entire material world. Every atom in the vast universe is his form. The seeker is also Parabrahma. Ayamatma Brahma. I have this Supreme Lord within me. Thinking that I am Parabrahman, I should get rid of all worldly and material attachments. That means one should be freed from the cycle of karma. One will not do karma in this life. But what happens to the karmas done in the past? In general, one does karma while enjoying the fruits of past karma. Then does new karma again to enjoy fruits of this karma. Caught in this cycle one would take birth and rebirth till the end of the kalpa. The only way to escape from karmic cycle is to worship the Lord. Praying to that Lord through thoughts, speech and actions. There should be empathy in that prayer. Then his karma will be nullified. That means all the sins committed by him will be burned in the fire of enlightenment. All karmas perish. This is Rahastarpana. Gajendra prayed to the Supreme Lord that he would not suffer the karma with the crocodile in Gajendramoksha. Parameshwari is pleased by Rahastharpana. Then the seeker gets liberation. But Shatchakrabhedana and Chaturvidhaikyasandhana in Antaryagaprakriya should be learned only from Guru. This is a yogic process. Chaturvidhayakyasandhana means

Piṇḍa brahmāṇḍayō raikyaṁ liṅgasūtrātmanō rapi
svāpā vyākr̥tayō raikyaṁ kṣētrajña paramātmanōḥ ||

1. Unity of the body and the universe
2. Unity of the Subtle Body to the sutraatma
3. Unity of Swapavyakrits
4. Unity of Ksetrajna and the Supreme Souls

This has to learnt from a Guru!

381. Rahoyagakramaradhya

సహస్రారమున తన భర్తతో రహస్యముగ విహరించునది. రహోయాగము అంటే అంతర్యాగము. పరమేశ్వరి పూజ రెండువిధాలు అని గతంలో వివరించాం. కాని సందర్భానుసారం మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
బాహ్యపూజ, అంతఃపూజ అని పూజ రెండు రకాలు. బాహ్యపూజ అంటే ఎదురుగా దేవి విగ్రహాన్ని కాని, శ్రీచక్రాన్ని కాని ఉంచి చేసేటటువంటిది. ఇది ద్వైతభావనతో కూడిన పూజ. ఇక అంతః పూజ అంటే అద్వైతభావనతో పూజ ఇందులో భగవంతుడు భక్తుడు ఇద్దరూ ఒకటే. తేడాలేదు. సాధకుడే సాక్షాత్తూ పరబ్రహ్మ. 'అయమాత్మాబ్రహ్మ' అనే మహావాక్యము ఇక్కడ అన్వయించబడుతుంది. పరమేశ్వరుణ్ణి తన శరీరంలోనే ఊహించి, తానే పరమేశ్వర స్వరూపము అని నమ్మి భావనోపనిషత్తులో చెప్పిన ప్రకారం అర్చన చెయ్యటం. ఇది ముఖ్యవ్రణోపాసన.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలోని తొమ్మిదవశ్లోకంలో ఈ విషయం చెబుతూ
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి
మనో2పి భ్రూమధ్యే సకల మపి భిత్త్వాకులపడం
సహస్రారే పద్మే నవ రహసి పత్యా విహరసే ||


ఓ తల్లీ ! పృథివీతత్త్వమైన ఆధారచక్రము, అగ్నితత్త్వమైన స్వాధిష్ఠానము, జలతత్త్వమైన మణిపూరము, వాయుతత్త్వమైన అనాహతము, ఆకాశతత్త్వమైన విశుద్ధిచక్రము, మనస్తత్త్వమైన ఆజ్ఞాచక్రము దాటి సుషుమ్న ద్వారా సహస్రారంచేరి నీ భర్త అయిన సదాశివునితో కలిసి రహస్యముగ క్రీడించుచున్నావు.

గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలో కుండలినీ ప్రభోదాన్ని వివరిస్తూ నాల్గవశ్లోకంలో
యదా తౌ చంద్రార్కౌ నిజసదన సంరోధ నవశా
దశక్తా పీయూష స్రవణహరణే సా చ భుజగీ
ప్రబుద్ధా క్షుత్కృద్ధాదశతి శశినం బైందవగతం
సుధాధారాసారైః స్నపయతి తనుం బైందవకళే ||


ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని అంతర్యాగం చేసి నిద్రలేపినట్లైతే అది షట్చక్రాలను దాటి సహస్రారం చేరి సుధాదారలు కురిపిస్తుంది. ఇదే విషయాన్ని వామకేశ్వరతంత్రం, తంత్రసారంలో కూడా వివరించారు. రహస్యముగా కుండలినీ శక్తిని జాగృతం చేసి దానితో పుణ్యపాపాలను చిదగ్నిలో హోమం చెయ్యటమే రహోయాగము. జ్ఞానంవల్ల కర్మలన్నీ నశిస్తాయి. కాబట్టి కుండలినీ యాగమే రహోయాగము. ఆపస్తంభ సూత్రాలలో “శాస్త్రాల మీద ఆసక్తి గలవాడికి మోక్షంరాదు. మంచి ఇళ్ళలో నివసించటంవల్ల, భోజనాదులవల్ల, లోకులు మనలను గుర్తించటంవల్ల మోక్షంరాదు. ధృడమైన సంకల్పంగలవాడికి, ఏకాంతజీవనం చేసేవాడికి, ఐహిక బంధనాలు వదిలించుకున్నవాడికి, ఆత్మయోగికి, అహింసాపరుడికి మాత్రమే ముక్తి లభిస్తుంది" అని చెప్పబడింది. కాబట్టి పుణ్యపాపాలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధంచేసి, సహస్రారంలో పరమేశ్వరిని అర్చించిన వారికి ముక్తి లభిస్తుంది. శ్రీ చక్రాన్ని అర్చన చేసే వారంతా కూడా అంతర్యాగంలో అదే అర్చనచేస్తారు. శ్రీచక్రంలో ఉన్న ఆవరణలన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. శరీరమే శ్రీ చక్రం. అదే చరాచరజగత్తు. నవావరణలు శరీరంలోని భాగాలే అని గతంలో చెప్పాం. కాని అది ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళీ చెబుతున్నాం.

బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకమ్
లలాటేస్థారకం పత్రం భృవో ర్మధ్యే దశారకం
బహిర్ధశారం కంఠేతు మన్వత్రం హృదయం భవేత్
నాభౌ చ వసుపత్రం చ కట్యాం షోడశపత్రకం
వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయమ్ ||


ఈ రకంగా శ్రీ చక్రాన్ని శరీరంలోనే భావించి, సహస్రారంలో ఆ పరమేశ్వరిని అర్చించిన జ్ఞానికి మోక్షం లభిస్తుంది.

She who wanders with her husband secretly in Sahasrara. Rahoyagam means inner yoga. We have previously explained that Gods worship is of two types. But let's recall once again according to the context.

There are two types of worship namely Bahyapuja and Antahpuja. Bahyapuja means keeping the idol of Devi or Srichakra in front of you during worship. It is a dualistic worship. And Antah Puja means worship with Advaita Bhavana in which both the devotee and the Lord are one and the same. No difference. The worshiper is the real Parabrahma. The adage 'Ayamatmabrahma' is applied here. Imagining the Supreme Lord in his/her own body and believing that he/she is the embodiment of the Supreme Lord, worshiping as per Bhavanopanishad. This is the mukhyapranopasana. Sri Shankarabhagavata says this in the ninth verse of his Soundaryalahari.
Mahīṁ mūlādhārē kamapi maṇipūrē hutavahaṁ
sthitaṁ svādhiṣṭhānē hr̥di maruta mākāśa mupari
manō2pi bhrūmadhyē sakala mapi bhittvākulapaḍaṁ
sahasrārē padmē nava rahasi patyā viharasē ||

O mother! Beyond the Aadhar Chakra which is Earth, Swadhishthana which is Fire, Manipura which is Water, Anahata which is Air, Visuddhi Chakra which is Sky, Ajna Chakra which is Mind, you enter the Sahasrara through Sushumna and dance with your husband Sadashiva in secret. 

Sri Gaudapada in the Subhagodayastuti described the Kundalini Prabhoda in the fourth stanza.
Yadā tau candrārkau nijasadana sanrōdha navaśā
daśaktā pīyūṣa sravaṇaharaṇē sā ca bhujagī
prabud'dhā kṣutkr̥d'dhādaśati śaśinaṁ baindavagataṁ
sudhādhārāsāraiḥ snapayati tanuṁ baindavakaḷē ||

If the dormant Kundalini Shakti is awakened in the Aadhar Chakra, it crosses the Shatchakras and reaches the Sahasrara and rains Sudhadaras. The same thing is also explained in Vamakesvaratantram and Tantrasara. Rahoyaga is to secretly awaken the Kundalini energy and use it to burn sins in Chidagni. The fire of consciousness destroys all karmas. So the Kundalini Yaga is the Raho Yaga. In the Apastamba Sutras, “He who is interested in the sciences does not attain moksha. Living in good houses, eating delicious food, being famous in the world does not bring salvation. It is said that only the strong-willed, the solitary, the one who has freed himself from worldly bonds, the spiritual yogi and the non-violent person can attain liberation. Therefore, those who have burnt all their sins in the fire of consciousness and worshiped Divine mother in the sahasrara will attain liberation. Shri Chakra - That is embodiment of the whole universe.

Baindavaṁ brahmarandhraṁ ca mastakaṁ ca trikōṇakam
lalāṭēsthārakaṁ patraṁ bhr̥vō rmadhyē daśārakaṁ
bahirdhaśāraṁ kaṇṭhētu manvatraṁ hr̥dayaṁ bhavēt
nābhau ca vasupatraṁ ca kaṭyāṁ ṣōḍaśapatrakaṁ
vr̥ttatrayaṁ ca ūrubhyāṁ padbhyāṁ

Like this, one has to worship divine mother inside the body. Imagine her in the Sahasrara.

Popular