అధ్వము అనగా - మార్గము అని అర్ధం. ఆధ్యాత్మికాభ్యాసం చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఆరు రకాలగా విభజించారు. అవి
1. వర్ణ, 2.పద, 3.మంత్రం, 4.కలా, 5.తత్వ, 6.భువనములు. మొదటిమూడు విమర్శంశలు. మిగిలినవి ప్రకాశంశలు. వీటినే షడధ్వాలు అంటారు.
ఏ మార్గమైనా పరమాత్మను చేరుకోవడానికి సూచించబడిన ఒక పద్ధతే తప్ప అదే పరమాత్మ కాదు. లలితా సహస్రం, విష్ణుసహస్రం, వేదం, రుద్రం, పురాణాలు, భగవద్గీత, బైబిల్, కురాన్, యజ్ఞ యాగాది క్రతువులు, రాజ యోగ, క్రియ యోగ ఏదైనా సరే. పరమాత్మను సంపూర్ణంగా ఏదీ వర్ణించలేదు. పరమాత్మ అనుభవైకవేద్యము. ఏదైనా ఒక గ్రంథాన్ని లేదా మార్గాన్ని సుదీర్ఘ కాలం అభ్యాసం చేయడం వలన ఒక్కొక్కప్పుడు సాధకులు దానినే భగవత్ శాశనమని, దానిని మించినది ఇంకేదీ లేదని భ్రమ పడుతుంటారు. ఆ భ్రమ వలన వారు తమ అంతిమ ప్రయోజనాన్ని(ఆత్మ సాక్షాత్కారం) సాధించలేక పోతుంటారు. అది తప్పు. వీటన్నింటికీ(షడధ్వాలకు) అతీతమైనది అమ్మ(పరమాత్మ). ఆవిడని సులభంగా చేరుకోవడం కోసమే ఇవన్నీ ఉన్నాయి తప్ప వీటికోసం ఆవిడ లేదు. ఇదే ఈ నామంలోని రహస్యం.
Adhwa means a path. There are many methods to practice spirituality. They are divided into 6 classes. They are:
1.Varna, 2.Pada, 3.Mantra, 4.Kalaa, 5.Tattwa, 6.Bhuvana. The first three are Vimarshaamsha. The remaining are Prakaashaamsha. These are called Shadadhwaas.
One has to note the a path/method is only a means to reach Paramaatma but not Paramaatma in itself. Lalitha sahasram, Vishnu sahasram, vedam, rudram, Puranas, Bhagavad geetha, Bible, Quran, Yagnas, Yoga etc are various methods to reach Paramaatma. But none of them can completely describe IT. IT can be known only by experiencing IT. Not through books, speeches or any other rigorous practices. After practicing a particular method for a long time, sometimes humans get into an illusion that what they are practicing is the ultimate. They become intolerant and argue that all other methods are useless. This is wrong. It defeats their ultimate purpose - Liberation. These methods are prescribed so that we can reach Paramaatma easily. But Paramaatma is not bound to any one of these(shadadhwaas). This is the secret behind this nama.