గుహలో ఛాయారూపముగా నుండు తల్లి. హృదయము అనే గుహలో ఛాయా రూపంతో ఉండేది. స్థూలసూక్ష్మకారణ శరీరాదులు కానిది. పంచకోశాలకు లోపలిదైనది గుహ అనబడుతుంది. హృదయస్థానంలో దహరాకాశంలో ఉండే గుహ యందు ఉంటుంది. ఇక్కడ జీవాత్మ రూపంలో ఉంటుంది. అందుకే గుహాంబా అనబడుతుంది.
గుహుడు - కుమారస్వామి. అతని తల్లి. తారకాసుర సంహారం కోసం పరమేశ్వరి అంశ పార్వతిగ హిమవంతుని ఇంట జన్మించింది. శివుణ్ణి వివాహమాడింది. శివపార్వతులకు పుట్టినవాడే కుమారస్వామి. అతడే స్కందుడు. కుమారుని పోషించటానికి అగ్నినుంచి
1. స్కంద 2. రేవతి 3. శతపూతనా 4. స్కందాపస్మార 5. పూతనా 6. ముఖకుండికా 7. శకున 8. అంధపూతనా 9. నైగమేయఅనబడే తొమ్మిదిమంది దాదులను సృష్టించింది. కుమారస్వామిని వీరే పెంచి పెద్ద చేశారు. కుమారుడు పెద్దవాడైన తరువాత ఇంక మా పని ఏమిటి అని వీళ్ళు పరమేశ్వరిని అడగగా దేవపూజలు, పితృపూజలు జరగని ఇళ్ళలో శిశుపీడాకారులుగా ఉండండి అని దేవి వీరిని ఆదేశించింది. వీరే బాలగ్రహాలు. వీరంతా కుమారస్వామికి తల్లిలాంటివారు. అందుచేత గుహాంబా అనబడుతోంది.
Daharaakaasha is a cave in heart inside which Divine mother stays. It is neither a physical body nor a meta physical body. She stays in it as jeevaatma. Guha means cave. Guhamba means Mother who lives in Daharaakaasha
Guha also means Lord Muruga. Guhamba means his mother Parvathi. Parvathi is an avatar of Divine mother. She came to kill the demon Tarakaasura. Taarakasura has a boon that only a son born to Siva and Parvathi can kill him. So Divine mother takes the avatar of Parvathi and gives birth to lord Muruga or Skanda. She appoints 9 nannys to take care of Skanda. They are:
1.Skanda 2.Revathi 3.Shatapootanaa 4.Skandaapasmaara 5. Pootanaa 6. Mukhakundikaa 7. Shakuna 8. Andhapootanaa 9.Naigameya
These nannys took care of Skanda till he grew up as an adult. After that, these nannys asked Parvathi, "Your son is old enough to take care of himself. What shall we do now". Then Parvathi replied, "Go to those houses where people don't offer oblations to God and elders. Cause difficulties to children growing in those houses". From then, they became baala grahas.
No comments:
Post a Comment