Search This Blog

251-253 - Chinmayi...VignanaGhanaRupini

All the knowledge is embedded into vedas in the form of Seeds. When it meets a mind with chaitanya, a sapling called Paramananda(bliss) emerges out of it (A mind with Chaitanya acts as a seed bed for vedic knowledge)

251.Chinmayi - From chit comes chaitanya. This happens only for Humans and apemans (vaanaras). Other species doesn't have chaitanya. Due to this chaitanya, humans are able to rule the world. Divine mother personifies herself as chaitnya and fills this world. Hence she is called Chinmayi. But as said earlier, only humans and apemans can connect to her chaitanya swaroopa.

252.Paramananda - Happiness is of two types. 1) Spiritual, 2) Materialistic. Spiritual happiness is much greater than material pleasures. It is always new. You never feel bored of it. It is the best experience of happiness a human being can have.

253.VignanaGhanaRupini - Knowledge of a particular thing is called 'Gnana'. Having knowledge of all the 64 studies is called 'Vignanaghana'. Divine mother is the personification of all the studies. So she is called Vignana ghana roopini.

Small story:

There were two friends, Ramadas and Somadas. Ramadas was born blind. Somadas was born lame. Ramadas used to carry Somadas on his shoulders. Somadas used to tell him how to go. Both of them lived like this for a long time. One day a saint advised them that with devotion on Lord krishna you can overcome your blindness and lameness. When they asked how, the Sadhu said, "take a bath every morning and pray Lord Krishna wholeheartedly. Your wish will be fulfilled." From then on they started praying Lord Krishna every day. Years passed by, but nothing changed.

One day, Mother Rukmini said to Sri Krishna, "Rama and Soma have been praying to us for many years. Why aren't you helping them. Then Sri Krishna said, "You have been observing them ever since they started praying. I've been watching them even before they started praying. That's why I appeared to them in the guise of a saint. I freed them from all their issues on the very first day of their prayer. But they don't know that. Rama does not try to open his eyes and see. Soma does not stand up and try to walk. I'm looking forward to see that day when they both will become conscious and start trying, and if they need any more help, I will do it again." That is consciousness. That's Chinmayi. It is consciousness that is present in all of us. Freedom is like a breath to it. Where man forgets to think freely and to live independently, there is no room consciousness. Those places will go under the control of demons like Bhandasura.


వేదంలో సమస్త విజ్ఞానము బీజ రూపంలో ఉంటుంది. చైతన్యం కలిగిన మనస్సు ఆ విజ్ఞానానికి క్షేత్రము వంటిది. ఎప్పుడైతే అవి రెండూ కలుస్తాయో (వేదము చైతన్యముతో ఉన్న మనస్సు) పరమానందము అనే అంకురం ఉద్భవిస్తుంది. 

250.చిన్మయి - చిత్ నుండి చైతన్యం పుడుతుంది. ఇది కేవలం నర, వానరులకు మాత్రమే ఉంటుంది. మిగతా జీవ రాశులకు చైతన్యం ఉండదు. నరులు ప్రపంచంపై ఆధిపత్యం సాధించటానికి ఈ చైతన్యమే కారణం. చైతన్యరూపంలో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది కనుక అమ్మను చిన్మయి అన్నారు. అయితే, కేవలం నరవానరులు మాత్రమే ఆ చైతన్య స్వరూపాన్ని కనుగొనగలరు.

251.పరమానందా - ఆనందము రెండు రకాలు. 1) ఇహము 2) పరము. పరమానందం ఐహికానందం కన్నా చాలా గొప్పది. అదే ఆత్మానందం. అదే అమ్మ స్వరూపం. అది ఎల్లప్పుడూ కొత్తగానూ, ఆహ్లాదంగానూ ఉంటుంది.

252.విజ్ఞానఘనరూపిణీ - ఏదైనా ఓక విషయం గురించి కలిగేది జ్ఞానం. మొత్తం 64 కళల పట్లా సంపూర్ణమైన జ్ఞానం సంపాదించినట్లయితే ఆ పాండిత్యాన్ని విజ్ఞానఘనమని అంటారు. అన్ని కళలు అమ్మనుండి వచ్చినవే. అందుకే ఆమెని విజ్ఞానఘనరూపిణి అన్నారు.

ఒక చిన్న కథ:
రామదాసు, సోమదాసు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామదాసు పుట్టుకతో గుడ్డివాడు. సోమదాసు పుట్టుకతో కుంటివాడు. రామదాసు సోమదాసును తన భుజాలపైన ఎక్కించుకుని తిప్పేవాడు. సోమదాసు వాడికి ఎలా వెళ్ళాలో చెప్పేవాడు. వారిద్దరూ చాలాకాలంగా ఇలా ఉంటున్నారు. ఒక రోజు ఒక సాధువు వారి దగ్గరకు వచ్చి, కృష్ణ భక్తితో మీరు మీ అవిటితనాన్ని రూపు మాపుకోవచ్చు అని చెప్తాడు. వారు అది ఎలా స్వామీ అని అడుగగా, రోజూ ఉదయం స్నానం చేసి, మీరిద్దరూ మనసులో కృష్ణుడిని తలచుకొని తండ్రీ నా అవిటితనాన్ని రూపుమాపు అని ఆర్తితో అడగండి. మీ కోరిక నెరవేరుతుంది. అని అన్నాడు. వారు అలానే చేయసాగారు. ఏళ్ళు గడిచినా వారికి ఎం మార్పు తెలియలేదు.

ఒకరోజు అమ్మ రుక్మిణీ శ్రీకృష్ణుల వారితో, "ఆ రాముడు సోముడు చాలా ఏళ్లగా మనల్ని ప్రార్థిస్తున్నారు. వారికి సాయం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది (అమ్మ ప్రేమ కదా). అప్పుడు శ్రీకృష్ణుడు, "నువ్వు వాళ్ళు ప్రార్ధన మొదలు పెట్టినప్పటినుండి వాళ్ళని గమనిస్తున్నావు. నేను అంతకుముందునుంచే చాలా కాలంగా వారిని గమనిస్తున్నాను. అందుకే సాధువు వేషంలో వారికి కనిపించి సలహా ఇచ్చాను. వారు ప్రార్ధించిన మొదటిరోజే వారికి అవిటితనం నుండి విముక్తి కల్పించాను. కానీ వారు దానిని తెలుసుకోవడంలేదు. రాముడు కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నించడు. సోముడు లేచి నించుని నడవడు. ఏనాటికైనా వాళ్లలో చైతన్యం కలిగి వాళ్ళు ప్రయత్నం మొదలుపెడతారేమో, అప్పుడు వాళ్లకి ఇంకా ఏమైనా సహాయం కావాలంటే మళ్ళీ చేద్దాం అని నేను ఎదురుచూస్తున్నాను అన్నాడు". అదే చైతన్యం. ఆదే చిన్మయి. అది చైతన్యం మనందరిలోనూ ఉంది. స్వతంత్రం దానికి ఊపిరివంటిది. ఎప్పుడైతే మనషి స్వతంత్రంగా ఆలోచించడం మరిచిపోతాడో, స్వతంత్రంగా బ్రతకడం మరిచిపోతాడో అక్కడ చైతన్యం ఉండదు. ఆ ప్రదేశాలు భండాసురుని వంటి రాక్షసుల ఆధీనంలోకి వెళ్లిపోతాయి.

Popular