Search This Blog

528.Haakineeroopadhaarinee


ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత అయిన సిద్ధమాత యొక్క మంత్రానికి శక్తి, బీజము, కీలకము అన్నీ హకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెను హాకినీ అంటారు. యోగినీన్యాసంలో

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగకలితే శుక్లవర్ణాం కరాబ్లైః
బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుక మక్షమాలాం కపాలం
షడ్వక్షాధారమధ్యాం త్రినయనలసితాం హంసవత్యాది యుక్తాం
హరిద్రాన్నైకరసికాం సకలశుభకరీం హాకినీం భావయామః ||


కనుబొమల మధ్య రెండు దళములు గల పద్మమున్నది. ఆ పద్మమునందు హాకినీ దేవత ఉంటుంది. ఆమె చేతులలో జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము ధరించి ఉంటుంది. హాకినీ దేవతకు మూడుకనులు, ఆరు తలలు ఉంటాయి. ఆమెకు హరిద్రాన్నమునందు ప్రీతి ఎక్కువ.

ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవతా హాకినీ యుక్త సదాశివ
స్వరూపిణ్యంబా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః


శంకరభగవత్పాదులవారు సౌందర్య లహరిలోని 36వ శ్లోకంలో ఆజ్ఞాచక్రాన్ని వివరిస్తూ

తవాజ్ఞా చక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుం వందే పరమిళిత పార్శ్వం పరచితా
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామవిషయే
నిరాలోకేలోనే నివసతి హి భాలోకభువనే ||


ఆజ్ఞాచక్రంలో శివాశివులు కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు.

లక్ష్మీధరుడు తన కర్ణావతంస స్తుతిలో

అజ్ఞాత్మక ద్విదళ పద్మగతే తదానీం
విద్యున్నిభై రవిశశి ప్రయుతోత్కటాభే
గండస్థల ప్రతిఫల త్కరదీప జ్వాల
కర్ణావతంసకలికే కమలాయతాక్షి ! ||


ఆజ్ఞా చక్రమనబడే రెండుదళములు గల పద్మమందున్న ఓ దేవీ ! మెరుపుతీగవలె కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తున్నావు. షట్చక్రనిరూపణంలో “ఆజ్ఞాచక్రము అనేది గురువు యొక్క ఆజ్ఞలు లభించే స్థానము. ఇక్కడ నుంచే శరీరంలోని వివిధ భాగాలకు ఆజ్ఞలు జారీచేయబడతాయి. ఇక్కడ ఓంకారాన్ని ధ్యానించేవాడు జ్ఞాని అవుతాడు. సర్వజ్ఞుడై
సర్వదర్శి అయిన మునీంద్రుడవుతాడు. ఈ చక్రము కర్ణికలో త్రికోణమున్నది. ఈ త్రికోణంలో ప్రణవానికి ఆధారమైన అకార ఉకారాలుంటాయి. దాని మీద బిందురూపంలో మకారముంటుంది.

సంతానోపనిషత్తులో షషేమాసి నాసాక్షిత్రోత్రాణి భవంతి

ఆరవనెలలో గర్భస్థ శిశువుకు ముక్కు, చెవులు, కనులు మొదలైన అవయవ సౌష్టవం ఏర్పడుతుంది. ఈ నెలలోనే మనస్సుకూడా ఏర్పడుతుంది. అదే ఆరవ అవయవము. అందుచేతనే సిద్ధమాతకు ఆరు తలలుంటాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీకి హరిద్రాన్నము మంచి ఆహారము.

The presiding deity of Agna chakra is called Haakini because her Shakti, Root (Beeja) and Vitality (Keelaka) all begin with symbols of 'ha'.

In yogininyasam

Bhrūmadhyē bindupadmē daḷayugakalitē śuklavarṇāṁ karāblaiḥ
bibhrāṇāṁ jñānamudrāṁ ḍamaruka makṣamālāṁ kapālaṁ
ṣaḍvakṣādhāramadhyāṁ trinayanalasitāṁ hansavatyādi yuktāṁ
haridrānnaikarasikāṁ sakalaśubhakarīṁ hākinīṁ bhāvayāmaḥ ||

Between the eyebrows is a two-tiered lotus. In that lotus is the deity Haakini. She holds jnanamudra, damaruka, akshamala and a skull in her hands. Goddess Hakini has three eyes and six heads. She likes rice mixed with turmeric (Haridranna - plihora).

Ājñācakrādhiṣṭhānadēvatā hākinī yukta sadāśiva
svarūpiṇyambā śrīpādukāṁ pūjayāmi tarpayāmi namaḥ

Saint Shankara described Agna chakra in the 36th verse of his Soundarya lahari

Tavājñā cakrasthaṁ tapanaśaśikōṭidyutidharaṁ
paraṁ śambhuṁ vandē paramiḷita pārśvaṁ paracitā
yamārādhyan bhaktyā ravi śaśi śucīnāmaviṣayē
nirālōkēlōnē nivasati hi bhālōkabhuvanē ||

Shiva, and Shivaa are in Agna chakra and shining with the light that tantamount to crores of Suns and moons

Lakshmidhara said like this in his karnaavatamsa stuthi

Ajñātmaka dvidaḷa padmagatē tadānīṁ
vidyunnibhai raviśaśi prayutōtkaṭābhē
gaṇḍasthala pratiphala tkaradīpa jvāla
karṇāvatansakalikē kamalāyatākṣi! ||

O! goddess who is in the two-petalled lotus called Ajna Chakra! You are shining with the light of millions of suns and moons. According to the Shatchakranirupana “Ajnachakra is the place where the commands of the Guru are received. From here commands are issued to different parts of the body. One who meditates by reciting Omkara and putting focus here becomes omniscient. He becomes the greatest of all saints. There is a traingle in the atrium of this chakra. The base syllables of pranava are "A" and "U". They lie in this triangle. There is a bindu on top of this triangle. The syllable 'M' is in that bindu.

Popular