Search This Blog

Prolouge

వ్యాస హృదయం:

బ్రహ్మాండపురాణంలో అనేక గంభీరమైన విషయాలను ప్రస్తావించారు. లలితా సహస్రనామం అందులో ఒకటి. ఈ నామాలు హయగ్రీవుడు అగస్త్యముని వారి సంభాషణ నుంచి వచ్చాయి. ఇటువంటి గంభీరమైన విషయాలను ప్రస్తావించే కర్త హృదయం మరింత గంభీరంగా ఉంటుంది. వ్యాస హృదయం తెలుగులో చదవడానికి ఈ లింకును క్లిక్ చేయండి 

మూలకథ:

అసలు లలితాదేవి ఎలా ఉద్భవించింది, ఎందుకు వచ్చింది, వచ్చి ఏమి చేసింది అనే వృత్తాతం మూలకథలో ఉంటుంది. దానిని చదువుటకు ఈ లింకును క్లిక్ చేయండి. 

ధ్యాన శ్లోకములు:

పరమాత్మ అవ్యక్తం. దానికి ఒక రూపము, నామము ఉండదు. అది నామ రూపాలకు అతీతమైన శక్తి. అని కొంత మంది హేతువాదులు విగ్రహారాధనను ఖండిస్తారు. అది తప్పు అని ఎద్దేవా చేస్తారు. ఈ వాదనలో కొంత హేతువు ఉన్నమాట వాస్తవమే అయినా అది పూర్తిగా వేద సమ్మతం కాదు. ఈ వాదనలో ఒక చిన్న దోషం ఉంది. అదేమిటంటే వ్యక్తమైనది అవ్యక్తమైనది అంతా పరమాత్మే. "ఏకమేవాద్వితీయం బ్రహ్మ" అన్నది వేదం. ఉన్నది ఒక్కటే. రెండవది లేదు. అటువంటప్పుడు నామము, రూపము పరమాత్మ కాదు అని చెప్పలేము. కేవలం అవి మాత్రమే పరమాత్మ అనే వాదన తప్పు. నేను పూజించే విగ్రహం తప్ప ఇంకేదీ దేవుడు కాదు అనే భావన తప్పు. వేదవిరుద్ధం. దానిని ఖండించబోయి కొంతమంది మొత్తం విగ్రహారాధన ప్రక్రియనే తప్పు పడుతుంటారు. అది మంచిది కాదు. ధ్యాన శ్లోకాల గురించి తెలుసుకునే ముందు విగ్రహారాధన ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఆ శ్లోకాలలో వర్ణించేది మనం పూజించే మూర్తులనే. 

చిన్న కధ: ద్రవిడ దేశంలో ఉండే ఒకతను ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదామని సంకల్పించాడు. ఒక అనుభవజ్ఞుడిని అడిగితె అక్కడకు ఏ వాహనం వెళ్ళదు. కేవలం నీకాళ్లను చేతులను ఉపయోగించి పైకి ఎక్కాలి అని చెప్పాడు. అయితే ఇక్కడినుంచి ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కాలినడకన వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు అతను. అప్పుడు ఆ అనుభవజ్ఞుడు నవ్వి, ఎవరెస్ట్ ఎక్కాలంటే నేపాల్ వెళ్ళాలి. ఇక్కడినుండి అక్కడికి కాలినడకన వెళ్ళవలసిన అవసరం లేదు. ఏదైనా వాహనం ఎక్కి వేళ్ళు. ఆ తరువాత  కొండ ఎక్కేటప్పుడు నీ కాళ్లతో చేతులతో పైకి ఎగబాకు. అని సలహా ఇచ్చాడు. ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. మొదట్లో సాధన ఒక రూపంతో నామంతో మొదలు పెట్టాలి. అప్పుడు వాటిపై మనస్సు లఘ్నం అవుతుంది.  అసలు రూపమే లేదంటే మనస్సు దేని మీద లఘ్నం చేయాలి? మనస్సు లఘ్నం చేయకపోతే సాధనకు కూర్చోవడమెలాగ? సంకల్ప వికల్ప సంఘాతం మనస్సు. దృష్టి కేంద్రీకరించడానికి ఒక వస్తువు(నామ రూపాత్మకమైనది) లేకుంటే అది అనేక విషయములందు భ్రమిస్తూ ఉంటుంది. అలా కాకుండా దానికి నచ్చిన విషయాలతో ఉన్న రూపం ఒకటి ఉంటే ఆ రూపంపై మనస్సు సులువుగా లఘ్నం అవుతుంది. అప్పడు సాధన ముందుకు సాగుతుంది. అలా సాధనలో ఉన్మన స్థితి చేరుకున్నాక నామ రూపాలను వదిలేసి ఉన్మత్త స్థాయిలో సాధన జరుగుతుంది. మనస్సుని భగవంతునిపై లఘ్నం చేయడం సాధనలో మొదటి మెట్టు. దానికోసం హైందవ ధర్మంలో విగ్రహారాధన వచ్చింది. 

ధ్యాన శ్లోకములు ఈ బ్లాగ్ పోస్టులో ఉన్నయి. 

Intention of sage veda vyasa:

Brahmanda purana mentions many sublime and deep concepts. Lalita Sahasranama is one of them. These names came from the conversation with Hayagriva  and Agastya. The subtle intention behind these deep concepts is even more deep. Click on this link to read Vyaasa hrudayam in English.

Story behind Lalitha Sahasranama:

The raison d'etre of Lalitha devi and explanation of how she emerged is explained in this post.

Dhyana shlokas:

Paramatma is attributeless. It has no form or name. It is a supernatural force. Saying this some rationalists condemn idol worship. They say that it is wrong. Though there is some logic in this argument, it is not entirely true. There is a small error in this. Everything that is manifested and unmanifested is Paramatma. The Vedas say "Ekamevadvitiyam Brahma". There is only one. There is no second. In such a case it cannot be said that that which is manifested, that which has a name and form is not Paramatma. What's incorrect is the notion that only the idol I worship is God and rest all are not God. It is against vedas. Before learning about Dhyana Shlokas it is necessary to know why idol worship came into being. Because they are nothing but the idols on which one has to meditate while chanting Lalitha sahasram.

Short story: A person from south India wanted to climb Mount Everest. He learnt from a veteran that there is no vehicle that can take him to the pinnacle. That one should climb up using ones own hands and legs. So he asked the veteran, "how long would it take to walk from here to the summit of Everest." Then the veteran smiled and said if you want to climb Everest you have to go to Nepal. No need to walk from here to there. you can use a  vehicle. After reaching the foothills climb up the hill with your hands and feet. Spiritual practice is also similar. You start with idol worship. That way it will be easy to focus your mind on it and make progress. Without an idol to focus on, the mind keeps wandering on various aspects. Once a practitioner reaches the state of 'unmana', in spiritual progress then he/she shuns the idols and mediate upon the unmanifested. To focus mind on God is the first step in spiritual progress. That is why idol worship is prescribed in Hinduism.

Verses for meditation are explained in this blogpost

No comments:

Post a Comment

Popular