Search This Blog

980. Gnanagamya

 

జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే భావన కలిగి అంతటా ఆ పరమాత్మను దర్శించ గలగటమే జ్ఞానము. వేదాలు చదివినంత మాత్రాన మోక్షం రాదు. శాస్త్ర పాండిత్యం వలన రాదు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినినంత మాత్రాన కూడా ముక్తి రాదు. విని లేదా చదివి తెలుసుకున్న విషయాలను పట్టించుకోవాలి. వాటిని ఆచరించాలి. ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని భావించాలి. త్రికరణ శుద్ధిగా దానిని ఆచరించాలి. ఎల్లప్పుడూ భగవంతునిపట్ల భక్తితో మెలగాలి. దానినుండి జ్ఞానం వస్తుంది. దాని వలన వైరాగ్యం వస్తుంది. అప్పుడు ముక్తి లభిస్తుంది. 

జ్ఞానా దేవ తు కైవల్యం
జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. 

కూర్మపురాణంలో 
య త్తు మే నిష్కళం రూపం చిన్మాత్రం కేవలం శివం 
సర్వోపాధి వినిర్ముక్తా మనంత మమృతం పరం 
జ్ఞానెనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదం 

నా నిష్కళమైన రూపము చిన్మాత్రము. కేవలము శివమైనది. సమస్త ఉపాధులచేత వదలబడినది. అటువంటి అమృతపరమైన నా రూపం కేవలము జ్ఞానము చేతనే పొందదగినది. జ్ఞానదృష్టి గల వారు మాత్రమే నన్ను చేర గలరు. 

Jeevaatma and Paramaatma are one and the same. Those who possess gnana(pure consciousness) can see Paramaatma in everything and everywhere. One cannot attain moksha(Liberation) by mere recitation of vedas. Nor by study of various applied sciences(shaastras). Even listening to various spiritual discourses does not guarantee moksha. One has to assimilate and follow all of it. One has to believe and feel that everything is Paramaatma. One has to follow dharma with purity and determination. One should have devotion to God always. That leads to gnana. That leads to Moksha.

Gnaanaa deva tu kaivalyam
Moksha comes only from Gnaana.

It is said like this in Kurma puraana
Ya ttu me nishkalam roopam chinmaatram kevalam shivam
Sarvopaadhi vinirmuktaa mananta mamrutam param
gnanenaikena tallabhyam kleshena paramam padam

Chinmaatra is my purest form. It is filled with Shiva. It is rid of all bodies. That purest form of mine can be gotten by pure consciousness. Only those who attain the highest-level consciousness can reach me!

Popular