Search This Blog

85-87: Vaghbhava, Madhya and Shakti kutas

Names from 85 to 87 describe Mother's sookshma body.

The soul has three bodies. We all are aware of our physical body. But there are two other bodies that we are not generally aware of:


  1. Physical body - This body experiences pleasure, pain, happiness, sorrow. Health and age pertain to this body. Humans enjoy the result of their good deeds or sins with this body. This functions only when we are awake. This Sthula sharira is called bhoga ayatanam.
  2. Meta physical (Sookshma) body -  Faculty of speech, senses, 5 vital life forces, 5 thanmatras (associations between 5 sense organs and 5 elements), memory patterns, karma and desire are parts of this body. This is not made of five elements. Humans go through their karma with this body. It is also called 'Linga' body. This functions in dreams and awake states. As a crude analogy, we can say this is the software of our body. This Sukshma sharira is called bhoga sadhanam.
  3. Kaarana body - This body comprises of the three gunas - Sattva, Rajas and Tamo. This functions in awake, dream and sushupti states. In sushupti state whole body is completely relaxed. There is no movement. Even mind is dissolved. 
Now let's look at Mother's Sookshma body:

  1. Vaagbhava kutami - This span from head to neck. Eyes, nose, ears and mouth are in this area. The faculty of speech is here. From here we get the power to learn, think, talk, sing etc
  2. Madhya kutami - This span from neck to waist. This has shoulders, heart(hridayam), belly button, waist etc. Trimurthy's get their means to create, maintain and destroy from here. Tanmatras and the desire that gives rise to arishadvarga (kama, krodha, lobha, moha, mada, matsaryam) have their genesis here.
  3. Shakti kutami - This span from waist to feet. This is the powerhouse. Power generated here travel along Madhya kutami to reach Vakbhava kutami.


85 నుంచి 87 వరకు ఉన్న మూడు నామాలు అమ్మ సూక్ష్మ శరీరాన్ని వర్ణిస్తాయి.

ఆత్మకు  మూడు శరీరాలు ఉంటాయి. అవి:
  1. స్థూల కాయము - ఇది స్థూల దేహము. సుఖము, దుఃఖము, హాయి, నొప్పి, ఆరోగ్యము, అనారోగ్యము, యవ్వనము, వృద్ధాప్యము మొదలగునవి ఈ శరీరానికే వర్తిస్తాయి. మనిషి తనయొక్క పాపపుణ్యాల ఫలితాలు ఈ శరీరంతో అనుభవిస్తాడు. ఇది జాగృదావస్థలో ఉంటుంది. ఈ స్థూల శరీరమును భోగ ఆయతనం అంటారు. 
  2. సూక్ష్మ కాయము - వాక్కు, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, 5 తన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, విద్య, కర్మ, కామము మొదలగునవి సూక్ష్మ శరీరం అని చెప్పబడ్డాయి. దీన్నే లింగశరీరం అని కూడా అంటారు. మనిషి తన కర్మ ఫలం ఈ శరీరంతో అనుభవిస్తాడు. ఇది పంచభూతాలతో నిర్మించిన శరీరం కాదు. మనకు కలలో కలిగే అనుభూతులన్నీ ఈ శరీరమే అనుభవిస్తుంది. ఒక బండ గుర్తుగా చెప్పాలి అంటే మన స్థూలకాయం హార్డ్వేర్ ఐతే సూక్ష్మకాయం సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సూక్ష్మశరీరమును భోగ సాధనం అంటారు. 
  3. కారణ శరీరం - సత్త్వరజస్తమో గుణములతో కూడినదే ఆత్మాయొక్క కారణ శరీరం. ఇది సుషుప్తి అవస్థలో ఉంటుంది. సుషుప్తిలో అన్నిరకముల జ్ఞ్యానము నశిస్తుంది. బుద్ధి కేవలం బీజరూపంలో ఉంటుంది. ఆ అవస్థలో అన్ని అవయవాలు పూర్తిగా విశ్రమిస్తాయి. 
అమ్మ సూక్ష్మ శరీర వర్ణన:
  1. వాగ్భావకూటమి - ఇది శిరస్సునుండి కంఠం వరకు ఉంటుంది. ఇక్కడ కళ్ళు , చెవులు, ముక్కు నోరు ఉంటాయి.  దీనినుంచి వాక్కు వస్తుంది. ఈ శక్తినుంచే వేదాది సకలవిద్యలు, సకల భాషలు, సకల ఛందస్సులు, సప్త స్వరాలు వచ్చాయి. 
  2. మధ్య కూటమి - ఇది కంఠం నుండి నడుము వరకు ఉంటుంది. ఇక్కడ బాహుసంధులు, కటి సంధులు, నాభి, హృదయము ఉంటాయి. సృష్టి స్థితి లయాలను నిర్వహించు త్రిమూతులకు శక్తిని గోచరము చేయునది ఇదే. తన్మాత్రలు, ప్రాణుల మనస్సులో అరిషడ్వార్గాలను ఉత్పన్నము చేయు కామ బీజము ఇక్కడ ఉంటుంది. 
  3. శక్తి కూటమి -  నడుము నుండి పాదాల వరకు ఉన్నది శక్తి కూటమి. త్రిమూర్తులకు వారి వారి పనులు నిర్వహిచడానికి కావాల్సిన శక్తి ఇక్కడనుండి వస్తుంది. ఉపాసకులకు విద్య కవిత్వం సిద్ధింపజేస్తుంది. త్రిగుణముల ప్రవృత్తిని కలుగజేస్తుంది. యోగులకు సత్యాత్మకమైన బ్రహ్మము ఇదే. 

Popular