177.Nirabadha
Baadha means sorrow. The root cause of all the sorrows is Raga and Dwesha. From them arise the Arishadvarga, sankalpa, vikalpa, dhuritam etc. But divine mother is beyond Raga Dwesha. So she does not have any sorrows. So she is Nirabadha.
178.Nirbhedha
Bheda' means difference. Sanatana dharma is based on advaita. 'Advaita' means not two. General belief is that there are two things. 1. People and 2. God. People are different from God and when people pray, God will help them. But that is wrong. The difference between people and God is illusional. As there is no bheda(difference) it is 'Nirbheda'
179.Bhedhanashini
By praying divine mother, we can realize the oneness (advaita). When you strongly believe that there is only one thing, the reason to differentiate is automatically lost. When the reason to differentiate is lost, there is not scope for Raaga or Dwesha. When there is no Raaga Dwesha, there is only one thing that is 'Bliss'.
177.నిరాబాధా
అసలు బాధలన్నింటికీ మూలము రాగ ద్వేషములు. వాటి నుండే అరిషడ్వార్గములు, సంకల్ప వికల్పములు, దురితం, మొదలైనవన్నీ వస్తాయి. అసలు రాగద్వేషాలే లేని అమ్మకు బాధలేందుకు ఉంటాయి? ఆమె నిరాబాధ.
178.నిర్భేదా
ఇక్కడ భేదము అంటే ద్వైత భావన. అంతటా దేవుడే ఉన్నాడు అని చెబుతోంది అద్వైతం. అద్వైతం అంటే రెండు కాదు అని అర్ధం. సనాతన ధర్మానికి అద్వైతమే ఆధారం. రెండవదంటూ లేనపుడు ఇంక భేద భావనకి చోటేది. తాను వేరు దేవుడు వేరు అన్న భావన తప్పు. అసలు భేదమే లేదు కనుక నిర్భేద.
179.భేదనాశినీ
అమ్మను ప్రార్ధిస్తే భగవంతునితో ఏకత్వాన్ని సాధించగలుగుతాము. అంతా ఒకటే అని భావించేవానికి తన పర అనే భేదమే ఉండదు. అసలు భేదమే లేని చోట రాగ ద్వేషాలకు చోటే ఉండదు. రాగ ద్వేషాలు లేని చోట కేవలం ఆనందం ఉంటుంది.