Search This Blog

402. VidyaavidyaSwaroopini

విద్య అవిద్య ఈ రెండింటి స్వరూపము అమ్మే.

ఈశావాస్యోపనిషత్తులో విద్య అవిద్యల గురించి ఇలా చెప్పబడింది:-
అవిద్య అంటే ఆత్మా జ్ఞానం లేకుండా కేవలం కర్మలను(పూజలు, వ్రతాలు మొ... ) చేయడం. అవిద్యతో ఆరాధించేవారు గాడాంధకారంలో పడిపోతారు.
విద్య అంటే కేవలం ఆత్మ జ్ఞానం. కర్మలను వదిలి పెట్టి కేవలం విద్య ఉపాసనలో పడ్డవారు ఇంకా అంధకారంలో పడిపోతారు.

అందుచేత జ్ఞానరహితమైన కర్మల(పూజలు, వ్రతాలు మొ... ) వల్లగాని, కర్మరహితమైన జ్ఞానంవల్లగాని సద్గతి కలుగదు. వీటిని విడివిడిగా అనుష్టించేవారు తామసలోకాలకుపోతారు. మోక్ష ప్రాప్తికి ఆత్మజ్ఞానము , కర్మాచరణ రెండూ ముఖ్యమే. అప్పుడే సత్ఫలితం ఉంటుంది.

విద్యను ఉపాసించటంవల్ల దేవలోకము, అవిద్యను ఉపాసించటంవల్ల పిత్రులోకము వస్తాయి. వీటినే ఉత్తర దక్షిణాలు అంటారు. ఈ రెండూ తెలిసినవారు అవిద్య అంటే కర్మలచే మృత్యువును జయించి, విద్యతో దైవత్వం పొందుతారు. విద్య అవిద్య రెండూ పరమేశ్వర స్వరూపాలే. ఈ రెండింటినీ సమానంగానే ఉపాసించాలి. “అవిద్యవల్ల శరీరాన్ని వదలి, విద్యతో జన్మరాహిత్యం పొందాలి. జగత్తును దాటటానికి కర్మాచరణ, జన్మరాహిత్యానికి జ్ఞాన సముపార్జన రెండూ అవసరమే. ఇది తెలిసి ఆచరించినవాడు కర్మలవల్ల సంచితకర్మలను నాశనంచేసి, జ్ఞాన సముపార్జన వల్ల దైవత్వం పొందుతాడు" అని చెప్పబడింది.

విద్య, అవిద్య రెండూ కూడా అమ్మ స్వరూపాలే. అయితే సాధకుడు ఈ విషయాలను తెలుసుకుని ఉపాసన చేసినట్లైతే అతడికి ఆవిడ మోక్షం ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆమె విద్యావిద్యస్వరూపిణి అనబడింది.

According to Esavasyopanishath:-

Vidya means knowledge of Atma. Those who shun karma completely and purse vidya fell into oblivion.
Avidya means performing karma without any knowledge of Atma. Those with avidya also fell into oblivion.

That means, to attain liberation(moksha), both knowledge of Atma and performing karma are necessary. Through vidya one attains deva loka and through avidya one attains pitru loka. These are called north and south poles. One will surpass death with avidya and attain daivatva with vidya. so to enter the transcendental world, pursuit of both karma as well as knowledge are utmost important.

Both vidya and avidya are forms of Divine mother. Hence she is called vidyaavidya swaroopini.

Popular