Search This Blog

638. Vishwagarbha

విశ్వము గర్భమునందు గలది. ప్రళయం సంభవించినప్పుడు జగత్తు అంతా లయమైపోతుంది. కర్మక్షయమైన జీవులకు మోక్షం కలుగుతుంది. కర్మక్షయం కాని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మ చెయ్యగానే ఫలితం రాదు. కర్మ పరిపక్వం కావాలి అప్పుడే ఫలితం వస్తుంది. ఈ జీవులు గతంలో చేసిన కర్మతాలూకు ఫలితాన్ని అనుభవించాయి. కాని వర్తమానంలో చేసిన కర్మఫలితాన్ని అనుభవించాలి అంటే ఆ కర్మ పరిపక్వత చెందే వరకు ఆగాలి. అటువంటి జీవసమూహం అంతా కూడా మాయా స్వరూపిణి అయిన పరమేశ్వరిలో లీనమైపోతుంది. అలాగే పంచభూతాలు కూడా


భూమి జలంలో కలిసిపోతుంది
జలం అగ్నిలో కలిసిపోతుంది
అగ్ని వాయువులో కలిసిపోతుంది
వాయువు ఆకాశంలో కలిసిపోతుంది
ఆకాశం మాయలో కలిసిపోతుంది

ఈ రకంగా సృష్టి అంతా పరమేశ్వరిలో లీనమైపోతుంది. ఇప్పుడు ఆ సృష్టి అంతటినీ తన గర్భంలో దాచుకుని, మాయాశక్తి పరమేశ్వరునిలో లీనమైపోతుంది. ఈ రకంగా విశ్వమంతా తన గర్భంలో దాచుకుంటుంది. కాబట్టి ఆమె విశ్వగర్భా అనబడుతోంది.

During the apocalypse, the whole creation gets dissolved into Her.

Karma won't lead to immediate result. It takes time to get the result of your current actions. All beings enjoy the result of their past karma and accrue the result of their present karma for the future. Those who have not yet fulfilled karma by the time of apocalypse have to take another birth in the next phase of creation. Beings who perform selfless duty, who follow dharma unconditionally fulfil their karma. Their actions fulfill their past karma but won't accrue anything for future. Hence they get liberated.

Earth dissolves into Water
Water dissolves into Fire
Fire dissolves into Air
Air dissolves into Space
Space dissolves into Divine Mother.

At that moment Divine mother holds the entire creation in her womb. Then she dissolves into Parameshwara.

Popular