Search This Blog

668. Nirdwaita

నిర్ద్వైతా. రెండు కానిది. భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేది ద్వైతభావన. ఇటువంటి భావన తప్పు అని చెబుతోంది సనాతన ధర్మం. సనాతన ధర్మం అద్వైతభావనను ప్రతిపాదిస్తుంది. అంటే భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే. జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమె. అంతకుమించినది ఏదీలేదు.

బ్రహ్మవిద్ బ్రహ్మ ఎవ భవతి

సాధకుడు తాను వేరు భగవంతుడు వేరు అని భ్రమలో ఉంటాడు. కానీ సాధన చేసి బ్రహ్మ జ్ఞానం సముపార్జించిన తరువాత తానూ, బ్రహ్మము ఒకటే అని తెలుసుకుంటాడు.

అసతోమా సత్గమయ!
తమసోమా జ్యోతిర్గమయా!
మృత్యోర్మా అమృతంగమయ!

ఓం శాంతిః శాంతిః శాంతిః !!!

తానూ వేరు బ్రహ్మము వేరు అనే అసత్యము నుండి అంతా బ్రహ్మమే అని తెలుసుకునే వరకు సాగే ప్రయాణం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అజ్ఞానాంధకారం నుండి అంతా స్పష్టంగా జ్యోతకం అయ్యే వరకు సాగే ప్రయాణం. చావు పుట్టుక అనే కష్టాల నుండి అసలు చావే లేనటివంటి స్థాయికి చేరుకునే ప్రయాణం - ధర్మ బద్ధంగా సాగే జీవితం. 

ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుతో “మానవుడు నిద్రించేటప్పుడు ఆత్మలో తాత్కాలికంగా లీనమవుతాడు. మరణకాలంలో వాక్కు మనసులో లీనమవుతుంది. మనసు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో లీనమవుతుంది. చివరకు అది పరమశక్తితో కలిసిపోతుంది. ఆ శక్తి అతి సూక్ష్మమైనది. కాని విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే సత్యము. అదే నిత్యము. అదే ఆత్మ. అదే నీవు శ్వేతకేతూ అదేనీవు. జీవించినంత కాలము పులి, సింహము, క్రిమి కీటకము ఇత్యాది పేర్లుంటాయి. మరణించిన తరువాత ఆ పేర్లన్నీ పోతాయి. జీవికి గుర్తింపు ఉండదు. ఆ జీవి పరమాత్మలో చేరిపోతుంది. అదే నీవు. శ్వేతకేతూ ఆ పరమాత్మే నీవు" అని చెబుతాడు. ఇది అద్వైత సిద్ధాంతం.

Nirdwaita means one that cannot be divided. The belief that God and his creation are separate is called Dwaita. Sanathana dharma does not accept it. It says there are no two things. Everything is para-brahma. We perceive them as different because of our ignorance.

Brahma vid brahma eva bhavati

A practitioner initially thinks there are two separate things. Then he practices yoga and meditation and become aware that there indeed is only one thing.

Asatoma satgamaya!
Tamasomaa jyotirgamaya!
Mrityorma amritangamaya!

Om Shantih Shantih Shantih !!

Life is a journey from falsehood to truth. From darkness to light. From mortality to immortality when you follow dharma.

In Chandogya upanishath, Uddalaka says this to his son Shwetakethu, "When a man is in deep sleep, he is temporarily submerged into soul. During death, speech dissolves into Mind. Mind goes into Prana(life force). Prana goes into soul. Finally everything goes into Paramatma. This Paramatma cannot be perceived. But is present everywhere. That is truth. That is permanent. That is you. O! Swataketha! That is you! Out of illusion we perceive things as a man, a tiger, a bird, an insect etc. But just think, what happens when they are all gone? They all go into the same paramaatma. That is you!" 

This is Adwaita

Popular