Search This Blog

Maha Shiva Ratri

మాఘ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహా శివరాత్రి అంటారు. ఇది గొప్ప శుభ దినం. ఈ రోజు హిందువులు ఉపవాస జాగరణ దీక్షలతో శివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు వచ్చే కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. 

శివరాత్రి యొక్క మహిమను ఋషులు ఇలా వివరించారు. భూమి తనపై ఉన్నవాటిని తన వైపు లాగుతుంది. ఈ శక్తిని గురుత్వాకర్షణ అంటారు. అలాగే దీనికి విరుద్ధంగా పని చేసే శక్తి ఒకటి ఉంది. అది వస్తువులను భూమి నుండి దూరముగా లాగడానికి ప్రయత్నిస్తుంది. దీనిని విరుద్ధ గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఈ శక్తి యొక్క ప్రభావం కృష్ణ పక్ష చతుర్దశి నాడు అధికంగా ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉండడం వలన,  సాధకుడు తన వెన్నును నిటారుగా ఉంచినప్పుడు కుండలినిని పైకి లాగడంలో ఈ శక్తి దోహద పడుతుంది. 

శివరాత్రి అంటే ఆకలిదప్పులు మరచి రోజంతా శివదీక్ష లో మునిగి ఉన్న సాధకుడికి కుండలిని జాగృతం అయి, అది పైకి ఎగబాకి సహస్రారం చేరి ఆత్మ సాక్షాత్కారం కలగడం. యతి యోగిగా మారడం. ఆ రోజు ఉదయం నుంచి సాధన మొదలు పెడితే రాత్రి 12 గంటలకు లింగోద్భవము జరగడం. జీవాత్మ పరమాత్మ ఏకమవ్వడం. ఈ ప్రక్రియకు విరుద్ధ గురుత్వాకర్షణ శక్తి దోహద పడుతుంది. మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అందుకనే ఆరోజు మహా శివరాత్రి గాను, తక్కిన మాసములలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రి గాను లెక్కిస్తారు. ఉపవాస జాగరణ దీక్షలు శివ సాయుజ్య సాధనలో  ఆకలి, అలసట మొదలైన విఘ్నాలు కలుగకుండా ఉండటానికి సూచిస్తారు. 

The 14th day in the second half of the month of Maagha is called Shivaraatri. Hindus worship Lord Shiva on this day. They fast for the whole day and stay awake the whole night while worshipping the Lord. 12 o clock in the midnight of Shivaratri is called Lingodbhava kalam.

Saints explained the greatness of Shivaratri as follows. The earth's gravity pull all objects towards itself. However, there is a force that pulls objects away from earth. This is called anti gravity. The effect of this anti gravity is prominent on the 14th day of the second half of every month(29th day). If a spiritual practitioner meditates on Lord Shiva with his spine erect, this anti gravity force helps kundalini to crawl up the spinal cord to Sahasrara.

Shivaratri means to spend time meditating on Lord Shiva. Indulging in meditative calmness, a spiritual practitioner would shun even basic necessities like hunger, rest and puts his/her mind steadfast on the Lord. Kundalini will be awakened in that meditation and with help of anti gravity, it reaches the Sahasrara. By 12 in the midnight, a practitioner becomes a yogi. It means the union of jeevatma and paramatma. That is called lingodhbhavam. This process is called Shivaratri. Anti gravity helps in this process. It's effect is much more prominent on Maha Shivaratri. 14th day of the second half of each month is called maasa shivaratri (monthly shivaratri). Shivaratri that comes in the month of Maagha is called Maha Shivaraatri. Fasting is prescribed to avoid unwanted distraction during meditation and jaagarana is done to continue meditation till midnight.

644. Gnanadha

అన్నింటికీ మూలమైనది ఏదో, దేనివలన ఈ జగత్తు సృష్టించబడుతోందో, ఆ విషయపరిజ్ఞానమే జ్ఞానము అనబడుతుంది. ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయమే జ్ఞానము. జ్ఞానమనేది పరమాత్మ స్వరూపము అందుచేతనే పరమాత్మ తేజోమయమైన కాంతిపుంజము అని చెప్పబడింది.

అదే జ్ఞానజ్యోతి సాధకుడు కుండలినీశక్తిని నిద్రలేపి సహస్రారం చేర్చగలిగితే అక్కడ తానెవరు అనే విషయం తెలుస్తుంది. అదే స్వరూపజ్ఞానం. ఆత్మజ్ఞానం.

బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి.

బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు తాను కూడా బ్రహ్మమే అవుతాడు.ఈ చరాచర జగత్తు అంతా తనలో చూడగలుగుతాడు. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందినవాడు జ్ఞాని. ఇతని దృష్టిలో కులాలు లేవు. మతాలు లేవు. రూపభేదం, రంగు భేదం లేదు. జగత్తులోని మానవులంతా ఒకటే.

శంకర భగవత్పాదులవారికి కాశీలో ఒక ఛండాలుడు త్రోవలో అడ్డు వస్తాడు. అతణ్ణి తప్పుకోమంటారు శంకరుని శిష్యులు.
అప్పుడు ఆ ఛండాలుడు ఎవర్ని తప్పుకోమన్నారు? నన్నా ? నా ఆత్మనా ? ఆత్మనే గనక అయితే నీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకే ఆత్మ. ఈ శరీరాన్ని అయితే అందరి శరీరాల్లోని రక్తమాంసాలు ఒకటే. మరి ఎవరు తప్పుకోవాలి? అని అడుగుతాడు. దీంతో శంకరులవారికి జ్ఞానోదయమవుతుంది. అప్పుడు ఆ ఛండాలుడి పాదాల మీద పడతాడు శంకరుడు. ఆ వచ్చిన వాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. ఈ రకంగా అనేకమందికి అనేకచోట్ల జ్ఞానోదయమవుతుంది. జ్ఞానికి అన్ని విషయాలు తెలుస్తాయి. సకల శాస్త్రాలు తెలుస్తాయి. వాటిని ప్రత్యేకంగా చదువవలసిన అవసరం లేదు.

జ్ఞానమనేది రెండు రకాలుగా ఉంట 1. ఇహలోక జ్ఞానము 2. పరలోక జ్ఞానము. ఐహలోక జ్ఞానము అంటే ఈ లోకంలోని వస్తువులను గురించిన పరిజ్ఞానము. లౌకికమైన అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి.
2. పరలోక జ్ఞానము పరదేవతను గురించి ఆత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం.

ఈ జ్ఞానమనే దాన్ని భక్తులకు ఇచ్చేది జ్ఞానదా. బంధజ్ఞానాన్ని పోగొట్టి పరమజ్ఞానాన్ని ఇచ్చేది.

Gnana means knowledge of that which is utmost superior. That which can explain everything else. Knowledge of that which has knowledge of everything else embedded in it. It is the form of Paramatma. That is why Paramatma is explained as a brilliant self-luminous light.

When a practitioner meditates upon Divine Mother and awakens kundalini, it crawls up and reaches Sahasrara. Then he acquires Gnana. That is called self-realization. Knowledge of Paramatma.

'Brahmavid brahmaiva bhavati'

One who learns about Brahman (Paramatma) becomes Brahman. He see the whole creation inside him. That is Gnana. Those who have Gnana are called Gnani. A Gnani does not see any difference between a priest and a chandala. A dog and a royal elephant. He sees Divine Mother in all.

Once sri Adi Shankara is going in a procession along with his disciples in the city of Kasi. A chandala (person from lower caste) comes and stands in front of the procession. Then Shankara's disciples ask him to move away. To that, the chandala asks, "Whom are you asking to move away? This body, or this Atma? If it is this Atma, then it is same in you and me. This dog and that king. If it is this body, then all these bodies have the same elements like skin, flesh, blood, bones, etc. So first clarify what is different here. Then we can move that out". That is the moment when Sri Adi Shankara realizes Gnana. A Gnani will know about everything. He knows all sciences by default.

Gnana is of two types: 1.Ihaloka 2.Paraloka. Ihaloka means knowledge about all perceivable things. A Gnani will know about all perceivable things. Paraloka means knowledge about Atma.

Gnanadha means one who gives this Gnana. That is Divine Mother.

Popular