శివము వేరు శక్తి వేరు కానే కాదు. వారిద్దరు ఒక్కటే. శక్తికీ శక్తి గలవానికి భేదం ఉండదు. పదమునకు దాని భావమునకు భేదం లేదు. సౌందర్యలహరి మొదటి శ్లోకంలో శంకరాభగవతపాదులు ఇలా అన్నారు
శివశ్శక్త్యాయుక్తో యది భవతి శాక్తః ప్రభవితుమ్
నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామ్ ఆరాధ్యామ్ హరి హర విరించాదిభిరపి
ప్రాణన్తుమ్ స్తోతుంవా కథమకృత పుణ్యహ్ ప్రభవతి
శక్తి లేకుంటే శివం తన స్పందన కోల్పోతుంది. అప్పుడు దాని గురించి మనం ఏమి తెలుసుకోలేము. శివం లేకుంటే శక్తికి ఏ ఆధారం ఉండదు. శివశక్తుల సామరస్యమే ఈ సృష్టి. ఇదంతా వారి తాండవకేళి
భైరవ యమ్మాళమ్ లో ఇలా చెప్పారు
చతుర్భి శ్శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః
శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయో ర్వపుహ్
త్రికోణము, అష్టకోణము, దశారద్వయము, చతుర్దశారము. ఈ 5 శక్తి చక్రాలు. బిందువు, అష్టదళము, షోడశ దళము, భూపురము ఈ 4 శివ చక్రాలు.
త్రికోణంలో బిందువున్నది. అష్టకోణంలో అష్టదళపద్మఉన్నది. దశారయుగ్మములో షోడశదళమున్నది. చతుర్దశారంలో భొపురమున్నది. ఈ రకంగా శివ శక్తుల అవినాభావ సంబంధము నెరిగినవాడే చక్రవిదుడు. అతడే చక్రసంకేతము నెరిగినవాడు. ఈ విషయం తెలుసుకోకుండా ఎన్ని సంవత్యరాలు తపస్సు చేసినా మంత్రం సిద్దించదు.
The notion of Shiva and Shakti as independent entities is completely wrong. They are one and the same. There is no difference between me and my energy. There is no division between a word and its meaning. Sri Shankara bhagavatpaadaacharya said like this in the 1st shloka of Soundarya Lahari
Shivasshktyaayukto yadi bhavati shaktah prabhavitum
nache devam devo na khalu kushalah spanditumapi
atastvaam aaraadyhaam hari hara virinchaadibhirapi
pranantum stotumvaa kathamakrita punyah prabhavati
With out Shakti, Shivam loses its stimulus. We can never know about Shivam without it. Without Shivam, Shakti loses its basis. The whole creation is their united spirit. It is their partner dance
It is said like this in Bhairava yamaalam
Chaturbhi sshivachakraihscha shaktichakraischa panchabhih
shivashaktyaatmakam gneyam srichakram shivayorvapuh
Trikona, Ashtakona, 2 dashaaras and chaturdashaara are Shakti chakras. Bindu, Ashtadala, shodashadala and bhoopura are Shiva chakraas
Bindu lies in Trikona. Ashtadalapadma lies in Ashtakona. Shodashadala padma lies in the two dashaaras, Bhoopura is in chaturdashaara. This means Shiva and Shakti are always united. One who knows this is knows the essence of SriChakra. Doing penance without knowing this will not be fruitful.