సమస్తమైన అంతఃకరణలను నియమించునది. పరమేశ్వరి సర్వజీవుల యొక్క హృదయాకాశములయందు జీవరూపంలో ఉంటుంది. జీవులను సృష్టించి, తాను ఆ జీపులందు ప్రవేశిస్తుంది.
ఐతరేయోపనిషత్తులో “ఈ రకంగా పరబ్రహ్మ జీవకోటిని సృష్టించి, తాను ఆ జీవరాసిలో ప్రవేశించాలి అనుకుంది. అందుకు రెండే మార్గాలు ఉన్నాయి. 1. పై నుంచి 2. క్రింద నుంచి క్రిందనుంచి ప్రవేశించటమనేది సేవకుల లక్షణం కాబట్టి పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాలలో ప్రవేశించింది" అని చెప్పబడింది. హకార సంజ్ఞగల పరమేశ్వరుడు, సకారసంజ్ఞ గల ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై, తొమ్మిది ద్వారాలు గల మానవ శరీరము అనే పట్టణంలో ప్రవేశించి, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సుతో కూడినవాడై, పంజరంలో బంధించబడిన పక్షిలాగా, బయటకు వచ్చే ఉపాయం తెలియక, ప్రాపంచిక బంధనాలలోపడి కొట్టుమిట్టాడుతున్నాడు. అంటువంటి హంస అనబడే జీవుడికి అగ్ని, చంద్రమండలాలు - రెక్కలు ఓంకారము - శిరస్సు జ్ఞాననేత్రము - ముఖము హకార సకారాలు - పాదాలు ఈ రకంగా ఉన్న హంస అనే జీవుడు పాలలో ఇమిడి ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటిని ఆవరించి ఉన్నాడు. అందుచేతనే అమ్మ సర్వాంతర్యామిణీ అనబడుతోంది.
She is the Lord of all faculties of intuition (The mind, the intellect, Chit and Ego). She is present in the Hridayaakaasha (back of forehead) as soul (jeevatma). She creates beings, enters into them and stay with them till they die.