Search This Blog

608. Deveshi

దేవానాం బ్రహ్మవిష్ణ్వా దీనాం ఈశీ ఈశ్వరీ

బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలకు ఈశ్వరి, పంచదశీ మహామంత్రాన్ని జపించి తరించిన వారిలో విష్ణువు, శివుడు, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు ఇత్యాది దేవతలు ప్రముఖులు. కాబట్టి అటువంటి దేవతలకు కూడా ఈశ్వరి.

దేవీ భాగవతంలో మధుకైటభ సంహారం చేసిన తరువాత దివ్యమైన విమానంలో త్రిమూర్తులు మణిద్వీపం చేరి, అక్కడ పరమేశ్వరిని దర్శించి, ఆమెను పరిపరివిధాల కీర్తిస్తారు.
(మధుకైటభ సంహారం అంటే అరిషడ్వర్గాలను తెగ నరికి అహంకారంపై విజయం సాధించటమే)

వృత్రాసురుని బాధలు పడలేక స్థితికారకుడైన విష్ణుమూర్తితో కలిసి దేవతలంతాహిమాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరిని నియమనిష్ఠలతో పరిపరివిధాల ప్రార్ధిస్తారు.

శుంభనిశుంభులు దేవతలను నానాబాధలు పెడుతుంటే సహించలేక చివరకు
హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాః ||

అంటూ పరిపరివిధాల ప్రార్ధించారు. ఈ రకంగా దేవతలందరిచేత పూజించబడిన దేవత. దేవతలకు ఈశ్వరి. కాబట్టి దేవేశి.

Vishnu, Shiva, Indra, Agni, Surya are the devatas who worshipped Divine mother with Panchadashi mantra. Eswari means the protector and leader. Because devatas seek Divine mother's protection and leadership, she is called Deveshi.

After triumph over demons Madhu and Kaitabha, Trimurthy's go to manidweepa to visit Divine mother and pray her with gratitude.

(Madhu means 'I' and Kaitabha means 'Mine'. Victory over them means victory over the ego and thereby victory over the 'Arishadvarga')

Devatas sought help from Divine mother to overcome the difficulties caused by Vrutrasura and Shumbha-Nishumbha.


No comments:

Post a Comment

Popular