తత్త్వమసి అనే మహావాక్యాలయందు గల తత్ అనే పదము. ఇది శబళ బ్రహ్మను తెలుపుతుంది. పరమేశ్వరి జీవాత్మ పరమాత్మల ఏకీభావం తెలుపుతుంది. హకారసంజ్ఞ గల పరమేశ్వరుడు సకారసంజ్ఞ గలిగిన ప్రకృతితో కలసి శబళబ్రహ్మమై, తొమ్మిది ద్వారాలుగల మానవశరీరము అనే పట్టణంలో ప్రవేశించి, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సుతో కూడినవాడై పంజరంలో బంధించబడిన పక్షిలాగా బయటకువచ్చే ఉపాయం తెలియక ప్రాపంచిక బంధనాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ వేరుకాదు. రెండూ ఒక్కటే. ఈ జీవాత్మను వచ్చిన దారి గుండానే గనక బయటకు పంపగలిగినట్లైతే అతడు పరబ్రహ్మలో లీనమవుతాడు. కాబట్టి ఆ పరమాత్మా ఈ జీవాత్మ రెండూ ఒకటే. ఈ విషయాన్ని తన బిడ్డలకు తెలియచెయ్యటమే అమ్మ యొక్క విలక్ష్యము అందుచేతనే ఆవిడ తత్పదలక్ష్యార్థా అనబడుతోంది.
The word Tat in the Mahavakyas like Tattvamasi indicates Sabala Brahma. Divine mother expresses the unity of the Jeevatma and Paramatma. Lord Parameshvara, who is represented by the symbol 'ha' unites with the nature that is represented by the symbol 'Sa', entered into the city called the human body that has senses, vital forces, mind and the nine doors. Caged in this body, He is surrounded by worldly bonds, and is not aware how to come out of it. He is the soul (Jivatma). It is not separate from the Supreme Soul (Paramatma). Both are one and the same. If you are able to expel this soul through the same path from which it entered this body, it will be absorbed in Paramatma. Mother's motive is to explain this to her children that is why she is called Tatpadalakshyartha.