దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతమ్
చరాచర జగత్తు అంతా కూడా దైవము యొక్క అధీనంలో ఉంటుంది. దైవం మంత్రానికి అధీనం అయి ఉంటుంది. కాబట్టి మంత్రానికి ప్రాముఖ్యత ఉన్నది. మననాత్ త్రాయత ఇతి మంత్రః మననము చేయుటవలన మననము చేయువానిని రక్షించునది మంత్రము. దేవతల దయకు పాత్రులు కావాలంటే మంత్ర జపం చెయ్యాలి. దీన్నే ఉపాసన అంటారు. అరణి మధిస్తే అగ్ని ఎలా పుడుతుందో అలాగే మంత్రాన్ని జపించినట్లైతే శక్తి పుడుతుంది. ఆ శక్తి సాధకుడికి సర్వార్ధాలూ చేకూరుస్తుంది. బీజాక్షరాలచే సంపుటం చేయబడిన మంత్రజపంవల్ల దేవతానుగ్రహం త్వరగా కలుగుతుంది. ఆయా దేవతల యొక్క తత్త్వాలకు అనుగుణమైన బీజాక్షరాలు ఋషులచేత సంపుటీకరణం చేయబడ్డాయి. పరమేశ్వరుని బీజం ఓంకారము.మంత్రాలు మూడు రకాలు అవి
1. వైదికములు - వేదాలలో చెప్పబడిన మంత్రాలను వైదికమంత్రాలు అంటారు అవి జ్ఞానప్రదాలు.
2. తాంత్రికములు - కామ్యప్రదమైనవి తాంత్రికాలు.
3. అపభ్రంశములు - సంస్కృతంలో కాక ఇతర భాషలలో ఉన్న మంత్రాలను అపభ్రంశాలు అంటారు.
ఈ మంత్రాల సారాంశమంతా లలితమ్మే కాబట్టి ఆమె మంత్రసారా అనబడుతుంది.
Daivadheenam jagatsarvam mantraatheenam tu daivatam
The whole creation is in control of Devatas. These Devatas can be controlled by Mantras. Hence Mantras are quite significant.
Mananaath Traayate iti mantrah
Manthra came from the word Manana. Manana means to repeat inside the mind. That which will protect you by doing manana is called Manthra. A mantra is presided by a Devata. By chanting the mantra inside your mind and focusing on the presiding Devatha, you can please the Devatha. This is called upaasana. Hindu saints have embedded beejaaksharas in the mantras. The sound vibration of a mantra emits shakti that pleases it's devata. 'Om' is the beejakshara of Paramaatma.
Manthras are of three types:
1. Vaidikas - Those that are spelled out in Vedas.
2. Thaanthrikas - Those that fulfill desires.
3. Apabhramshas - Mantras of other languages (other than Sanskrit)
Divine mother is the essence of all these mantras. Hence, she is called Mantrasara.