251 | Chinmayi చిన్మయి | Divine mother personifies herself as chaitnya and fills this world. Hence she is called Chinmayi. చైతన్యరూపంలో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది కనుక అమ్మను చిన్మయి అన్నారు. |
252 | Paramananda పరమానందా | Happiness is of two types. 1) Spiritual, 2) Materialistic. Spiritual happiness is much greater than material pleasures. ఆనందము రెండు రకాలు. 1) ఇహము 2) పరము. పరమానందం ఐహికానందం కన్నా చాలా గొప్పది. అదే ఆత్మానందం. అమ్మ స్వరూపం. |
253 | VignanaGhanaRupini విజ్ఞానఘనరూపిణీ | Knowledge of a particular thing is called 'Gnana'. Having knowledge of all the 64 studies is called 'Vignanaghana'. Divine mother is the personification of all the studies. So she is called Vignana ghana roopini. ఏదైనా ఓక విషయం గురించి కలిగేది జ్ఞానం. మొత్తం 64 కళల పట్లా సంపూర్ణమైన జ్ఞానం సంపాదించినట్లయితే ఆ పాండిత్యాన్ని విజ్ఞానఘనమని అంటారు. అన్ని కళలు అమ్మనుండి వచ్చినవే. అందుకే ఆమెని విజ్ఞానఘనరూపిణి అన్నారు. |
254 | DhyanaDhyathruDhyeyarupa ధ్యానధ్యాతృధ్యేయరూపా | She who is personification of meditation, the one who meditates and what is being meditated upon. ధ్యానం, ధ్యానించబడేది, ధ్యానం చేస్తున్నది అన్ని అమ్మే. |
255 | DharmadhramaVivarjitha ధర్మాధర్మవివర్జితా | Divine Mother does not do karma. So she is beyond Dharma or Adharma. అమ్మకు కర్మ చేయవలసిన అవసరమే లేదు అని ఇంతకు ముందు వచ్చిన నామాలలో చెప్పుకున్నాం. కర్మే లేనప్పుడు ధర్మం/అధర్మం ఆమెకు ఎలా వర్తిస్తుంది? అందుకే ధర్మాధర్మవివర్జితా అన్నారు. |
256 | Vishwaroopa విశ్వరూపా | Divine mother is filled in the whole universe. She is present in every atom. Vishwaroopa reminds us that God is omni present. 'Bhaga' means part. 'Bhagavan' means one who is present in all parts. Because she is present everywhere in this vishwa (universe), she is called vishwarupa. ఈ విశ్వమంతా నిండి నిభిడీకృతమై ఉంది అమ్మ. ఇందులోని అణువణువులోనూ ఆమె ఉంది. విశ్వరూప అన్న నామం భగవంతుని సర్వ వ్యాపకత్వాన్ని గుర్తుచేస్తుంది. అన్ని భాగాలలోను ఉండేవాడు భగవాన్. అంతటా ఆమె ఉంది కాబట్టి ఈ విశ్వమే ఆమె రూపం. |
257 | Jagarini జాగరిణీ | House is the base for a family man. He lives in it. In the same way, this body is the base of 'jeeva'. He lives in it. This body has 4 states. 1. Jagrut, 2. Swapna, 3.Shushupti, 4. Tureeya. 'Viswa' is the jeeva who represents thoughtful sensory inputs. He is present in 'Jagrut'. Man experiences pleasant and unpleasant things in 'Jagrut' శరీరమే జీవునికి గృహము. అతను అందులోనే నివసిస్తుంటారు. ఈ శరీరానికి 4 అవస్థలు ఉన్నాయి. అవి 1. జాగ్రత్, 2. స్వప్న, 3. శుషుప్తి, 4.తురీయ. ప్రభోదాత్మకమైన సర్వేంద్రియ జ్ఞానము కలవాడు విశ్వుడు. జాగ్రదావస్థ ఇతని సంచార స్థానము. అందుకే జాగృదావస్థ సర్వేంద్రియగోచరమైనది. జాగృత్ లోనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. |
258 | Swapanthi స్వపంతీ | The experiences of the mind when we are asleep are called dreams(Swapna). The sensory organs and limbs are inactive in this state. But the mind is active. The passage of time in the dream state is much faster than in Jagrut state. నిద్రుస్తున్నపుడు మనస్సులో కలిగే ప్రపంచానుభవమును స్వప్నము అంటారు. జాగృదావస్థలోని ప్రపంచానుభవాలన్నీ బీజరూపంలో ఉండి, స్వప్నకాలంలో మనస్సుకి కనిపిస్తాయి. ఇది స్వప్నావస్థ. ఈ అవస్థలో ఇంద్రియాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మనస్సు మాత్రం మేలుకొని ఉంటుంది. స్వప్నావస్థలో కాల గమనము జాగృదావస్థ కంటే చాలా వేగంగా ఉంటుంది. |
259 | Thaijasathmika తైజసాత్మికా | Physical body is motionless in dream state (swapna avastha). So, it cannot perform any karma. Dreams are the karma performed by the meta-physical body (sukshma sharira). Divine mother is the witness for all the karma performed by sukshma sharira. She is in the form of Taijasa. Hence, she is called Taijasatmika. Taijasa is the second quartile of the atma. స్వప్నము సూక్ష్మ శరీరము యొక్క వ్యవహారము. స్వప్నావస్థలో స్థూల శరీరం అచేతనంగా ఉంటుంది. కర్మలు చేయలేదు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నింటికీ సాక్షి లలితమ్మ. ఆవిడ తైజసుని రూపంలో ఉంటుంది. అందుకే తైజసాత్మిక అని అన్నారు. ఇతను ఆత్మయొక్క రెండవ పాదం. |
260 | Suptha సుప్తా | Suptha or sushupta is a state in which all senses, mind and intellect dissolve into 'Prana'. Only 'Gnana' is awake. This is close to deep sleep at night. By virtue of this 'Gnana' we are able to realize (after waking up) that we had deep sleep at night. సుప్త లేదా సుషుప్త అంటే ఇంద్రియ వ్యాపారములు నశించిన అవస్థ. ఈ స్థితిలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. కేవలం జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ జ్ఞానం వలనే నిద్రలేచాక గాఢ నిద్ర పట్టేసింది అని తెలుస్తుంది. |
261 | Prangnathmika ప్రాజ్ఞాత్మికా | Pragna is the third quartile of the 'Atma'. He is awake in suptha/sushupta. సుషుప్తిలో సంచారం చేసే జీవుడు ప్రాజ్ఞుడు. ఇతను ఆత్మయొక్క 3వ పాదం. |
262 | Thurya తుర్యా | When the consciousness is with senses, it is Jaagruth, with mind - Swapna, with heart - shushupti, with sahasrara - Turiya. Turiya is the state where Yoga happens. This is beyond Jaagrut, swapna and shushupti. మనస్సు, బుద్ధి ఇంద్రియాలను ఆశ్రయిస్తే జాగృతి. అవి మనోగతమైతే స్వప్న. అవి హృదయగతమైతే శుషుప్తి. అవి సహస్రారం చేరితే తురీయ. తురీయావస్థ యోగం సాధించే స్థితి. ఇది స్థూల, సూక్ష్మ కారణం శరీరాలకు అతీతంగా ఉంటుంది. |
263 | Sarvavasthavivarjitha సర్వావస్థావివర్జితా | Beyond Jagrut, swapna, shushupta and turiya is turiyateeta. meaning beyond a state - stateless. Here one experiences boundless happiness in all times. One who goes beyond Turiya will shun everything. This is Moksha. Being equal to Shiva. Those who reach here are free from bonds of rebirth. They do not perform karma. జాగృత్ స్వప్న శుషుప్తి తురీయములు దాటిన తరువాత తురీయాతీతము. తురీయాన్ని దాటిన సాధకుడు అన్నింటినీ వదిలేస్తాడు. ఇదే పరమ పదము. శివునితో సమానమగుట. ఇక్కడ ఎల్లప్పుడూ ఆనందమే. అటువంటి సాధకుడు జీవన్ముక్తుడు. దేహేంద్రియాలు ఉన్నప్పటికీ అతడు కర్మలు చేయడు. |
264 | Srushtikartri సృష్టికర్త్రీ | Divine mother assigns new births to all those beings whose karma is not neutralized in previous births. Hence she is called srishti karthri. అమ్మ మూలప్రకృతి రూపం పొంది సృష్టిని చేస్తున్నది. అంటే గతంలో కర్మక్షయం కాకుండా ఉన్న జీవులకర్మానుసారము వారికి ఉత్తరజన్మ ఇస్తున్నది. అందుచేతనే ఆమె సృష్టికర్తీ అనబడుతోంది. |
265 | Brahmarupa బ్రహ్మరూపా | The act of creation is a quality of rajo guna. Of all forms of Divine mother, Brahma is mainly of rajo guna. Hence, the job of creation is assigned to Brahma. సృష్టి కర్తృత్వము రజోగుణ ప్రధానము. త్రిగుణాత్మకమైన దేవి రూపాలలో రజోగుణ ప్రధానుడు బ్రహ్మ. ఇటువంటి చతుర్ముఖ బ్రహ్మ రూపంలో ఈ జగత్తును పరమేశ్వరి సృష్టిస్తోంది కాబట్టి బ్రహ్మరూపా అనబడింది. |
266 | Gopthri గోప్త్రీ | Gopana means protecting the universe. It is the job of Eswara because he is mainly of sattva guna. Goptri means she who is protecting this universe in the form of eswara. గోపనము అంటే జగత్తు యొక్క రక్షణ. అది సత్వగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. ఆ పనిని చెయ్యటంచేత పరమేశ్వరి గోప్త్రీ అనబడుతున్నది. |
267 | Govindarupini గోవిన్దరూపిణీ | Govinda is mainly of sattva guna. He is the one who protects this world. Eswara and Govinda are synonyms. Divine mother is the shakti behind Govinda in the form of 'Govinda rupini' జగద్రక్షణ సత్త్వగుణ ప్రధానము. పరమేశ్వరుని మూర్తులలో సత్త్వగుణ ప్రధానుడు గోవిందుడు. ఇటువంటి గోవిందుని రూపంలో ఈ జగత్తును రక్షిస్తున్నది. కాబట్టి గోవిందరూపిణి అనబడుతోంది. ఈశ్వరుడు, గోవిందుడు పర్యాయపదాలు. |
268 | Samharini సంహారిణీ | Destruction is the job of Rudra who is majorly of Tamo guna. Divine mother gives the power of destruction to Rudra. సంహారము తమోగుణ ప్రధానుడైన రుద్రుని పని.రుద్రునికి ఆ శక్తిని ఇచ్చేది అమ్మే. |
269 | Rudrarupa రుద్రరూపా | Rudam dravayateeti rudrah - Rud means Sorrow or reason for sorrow. Rudra is He who removes rud. Rudra amongst trimurthies is the one mainly with tamo guna. Divine mother dissolves the world in the form of 'Rudra'. రుదంద్రావయతీతి రుద్రః. రుద్ - అనగా దుఃఖము లేక దుఃఖకారణము. దుఃఖములను పోగొట్టువాడు రుద్రుడు. త్రిమూర్తులలో తమోగుణ ప్రధానుడు రుద్రుడు. అమ్మ రుద్రుని రూపంలో జగత్తును లయం చేస్తుంది. కాబట్టి రుద్రరూపా అనబడుతోంది. |
270 | Thirodhanakari తిరోదానకరీ | Tirodhana means total destruction at atom/sub atom level. At the end of a kalpa, the entire creation is dissolved into Divine mother. She embeds the karana bodies of all the beings inside her. So she is called Tirodhanakari. తిరోధానము అంటే సంపూర్ణనాశనము. అణువులను కూడా ప్రకృతిలో లయింపచేయుట, దీపనాశనముతో సమానంగా లయం చెయ్యటము. కల్పాంతమున చరాచరజగత్తు యొక్క సకల కారణ శరీరములను బీజరూపంలో తన యందు ఇముడ్చుకుని కనపడకుండా ఉండేటట్లు చేయునది కాబట్టి అమ్మ తిరోధానకరి అనబడుతోంది. |
271 | Eswari ఈశ్వరీ | The one in shuddha sattva is called Eswara. He is the master of 'Maya'. Divine mother is the shakti of Eswara. Hence she is called Eswari. Tirodhana is the job of eswara who is majorly of shuddha sattva guna. శుద్ధసత్వము గలవాడు ఈశ్వరుడు. మాయను వశము నందుంచుకున్న ఈశ్వరుని యొక్క శక్తి కాబట్టి ఈశ్వరీ అనుబడుతోంది. తిరోధానము శుద్ధసత్త్వగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. |
272 | Sadashiva సదాశివా | Sada shiva is of shuddha sattva guna. He is the 5th of the 5 bhrahmas. He always gives good and auspicious things. Divine mother is the shakti of sada shiva. సదాశివత్త్వము అనేది శుద్ధసత్త్వ స్వరూపము. పంచబ్రహ్మలలో ఐదవవాడు సదాశివుడు. ఎల్లప్పుడు శుభమును, మంగళములను చేకూర్చువాడు సదాశివుడు.సదాశివా అంటే బ్రహ్మతో ఐక్యము గల స్వరూపిణి. సదాశివుడితో భేదం లేదు కాబట్టి ఆ పరమేశ్వరి సదాశివా అనబడుతోంది. |
273 | Anugrahada అనుగ్రహదా | Anugraha means blessing. At the end of a kalpa, the entire creation is dissolved into Eswara who in turn gets merged into Sada shiva. When the creation begins again, Eswara kick starts the process with blessings from sada shiva. Anugrahada is the shakti of Sada Shiva. మహాకల్పాంతమున చరచరజగత్తు అంతా నిశ్శేషంగా నాశనమయిపోతుంది. అణువులు, పరమాణువులు కూడా నాశనమయిపోతాయి. ఏమీ ఉండదు. ఆ సమయంలో సృష్టి మొత్తాన్ని త్రిమూర్తులను తనలో లయం చేసుకున్న ఈశ్వరుడు సదాశివునిలో లీనమవుతాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు సదాశివుని అనుగ్రహంతో ఈశ్వరుడే ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. ఈరకంగా సదాశివుని రూపంలో పునఃసృష్టి ప్రారంభిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి అనుగ్రహదా అనబడుతోంది. |
274 | Panchakrutyaparayana పంచకృత్యపరాయణా | Panchakritya means - Srushti, Sthiti, Laya, Tirodhana, anugraha. Parayana means having inclination, passionate etc. Pancha brahma means - Charurmukha brahma, Vishnu, Rudra, Eswara and Sada Shiva. Divine mother is the inspiration, power and passion behind pancha brahmas for performing pancha krutyas. సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము అనేవి పంచకృత్యములు. సృష్టికర్తీ, గోప్త్రీ, సంహారిణీ, తిరోధానకరీ, అనుగ్రహదా అనే రూపాలతో ఆ పరమేశ్వరి ఈ పంచకృత్యాలను చేస్తుంటుంది. పరాయణము అంటే - అత్యంతాసక్తము, తత్పరము, అభీష్టము, ప్రియము, అని చెబుతోంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సద శివుడు - వీరు పంచబ్రహ్మలు. వీరిచే నిర్వహించబడే పంచకృత్యాలకు అమ్మే శక్తి, స్ఫూర్తి, చైతన్యం. |
275 | Bhanumandala madhyastha భానుమండల మధ్యస్థా | Bhanumandalam means Anaahata. That is the place of heart. There lies the Divine Mother. Hence she is called Bhanumandala madhyastha. భానుమండలము అంటే అనాహతము. అదే హృదయస్థానము. అక్కడ ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టే భానుమండల మధ్యస్థా అనబడింది. |
276 | Bhairavi భైరవి | Shakti of Bhairava is called bhairavi. There are 8 bhairavas: 1. Asitaanga bhairava, 2. Rurubhairava, 3. Chandabhairava, 4. Krodhabhairava, 5. Unmatta bhairava, 6. Kapaala bhairava, 7. Bheeshana bhairava, 8. Samharabhairava. భైరవుని యొక్క శక్తి భైరవి. భైరవులు ఎనిమిదిమంది. 1. అసితాంగ భైరవ 2. రురుభైరవ 3. చండభైరవ 4. క్రోధభైరవ 5. ఉన్మత్త భైరవ 6. కపాలభైరవ 7. భీషణ భైరవ 8. సంహారభైరవ. |
277 | Bhagamalini భాగమాలినీ | Anahata chakra is called Surya mandala. It has 12 corners. One for each Aditya. Mala means necklace. Divine mother is at the center of the chakra and the brightness of these Adityas are her necklace. అనాహత పద్మం సూర్యమండలం. ఇక్కడ పన్నెండుదళాలు గల పద్మమున్నది. ఈ పన్నెండు దళాలలోనూ ద్వాదశాదిత్యులు ఉంటారు. వీరికి 12 కళలు ఉంటాయి. ఈ కళలే మాలగా ధరించి అమ్మ తామర దుద్దులో ఉంటుంది. అందుకే భాగమాలిని అన్నారు. |
278 | Padmasana పద్మాసనా | Padmaasana is the best pose for meditation. The spine will be straight in this pose. It is the most favorable position for Yoga. Divine mother is meditating upon parabrahma in this pose. పద్మాసన అంటే పద్మాసనము అనే యోగాసనంలో కూర్చున్నది. ధ్యానంలో ఉన్నటువంటిది. ధ్యానం కొరకు పద్మాసనం చాల మంచి ఆసనం. ఈ ఆసనంలో వెన్నుపాము నిటారుగా ఉంటుంది. యోగ సిద్ధి త్వరగా కలుగుతుంది. |
279 | Bhagavathi భగవతీ | 1. Omnipotent, 2. Omnipresent, 3. Eternal 4. Having knowledge of everything by default, 5. Having no desire, 6. Free will to do anything. These are few attributes of God (Bhagavan). Divine mother is called Bhagavathi because she has all these qualities. 1.సర్వజ్ఞత 2.నిత్యతృప్తి 3.అనాదిబోధ 4.స్వతంత్రతాశక్తి 5.నిత్యాలుప్త శక్తి 6.అనంతతాశక్తి. ఇవి భగవంతుడి లక్షణాలు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మని భగవతి అన్నారు. |
280 | Padmanabha sahodari పద్మనాభ సహోదరీ | Sister of Lord Vishnu - One who has Lotus coming out of his navel. పద్మమును నాభి యందు కలవాడు - విష్ణువు. అతని సహోదరి. |
281 | Unmeshanimishotpannavipannabhuvanavali ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి | Unmesha means opening eyes. Nimisha means closing eyes. When Divine mother opens her eyes, it is evolution. When she closes her eyes it is involution. ఉన్మేషము అంటే - కనులు తెరవటము. నిమిషము అంటే - కనులు మూయటం. అదేక్రమంలో సృష్టి జరుగుతుంది. అనగా అమ్మ కనులు తెరిస్తే సృష్టి జరుగుతుంది. కనులు మూస్తే ప్రళయం సంభవిస్తుంది. |
282 - 284 | sahasrashirshavadana sahasrakshi sahasrapat సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ | The literal meaning of the word sahasra is 1000. However here it is used to indicate the unending nature of Divine mother. Sahasra here means countless. It means she is in the heads of all the 84 lakh species. She is the skill in all those hands. She is the shakti in all those legs. She is the vision in all those eyes. వేయితలలు కనులు చేతులు కాళ్ళు, కలిగిఉన్నది. ఇక్కడ వేయి అనేది అనేకానేకమైన, లెక్కలేనన్ని అనే అర్ధంలో వాడటం జరిగింది. అంతేకాని వేయిసంఖ్యావాచకం కాదు. వేలకొలది శిరస్సులు కలిగినటువంటిది. చరాచరజగత్తులో ఎన్ని జీవరాశులైతే ఉన్నాయో అన్ని శిరస్సులు కలిగినటువంటిది. ఈ జగత్తంతా తానే అయినది. పరమేశ్వరుడు ప్రతిజీవి యందు ఉన్నాడు అని చెప్పటం కోసం వాడిన పదమిది. |
285 | Aabrahmakeetajanani ఆబ్రహ్మకీటజననీ | Janani means mother. She is the mother of Brahma - The master of creation. She is also the mother of the smallest creature created by Brahma. She is the mother of all. జనని అంటే అమ్మ. సమస్తమును సృష్టిచేయు బ్రహ్మకైనా ఆయనకే సృష్టించబడిన అతిచిన్న ప్రాణికయినా అమ్మ ఆవిడే. మనమందరము ఆవిడ బిడ్డలము. |
286 | Varnashramavidhayini వర్ణాశ్రమవిధాయినీ | Mother established the four varnas and various ashramas to enable humans to perform their prescribed karma చాతుర్వర్ణాలు, ఆశ్రమాలు విభజించి జీవులు వారి వారి ధర్మాలను నిర్వర్తించేటట్లు చూస్తుంది లలితమ్మ |
287 | Nijajnarupanigama నిజాజ్ఞారూపనిగమా | Nigama means vedas. Agna means instruction/order. Vedas are nothing but the set of rules and instructions given by Divine mother for conducting the whole creation. Hence she is called Nijagnaroopanigama వేదాలు, వేదాంగాలు, స్మృతులు, అమ్మ యొక్క విధి వాక్యాలే. వేదాలలో కర్మాచరణ అంతా నిష్ఠలు నియమాలతో ఉంటుంది. ఇదంతా ఆవిడచేతనే విధింపబడింది. ఆమె ఆజ్ఞానుసారము వేదమార్గానుయాయులంతా ఆ నిబంధనలను అనుసరిస్తారు కాబట్టి అమ్మ నిజాజ్ఞారూపనిగమా అనబడుతోంది. |
288 | Punyapunyaphalapradha పుణ్యాపుణ్యఫలప్రదా | When karma is performed as per the methods prescribed in vedas, it accrues punya. otherwise it accrues sin. Divine mother is impartial. She gives punya or paapa based on the karma. వేదాలలో చెప్పినట్లుగా కర్మలను ఆచరించాలి. వేదవిహితమైన కర్మలనాచరిస్తే సత్ఫలితము వస్తుంది. విరుద్ధ కర్మలు ఆచరిస్తే దుష్ఫలితము వస్తుంది. జగన్మాతకు పక్షపాతం ఉండదు. ధర్మబద్ధమైన కర్మలు చేస్తే పుణ్యం ఇస్తుంది. ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే పాపమ్ ఇస్తుంది. |
289 | Shruthiseemanthasindhuri krithapadabjadhulika శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జాధూళికా | వేదాలు మహాకావ్యాలు, ఉపనిషత్తలు మొదలైనవన్నీ కలిసినా కూడా పరమాత్మను పూర్తిగా వర్ణించలేవు All the vedas, the maha kaavyas and upanishats combined together are still incapable of explaining the Paramatma completely |
290 | Sakalagamasandoha shukthisamputamaukthika సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా | Āgama-s are traditional doctrines or precepts that lay down guidelines for various rituals, mostly with temples. It is a huge subject and is the combination of vāstu śāstra, astrology, astronomy etc. All the aagamas combined were able to explain only a tiny aspect of Divine mother. It tantamount to her nose ring that is made of pearls. The names 289 and 290 explain us that it is not possible to know Divine mother completely by reading religious books or following various rituals. One has to meditate upon her with true devotion. She can be known only through introspection. వాస్తు, జ్యోతిష్యం, ఆలయ సిద్ధాంతం మొదలైన వాటిని ఆగమములు అంటారు. అవి అన్నీ కలిసి అమ్మను వర్ణిద్దాం అనుకున్నాయి. కానీ ఎంత కష్టబడినా వాటి ఫలితం అమ్మ ముక్కు పుడకతో సమానమైనది. ఈ నామములద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, వేదాధ్యయనం వలనో పూజాప్రవచనాల వలనో ఎవరూ అమ్మను చేరుకోలేరు. భక్తితో ధ్యానించువారికే ఆవిడ తెలియబడుతుంది. |
291 | Purasharthaprada పురుషార్థప్రదా | Purusharthaprada means one who gives the purusharthams. Purushartham means the purpose of the human life. If Purusharthas are not achieved, then the human birth is wasted. You have to take another birth again. పురుషార్ధప్రదా అంటే పురుషార్థములను ఇచ్చునది అని అర్థం. పురుషార్థములు అంటే ప్రతీ మనిషికి (జన్మ ఎత్తినందుకుగాను) సిద్ధిఞ్చవలసినవి. పురుషార్థ సిద్ధి జరగకపోతే మనిషి జన్మ వ్యర్థం. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. |
292 | Poorna పూర్ణా | The Brahman is full. It is complete. It is infinite. It cannot be divided. It does not change. It is eternal and omni present. పూర్ణమైనటువంటిది. పరిమాణము లేనటువంటిది. దేశకాలములచే విభజింపబడనటువంటిది. సృష్టికి ఆదిలోను అంతంలోనుకూడా ఉండేది. జనన మరణాలు లేనిది. వృద్ధిక్షయాలు లేనిది. సర్వాంతర్యామి. ఈ రకంగా సర్వమూ తానే అయినది. |
293 | Bhogini భోగినీ | Bhoga means a pleasant experience. Enjoyment. Divine mother manifests as boundless joy. Hence she is called Bhogini. There are eight types of Bhogas for humans. They are: 1. House, 2. Bed, 3. Clothes, 4. Ornaments, 5. Spouse, 6. Flowers, 7. Scents and 8. Food. These are called Ashtabhogas (Ashta = 8). Divine mother gives these bhogas based on our karma. భోగము అంటే సుఖము, ఆనందానుభవము. ఆనందమే స్వరూపంగా గలది కాబట్టి అమ్మ భోగినీ అనబడుతుంది. మనకు భోగాలు ఎనిమిది రకాలు. అవి 1. గృహము, 2. శయ్య, 3. వస్త్రము, 4. ఆభరణము, 5. మాంగల్యము, 6. పుష్పము, 7. గంధము, 8. తాంబూలము. వీటిని అష్టభోగాలంటారు. జీవులయొక్క కర్మనుబట్టి వారికి భోగ భాగ్యాలను ఇస్తుంది అమ్మ. |
294 | Bhuvaneshwari భువనేశ్వరీ | Divine mother is the ruler of the 14 lokas చతుర్దశ భువనాలకు అధిపతి అమ్మే |
295 | Ambika అంబికా | She who is the mother of the world అంబిక అంటే జగన్మాత అర్థం. |
296 | Anadhi nidhana అనాది నిధానా | She who neither has an end nor a beginning. Always the form of truth. Who has never been altered. ఆద్యంతము లేనిది. జనన మరణాలు లేనటువంటిది. నిత్యము, సత్యము అయినటువంటిది. ఏ రకమైన వికారాలు లేనటువంటిది. |
297 | Haribrahmendrasevitha హరిబ్రహ్మేంద్రసేవితా | Brahma, Vishnu, Shambhu, Rudra, Indra, Varuna, Yama, Vayu, Agni, Kubera, Twashtas, Ashwini devatas, Bhaga, Aditya, Vasu, Vishwadevatas, Marudganas - All these pray Divine Mother for help when they face challenges. బ్రహ్మ, విష్ణువు, శంభుడు, రుద్రుడు ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని కుబేర, త్వష్ట పురుషులు, అశ్వనీ దేవతలు, భగుడు, ఆదిత్యుడు, వసువులు, విశ్వదేవతలు, మరుద్గణాలు అందరూ సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మని ధ్యానిస్తున్నారు. |
298 | Narayani నారాయణీ | The creation is made out of Ātman (the Brahman). The five elements that emerged from it are known as nārāmu. Divine Mother is spread everywhere in panchabhootas. They are filled with her. Hence she is called Narayaani నరుడు అంటే పరమాత్మ. అటువంటి ఆత్మవలన జన్మించిన పంచభూతాలు నారములు అనబడతాయి. ఆ పంచభూతముల యందు వ్యాపించినది. పంచభూతాలే స్థానముగా గలది - నారాయణి అనబడుతుంది. |
299 | Nadarupa నాదరూపా | 'మ్' అనే శబ్దం నాదం. అది అమ్మ స్వరూపం. The sound 'm' is called Naada. That is form of Divine mother |
300 | Namarupavivarjitha నామరూపవివర్జితా | Divine mother is inside all living beings in this universe. However, it is not possible to assign a particular name or form to her. జగత్తులోని జీవరాశి యందు అంతటా తానే అయి ఉన్నది అమ్మ. కాని కంటికి కనిపించే రూపంలోను పేరుతోను మాత్రం కాదు. అందుచేతనే నామరూప వివర్జితా అనబడుతోంది. |
301 | Hrimkari హ్రీంకారీ | If Omkara - Parabrahma, then Hreemkara - An embodiment of Divine Mother (Parameshwari) ఓంకారము పరబ్రహ్మ స్వరూపము అయితే హ్రీమ్కారము పరమేశ్వరి స్వరూపము |
302 | Hrimathi హ్రీమతీ | Divine mother is modest for her capabilities and caliber. She does not like pomp and vanity అమ్మ ఎల్లపుడు లజ్జతో ఉంటుంది. అట్టహాసాలు నచ్చవు. |
303 | Hrudya హృద్యా | Lalitamba is an embodiment of mercy. She responds from the place where heart is if you yearn for her. She does not check the qualifications or status of the devotee. All she needs is devotion లలితాంబ దయాస్వరూపిణి. ఆర్తితో పిలిచిన వెంటనే హృదయ స్థానం నుంచి ఆవిడ స్పందిస్తుంది. అర్ధించువాడికి పుణ్య బలం ఎంతవుంది, కుల గోత్రాలు ఏమిటి మొదలైనవి ఆమె చూడదు. |
304 | Heyopadeya varjitha హేయోపాదేయవర్జితా | same as above పైన చెప్పిన విధంగానే |
305 | Rajarajarchitha రాజరాజార్చితా | The great qualities of her divotees are the real ornaments of Divine mother. She is prayed by many kings and emperors. Hence she is called Rajarajarchitha. తన బిడ్డల గొప్పతనమే అమ్మకు నిజమైన అలంకారములు. ఎందరో గొప్ప గొప్ప రారాజులు, చక్రవర్తులు లలితమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు. అందుకే రాజరాజార్చితా అని పిలవబడుతోంది. |
306 | Ragyni రాజ్ఞి | She who is the queen of Rajarajeshwara రాజరాజేశ్వరుని పట్టపురాణి కాబట్టి రాజ్ఞీ అనబడుతున్నది. |
307 | Ramya రమ్యా | Mother's smile is the most beautiful sight for any child. Similarly we will get mersmerized by the beauty of Divine mother's smile and the brightness of love beaming from ther eyes. That is why she is called 'Ramya' - The most beautiful. ఏ బిడ్డకైనా అమ్మ చిరునవ్వే అత్యంత సౌందర్యమైన దృశ్యం. అమ్మ పెదవులపై చిరునవ్వును చూస్తూ ఆమె కన్నులలోని ప్రేమకాంతులకు వశుడవని బిడ్డ ఉండదు. ఎందుకంటే అది అత్యంత రమ్యమైన దృశ్యం. |
308 | Rajivalochana రాజీవలోచనా | Divine mother's eyes are described as lotus flowers. There are two types of lotus flowers. 1) White lotus, 2) Red lotus. White lotus represents the Moon and red lotus represents the Sun. The light of sun and moon beam from divine mother's lotus eyes. రాజీవము అంటే పద్మము అని అర్ధం. పద్మము వంటి కనులు గలది. పద్మాలు లేక కమలములు రెండు రకాలు. 1. శ్వేత కమలము 2. రక్త కమలము అమ్మ యొక్క నేత్రాలు సూర్యచంద్రులు. కాబట్టి శ్వేత రక్త కాంతులు కలిగి ఉంటాయి. |
309 | Ranjani రంజనీ | Lord shiva is like a spatika (color less). And divine mother is like a red flower. When you put red flower near spatika linga, the originally colorless crystal linga will also glow in red color. స్ఫటికమువలే ప్రకాశించు పరమశివుని, దాసాని పువ్వులా ఉన్న అమ్మ రంజింపచేస్తుంది. అనగా స్వచ్ఛమైన స్ఫటికము ప్రక్కన ఎర్రని రంగు పెట్టినట్లైతే, ఆ స్ఫటికంకూడా ఎర్రగానే ప్రకాశిస్తుంది. |
310 | Ramani రమణీ | Divine mother stays in the hearts of her devotees. She makes them feel happy and joyous. భక్తజనుల హృదయములందు విహరించునది. భక్తులను రమింపచేయునది. ఆనందింపచేయునది. |
311 | Rasya రస్యా | Divine mother is in all beings in the form of the 'faculty of grasping' the gist of a substance ప్రతిజీవిలోని రసగ్రహణ శక్తి ఆ అమ్మ అంశయే. ఆవిడే మనలో ఉండి ఆ శక్తిని అందిస్తోంది. |
312 | Ranathkinkinimekhala రన్తకింకిణిమేఖలా | Divine mother wears the golden waist band with tinkling bells. మ్రోగుచున్న చిరుగంటలు గల మొలనూలు గలది. |
313 | Rama రామా | Rama means Lakshmi. Lakshmi is the shakti of Lord Vishnu. The master of the state of the universe. రమా అంటే లక్ష్మీ స్వరూపము గలది. లక్ష్మి విష్ణుమూర్తి యొక్క శక్తి. చరాచర జగత్తుకు స్థితి రూపమైనటువంటిది. |
314 | Raakenduvadana రాకేందువదనా | She who has a face like the full moon రాకేందువదనా - పూర్ణ చంద్రుని వంటి ముఖము గలది. |
315 | Rathirupa రతిరూపా | She who looks like Manmadha's (God of love) wife Rathi. మన్మథుని భార్య అయిన రతీదేవి వంటి రూపము గలది. పరమేశ్వరుడు కామేశ్వరుడనబడుచున్నాడు కాబట్టి అతని భార్య కామేశ్వరి - రతిరూప అనబడుతోంది. |
316 | Rathipriya రతిప్రియా | When Lord Shiva turns Manmatha into ashes, his wife Rathi prays Divine Mother. Pleased by her prayer Divine mother gives life to Manmatha again but will not resuciate his body. From then onwards, Manmatha wanders without a body but can be seen only by Rathi. రతీదేవియందు ప్రీతి గలిగినటువంటిది. గిరిజా కల్యాణం సందర్భంగా మన్మథుడిని భస్మం చేశాడు శంకరుడు. భండాసురవధ తరువాత ఆ మన్మథుణ్ణి పునర్జీవుడుగా చేసింది పరమేశ్వరి. కాబట్టి రతీదేవికి అమ్మ యందు మక్కువ ఎక్కువ. |
317 | Rakshakari రక్షాకరీ | Divine mother protects the whole creation. After giving birth to beings, she gives them health, energy and protection. రక్షణ అంటే జగద్రక్షణ. జీవులను సృష్టించిన తరువాత, వాటిని పోషించే బాధ్యతకూడా అమ్మదే. వారికి ఆరోగ్యము, జీవనోపాది, ఆపదల నుంచి రక్షణ అంతా ఆవిడే చేస్తుంది. అందుచేతనే ఆమె రక్షాకరీ అనబడుతుంది. ఇతర దేవతలు కొన్ని రకాల రక్షణలు మాత్రమే ఇస్తారు. కాని అమ్మ అన్ని రకాలుగా రక్షణ ఇచ్చి తన పిల్లలను కాపాడుతుంది. |
318 | Rakshasagni రాక్షసాఘ్నీ | She who kills Rakshasas-ogres opposed to the heaven. Here we should infer that the Arishadvargas that interfere in self-realization are also controlled by Divine Mother. రాక్షస సంహారము చేయునది. బయట రాక్షసులనే కాదు. ధర్మ మార్గంలో , మోక్ష మార్గంలో అడ్డుపడే అరిషడ్వర్గాలనబడే అంతశ్శత్రువులను కూడా నాశనం చేస్తుంది. |
319 | Rama రమా | Shiva is always still without any movements. Shakti will cause stimulus in otherwise still Shiva. Similarly, all those that have movement are described as feminine and all those that are still are described as Masculine. Eg: Window is masculine but door is feminine. Our hearts have become insensitive due to the influence of Bhandasura. Divine mother brings stimulus in it. Hence she is described as feminine (Rama) శివశక్తులలో శివుడు కదలకుండా స్థిరంగా స్థాణువుగా ఉంటాడు. శక్తి వలన శివునిలో స్పందన లేక కదలిక వస్తుంది. కదలిక ఉన్నవాటిని స్త్రీలింగముగాను కదలిక లేని వాటిని పుంలింగముగాను చెప్పడానికి ఇదే మూలము. భండాసురుని ప్రభావముచే అచేతనమైపోయిన మన హృదయములలో మళ్ళి చైతన్యం కలిగిస్తుంది కనుక స్త్రీలింగముతో వర్ణిస్తున్నారు. రామా అంటే స్త్రీ లేదా స్త్రీలింగం. |
320 | Ramanalampata రమణలంపటా | The stimulus she causes will be in the direction of yoga (union of jeevatma and paramaatma). The first step towards self realization is due to the stimulus caused by Divine mother. ఆవిడ కలిగించే స్పందన జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయ్యే దిశలో ఉంటుంది. ప్రతీ మనిషిలోనూ మోక్ష ప్రస్థానం ప్రారంభం అయ్యేది అమ్మ కరుణ వలెనే. |
321 | Kamya కామ్యా | Based on their karma, beings wish for various things and Divine Mother fulfills them. Hence she is called Kaamya. జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. అమ్మ ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. అందుకే కామ్యా అనబడుతుంది. |
322 | Kamakalarupa కామకలారూపా | Here, Śiva becomes the most desired of all, as He is the Supreme Reality or Paramārtha. Śiva being the Supreme Ruler, He is addressed as Kāmeśvara. Kalā refers to vimarśa form of Śiva, Mahātripurasundarī. కామేశ్వరుని కలా విభూతి శక్తి కనుక కామకల అనబడుతుంది. ఆవిడ ఇచ్ఛాశక్తి స్వరూపిణి అందుచేత కామకలా రూపా అనబడుతోంది. |
323 | Kadambhakusumapriya కదంబకుసుమప్రియా | Divine mother likes Kadamba flowers. కదంబ కుసుమము లందు ప్రీతిగలది. |
324 | Kalyani కల్యాణీ | Kalyana means good, auspicious. Yoga (union of jeevatma and paramatma) is the ultimate kalyana. Because that is the root cause of everlasting happiness. We have learnt in the name 'Ramanalampata' that Divine Mother stimulates us towards Yoga. Because she causes kalyana to all of us, she is called kalyani. కళ్యాణం అంటే శుభం,మంగళం అని అర్థం. యోగమే(ఆత్మాపరమాత్మల కలయిక) కళ్యాణం. ఎందుకంటే దాని వలెనే అంతులేని ఆనందం కలుగుతుంది. అమ్మ మనలో యోగము వైపు స్పందన కలిగిస్తుంది అని రమణలంపట అనే నామంలో మనం తెలుసుకున్నాం. మనందరికీ కళ్యాణం చేకూరుస్తుంది కనుక కళ్యాణి అనబడుతోంది. |
325 | Jagathikandha జగతీకందా | Divine mother is the root cause of kalyana for everyone in this world (Because she has both the intention and power of stimulation) ఈ జగత్తులో అందరికి మంగళం జరగడానికి మూలం అమ్మే (ఎందుకంటే స్పందన కలిగించే శక్తి సంకల్పం ఆవిడదే కదా) |
326 | Karunarasasagara కరుణారససాగరా | To embark on the journey of yoga is not everybody's cup of tea. It requires some level of karma. But Divine Mother does not shun her children if they lack it. She passionately tries to uphold them in the path of yoga. The moment one realizes ones mistakes and prays her, she neutralizes all the bad karma and shows the path to yoga. అమ్మది అపారమైన దయ. తన పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమను ఎవ్వరు లెక్క వేయలేరు. యోగప్రస్థానం జరగాలంటే ఎంతో గొప్ప కర్మఫలముండాలి. తగ్గ యోగ్యత ఉండాలి. కానీ మన అమ్మ కర్మ, యోగ్యత లేవు అని ఏ బిడ్డని వదిలేయదు. ప్రేమతో, కరుణతో వారిని ఉద్ధరిస్తూనే ఉంటుంది. చేసిన తప్పు తెలుసుకుని, అమ్మా నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అడిగిన వారికి వెంటనే చెడ్డ కర్మ తొలగించి యోగ మార్గం చూపిస్తుంది. |
327 | Kalavathi కళావతీ | Shodasakalas: 1. Prana, 2. Shraddha, 3.Akash, 4.Vayu, 5. Agni, 6. Jal, 7.Bhoomi, 8. Sense organs, 9. Mind, 10. Food, 11. Strength, 12. Tapas, 13. Vedas, 14. Karma, 15. Lokas, 16. Names of beings. Divine mother is the shape and form of all these kalas. Hence she is called Kalavathi. షోడశ కళలు: 1. ప్రాణము, 2 శ్రద్ధ, 3. ఆకాశము, 4. వాయువు, 5. అగ్ని, 6. జలము, 7. భూమి, 8. ఇంద్రియాలు, 9. మనస్సు, 10. అన్నం, 11. బలం, 12. తపస్సు, 13. వేదమంత్రాలు, 14. కర్మలు, 15. లోకాలు, 16. ప్రాణుల పేర్లు ఈ రకంగా అన్ని కళలకు రూపమయినది అమ్మే. అందుకే ఆమె కళావతి అనబడింది. |
328 | Kalalapa కాలాలాపా | Conversation is key to know about someone. We gain familiarity about someone's likes, dislikes, attitude, character by engaging them in a conversation. Similarly you can engage with Divine mother with Shodasha kalas listed in the name kalavathi. కళావతి నామంలో చెప్పిన కళలే సంభాషణగా కలది. ఎవరిగురించైనా తెలుసుకోవాలంటే మనం వారితో మాట్లాడాలి. ఆలా కొంతసేపు మాట్లాడాక పరిచయం పెరుగుతుంది. మరికొన్ని విషయాలపై సంభాషణ జరుగుతుంది. తద్వారా వారి భావాలు, అభిరుచులు తెలుస్తాయి. అప్పుడు వారి గుణం, స్వభావం తెలుస్తుంది. మరి అమ్మతో సంభాషించాలంటే ఎలా? దానికి సమాధానమే కళావతి నామంలో చెప్పిన కళలు. వాటి ద్వారా అమ్మ గురించి తెలుసుకోవచ్చు. |
329 | Kantha కాంతా | kah means Brahman. Antah means ultimate. This name says that Her beauty is vibrating and radiating. కః అంటే - బ్రహ్మ. అంతః - అన్నింటికన్నా గొప్పది. మిక్కిలి చక్కనైన రూపం గలది కాబట్టి కాంతా అనబడుతోంది. పరమ మనోహరమైన రూపం గలది. జగత్తులోని స్త్రీ జాతి రూపముగలది. కాబట్టి కాంతా అనబడుతుంది. ఆమె సౌందర్యం వెలుగులా ప్రకాశిస్తుంది. |
330 | Kadambaripriya కాదంబరీప్రియా | Kadambari represents the greatest happiness one can experience. The bliss of Atma has the supreme attractive power in the world. It is superior to the pleasure of liquor, meat, gambling, drugs and sex. A yogi who has tasted the bliss of Atman will reject all others as trivial. On top of it, it will not make the yogi lose his consciousness. It would improve his mental and physical health and makes him much more capable than he/she was. Divine mother likes such bliss of Atman. కాదంబరీ అంటే అన్నింటికన్నా గొప్పదైన సుఖానుభూతి. ఆత్మానందానికి అన్నింటికన్నా గొప్ప ఆకర్షణ శక్తి ఉంది. దాని ముందు మద్యం, మాంసం, జూదం, ఇతర శారీరిక సుఖములు, మాదక ద్రవ్యాలు నిలువలేవు. ఆత్మానందాన్ని చవిచూసిన యోగి మిగిలిన వాటిని తృణముల వలె తిరస్కరించగలడు. అది యోగి స్మ్రుతి కోల్పోయేలా చేయదు. అతని మనోబలం, ఆరోగ్యం పెంపొందించి ఏ కార్యాన్నైనా సాధించగల ధీరుడిగా తీర్చి దిద్దుతుంది. అటువంటి గొప్ప ఆత్మానందం అంటే అమ్మకు ఆసక్తి. |
331 | Varadha వరదా | She not only fulfills the wishes of all her children but also ensures that the final result is much more than what they sought for. Hence she is called Varadha. తన పిల్లల కోరికలు తీర్చడమే కాదు, కోరిన దానికన్నా ఎక్కువ ఫలితం వచ్చేలా చేస్తుంది కనుక వరదా అని అన్నారు. |
332 | Vamanayana వామనయనా | She who has beautiful and merciful eyes సుందరమైన కనులు గలది. చక్కని ప్రమాణములు గలది. కరుణాపూరితములు మనోహరములు అయిన నేత్రములు గలది. |
333 | Varunimadhavihvala వారుణీమదవిహ్వలా | By controlling the flow of air inwards and outwards in the body, the consciousness of a Yogi reaches Sahasrara. 'Amrut' drips down from this point. This is called Varuni mada. The technique to stimulate those nadis is called Varuni vidhya. In this state a yogi loses contact with external world and enters into trance. శరీరంలో క్రిందికి పైకి సర్వత్ర సంచరించు వాయుసంచారం గల నాడిని వారుణి అంటారు. దీన్ని యోగసాధనతో అదుపులో ఉంచినట్లైతే సహస్రారం నుంచి అమృతం కురుస్తుంది. అప్పుడు యోగి ఆత్మానందాన్ని పొందుతాడు. వారుణీ విద్యను బ్రహ్మవిద్య అంటారు. అమ్మ ఎప్పుడూ ఈ స్థితిలోనే ఉండి పరమానందాన్ని అనుభవిస్తుంటుంది కాబట్టి వారుణీ మదవిహ్వలా అనబడుతుంది. ఈ స్థితి బాహ్యస్మృతి ఉండదు. |
334 | Visvadhika విశ్వాధికా | She who is above all universes. అనంత విశ్వం కన్నా అధికురాలు. |
335 | Vedavedhya వేదవేద్యా | Vedas are the official scripts that explain Divine mother. వెదాలచే ఆద్యాంతం చెప్పబడింది. |
336 | Vindhyachalanivasini వింధ్యాచలనివాసినీ | The Sahasrara of a yogi is Vindhya mountain. Divine mother is called Vindhyachala nivasini because she stays there. సాధకుని సహస్రారమే వింధ్యపర్వతము. అక్కడ కొలువై ఉంటుంది కనుక వింధ్యాచల నివాసిని అన్నారు. |
337 | Vidhatri విధాత్రీ | She who carries the world జగత్తులను ధరించునది. జగములను పోషించునది. ధాత్రి అంటే ధరించునది |
338 | Vedajanani వేదజననీ | She who created the Vedas వేదములను పుట్టించినది. వేదాలను సృష్టించినది. వేదాలకు జన్మనిచ్చినది. వేదమాత. |
339 | Vishnumaya విష్ణుమాయా | Vishnu is one who is not restricted to a specific time or place. But due to Maya(illusion), we don't realize it. That is called Vishnu maya. In the influence of Vishnu maya, we think we are confined to a particular time, place and body దేశకాలమానములచే విభజించటానికి వీలుకాని వాడు విష్ణువు. అట్టి విష్ణువును కప్పి వేస్తుంది మాయ. అదే విష్ణుమాయ. దాని ప్రభావముచే మనం ఒక శరీరానికి ఓక ప్రదేశానికి ఒక కాలానికి పరిమితం అనే భ్రమ కలుగుతుంది. |
340 | Vilasini విలాసినీ | Vilaasa means enjoyment. Maya makes man inclined to carnal pleasures. But these are momentary. With yoga, one can pierce the Maya and enjoy the boundless and everlasting bliss of Vishnu. విలాసం అంటే భోగములు. మాయ మనిషిని ఐహికమైన భోగముల వైపుకి నెడుతుంది. కానీ అవి క్షణికాలు. యోగ మార్గముచే మాయను ఛేదించిన వారు సత్చిదానందమగు ఆత్మ భోగాన్ని(విష్ణువుని) అనుభవిస్తారు. |
341 | Kshetraswarupa క్షేత్రస్వరూపా | జ్ఞానబీజము అంకురించే ప్రదేశమే క్షేత్రము. అదే శరీరము. The place where the seeds of knowledge germinate (physical body) is called Kshetra. |
342 | Kshetresi క్షేత్రేశీ | The one who know about the kshetra. The who governs it. That is jeevaatma. క్షేత్రములను ఎరిగినది, పాలించునది. అదే జీవాత్మ. |
343 | Kshethrakshethragnapalini క్షేత్రక్షేత్రఙ్ఞపాలినీ | Divine mother is the lord of both Kshetra and Kshetragna. జగన్మాతయే క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని. దేహము, దేహి ఈ రెండింటినీ పాలించేది. |
344 | Kshayavridhivinirmuktha క్షయవృద్ధివినిర్ముక్తా | Change is a property of the body. Not the soul. The soul neither grows nor shrinks. It is Divine mother who causes these kinds of deformations. But she doesn't have those. ఆత్మకు వృద్ధిక్షయాలు లేవు. అవన్నీ శరీరానివే. భావవికారాలను కలిగించేది అమ్మే. కాని ఆ వికారాలు ఆమెకు లేవు. |
345 | Kshetrapalasamarchitha క్షేత్రపాలసమర్చితా | Kshetra means body. Ruler means - the soul which has made the body the base. Divine Mother is called Kshetrapala Samarchita because she is worshiped by those who have knowledge of the soul. క్షేత్రము అంటే శరీరము. పాలకుడు అంటే - శరీరాన్ని స్థావరంగా చేసుకొన్న జీవుడు. ఆత్మజ్ఞానం కలవారిచే అర్చించబడుతోంది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చితా అనబడుతుంది. |
346 | Vijaya విజయా | The good always triumphs Evil thoughts of the living beings. Hence Divine mother is called Vijaya. జీవులకు వచ్చే ఆలోచనలలో చెడు ఓడిపోయి మంచే విజయం సాధిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి విజయా అని పిలవబడుతోంది. |
347 | Vimala విమల | She who is clean of ignorance and illusion మల అంటే అజ్ఞానము. అజ్ఞానము లేనటువంటిది. జ్ఞానరూపిణి. |
348 | Vandhya వంద్యా | She who is being worshipped by every body అందరిచేత అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జనులందరితోనూ నమస్కరించబడేది |
349 | Vandarujanavatsala వందారుజనవత్సలా | She who has affection towards all those who worship her వందన మొనర్చు జనులందరియందు వాత్సల్యము గలది |
350 | Vagvadini వాగ్వాదినీ | She who manifests as the faculty of speech in human beings సమస్త జనులయందు వాగ్రూపంలో ఉండే దేవత కాబట్టి వాగ్వాదిని అనబడుచున్నది. |
351 | Vamakeshi వామకేశీ | She who has beautiful hair అందమైన కేశములు గలది. |
352 | Vahnimandalavasini వహ్నిమండలవాసినీ | She who lives in the universe of fire which is Mooladhara(Agni mandala). The six chakras are divided into 3 mandalas. They are: 1) Moolaadhaara + Swaadishtana - Agni mandala 2) Manipura + Anahata - Surya mandala 3) Vishuddi + Agna - Chandra mandala అగ్నిమండలమునందుండునది. షట్చక్రాలలో రెండు రెండు చక్రాలు ఒక మండలము అని చెప్పబడింది. 1. ఆధారస్వాధిష్ఠానాలు - అగ్నిమండలము 2. మణిపూర అనాహతాలు - సూర్యమండలము 3. విశుద్ధి ఆజ్ఞాచక్రాలు - చంద్రమండలము |
353 | Bhakthimatkalpalathika భక్తిమత్కల్పలతికా | She who is the wish giving creeper Kalpaga. She helps those whose devotion is mired with doubts by clearing all their doubts. Then they become ardent devotees and attain moksha. భక్త జనులకు కల్పలతవలె కోరికలు తీర్చునది. సగము భక్తిగలవారికి పూర్తి భక్తికలుగచేసేది. పరమభక్తులకు, జ్ఞానులకు మోక్షమునిచ్చేది. ఈ జన్మలో కొంతభక్తి ఉండి సరిగా అర్చన చేయలేకపోతే మరుజన్మలో పూర్ణభక్తి అలవడుతుంది. ఈ రకంగా అమ్మని అర్చించినవారికి ఇహపరసుఖాలు కలుగుతాయి. అందుచేతనే ఆమె భక్తిమత్కల్పలతికా అనబడుతుంది. |
354 | Pashupashavimochani పశుపాశవిమోచనీ | Divine mother removes all shackles of illusion. She protects from the sins committed by egoistic tendencies like 'I', 'Me' and 'Mine' పశువులకు ఆలోచన, ధర్మాధర్మవిచక్షణలను కలుగచేసి వారికి బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. నేను నాది అనే అహంకారమమకారముల నుండి రక్షణ కల్పిస్తుంది. |
355 | Samhruthaseshapashanda సంహృతాశేషపాషాండా | Pashandaa means those who does not follow the path prescribed in vedas. God's creation is based on a set of rules. Vedas and shastras are description of those rules. Those who go against them will perish. వేదములకు విరుద్ధముగా ప్రవర్తించేవారు పాషండులు. భగవంతుడు ఈ సృష్టి చేస్తున్నపుడు కొన్ని నియమాలు చేసాడు. వాటి వివరణే వేదాలు, శాస్త్రాలు. వాటికి విరుద్ధముగ ప్రవర్తించడం అంటే సృష్టి నియమాలకు విరుద్ధంగా ఉండడమే. అటువంటి వారు నశించి పోతారు. |
356 | Sadacharapravarthika సదాచారప్రవర్తికా | Those who follow vedas will progress. They will be protected. వేదములు చెప్పినట్లు నడుచుకొనుట సదాచారం. సదాచారపరులు వృద్ధి చెందుతారు. కాపాడబడతారు. |
357 | Thapatryagnisan thapthasamahladahnachandrika తాపత్రయాగ్నిసం తప్తసముదాహ్లాదనచంద్రిక | Taptraya represents our worries and concerns due to attachment to this body. Divine mother removes all the worries and makes the mind calm and pleasant (like moonlight). తాపత్రయము అనేటటువంటి సంసార లక్షణాలు గల అగ్నిచే దహించబడతున్న మానవులకు ఆహ్లాదము కలిగించునది. లేక తాపోపశమనము కలిగించునది. |
358 | Tharuni తరుణీ | She who is ever young. From God came time(kaalam). So He has no transformation as the time passes. He is beyond time. ఎల్లప్పుడూ యవ్వనము గలది. ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేది. భగవంతునిలోంచి కాలం వచ్చింది. కనుక కాలం వలన వారికి మార్పు ఉండదు. వారు కాలాతీతులు. |
359 | Tapasaradhya తాపసారాధ్యా | She who is being worshipped by sages. తపోవంతులైన మునీశ్వరులచే, ఋషీశ్వరులచే ఆరాధింపబడునది. సంసార బంధనాలలో చిక్కుకున్న వారిచే ఆరాధింపదగినది. |
360 | Tanumadhya తనుమధ్యా | She who has a narrow contracted waist (hip). This is the mark of a mother who is busy with a lot of children. Divine mother is the mother for all the living beings. So she is described as Tanumadhya. సన్ననినడుము గలది. కృశించిన నడుము గలది. గంపెడు పిల్లలతో సతమతమవుతున్న తల్లి లక్షణం ఇది. అమ్మ ఆబ్రహ్మకీటజనని. 84 లక్షల జీవరాసులు ఆవిడ పిల్లలే. అందుకనే తనుమధ్య అన్నారు. |
361 | Thamopaha తమోపహా | She who destroys ignorance and paves path to moksha అవిద్య, అజ్ఞానములను పోగొట్టేది. ఉపాసకుల యొక్క అజ్ఞానము పోగొట్టి బ్రహ్మజ్ఞాన్ని ఇచ్చేది |
362 | Chitih ఛితిః | Chitih is the antonym of ignorance. It is the one that liberates us from the shackles of ignorance. It is the one that stimulates the inactive mind. In this creation, there are 84 lakh species. Divine mother is present in all these beings in the form of Chit. అవిద్యకు శత్రువు చితి. చితి అంటే - జ్ఞానము స్వతంత్రమైనది. విశ్వసిద్ధికి కారణమైనది. ఈ జగత్తులో మొత్తం 84 లక్షల జీవరాసులున్నాయి. వీటన్నింటి యందు చిత్కళారూపంలో ఉండేది చితి. |
363 | Thatpadalakshyartha తత్పదలక్ష్యార్థా | 'Tat twam asi', 'Om tat sat'. 'Tat' indicates that there is no difference between Jeevaatma and Paramaatma. That they are same. 'తత్ త్వం ఆసి', 'ఓం తత్ సత్'. ఈ విధంగా తత్ శబ్దం జీవాత్మ పరమాత్మల ఏకీభావం తెలుపుతుంది. జీవాత్మ పరమాత్మ వేరుకాదు. రెండూ ఒక్కటే |
364 | Chidekarasaroopini చిదేకరసరూపిణీ | Chidekarasam means the joy of Atma. It is always fresh. One doesn't get bore of it. So will be mother's love. Isn't it! చిదేకరసం అంటే చిదానందము. ఇది ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తుంది. విసుగు పుట్టదు. మరి అదే కదా అమ్మ అంటే. అమ్మ ఆప్యాయత మనకు ఏనాడైనా విసుగు అనిపిస్తుందా! |
365 | Svathmananda lavi bhutha brahmadyananda santatih స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః | One cannot explain the bliss of Atman. It has to be experienced. యోగ మార్గములో పొందే ఆనందము అనిర్వచనీయమైనది. అది అనుభవైకవేద్యము. |
366 | Paraa పరా | The thoughts that arise at the Bindu is called 'Para'. బిందు స్థానంలో ఉద్భవించిన ఆలోచన తరంగాలు పరా వాక్కు. |
367 | Prathyakchitirupa ప్రత్యక్చితీరూపా | Thoughts help to develop wisdom in the mind. Wisdom gives the power of discretion. With discretion, we find truth. మాయలో ఉన్న వారిని బ్రహ్మం వైపు తిప్పే శక్తి ఆలోచనకే ఉంది. |
368 | Pashyanthi పశ్యంతీ | ఆధారచక్రంలో గాలిబుడగలా ఉండే వాక్కు పశ్యంతీ వాక్కు. ఇది అవ్యక్తమైనది The speech that is present in the Moolaadhaara in the form of a baloon is called Pashyanthi. It is unexpressed. |
369 | Paradevatha పరదేవతా | After coming out of Bindu, The speech reaches Pasyanti. The devata in pasyanti is called Para devata. She can't be perceived by senses. But can be known by the mind. ఆ బిందువు నుంచి బయటకు వచ్చిన వాక్కు పశ్యంతి చేరుతుంది. ఈ పశ్యంతీ స్థానంలో ఉండే దేవత పరా దేవత. ఈమెను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. మనసుతో తెలుసుకోవచ్చు. |
370 | Madhyama మాధ్యమా | The sound that is in the form of pasyanti in moolaadhaara will crawl up to Anahata. Here the sound develops consonant sounds. This is called madhyama. It is not just a sound like pasyanti but also not pure speech like vaikhari. It is in the middle . So it is called Madhyama. మూలాధారం దగ్గర పశ్యన్తిగా ఉన్న వాక్కు పైకి ఎగబాకి అనహత పద్మం చేరుతుంది. ఇక్కడ శబ్దానికి హల్లులు చేరి స్థూలమైన అష్పాష్టమైన వాక్కుగా మారుతుంది. ఇది పశ్యన్తి వలె కేవలం శబ్ద రూపం కాదు. అలాగని వైఖరి వలె పూర్తిగా స్పష్టమైన వాక్కు కాదు. వీటి మధ్యలో ఉంటుంది. కనుక మధ్యమ అన్నారు. |
371 | Vaikharirupa వైఖరీరూపా | The sound that originated in Bindu (as ParA) travels through mOlAdhAra (as pasyanti) and anAhata(as madhyama) and reaches vishuddhi( as vaikhari). Here passes through the teeth, tongue and lips and comes out as sound waves(speech). Till anAhata, the speech only has consonant sounds. But after reaching vishuddhi, it develops into complete speech by adding vowel sounds.పరాస్థానంలో బయలుదేరిన వాక్కు నాలుక, దంతాలు మొదలైన స్థానాలకు తాకి స్పష్టమైన రూపం పొందుతుంది. ఆ రకంగా ముఖము ద్వారా బయటకు వచ్చి శబ్దతరంగాల రూపంలో చెవులకు చేరుతుంది. అనాహతం వరకు కేవలము హల్లులరూపంతో అస్పష్టంగా ఉన్న వాక్కు అక్కడ నుంచి విశుద్ధిచక్రం చేరుతుంది. విశుద్ధి చక్రానికి పదహారుదళాలున్నాయి. ఈ పదహారు దళాలలోను అ నుండి అః వరకు అచ్చులు ఉంటాయి. |
372 | Bhakthamanasahamsikha భక్తమానసహంసికా | A devotee is he who lives in Gods company in all times. Divine mother lives in hearts of those people. భక్తులు అంటే ఎల్లవేళలయందు హృదయమున ఎడతెగని తైలధారవలె భగవంతుని స్మరించేవారు. ధ్యానించేవారు. అమ్మ అటువంటి వారి హృదయములందు విహరిస్తుంది. అందుకే భక్తమానన హంసికా అనబడుతోంది. |
373 | Kameshwaraprananadi కామేశ్వరప్రాణనాడీ | She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. పరమాత్మ యొక్క మహాకామేశ్వరుని రూపానికి ప్రాణ అమ్మ. |
374 | Krutagjna కృతజ్ఞ | She who watches all actions of every one or She who knows all. అమ్మకు సమస్త జీవుల కర్మలు యెరుకే. ఆమె దృష్టి ఎవరూ తప్పించుకోలేరు. |
375 | Kamapujitha కామపూజితా | She who is being worshipped by the god of love in the kama giri peeta of Mooladhara chakra-Manmatha కామ దేవుడైనమన్మధునిచే మూలాధార చక్రంలోని కామ పీఠంలో పూజించబడేది. |
376 | Srungararasasampurna శృంగారరససంపూర్ణా | This name is about Poorna giri peetha. 'Srunga' means two. 'Ara' means six. 'Srungara' means 6X2 = 12. AnAhata padma is the one with 12 petals. Divine mother hovers around anAhata padma. This is also called Poorna giri peetha. There are four peethas. They are: 1) Kaama giri peetha, 2)Poorna giri peetha, 3)Jaalandhara peetha, 4)Odyana peetha. శృంగారము అను రసముచే పూర్తిగా నిండినది. ఈ నామము పూర్ణగిరి పీఠాన్ని తెలియచేస్తోంది. శృంగ అంటే రెండు, అర అనగా ఆరు. ఈ రకంగా చెబితే ఆరు రెళ్ళు పన్నెండుదళాలు గల పద్మము అనాహతము కాబట్టి శృంగారరసము అంటే అనాహత పద్మము. అక్కడ సం - తరచుగా, పూర్ణ - ఉండునది. మొత్తం పీఠాలు నాలుగు. 1. కామగిరి. 2. పూర్ణగిరి 3. జాలంధర 4. ఓడ్యాణ పీఠాలు. |
377 | Jaya జయా | She who is always victorious. She who conqured death. సర్వత్రజయమే కలది. అపజయము ఎరుగనిది. మృత్యువును కూడా జయించినది. మృత్యుదేవత కూడా ఆమెకులోబడే ఉంటుంది. అందుచేతనే ఆవిడ యా అనబడుతోంది. |
378 | Jalandharasthitha జాలంధరస్థితా | She who is on JAlandhara peetha in the name of 'Jaya'. JAlandhara peetha is Agnya chakra. జయ అనే పేరుతో జాలంధరపీఠము అని చెప్పబడే ఆజ్ఞా చక్రమందున్నది. |
379 | Odyanapeethanilaya ఓడ్యాణపీఠనిలయా | She who is on Odyana peetha. This is called brahma randhra. ఓడ్యాణము అనే పీఠమే నివాసస్థానముగా గలది కాబట్టి ఓడ్యాణ పీఠనిలయా అనబడుతుంది. ఇది బ్రహ్మరంధ్రం |
380 | Bindumandalavaasini బిందుమండలవాసినీ | She who lives in the dot in the center of Srichakra. Bindu is the cause for all the corners, petals, chakras and matrukas. Because divine mother stays at Bindu, she is called Bindu mandala vaasini. బిందువు అమ్మ స్వరూపం. శ్రీచక్రంలోని అన్ని కోణాలకు, అన్నిదళాలకు, అన్నిచక్రాలకు, వాగ్స్వరూపాలకు, మాతృకలకు కారణము ఆబిందువే. ఆ బిందువునందు నివసిస్తుంది కాబట్టే ఆవిడ బిందుమండలవాసిని అనబడుతోంది. |
381 | Rahoyagakramaradhya రహోయాగక్రమారాధ్యా | Raho yaga means inner yaga. Here the God and the devotee are the same. One who mediates with this feeling will awaken kundalini. Then it reaches the sahasrara at the top and showers ambrosia (amrut). రహోయాగము అంటే అంతర్యాగము. అంటే అద్వైతభావనతో పూజ. ఇందులో భగవంతుడు భక్తుడు ఇద్దరూ ఒకటే. తేడాలేదు. సాధకుడే సాక్షాత్తూ పరబ్రహ్మ. 'అయమాత్మాబ్రహ్మ' అనే మహావాక్యము ఇక్కడ అన్వయించబడుతుంది. పరమేశ్వరుణ్ణి తన శరీరంలోనే ఊహించి, తానే పరమేశ్వర స్వరూపము అని నమ్మి భావనోపనిషత్తులో చెప్పిన ప్రకారం అర్చన చెయ్యటం. ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని అంతర్యాగం చేసి నిద్రలేపినట్లైతే అది షట్చక్రాలను దాటి సహస్రారం చేరి సుధాదారలు కురిపిస్తుంది. |
382 | Rahastarpanatarpitha రహస్తర్పణతర్పితా | Shunning punya, papa, all the karma and burning them in the fire of knowledge is called Rahas tarpana. In raho yaga, there is no physical fire in the homa. Knowledge is the fire here and it is always lit. One has to sacrifice everything into it. పుణ్యపాపాలను, ధర్మాలను ప్రకాశ విమర్శలనే చేతులతో, ఉన్మని అనే సృక్కుతో జ్ఞానమనే అగ్నిలో హోమం చెయ్యాలి. ఇక్కడ హోమగుండంలోని అగ్నికి కట్టెలు అవసరం లేదు. అది జ్ఞానాగ్ని సర్వదా మండుతూనే ఉంటుంది. అటువంటి అగ్నిలో శివది క్షితి పర్యంతము సర్వస్వాన్నిహోమం చెయ్యాలి. ఇలా చెయ్యటాన్నే రహస్తర్పణము అంటారు. |
383 | Sadyaprasadini సాధ్యప్రసాదినీ | To those who perform raho yaga with rahas tarpana, moksha comes immediately. Divine mother takes the responsibility of removing any obstacles the come in way of moksha. రహోయాగము, రహస్తర్పణములవల్ల ఆ పరమేశ్వరి అప్పుడే అనుగ్రహిస్తుంది. పైన చెప్పిన విధంగా అంతర్యాగం గనక చేసినట్లైతే జీవాత్మ పరమాత్మతో ఐక్యమవుతుంది. అదే అనిర్వచనీయమైన ఆనందము. |
384 | Vishvasakshini విశ్వసాక్షిణీ | She who is the witness for the universe. She notices everything that happens in this universe with help of Sun, Moon, Yama and the five elements. ఈ జగత్తునంతటినీ తానే సృష్టించింది. ఇక్కడ జరిగే ప్రతిపనికీ ఆమె సాక్షి. అయినప్పటికీ వేటికీ ఆమె కారణం కాదు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని ఆమె సూర్యుడు, చంద్రుడు, కాలము, యముడు, పంచభూతాలసాయంతో చూస్తూనే ఉంటుంది. |
385 | Sakshivarjitha సాక్షివర్జితా | When a Yogi performs antaryaga, the kundalini rises up. When it reaches sahasrara, it is called Yoga(the union of jeeva and paramatma). This happens in the state of turiya(trance). It is beyond jagrut, swapna and sushupti. Hence there is no witness for it. సాధకుడు అంతర్యాగం చేశాడు. కుండలినీశక్తిని పైకి పంపి జీవాత్మ పరమాత్మల అనుసంధానం చేశాడు. ఇదే అంతర్యాగానికి ఫలము అని కూడా అన్నాం. మరి దీనికి సాక్ష్యమనేది ఉండదు. అంటే తురీయ స్థితికి సాక్ష్యములేదు. అందుచేతనే జగన్మాత సాక్షివర్జితా అనబడుతోంది. |
386 | Shadangadevathayuktha షడంగదేవతాయుక్తా | Shadanga means 6 parts. They are - heart, head, crest of head, armour, eyes and arrows. Divine mother is the master of the gods who govern these. షడంగములు అంటే ఆరు అంగాలు అవి 1. హృదయము 2. శిరస్సు 3. శిఖ 4. నేత్రము 5. కవచము 6. అస్త్రములు వీటిని దేవతలతో లేదా తన శక్తులతో ఆవరించినది. |
387 | Shadgunyaparipuritha షాడ్గుణ్యపరిపూరితా | wealth, valor, fame, satisfaction, wisdom and renunciation. Divine mother possess all these. 1. ఐశ్వర్యము 2. వీర్యము 3. యశము 4. శ్రీ 5. జ్ఞానము 6. వైరాగ్యము అనేటటువంటి పురాణాలలో చెప్పబడిన గుణములతో పరిపూర్ణమైనటువంటిది. |
388 | Nithyaklinna నిత్యక్లిన్నా | She in whose heart there is always mercy. All living beings are her childeren. So she is very generous and compassionate towards us. అమ్మ అత్యంత దయార్థమైన హృదయము గలది. ఈ సృష్టి అంతా ఆమె యొక్క సంతానమే. ఈ విశ్వము అంతటి పైనా దయగలది. |
389 | Nirupama నిరుపమా | She who does not have anything to be compared to సాటి లేనిది. ఉపమానము వేయడానికి వీలు కానిది. |
390 | Nirvanasukhadayini నిర్వాణసుఖదాయనీ | She who gives redemption/moksha. నిత్యక్లిన్న, నిరుపమ అయిన అమ్మను గనక అర్చించినట్లైతే వచ్చే ఫలము నిర్వాణ సుఖము. ఆవిడని అర్చిస్తే ఇహపరాలు రెండూ లభిస్తాయి. |
391 | Nithyashodasikaroopa నిత్యషోడశికారూపా | There are 16 nityas. The are: 1. Kameswari 2.Bhagamaalini, 3. Nityaklinna 4.Bherunda 5. Vavhni vaasini 6. Maha vajreswari 7.sivadhooti 8.Twarita 9.kulasundari 10.Nitya 11.Neelapataaka 12.Vijaya 13. Sarvamangala 14. Jwalaamaalini 15. Chitra 16.Maha Nitya. Of these the first 15 came from divine mother. The last one i,e, Maha nitya or Nitya kala is Divine mother herself. నిత్యలు పదహారు. వీటినే షోడశనిత్యలు అంటారు. 1. కామేశ్వరి, 2. భగమాలిని, 3. నిత్యక్లిన్న 4. భేరుండ 5. వహ్నివాసిని 6. మహావజేజ్రేశ్వరి 7. శివదూతి 8. త్వరిత 9. కులసుందరి 10. నిత్యా 11. నీలపతాక 12. విజయ 13. సర్వమంగళ 14. జ్వాలామాలిని 15. చిత్ర 16. మహానిత్య ఇందులో మొదటి 15 కళలు అమ్మనుంచే వచ్చాయి. 16 వ కళ నిత్యకళ లేదా మహాకళ. ఇది సాక్షాత్తు అమ్మ స్వరూపం. |
392 | Srikantarthashareerini శ్రీకంఠార్ధశరీరిణీ | Every atom in this creation has shiva and shakti in it. The whole creation is an accumulation of these atoms. So Shiva and Shakti are filled in every part of this creation. This is the tattva behind arthanareeswara. సృష్టిలోని ప్రతీ అణువులోనూ శివ భాగము శక్తి భాగము ఉంటాయి. ఈ అణువులతోనే సృష్టి చేయబడుతుంది. ఇదే అర్ధనారీశ్వర తత్వం. |
393 | Prabhavathi ప్రభావతీ | Divine mother is in the form of light. Crores of light rays emit from her body. Those rays are omni present. Boundless. Fire took 108 rays from Her. Sun took 116 and Moon 136. The total of these is 360. Day and night occur due to these. The wheel of time moves due to these. జ్యోతిరూపమైనటువంటి అమ్మ దేహము నుంచి కోట్లకొలది కిరణాలు ప్రకాశిస్తాయి. ఆ కిరణాలకు లెక్కలేదు. అవి అనంతమైనవి. వాటినుంచి 108 కిరణములను అగ్ని, 116 కిరణములు సూర్యుడు, 136 కిరణములు చంద్రుడు గ్రహించారు. ఇవి మొత్తం 360 కిరణాలు. వీటివల్లనే పగలు రాత్రి కలుగుతున్నాయి. కాలచక్రం తిరుగుతోంది. |
394 | Prabharoopa ప్రభారూపా | Divine mothers form is equal to the light of crores of Suns. That light is as pleasant as the cooling effect of one crore Moons. It is like crores of lightenings coming at the same time. She has reddish orange rays. అమ్మ రూపము కోట్లకొలది సూర్యుల కాంతులతో, విరాజిల్లుతూ కోట్లకొలది చంద్రుల చల్లదనము గలిగి ఉన్నది. ఆ రూపము కొన్ని కోట్ల మెరుపులు ఒక్కసారి మెరిసినట్లుగా తళుక్కున మెరుస్తుంది. అరుణారుణకాంతులు వెదజల్లుతున్ది. |
395 | Prasiddha ప్రసిద్ధ | Every body in this world knows 'Aham'. Aham means I, me, mine etc. It does not matter if one is educated or uneducated. Wise or foolish. 'Aham' is known to everybody. But 'Aham' is also a form of Divine mother. So she is very famous. ప్రపంచంలో ఉన్నవారంతా, తమకు తెలిసినా తెలియకపోయినా నేను, నాది అని చెప్పుకునే అహం వాచకముగా ప్రసిద్ధమైనది. |
396 | Parameshwari పరమేశ్వరీ | The ultimate goddess Eswari. Very famous. All beings in this world get a body based on their karma. After entering a body, the jeeva will start performing karma again. So karma accrues. The body has certain life time. Post that it dies. Then the jeeva enters another body. Like this the cycle of birth and death continues until the karma is neutralised by renouncing desire. Of all the 84 lakh species, only humans have the discretion of desire and renunciation. That explains how valuable human life is. But Divine mother is beyond karma. She is 'Para'. పరాత్పరురాలైన ఈశ్వరి. ప్రసిద్ధమైన దేవత. ఈ జగత్తులో జీవులకు వారి వారి కర్మల ననుసరించియే దేహము, ఇంద్రియాలు వస్తాయి. కర్మ ఎప్పుడైతే నశిస్తుందో దేహము కూడా అప్పుడే నశిస్తుంది. మళ్ళీ సంచితకర్మ అనుభవించటానికి జీవి ఈ లోకంలో పుడుతుంది. ఈ రకంగా జీవి ఈ లోకంలో జన్మిస్తూ, కర్మచేస్తూ, కర్మఫలాన్ని అనుభవించి మరణిస్తూ, మళ్ళీపుడుతూ ఉంటుంది. కర్మ క్షయమయ్యే దాకా ఈ విధంగానే జరుగుతుంది. ఈ రకమైన కర్మసంబంధములేనిది పరమేశ్వరి. |
397 | Moolaprakrithi మూలప్రకృతి | అన్నింటికీ మూలమైనటువంటిది She who is the root of everything |
398 | Avyaktha అవ్యక్తా | Avyakta means one that does not have a physical form. One that does not diffferentiate between mascuine and feminine. One that has neither beginning nor end. One that is capable of anything. One that is omni present. One that is the only ONE. అవ్యక్తము అంటే సూక్ష్మము. లింగభేదము లేనిది. చేతనము కానిది. ఆద్యంతరహితమైనది. సృష్టియందు సమర్ధమైనది, అవయవములులేనిది, ఏకమైనది, విశ్వవ్యాప్తమైనది అని చెప్పబడినది. |
399 | VykthaAvyakthaswaroopini వ్యక్తావక్తస్వరూపిణీ | Vyakta means Mahat. It came from Avyakta and is spread everywhere. Avyakta is the first in creation. From avyakta came vyakta and from vyakta came Ahankara. Vyakta is in the form of actions and Avyakta is in the form the Cause. Divine mother is both vyakta as well as avyakta. వ్యక్తము అంటే మహతత్త్వము. ఇది అవ్యక్తము నుంచి వచ్చినది. అంతటా వ్యాపించినది. సృష్టిలో మొదటగా అవ్యక్తము నుంచి మహతత్త్వము, మహతత్త్వమునుంచి అహంకారము పుట్టినాయి. వ్యక్తము కార్యరూపంలోను, అవ్యక్తము కారణరూపంలోను ఉంటాయి. ఈ రకంగా వ్యక్తము అవ్యక్తము కూడా అమ్మయే కాబట్టి వ్యక్తావ్యక్తస్వరూపిణి అనబడుతుంది. |
400 | Vyapini వ్యాపినీ | She who is spread everywhere. She who is filled in all the three gunas. సమస్త జగములందు వ్యాపించినది. సమస్త గుణములందు (సాత్విక, రాజసిక, తామసిక) నిండినది. |
401 | Vividhakara వివిధాకారా | Creation is done in various forms. They are: 1.Mahat 2.Ahankara 3.Bhoota 4.Indriya 5.Deva 6.Manah 7.Vanaspati 8.Tiryak 9.Manava 10.Kumaara. Divine mother is present in all these various forms. సృష్టి పదిరకాలుగా జరుగుతోంది. అవి 1. మహత్సృష్టి 2. అహంకార సృష్టి 3. భూతసృష్టి 4. ఇంద్రియ సృష్టి 5. అష్టవిధ దేవసృష్టి 6. షడ్విధ మస్సృష్టి 7. వనస్పతి సృష్టి ఇది ఆరురకాలు 8. తిర్యక్ సృష్టి ఇది 28 రకాలు 9. మానవసృష్టి 10. కుమారసృష్టి. వివిధకారలైన అన్ని సృష్టులయందు అమ్మే ఉంటుంది. కాబట్టే వివిధాకారా అనబడుతుంది. |
402 | Vidhyaavidhyaswaroopini విద్యావిద్యాస్వరూపిణీ | Vidya means knowledge of Atman. Those who shun karma completely and purse vidya fell into oblivion. Avidya means performing karma without any knowledge of Atman. Those with avidya also fell into oblivion. అవిద్య అంటే ఆత్మ జ్ఞానం లేకుండా కేవలం కర్మలను (పూజలు, వ్రతాలు మొ... ) చేయడం. అవిద్యతో ఆరాధించేవారు గాడాంధకారంలో పడిపోతారు. విద్య అంటే కేవలం ఆత్మ జ్ఞానం. కర్మలను పూర్తిగా వదిలి పెట్టి కేవలం విద్య ఉపాసనలో పడ్డవారు ఇంకా గాఢమైన అంధకారంలో పడిపోతారు. |
403 | Mahakameshanayana kumudahladhakaumudhi మహాకామేశనయనా కుముదాహ్లాదకౌముదీ | One cannot see divine mother's brilliance with naked eye. It is possible only for Maha Kamesha. Like moonlight for lotus is divine mothers brillinance to Maha kamesha. జ్ఞానజ్యోతులతో ప్రకాశించే అమ్మ ముఖం చూడాలంటే కామేశ్వరసమానులే కావాలి. అంతేకాని అన్యులకు సాధ్యం కాదు. ఆవిడ స్వరూపాన్ని చూడటంచేత కామేశునికి ఆహ్లాదం కలుగుతుంది. కలువలకు వెన్నెల ఆహ్లాదకరం. అలాగే మహా కామేశుని నయనాలకు అమ్మ స్వరూపం ఆహ్లాదకరం. |
404 | Bhakthahardhathamobedha bhanumatbhanusanthathi భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః | Lack of knowledge, ignorance, bonds etc are the impurities sticking to our mind. Divine mother is the embodiment of knowledge that removes this ignorance. Just like how the sun's light removes darkness from the whole world. అజ్ఞానము, భ్రమ, బంధములు ఇవన్నీ మనసుకు పట్టిన మలినాలు. పిల్లల హృదయాలలో తమోగుణాన్ని పోగొట్టి సూర్యప్రభలవలె జ్ఞానజ్యోతులు వెలిగించేది ఆ జగన్మాత. తన పిల్లల యొక్క అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతులనందిస్తుంది. |
405 | Shivadhoothi శివదూతీ | In the Markhandeya purana, Divine mother sends Shiva as a messenger. Hence she is called Shivadhooti. To reach Nirvana, one has to shun ego completely. Sending shiva as a messenger is to indicate this. Shiva is inert and stoic. He is a viragi. She sends Shiva as a messenger to a yogi who is in prusuit of Nirvana. మార్కండేయపురాణంలో అమ్మ శివుణ్ణి దూతగా పంపినది అని చెప్పబడింది. అందుకే శివదూతీ అని ప్రసిద్ధి చెందినది. సాధకులు కైవల్యం చేరాలంటే శివునిలాగా విరాగులు కావాలి. అహంకారాన్ని త్యజించాలి. జీవాత్మ పరమాత్మను చేరటానికి వైరాగ్యం కావాలి అని చెప్పటానికే అమ్మ శివుడిని దూతగా పంపింది. |
406 | Shivaradhya శివారాధ్యా | She who is worshipped by Lord Shiva శివునిచే ఆరాధించబడినది |
407 | Shivamoorthi శివమూర్తిహ్ | She who is of the form of Lord Shiva. Shiva is not separate from Shakti. Without Shiva there is not Shakti without Shakti we will never know about Shiva. శివుడే స్వరూపముగా గలది. శివశక్తులకు భేదము లేదు. శివుడు లేక శక్తిలేదు. శక్తి లేక శివుడు లేడు |
408 | Shivankari శివశంకరీ | She who transforms a seeker into yogi. Divine mother sends Shiva as a messenger to the yogi. Then he shuns ego completely and prays Divine mother. Then he merges with her and becomes Paramatma. సాధకుడిని శివునిగా చేయునది. యోగ సాధనలో ఉన్న భక్తుడి వద్దకు అమ్మ శివుడిని దూతగా పంపుతుంది. అప్పుడు బంధనాలన్నీ తొలగిపోయి సాధకుడు శివుడు అవుతాడు. అమ్మను ప్రార్ధించి పరమాత్మతో మమేకం అవుతాడు. |
409 | Shivapriya శివప్రియా | She who is dear to Lord Shiva (Paramaatma). After union with Paramaatma, the yogi is in eternal bond(love) with Divine mother. he is no more a normal human being. పరమాత్మతో మమేకం అయిన పిదప యోగికి శక్తితో అనుబంధం ఏర్పడుతుంది. భగవంతుడవుతాడు. |
410 | Shivapara శివాపరా | Though Shiva and Shakti are not separate, Shakit comesfirst in the order. Because the path to reach is shown by Shakti. శివశక్తుల రెండు ఒకటే అయినా ఆరాధన క్రమంలో మొదట శక్తి వస్తుంది. ఎందుకంటే శివున్ని చేరాలంటే శక్తి దారి చూపాలి కదా. |
411 | Shishteshta శిష్టేష్టా | 'Achara' means life style. Divine mother who likes people with good lifestyle. శిష్టులంటే ఇష్టపడేది. తేలికగా చెప్పాలంటే శిష్టులు అనగా సదాచార సంపన్నులు వారియందు, వారి ఆచారములందు ప్రీతిగలది. |
412 | Shishtapoojitha శిష్టపూజితా | Divine mother is sought by those who don't crave for sensory pleasures, those who study vedas and those who follow vedic preachings అవయవ చాపల్యము లేనివారు, వేదాధ్యయనం చేసేవారు, వేదాలనే ప్రమాణంగా తీసుకునే వారు శిష్టులు అనబడతారు' అని చెప్పబడింది. అటువంటి శిష్టులచే పూజింపబడేది. |
413 | Aprameya అప్రమేయ | She who cannot be measured. She who is not possible to be measured. Who does not have boundaries. కొలవటానికి వీలుకానిది. అంతేకాని ఇతరులచేత కొలచుటకు వీలుకానిది. ప్రమేయము అంటే పరిమాణము అని అర్ధం. అప్రమేయము. పరిమాణము లేనిది. |
414 | Swaprakasha స్వప్రకాశ | She who is self-luminous స్వయముగా ప్రకాశించేది. |
415 | Manovachamagochara మనోవాచామగోచారా | She who is beyond the mind and the speech. మనస్సుకు వాక్కుకు గోచరము కానిది. వాక్కుచే వర్ణించబడదు. మనస్సుకు అందదు. |
416 | Chitsakthi చిచ్ఛక్తి | Chit is the part of brain that causes chaitanya. Every being in this world has self-stimulus. Chit is the energy behind this stimulus. చిత్ అనే పదార్థాన్నే చైతన్యము అంటారు. జగత్తులోని ప్రతి వస్తువునందు స్పందన/చలనము తెచ్చే శక్తే పరమాత్మ శక్తి, అదే చైతన్యము. చిఛక్తి అనబడుతుంది. |
417 | Chethanaroopa చేతనారూపా | Causing stimulus is the dharma of chit. Both Chit and the stimulus caused by chit are forms of divine mother. In a simple example, both the electricity and the fan working on the that electricity are forms of Divine Mother. Not only that, the stimulus i,e the rotation of the fan which is caused by electricity is also Divine Mother. చిఛక్తి యొక్క ధర్మమే చైతన్యము. చైతన్యాన్ని కలిగించే చిత్ శక్తి అమ్మే చిత్ శక్తి వల్ల కలిగే చైతన్యము అమ్మే. ఒక మామూలు ఉదాహరణతో చెప్పాలి అంటే ఫ్యాన్ ను తిప్పే విద్యుత్ అమ్మే, విద్యుత్ వల్ల తిరిగే ఫ్యాను అమ్మే. అంతే కాదు. విద్యుత్ వల్ల చలనం కలిగి ఫ్యాన్ తిరుగుతుంది. ఆ చలనం కూడా అమ్మే. అంతా అమ్మే. |
418 | Jadashakthi జడశక్తి | Jada means Inert. One that lacks any stimuli. Jada shakti is cause of creation of all things. The whole nature is termed as 'Jada'. Actually, both chaitanya and jada are forms of Divine Mother. She is every thing. జడశక్తి అంటే జడమును సృష్టించే శక్తి. వస్తుకారణమైనది. జడములో చేతనముండదు. ప్రకృతి అంతా జడపదార్ధము. నిజానికి అన్ని శక్తులూఅమ్మవే. చేతనము అమ్మే. జడమూ అమ్మే. అంతా అమ్మే. |
419 | Jadathmikha జడాత్మికా | The creation is a function of Chit shakti and jada shakti. Jada shakti creates 'jada' and 'chit shakti creates chaitanya'. 'Sat', 'chit', 'ananda' are termed as chaitanya. All other things perceivable by senses are termed as 'Jada' ప్రపంచమనేది చేతనము, జడము అని రెండు భాగాలు. చేతనమే చిఛక్తి కాగా జడమే జడశక్తి. ఈ రెండింటి కలయికవల్లనే సృష్టి ఏర్పడుతున్నది. సత్తు చిత్తు ఆనందము బ్రహ్మపదార్థాలు, చైతన్యరూపాలు, ప్రకాశాంశ. నామరూపాత్మక జగత్తు జడపదార్ధము అది విమర్శాంశ. ప్రకాశవిమర్శాంశల సమిష్టి రూపమే ఈ సృష్టి. |
420 | Gayathri గాయత్రి | The power of Gayatri is same as Divine mother గాయత్రీ శక్తియే అమ్మ లలితమ్మ |
421 | Vyahruthi వ్యాహృతి | Vyahruti means - the gross form known to the 'Sritendriya'. It expands with pronunciation. వ్యాహృతి అంటే - శ్రీతేంద్రియానికి తెలిసే స్థూలమగు రూపము. ఉచ్చరించబడి వ్యాప్తి చెందేది. |
422 | Sandhya సంధ్య | Goddess 'Sandhya' is same as Gayatri, Savitri and Divine Mother. She is worshipped during Dawn and Dusk. The time before the sunrise and the stars set is Dawn and the time after sunset and stars rise is dusk. సంధ్యాదేవతయే గాయత్రి, సావిత్రి, పరమేశ్వరి. ఈ సంధ్యా దేవత సంధికాలమున ఉపాసించబడుతుంది. సూర్యుడు ఉదయించకముందు, నక్షత్రాలు అస్తమించకముందు కాలము ఉదయసంధ్య. అలాగే సూర్యుడు అస్తమించాడు. కాని నక్షత్రాలు పూర్తిగా లేవు. అది సాయంసంధ్య. |
423 | Dwijabrindanishewitha ద్విజబృందనిషేవితా | Dwija means those who have two births. Brahmana, kshatriya and Vaishyas. In the Renuka Purana it is said that "Sandhyadevi is worshiped by the gods, by the Dwijas, by the Mahatmas at all times and in all places." ద్విజులు అంటే రెండు జన్మలు గలవారు. బ్రహ్మక్షత్రియవైశ్యులు. వీరిచే పూజించబడునది. రేణుకాపురాణంలో “సంధ్యాదేవి దేవతలచేత, ద్విజులచేత మహాత్ములచేత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలయందు పూజించబడుతుంది" అని చెప్పబడింది. |
424 | Tatwasana తత్వాసనా | There are 25 tatwas in the horizon. There are 25 tatwas in Srichakra. Since Divine mother is at the pinnacle above these tatwas, they are like her seat(throne). శివాది క్షితి పర్యంతము 25 తత్త్వాలను ఆసనముగా గలది. శ్రీచక్రంలో తత్త్వాలు 25 ఉన్నాయి. ఆ తత్వాలకు పైన బిందువునందు అమ్మ ఉంటుంది కాబట్టి, తత్త్వములే ఆసనముగా గలది |
425 | Tat తత్ | That which is not you నీవు కానిది |
426 | Twam త్వాం | That which is you నీవు అయినది |
427 | Ayee అయీ | Divine mother అమ్మ |
428 | Panchakosandarasthitha పంచకోశాధరస్థితా | Koshamu means cell. The human body has five cells. They are 1. Annamayakosamu (Food cell), 2. Pranamayakosamu (life cell), 3. Anandamayakosamu (bliss cell), 4. Manomayakosamu(mind cell), 5. Vijnanamayakosamu(knowledge cell). The Anandamayakosamu is located between the other four cells. Parabrahma is in it. కోశము అంటే , వర అని అర్ధం. మానవ శరీరంలో ఐదుకోశాలున్నాయి. అవే 1. అన్నమయకోశము, 2. ప్రాణమయకోశము, 3.ఆనందమయకోశము, 4.మనోమయకోశము, 5.విజ్ఞానమయకోశము ఆనందమయకోశము మిగతా నాలుగుకోశాలనడుమ ఉంటుంది. అందులోనే పరబ్రహ్మ ఉంటాడు |
429 | Nissemamahima నిస్సీమమహిమ | Divine mother is beyond the limits of the mind. Her glory is boundless. She has no beginning, center and end. She is omni present. మనసు యొక్క యెల్లలను దాటినది. నిరవధికమైన హద్దులు లేని మహిమ గలది.అపారమైన ప్రభావము, అనంతమైన ప్రతిష్ఠగలది. ఆది మధ్యాంతరహితురాలు, సర్వవ్యాపి, పంచకృత్యపరాయణ అయిన ఆ పరమేశ్వరి మహిమలకు సీమలు లేవు. |
430 | Nithyayouawana నిత్యయోవనా | Change is the only constant thing in this world. Everything changes as time passes. But Divine mother is beyond time. She is never affected by time. కాలోహి జగద్భాక్షకః అన్నారు. అంటే స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కాలంలో మార్పు చెందుతుంది. అంటే కాలంచే ప్రభావితమవుతుంది. కానీ అమ్మ కాలాతీతమైనది. కాలముచే ఆమె ప్రభావితం అవ్వదు. |
431 | Madhashalini మాదశాలినీ | Divine mother is in trance enjoying the bliss of Atma (soul). ఆనందమయ విషయమే మదము. అమ్మ సదామహదానందం పొందుతూ ఉంటుంది కాబట్టి మదశాలినీ అనబడుతుంది. ఏ ఇతర భావావేశము చేతనూ కలవనటువంటి బ్రహ్మానందాన్ని పొందేటటువంటిది. |
432 | Madhaghoornitharakthakshi మదఘోరానితరక్తాక్షీ | In trance her eyes are red in color. Ghoornita means to separate oneself from all other worldly things. That's the state of Divine mother. ఆనందమయ విషయమే మదము. ఆ మదముచే తిరుగుచున్న ఎర్రని కనులు గలది. లోకసంబంధమైన విషయాలకు దూరంగా ఉండటమే ఘూర్ణము. పరమానందం పొందినప్పుడు, లౌకిక విషయాలన్నీ దూరమైపోతాయి. |
433 | Madhapatalagandabhoo మదపాటలగన్డభూ | In trance her cheeks glow in red and white color. మదముచేత ఎరుపు తెలుపు కలిసిన రంగు గల చెక్కిళ్ళు గలది. |
434 | Chandanadravadhigdhangi చందనద్రవాదిగ్దాన్గి | Divine mother has fine sandalwood coated on whole body of. It has a good scent mixed with sandal wood and saffron flower juice. మంచి గంధముచే పూయబడిన అంగములు గలది. అంటే పరమేశ్వరి శరీరమంతా చందనలేపనం కావించటం జరిగింది. కుంకుమ పూల రసముతో కలిపిన మంచి గంధము శరీరావయవములకు రాయబడినది. |
435 | Champeyakusumapriya చాంపేయకుసుమప్రియా | Divine mother likes Champa(sampenga) flowers. చాంపేయ పుష్పము అనగా - నాగకేసరపుష్పము. చంపకపుష్పము. సంపెంగపూవు, సంపెగపూలమీద పరమేశ్వరికి ప్రీతి ఎక్కువ. |
436 | Kushala కుశల | Divine mother is skilled in creation. So, she is called kushala. సృష్ట్యాది నిర్మాణములందు నేర్పు గలది. కాబట్టి కుశలా అనబడుతుంది. |
437 | Komalakara కోమలాకార | She is very soft and tender కుసుమకోమలమైన ఆకారము గలది. |
438 | Kurukulla కురుకుళ్ల | Kurukullā is a goddess who dwells in Śrī Cakra between the boundaries of ego and consciousness. కురుకుళ్ల దేవి శ్రీచక్రంలో అహంకారినికి చైతన్యానికి మధ్యలో ఉంటుంది. |
439 | Kuleshwari కులేశ్వరి | Divine mother is the ruler of the triad kula. The triad consists of cognisor, cognized and cognition (the psychological level of perception). She controls this triad that leads to Self-realization. If all the three become one, she is realized. తెలుసుకునేవాడు, తెలుసుకొనదగినది, తెలుసుకునే ప్రక్రియ. మూడింటినీ కలిపి కులము అంటారు. ఇవే మాతృ, మాన, మేయములు. ఈ మూడింటికీ అధిపతి అమ్మ. ఇవి మూడు ఏకమైనప్పుడే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. |
440 | Kulakundalaya కులకుండాలయ | The point at the center of Moolaadhaara is called Kulakundam. That is Divine mother's abode మూలాధారంలో కర్ణికమధ్యన ఉండే బిందువే కులకుండము. అదే ఆలయంగా కలది. |
441 | Kaulamargatatparasevitha కౌలమార్గతత్పరసేవితా | She who is being worshipped by people who follow Kaula matha కౌళాచారులచే కులమార్గంలో పూజించబడుతుంది. |
442 | Kumaragananadambha కుమారగణానాదాంబా | She who is mother to Ganesha and Subrahmanya. She who helps in overcoming one's Ego. If anyone prays Subrahmanya and Ganesha, they will destroy his ego. కుమారుడు - కుమారస్వామి. గణనాధుడు గణపతి వీరిద్దరికీ తల్లి. మన్మధ వికారాలను తొలగించేది. అంటే భక్తుల యొక్క అహంకారము తొలగించి వారికి మోక్షమిస్తుంది ఆ పరమేశ్వరి. |
443 | Thushti తుష్టి | She who is personification of happiness తుష్టి అంటే - సంతోషము. సర్వభూతాలయందు తుష్టి రూపంలో ఉంటుంది. |
444 | Pushti పుష్టి | She who is personification of health not only for physical body but also for astral and causal bodies. స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ, కారణ శరీరములయందు కూడా ఆరోగ్య రూపంలో ఉంటుంది. |
445 | Mathi మతి | She who is personification of wisdom. జీవులయందు బుద్ధి రూపంలో ఉండి సంకల్ప వికల్పాలను చేస్తుంది కాబట్టి మతి అనబడుతుంది. |
446 | Dhrithi ధృతి | She who is personification of stability of mind and courage. మనస్సు యొక్క స్థిరమైన భావమే ధృతి అనబడుతుంది. మనసుకు కావలసిన ధైర్య స్థైర్యం కలిగిస్తుంది. సర్వభూతములందు ధృతిరూపంలో ఉండేది. |
447 | Shanthi శాంతి | She who is personification ofpeace. To those who worship Divine mother, she helps in overcoming the Arishadvarga and thereby have peace of mind. శాంతి అనేది సత్వగుణ ప్రధానమైనది. అమ్మను గనక అర్చించినట్లైతే కామక్రోధలోభమోహ మదమాత్సర్యములనబడే అరిషడ్వర్గాలను నశింపచేసి, సాధకులకు శాంతిని కలిగిస్తుంది. |
448 | Swasthimathi స్వస్తిమతి | She who always keeps well. She who gives all auspicious things to us. సు అంటే బాగుగా, అస్తి అంటే ఉండటం. స్వస్తి అంటే మంచిగా ఉండటము. ఆవిడ మనందరికీ మంగళకారిణి. అందుకే స్వస్తిమతి అన్నారు. |
449 | Kanthi కాంతి | She who is personification of light, glow or radiance. సకల ప్రపంచమందు కాంతిరూపంలో ఉన్నది. ప్రతిజీవిలోనూ జీవం రూపంలో ఉన్నది. ప్రతి జీవిలోనూ జీవకళనే తేజస్సు అంటారు. అదే కాంతి. జీవులయందు ఆ రకంగా తేజోమయరూపంలో ఉండేది కాబట్టి అమ్మ కాంతి అనబడుతోంది. |
450 | Nandhini నందిని | She who is personification of Pleasure/joy. ఆనందస్వరూపమైనది. |
451 | Vighnanasini విఘ్ననాశిని | She who removes obstacles విఘ్నాలను నశింపచేసేది. అవిద్యను నశింపచేసేది. |
452 | Tejowathi తేజోవతి | She who is the base for the radiance of Sun, Moon and fire సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతురాలు |
453 | Trinayana త్రినయనా | She who has three eyes. Sun is her right eye (represents day), Moon is her left eye (represents night), Fire is her third eye (represents Dawn/dusk) సోమసూర్యాగ్నులనబడే మూడు నేత్రాలు గలది. తేజోవంతమైన మూడు నేత్రాలు గలది. కుడికన్ను - సూర్యుడు. ఎడమకన్ను - చంద్రుడు. ఫాలనేత్రము - అగ్ని అలాగే కుడికన్ను పగలు, ఎడమకన్ను - రాత్రి. ఫాలనేత్రము సంధికాలము. |
454 455 | Lolakshi-Kamaroopini లోలాక్షీ కామరూపిణీ | She who eyes wander sideways. She is the form of the attribute less MahaKameshwara. చలిస్తున్న కనులు గలది. మహా కామేశ్వరుని రూపం కలది కాబట్టి కామరూపిణి. |
456 | Malini మాలిని | She who wears a garland. It is the garland of all the letters మాల గలది కాబట్టి మాలిని. అది మాతృకా రూపంలో ఉన్న అక్షర మాల. |
457 | Hamsini హంసిని | 'Ha' in Hamsa representations inhalation. 'Sa' represents exhalation. One who can control and govern breathe is called 'paramahamsa'. Divine mother is always surrounded by such paramahamsa' హ కారము ఉచ్ఛ్వాస. సకారము నిశ్వాస. ఈ శ్వాస మీద అదుపు సంపాదించ గలిగినవాడు పరమహంస అనబడతాడు. అటువంటి పరమహంసలు చుట్టూ ఉంటారు. అంటే అమ్మనే తలచుకుంటూ ఉంటారు. |
458 | Matha మాత | Mother అమ్మ |
459 | Malayachalavasini మలయాచలవాసిని | Malaysia is called Malaya Mountain in puranas. Divine mother is worshipped in the name of 'Bhagavati' in Malaysia. మలయ పర్వతం మీద నివసించునది. మలబారు దేశంలో చందనవనంలో భగవతీనామంతో పూజించబడే దేవి. ఈమెనే మలయాల భగవతి అంటారు. మలయ పర్వతం అంటే మలేషియా. |
460 | Sumukhi సుముఖి | Divine mother is personification of the purest and everlasting form of pleasure and joy. Hence her face has an everlasting glow and radiance. అమ్మ బ్రహ్మానందస్వరూపిణి కాబట్టి ఆమె ముఖపద్మము సర్వకాల సర్వావస్థలయందు ప్రకాశిస్తూ ఉంటుంది. |
461 | Nalini నళినీ | She who is tender like lotus petals, lotus stem and lotus lower. తామర రేకులవంటి కనులు, తామరతూడులవంటి చేతులు, తామర పద్మములవంటి పాదాలు కలది. అంటే అంతటి మృదుత్వం, కోమలత్వం కలది. |
462 | Subrooh సుభ్రూహ్ | She who has beautiful eyebrows like the bow of manmadha. మంగళకరమైన కనుబొమలు గలది. సుభప్రదమైన మన్మథుని ధనుస్సువలె ఉన్న కనుబొమలు కలది. |
463 | Shobhana శోభనా | All devatas gathered and concentrated their power to kill mahishasura. A beautiful woman emerged out of that radiance. Hence, she is called Shobhana. మహిషాసురుని సంహరించటం కోసం దేవతలందరూ వారి తేజస్సును బయటకి తీశారు. ఆ తేజస్సులోంచి ఒక సుందరమైన స్త్రీ రూపము ఉద్భవించింది. ఈ కారణాలచేతనే శోభనా అనబడుతుంది. |
464 | Suranayika సురనాయికా | the power of all devatas is in her. Hence, she is called Mistress of devatas అందరి దేవతల శక్తి ఆమెలోనే ఉన్నది. అందుకే ఆవిడ సకల దేవతాశక్తి సమైక్యురాలు. |
465 | Kaalakanti కాలకంఠి | Lord Shiva is called Kaala kanta. Divine mother is his consort. Hence, she is called Kaala kanti. శివుడికి కాలకంఠుడు పేరు ఉంది. అమ్మ ఆయని భార్య కాబట్టి కాలకంఠి అన్నారు. |
466 | Kanthimathi కాంతిమతి | She whose body is full of ethereal luster కాంతి కలది. కాంతియుతములైన, తేజోవంతమైన సకలావయవములు గలది. |
467 | Kshobhini క్షోభిణీ | She who causes turbulence. Prabrahman is still/stateless. Divine mother causes stimulus in him. Then the creation begins. పరమేశ్వరుడికి సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగేటట్లు చేసింది. సృష్టికాలంలో నిర్గుణుడైన పరబ్రహ్మలో ప్రవేశించి, చాంచల్యము కలిగించి సృష్టి చెయ్యాలనే కోరిక అతనికి కలిగించింది. |
468 | Sukshmaroopini సూక్ష్మరూపిణి | She who cannot be perceived by sense. Praanamaya, Manomaya and Vignaana maya cells of our body are called Sukshma body. This is the last name in the description of Gayatri mantra. ఇంద్రియాల తెలుసుకొనుటకు సాధ్య పడనిది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను సూక్ష్మదేహమంటారు. ఇక్కడితో గాయత్రి మంత్ర వర్ణన పూర్తి అయ్యింది. |
469 | Vajreshwari వజ్రేశ్వరి | She who is Vajreswari (lord of diamonds) who occupies jalandhara peetha జాలంధరపీఠంలో ఉండే దేవత. షోడశనిత్యలలో ఆరవనిత్య వజ్రేశ్వరి. |
470 | Vamadevi వామదేవి | She who is the consort of Vama deva వామదేవుని శక్తి వామదేవి. దేవతలు "ఇతడు మనకు నమస్కరింపతగినవాడు. కాబట్టి వామదేవుడైనాడు" అన్నారు. వామదేవుడు అంటే - నమస్కరింపదగినవాడు. |
471 | Vayovasthavivarjitha వయోవస్థావివర్జితా | She who does not change with age. She who is always 16 years old. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యదశలు ఏవీ లేనిది. వయస్సుతోపాటుగా వచ్చే అవస్థలు లేనిది. సదాషోడశవరీయాం. ఎల్లప్పుడూ పదహారు సంవత్సరాల ప్రాయంలోనే ఉంటుంది. |
472 | Sidheswari సిద్ధేశ్వరీ | There are many types of supernatural powers. 8 of them are commonly known. These are famously called as Ashtasiddhis. Siddhi devatas are stationed in the first petal of Bhupura of Sri chakra. One can attain siddhis by offering penance to them. సిద్ధులు అనేకరకాలు. ప్రత్యేకంగా అష్టసిద్ధులు అని ఎనిమిది సిద్ధులు ప్రసిద్ధి చెందాయి. శ్రీచక్రంలోని భూపురంలోని మొదటిరేఖలో ఈ సిద్ధి దేవతలుంటారు. ఈ దేవతలను అర్చిస్తే ఆ ఫలితాలు వస్తాయి. |
473 | Siddhavidya సిద్ధవిద్యా | She who is personification of pancha dasa manthra which is called siddha vidya పంచదశి మహామంత్రమే సిద్ధి విద్య. అదే అమ్మ స్వరూపం. |
474 | Siddhamatha సిద్ధమాతా | She who is the mother of Siddhas సిద్ధులందరూ ఆవిడను అమ్మలా కొలుస్తారు. |
475 | Yasawini యశశ్విని | She who is famous because she is siddheswari సిద్ధేశ్వరి, సిద్ధవిద్యా, సిద్ధమాత అని చెప్పటంచేత లలితమ్మ సకలప్రపంచానికి సిద్ధులను ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆమె గొప్ప కీర్తి గలది. యశస్విని అనబడింది. |
476 | Vishudhichakranilaya విశుద్ధచక్రనిలయా | Vishuddhi chakra is slightly beneath the throat. It is white in color. It has 16 petals. These represents the 16 vowels sounds (Aa to Aha). Vajreshwari, the head of Vishuddhi కంఠస్థానానికి కొంచెం దిగువగా 16 దళాలతో ఉండే పద్మాన్ని విశుద్ధి చక్రం అంటారు. ఇది తెల్లని రంగులో ఉంటుంది. దీని పదహారు దళాలలోను ఆ నుంచి అః వరకు అచ్చులుంటాయి. ఈ పదహారుదళాలందు పదహారుశక్తులు పరివేష్టించి ఉండగా చక్రాధిష్టాన దేవత వజ్రేశ్వరి దీని మధ్యన ఉంటుంది |
477 | Aarakthavarni ఆరక్తవర్ణా | She who is in a shade of shite mixed with red - slightly red ఆ రక్తము అంటే - పాటలవర్ణము. ఎరుపు, తెలుపు రంగులు కలిసినది. పరమేశ్వరి రంగు జపాకుసుమము, అరుణారుణము. అంటే తెలుపుతో కలిసిన ఎరుపురంగు. |
478 | Trilochana త్రిలోచనా | She who has three eyes. They represent the Sun, Moon and Fire. Rig, Yajas and Sama. Past, present and Future. మూడు కనులు గలది. సోమసూర్యాగ్నులే మూడునేత్రాలు. ఋగ్ యజుస్సామాలే మూడునేత్రాలుగా గలది. ఈ మూడు నేత్రాలు భూతభవిష్యద్వర్తమానకాలాలను కూడా సూచిస్తున్నాయి. ఈ రకంగా మూడుకనులు గలది. |
479 | Khatwangadhipraharana ఖట్వాఙ్గదిప్రహరణ | Vajreswari, the goddess who lives here has a Khatvanga, Khadga (Sword), Trishul and skin in all the four hands ఖట్వాంగము అంటే మంచంకోడు. మానవుడి పుర్రె గ్రుచ్చబడిన ఒక కర్ర. ఇక్కడ ఉన్న వజ్రేశ్వరీదేవి ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మములను తన నాలుగుచేతులయందు ధరించి ఉంటుంది. |
480 | Vadanaikasamanvitha వదనైకసమన్విత | She who has one face వదనము - ముఖము, ముఖరంధ్రము. ఇక్కడ ఒకే శిరస్సు గలది అని చెప్పవచ్చును. |
481 | Payasannapriya పాయసాన్నప్రియ | She who likes sweet rice (Payasam). Payasam is prepared with rice, milk, cow ghee, green gram and jaggery. పాయసము నందు ప్రీతి గలది. పాలతో వండిన అన్నమునందు ప్రీతి గలది. పాయసమంటే. బియ్యం - ఒక శేరు, పాలు - రెండు పేర్లు, ఆవు నెయ్యి - అర్ధశేరు, పెసరపప్పు - అర్థశేరు, బెల్లం - అర్థశేరు, ఈ రకంగా వండిన అన్నాన్ని పాయసము అంటారు. |
482 | Twak stha త్వక్ స్థా | Twak means skin. Our body is made of 7 basic elements. They are Skin cells, Muscle cells, Plasma cells, Blood cells, Bone cells, Shukla cells, Medha cells (Grey matter). Vajreswari, the head of Vishuddhi chakra gives strength to Skin cells. త్వక్ అంటే చర్మము. చర్మము, మాంసము, చీమి, నెత్తురు, ఆస్తి, శుక్ల, మేధ అనే సప్త ధాతువులతో శరీరం ఏర్పడుతుంది.చక్రాధిష్టాన దేవత అయిన వజ్రేశ్వరి చర్మధాతువుకు పుష్టినిస్తుంది. |
483 | PashulokaBhayankari పశులోకభయంకరీ | Those who think God is separate from His devotees are called animals (ignorant). Those who believe that God is everywhere (inside you, inside me, in this world) are the real devotees. Divine mother protects all the devotees from the ignorant. భగవంతుడు వేరు భక్తులు వేరు అని భావించేవారు పశువులు (అజ్ఞానులు). నీలోను, నాలోనూ, ఈ ప్రకృతిలోని, చరాచర జగత్తు అంతటిలోను ఆ పరమాత్మే ఉన్నాడు భావించే వారు నిజమైన భక్తులు. పశువుల వంటి వారి నుంచి భక్తులను కాపాడుతుంది కనుక పశులోక భయంకరీ అన్నారు. |
484 | Amruthadimahashakti samavrutha అమృతాదిమహాశక్తి సమావృతా | Vajreswari is at the centre of Vishuddhi chakra and is surrounded by 16 shaktis like 1. Amrutha, 2. Akarshini, 3. Indrani, 4. Eesani, 5. Ushah kesi, 6. Urdwa 7. Ruddhita, 8. Rukaara, 9. Kaara, 10. Shaw, 11. Ekapadaa, 12. Aishwarya, 13. Omkaari, 14. Oushadhi, 15. Ambikaa 16. Akshara విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత అయిన వజ్రేశ్వరి ఈ చక్రము యొక్క కర్ణికలో ఉండగా, ఇక్కడి పదహారు దళాలలోను అ నుంచి అః వరకు ఉన్న శక్తులు ఆమెను చుట్టి ఉంటాయి. ఆ శక్తులు: 1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. బుద్ధిత, 8. ఋకార, 9. కార , 10. షా, 11. ఏకపదా , 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అక్షరా |
485 | Dakineeswari డాకినీశ్వరీ | Daakini is the presiding deity of Vishuddhi chakra. విశుద్ధి చక్రానికి అధిదేవత డాకిని. |
486 | Anahathabja nilaya అనాహతాబ్జ నిలయ | Anaahata is located near heart. It has 12 petals. It represents Vayu (Air) tattwa. Rudra is the master of this chakra. Adhidevata is vaamadevi. This chakra shines with a golden luster. Shaktis from 'Ka' to 'Tha' surround this chakra. హృదయస్థానమందు అనాహతమనే వాయుతత్త్వాత్మకమైనది. దీనికి 12 దళాలుంటాయి. దీనికి అధిపతి రుద్రుడు. అధిదేవత వామదేవి. ఈ చక్రం బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. దీని 12 దళాలలోనూ క నుండి ఠ వరకు అక్షరాలు శక్తి రూపాలలో ఉంటాయి. |
487 | Syamabha శ్యామాభా | She who is greenish black నల్లని కాంతి కలది. శ్యామల వర్ణము గలది. ఈ చక్రంలో ఉండే వామదేవి నల్లనిరంగులో ఉంటుంది. |
488 | Vadanadwaya వదనద్వయ | She who has two faces రెండు ముఖములు గలది. వామదేవి రెండు తలల కలిగి ఉంటుంది. |
489 | Dhamshtrojvala దంష్ట్రోజ్వల | She who shines with long protruding teeth like a wild boar. She is dark in greenish black color. But her teeth shine bright. వామదేవికి దంతాలు కోరలులాగా ఉంటాయి. ఈ దేవి నల్లగా ఉంటుంది. దంతాలు తెల్లగా ప్రకాశిస్తుంటాయి. అందుచేత దంష్ట్రోజ్వలా అనబడుతుంది. |
490 | Akshamaladhi dhara అక్షమాలాది ధర | She has four hands and holds, akshamala, spear, skull and Damaraka. Akshamaala means a beaded thread with 56 beads representing leters from 'Aa' to 'Ha' and 'Ksha' will be the final(last) bead. తన నాలుగుచేతులయందు అక్షమాల, శూలము, కపాలము, డమరుకము ధరించి ఉంటుంది. అక్షమాల అంటే రుద్రాక్షలమాల కాదు. ఆ నుంచి హ వరకు యాభైఆరు అక్షరాలుమాలగా క్ష కారము కొలికిపూసగా ఉంటాయి. |
491 | Rudhirasamsthitha రుధిరసంస్థితా | Heart is the control centre of the blood flow. She is called rudhira samsthita because she lives near heart. రక్తానికి కేంద్ర స్థానము అందుకే వామదేవి రుధిర సంస్థితా అనబడుతోంది. |
492 | Kalarathryadhishakthiyoghavrutha కాలరాత్ర్యాదిశక్త్యోఘవృతా | There are 12 petals in Anahata. Each petal has shakti in it. They are: 1.Kaalaratri, 2.Khateeta, 3.Gayatri, 4.Ghantaadhaarini, 5.Jaamini, 6.Chandra, 7.Chaya 8.Jaya 9.Jhankaari 10.Janaroopa, 11.Tankahastha 12.Tankaarini. These represent sounds from 'Ka' to 'Ra' అనాహతపద్మంలో పన్నెండు దళాలుంటాయి. ఆ పన్నెండు దళాలలోను క నుంచి ర వరకు పన్నెండు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి. అవి: 1. కాళరాత్రి 2. ఖాతీత 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్ర 7. ఛాయా 8. జయా 9. ఝంకారి 10. జనరూపా 11. టంకహస్తా 12. ఠంకారిణి. వీరంతా చుట్టూ పరివేష్టించి ఉండగా వామదేవి మధ్యలో ఉంటుంది. |
493 | Snigdhowdhanapriya స్నిగ్ధౌదనప్రియా | She who likes rice mixed with cow ghee. వామదేవికి నేతితో తడిపిన అన్నము నందు మక్కువ ఎక్కువ. ఇక్కడ నేయి అంటే అవునేయి మాత్రమే అని గుర్తించాలి. |
494 | Mahaaveerendravaradha మహావీరేంద్రవరదా | Those who pursue Srividya are the real heroes. Manu, Chandra and Kubera are the great ones of those. Divine mother gave boons to these aswell. She is worshipped by all these great people. శ్రీవిద్యోపాసకులను వీరులు అంటారు. వారిలో కూడా మహావీరులు మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలైనవారు. వారిచేత ఆర్చించబడినది. అద్వైత సిద్ధాంతము బాగా తెలిసినవారిచేత ఉపాసింపబడేది. |
495 | Rakinyambaswaroopini రాకిణ్యంబాస్వరూపిణి | The beeja, shakti, keelaka of Vaama devi are denoted by the sound 'Ra'. Hence she is called Rakinyamba. ఈ అనాహత చక్రంలో ఉండే వామదేవి యొక్క మంత్రంలో శక్తి బీజము, కీలకము అన్నీ రకార సంకేతాలే. కాబట్టి రాకిని అని పిలువబడుతుంది. |
496 | Manipoorabja nilaya మణిపూరాబ్జ నిలయా | The energy center located at the naval center is called Manipoora. It is a 10 petalled lotus. This is characterized by water amongst the five elements. The letters from 'Da' to 'Pha' represent the shaktis in these petals. At the center of these is Devata 'Vayovastha vivarjita' .She does not show signs of age as the time passes. She is always young. నాభిస్థానంలో ఉండే చక్రాన్ని మణిపూరము అంటారు. ఇది పదిదళాలు గల చక్రము జలతత్త్వాత్మకము. దీని దళాలలో డ నుంచి ఫ వరకు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి. ఇందులో ఉండే దేవత పేరు 'వయోవస్థా వివర్జితా'. కాలంతో పాటుగావచ్చే వయోభేదంగాని, బాల్య కౌమారాది అవస్థలుగాని ఈమెకు ఉండవు. ఎప్పుడూ నిండు యవ్వనవతిగానే ఉంటుంది. ఇది విష్ణుస్థానము. |
497 | Vadanathraya samyutha వదనత్రయ సంయుతా | She who has three faces మూడు ముఖములు గలిగినది. |
498 | Vajradhikayudhopetha వజ్రాధికాయుధోపేతా | This devata has four hands. She holds Vajra, Shakti, Danda and Abhaya mudra. మణిపూరానికి అధిష్ఠాత్రి అయిన వయోవస్థావివర్ణితా అనే దేవతకు నాలుగుచేతులు ఉంటాయి. ఆ చేతులలో వజ్రము, శక్తి, దండము, అభయముద్రలు ఉంటాయి. |
499 | Damaryadhibhiravrutha డామర్యాదిభిరావృతా | మణిపూరంలో పదిదళాలు ఉంటాయి. వీటిలో డ నుంచి ఫ వరకు శక్తులు ఉంటాయి. అవి 1. డామరి 2. ఢంకారిణి 3. ణామిరి 4. తామసి 5. స్థాణ్వి 6. దాక్షాయణి 7. ధాత్రి 8. నందా 9. పార్వతి 10. ఫట్కారిణి. ఈ శక్తులు చుట్టూ పరివేష్టించి ఉండగా ఆ పద్మము యొక్క కర్ణికలో వయోవస్థా వివర్జిత అనబడే దేవత ఉంటుంది. There are 10 petals in Manipoora. In these Shaktis represented by 'Da' to 'Pha' are present. Their names are: 1. Daamari 2. Dankarini 3.Namiri 4.Taamasi 5. Sthaanvi 6. Dhakshayani 7. Dhatri 8. Nandaa 9. Paarvati 10 Phatkaarini. |
500 | Rakthavarna రక్తవర్ణా | She who is of the colour of blood రక్తమువలె ఎర్రనిరంగు గలది. ఈ చక్రాధిష్టాన దేవత ఎఱ్ఱని ఎరుపురంగు లో ఉంటుంది. |
List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
Search This Blog
Lalitha Sahasram - 251-500
Subscribe to:
Posts (Atom)
Popular
-
Dhyana means meditation. A Dhyana sloka explains the form on which one has to fix his/her mind during dhyanam(meditation) Shloka1 Sindh...
-
Chit is a part of our brain that seeks pleasure . It causes chaitanya. It is self-motivated and always at work. First it records our experie...
-
Karma is the conjunction of desire and effort. If there is no desire but only effort then it is not karma. It will be selfless service. When...
-
Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka , this na...
-
దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. పండు దానిమ్మ పువ్వు దానిమ్మ పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు....
-
Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In India...
-
Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair. Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key ...
-
Pancha thanmathra sayaka is 11th name of the 1000 names of Lalitha Devi. This explains a very important concept behind self-improvement. ...
-
Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donot...
No comments:
Post a Comment