Search This Blog

12.Nijaruna prabhapura majjadbrahmanda mandala



Brahmanda:

In vedas, the universe is described as an infinite set of egg-shaped sub universes. The word 'anda' in brahmanda is to indicate that the sub universes are elliptical in shape. It may also indicate that the laws of creation in each of these sub universes are specific to that sub universe. Brahma - The creator god represents the laws of creation in each of the sub universe. That is why vedas describe the universe (anantha viswam) as a conglomeration of infinite brahmandas with each brahmanda headed by a brahma. This has been authenticated by modern science as well. When Mr. Albert Einstein did a conjunction of space and time, the output is an elliptic function.  

In the Bhaagavath purana, Lord Krishna, in order to teach brahma of our brahmanda (where we all are living) a lesson, summons all the brahmas in the universe. Then He explains to our chatur mukha (four headed) brahma like this, "The whole universe is My creation. I appointed you as head of this brahmanda to follow my command and be part of my process of creation. Like you there are infinite brahmas in this universe. All of them are appointed by me and are following my order. I summoned all of them here to help you understand your position and responsibility". Chatur mukha Brahma looks around and sees that all the brahmas are bowing to Lord Krishna. Then he realizes that Krishna (who is looking like a cowherd to naked eye) is an incarnation of Lord Vishnu. As a mark of respect, chatur mukha brahma (one of God's of creation) washes feet of little krishna (a cowherd) and seeks His blessings. Sri Annamacharya's melody "brahma kadigina padamu (The foot that is worshipped by the creator God)" reminds us about this story.

This name also describes the nebula of the outer space. The color of the nebula is a mixed shade of red and white. It is in the color of the first sunrays we see in the morning. It looks like all the brahmandas are drowned in this self-luminous radiance of Divine mother.


బ్రహ్మాండం:
బ్రహ్మాండం అంటే అండాకారంలో ఉన్న ఒక ఉపవిశ్వం. వేదాలలో, విశ్వం అండాకారంలో ఉన్న ఉప విశ్వాల యొక్క అనంతమైన సమూహంగా వర్ణించబడింది. బ్రహ్మండంలో 'అండా' అనే పదం ఉప విశ్వాలు దీర్ఘవృత్తాకారంలో ఉన్నాయని సూచిస్తుంది. ఒక్కొక్క ఉప విశ్వంలో(బ్రహ్మాండంలో) సృష్టి నియమాలు ఒక్కొక్క విధంగా  ఉండవచ్చు. ఒక్కొక్క ఉప విశ్వానికీ ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు. అతను భగవంతుని ఆజ్ఞానుసారం సృష్టి చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అండానికి ఒక్కో బ్రహ్మ కనుక దానిని బ్రహ్మాండ అన్నారు.అందుకే వేదాలలో ఈ అనంతవిశ్వం అఖిలాండకోటి బ్రహ్మండాల సమ్మేళనంగా అభివర్ణించబడింది. ఈ విషయం ఆధునిక శాస్త్ర ప్రయోగాల ద్వారా ధృవీకరించబడింది. శ్రీ ఆల్బర్ట్ ఐన్స్టైయిన్ గారు కాలమును గణితంలో ఒక ఎక్వేషన్ గా వర్ణించే ప్రయోగం చేశారు. అప్పుడు ఆయనకు దీర్ఘవృత్త ఆకారాన్ని సూచించే ఎక్వేషన్ వచ్చింది. దీనినే కజంక్షన్ అఫ్ స్పేస్ అండ్ టైం అని పేర్కొన్నారు. 

భాగవత పురాణంలో, శ్రీకృష్ణుడు, మన బ్రహ్మండం యొక్క (మనమందరం నివసిస్తున్న) బ్రహ్మ గర్వం అణచడానికి, విశ్వంలోని బ్రహ్మలందరినీ పిలిచి మన చతుర్ ముఖ బ్రహ్మతో ఇలా అన్నాడు, "ఈ విశ్వం మొత్తం నా సృష్టి. నా ఆజ్ఞను అనుసరించడానికి మరియు నా సృష్టికార్యంలో భాగం కావడానికి నేను నిన్ను ఈ బ్రహ్మండానికి సృష్టికర్తగా నియమించాను. ఈ విశ్వంలో నీవంటి బ్రహ్మలు అనంతకోటి ఉన్నారు. వారందరు నా చేత నియమించబడ్డారు మరియు సృష్టి క్రియలో నా ఆజ్ఞను అనుసరిస్తున్నారు. నీ స్థానం మరియు బాధ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి నేను వారందరినీ ఇక్కడకు పిలిచాను చూడు ". చతుర్ ముఖ బ్రహ్మ చుట్టూ చూసి బ్రహ్మలందరూ శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నట్లు గమనిస్తాడు. అప్పుడు కృష్ణుడు (గోపాల బాలుడు) విష్ణువు యొక్క అవతారం అని తెలుసుకుంటాడు. అంజలి ఘటించి, చతుర్ ముఖ బ్రహ్మ బాలగోపాలకృష్ణుడి పాదాలను కడుగుతాడు మరియు అతని ఆశీర్వాదం తీసుకుంటాడు. శ్రీ అన్నామాచార్య యొక్క కీర్తన "బ్రహ్మ కడిగిన పాదము" ఈ కథను మనకు గుర్తుచేస్తోంది.

ఈ నామం అనంతవిశ్వంలో కనిపించే నిహారికను కూడా వివరిస్తుంది. నిహారిక యొక్క రంగు ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణంలో ఉంటుంది. సంధ్యాకాలంలో భూమిని చేరుకునే మొట్టమొదటి సూర్యకిరణాల రంగులో ఉంటుంది. అన్ని బ్రహ్మండాలు అమ్మ యొక్క సహజంగా ఉత్పన్నమవుతున్నయట్టి ఈ పాటల వర్ణంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నాయి అని ఈ నామానికి అర్ధం. 

Popular