Search This Blog

323.Kadambakusumapriya


323.Kadambakusumapriya - Divine mother likes Kadamba flowers. She sits in the garden of kadamba trees and enjoys the nectar of kadamba flowers.It is said that kadamba flowers will start to blossom after they see the lightning in the sky. They blossom during the monsoon season. There are 5 types of kadamba trees:1) Dharakadamba, 2) Bhoomikadamba 3) Dhoolikadamba 4) Raajadhoolikadamba 5) Rajakadamba.Rajakadamba is the biggest of all these trees. The bark of this tree is thick. Kadamba flowers are in reddish orange color in the shape of a ball. They emit good fragrance. Their nectar is cold and sweet. It can help in neutralising poison, reducing fever and reducing imbalances in kapha,vatta and pita. It brings glow to the body and enhances vigor, strength and power.

323.కదంబకుసుమప్రియా - కదంబ కుసుమము లందు ప్రీతిగలది. కదంబ వృక్షాన్ని నీప వృక్షము, కడిమిచెట్టు అంటారు. ఈ వృక్షాలు మేఘాలు గర్జించినప్పుడు మొగ్గలు వేస్తాయి. ఎర్రని రంగులో ఉండే పూలను గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కదంబ వృక్షంలో చాలా రకాలున్నాయి. 1. ధారాకదంబ, 2. భూమికదంబ 3. ధూళికదంబ 4. రాజధూళికదంబ 5. రాజకదంబ. వీటన్నింటిలోకీ రాజకదంబము పెద్దవృక్షము. కడిమిచెట్టు ఆకు జీడిమామిడి ఆకులాగా ఉంటుంది. ఈ చెట్టు బెరడు దళసరిగా ఉంటుంది. చెట్టుకు సన్నని ఊడల వంటి కాడలు కూడా ఉంటాయి. దీని పూలు గుండ్రంగా, ఎర్రనిరంగులో, చిన్నవిగా ఉంటాయి. మంచి వాసన కలిగి ఉంటాయి. వర్షాకాలంలో ఈ చెట్టు పూలు పూస్తుంది. ఈ పూల నుంచి వచ్చే రసము చల్లగా, తియ్యగా ఉంటుంది. విషాన్ని హరించి వేస్తుంది. శరీరతాపాన్ని తగ్గిస్తుంది. ఈ రసము త్రిగుణ హరి. అంటే వాత, కఫ, పిత్తములను హరిస్తుంది. వీర్యవృద్ధి శరీరానికి మంచి కాంతిని కలిగిస్తుంది. అమ్మకు కదంబ వృక్షాలన్నా, వాటి పూలు అన్నా మక్కువ ఎక్కువ. ఆమె ఎల్లవేళల యందు కదంబవనంలోనే ఉంటుంది. కదంబ పుష్పాల నుంచి వచ్చే మధువును త్రాగుతుంది.

Popular