Search This Blog

345. Kshetrapalasamarchita

Kshetra means body. Pala means Ruler, the soul which has made the body the base. Divine Mother is called Kshetrapala Samarchita because she is worshiped by those who have knowledge of the soul.

In ancient times there was a demon named Darukasura. He did penance for Brahma and got many boons. He made life of devatas miserable with those powers. None of the gods could kill him. Finally, Lord Shiva asked goddess Kali to kill the demon. Kali slayed the demon in a fierce rage. Even after killing the demon, her anger did not subside. Her anger impacted all the worlds. Then Lord Shiva started crying as a child. Seeing that, Kali took the boy and breastfed him. Then Lord Shiva drank her anger along with that breast milk. That boy is called Kshetrapalashiva. Shiva is the Lord of all beings. Divine mother is called Kshetrapalasamarchita because she is worshipped by Lord Shiva.

In every Kshetra there is a ruler. Divine mother is called Kshetrapala Samarchita because she is worshiped by all kshetra palakas.

Kshetra means: Yagashala. The one who rules it is the ruler of the field. Divine mother is the goddess worshiped by him.

Let me explain with a simple analogy. Imagine there is a car and a driver for that car. Car is the kshetra and the driver is kshetragna. kshetragna is inside the kshetra and does the job of taking care of the kshetra. But there is an owner to both car and the driver. Similarly, Paramatma (Divine Mother) is the ultimate owner of both jivatma (kshetragna) and body (kshetra). The driver of the car must be aligned to the owner. Similarly, Kshetragna should be aligned to Divine mother, but due to illusion (Maya) common people lack this clarity.

క్షేత్రము అంటే శరీరము. పాలకుడు అంటే - శరీరాన్ని స్థావరంగా చేసుకొన్న జీవుడు. ఆత్మజ్ఞానం కలవారిచే అర్చించబడుతోంది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చితా అనబడుతుంది.

పూర్వకాలంలో దారుకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మని గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. అతని ఆగడాలు మితిమీరిపోయినాయి. వాణ్ణి సంహరించటం దేవతలెవరికీ సాధ్యం కాలేదు. ఆఖరుకి శివుడు ఆ రాక్షసుని మీద కాళిని ప్రయోగించాడు. కాళి భయంకరమైన ఉగ్రరూపంతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది. రాక్షస సంహారానంతరముకూడా ఆమె కోపము తగ్గలేదు. ఆ కోపాగ్నికి లోకాలన్నీ కల్లోలమయి పోతున్నాయి అప్పుడు శివుడు పసిబాలుడై ఏడవటం మొదలుపెట్టాడు. అది చూసిన కాళి ఆ బాలునిదగ్గరకు తీసుకుని స్తన్యమిచ్చింది. అప్పుడు శివుడు ఆ స్తన్యంతో పాటుగా కోపాగ్నిని కూడా త్రాగేశాడు. ఆ బాలుడినే క్షేత్రపాలశివుడంటారు. సకల భూతాలకు అధిపతి శివుడు. అతనిచే అర్చించబడునది కనుక క్షేత్రపాలసమర్చితా అనబడుతుంది.

ప్రతిక్షేత్రంలోనూ క్షేత్రపాలకుడు ఒకడుంటాడు. అతనిచే అర్చించబడేది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చితా అనబడుతోంది.

క్షేత్రమంటే : యాగశాల. దానిని పాలించేవాడు క్షేత్రపాలకుడు. అతనిచే పూజించబడే దేవి.

ఒక చిన్న ఉదాహరణతో ఈ నామాన్ని చూద్దాం. ఒక కారు ఉందనుకోండి. దానికి ఒక డ్రైవర్ ఉంటాడు. అతను ఆ కారును జాగ్రత్తగా చూసుకుంటాడు. అవసరమైనప్పుడు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ కారు క్షేత్రమైతే డ్రైవర్ క్షేత్రజ్ఞుడు. ఈ రెండింటికీ ఒక యజమాని ఉంటాడు. అదే లలితమ్మ. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు కూడా ఆవిడవే. ఎలాఅయితే డ్రైవర్ యజమాని చెప్పిన విధంగా కారుని నడుపుతుంటాడో, అలాగే జీవుడు అమ్మ చెప్పిన విధంగా (వేదాలు) శరీరమును ఉపయోగించి కర్మలు చేయాలి. కానీ మాయాప్రభావం వలన మనం వేదవిరుద్ధమైన కర్మలు చేసి అనవసరంగా కష్టాలు పడుతుంటాము.

Popular