Search This Blog

168-169.Nishkrodha Krodhashamani

168.Nishkrodha - Krodha is the second one in arishadvarga. It comes due to unfulfilled desire. Every living being that is bound by raaga/dwesha will suffer from arishadvarga. But divine mother has no raaga/dwesha. Her's is pure love for her children. Hence, she is called 'Nishkrodha'

169.Krodhashamani - 'shama' means to douse. When we pray divine mother with love and devotion, she will douse the 'krodha' within us as well.

168.నిష్క్రోధా - అరిషడ్వార్గాలలో రెండవది క్రోధం. కోరిక తీరకపోతే వచ్చేది క్రోధం. రాగ ద్వేషాలకు లోనైనా ప్రతీ జీవికి కోరిక తీరానప్పుడు క్రోధం వస్తుంది. కానీ అమ్మకు రాగ ద్వేషాలు ఉండవు. ఆవిడది పరిశుద్ధమైన ప్రేమ. కాబట్టి ఆమెకు క్రోధం కూడా ఉండదు. అందుకే నిష్క్రోధ. 

169.క్రోధశమని - ప్రేమ-భక్తిలతో అమ్మను ఆరాధిస్తే ఆవిడ మనలోని క్రోధాన్ని కూడా శమింపచేస్తుంది. 

166-167.Nishpapa Papanashini

166.Nishpapa - 'Papa' means sin. Common people like us perform karma (actions fueled by desire) every day. Due this we accrue either 'punya' or 'papa'. If one is influenced by 'Arishadvarga' as described in 156th name, then there is high probability that he/she accrues sin due to adharma. But divine mother's actions are not fueled by desire. So, she is 'Nishpapa'.

167.Papanashini - By praying divine mother, she enlightens our minds such that we realize the difference between truth and illusion. With this power of discretion, we overcome arishadvarga and destroy all the sins.

166.నిష్పాప - శరీరం ఉన్నంత వరకు మనుషులు కర్మలు చేస్తూనే ఉంటారు. పాపము చెడ్డ కర్మలు ద్వారా కలుగుతుంది. అరిషడ్వార్గాల ప్రభావం వలన మనం ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాము. అప్పుడు చేసే అధర్మం వలన పాపం కలుగుతుంది. కానీ అమ్మకు ఇటువంటి పాపం ఉండదు. ఎందుకంటే ఆవిడ కర్మలు చేయదు.

167.పాపనాశినీ - అమ్మను ప్రార్ధిస్తే మనకు ధర్మాధర్మ విచక్షణ కలుగుతుంది. దానితో అరిషడ్వార్గాన్ని తెగనరికి మనం పాపాన్ని తుడిచివేయ గలుగుతాము. 

164-165.Nirmama Mamatahanthri

164.Nirmama - 'Mama' means mine. My house, my job, my money like this, we attribute 'my' to many things. But in true sense, such attribution is not possible for atma. These are illusions of the mind. That is why divine mother is called 'Nirmama'

165.Mamathahanthri - The feeling of mine causes obstacles in the path of liberation. One has to overcome it. When you pray divine mother, she will give you the strength required for this. The story of Madhukaitabha samharam explains this very clearly.

164.నిర్మమ - మమ అంటే నాది అనే భావన. ఇల్లు నాది, డబ్బు నాది, వాహనం నాది, పదవి నాది, ఇలా ఎన్నింటికో మనం నాది అనే పదాన్ని ఆపాదిస్తూ ఉంటాం. ఇది మనసుకి సంబంధించిన వ్యవహారం. ఆత్మకు తన పర అనే భేదం వర్తించదు. అమ్మ ఆత్మ స్వరూపం. అందుకే నిర్మమ అని అన్నారు.  
165.మమతాహంత్రీ - నాది అనే భావన దైవసాధనకు అడ్డం పడుతుంది. దానిని జయించాలి. అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. మధు కైటభ సంహారంలో ఈ విషయాన్నే వివరించారు. అమ్మను ప్రార్ధిస్తే మనం ఈ అడ్డంకు తొలగించగలుగుతాము.

Popular