Search This Blog

922. Tarunaditya patala

తరుణాదిత్యుడు - మధ్యందినమార్తాండడు. పాటలా - పాటలవర్ణము గలిగినది. ప్రాతః కాలమునందున్న సూర్యునివలె ఎరుపు తెలుపు కలిసిన రంగుతో ప్రకాశించేది. పరమేశ్వరి శ్యామవర్ణంలో ఉంటుందని, గౌరవర్ణంలో ఉంటుందని చెప్పటం తప్పుకాదు. ఆమె తనను అర్చించే వారి మనసును బట్టి వివిధ వర్ణములలో ప్రకాశిస్తుంటుంది.

బృహదారణ్యకోపనిషత్తులో పరమేశ్వరుడు మంచి వస్త్రంలాగా, తెల్లని ఉన్నిగుడ్డలాగా, వర్షాకాలంలో కనిపించే ఆర్ధపురుగులాగా, అగ్నిజ్వాలలాగా, తెల్లనిపద్మంలాగా, మెరుపు కాంతిలాగా ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నవాడి సంపద విద్యుత్ప్రకాశంలాగా అంతటా వ్యాపిస్తుంది అని చెప్పబడింది. 

వేదంలో
శాంతా ధవళవర్ణాభా మోక్షధర్మ ప్రకల్పనే
స్త్రీవశ్యే రాజవశ్యేచ జనవశ్యే చ పాటలా
పీతా ధనస్య సంపత్తా కృష్ణా మారణకర్మణి
బభ్రుర్విద్వేషణే ప్రోక్తా శృంగారే పాటలాకృతిః
సర్వవర్ణా సర్వలాభే ధ్యేయా జ్యోతిర్మయీ పరమ్ ||


మోక్షమిచ్చేటప్పుడు శ్వేతవర్ణము, శాంతము, రాజ, జనవశ్యమందు పాటలవర్ణము, ధనసంపత్తిలో పీతవర్ణము, మారణకర్మలో కృష్ణవర్ణము, విద్వేషములందు కపిలవర్ణము, శృంగారమున పాటలవర్ణము, సర్వార్థములందు సర్వవర్ణములు కలిగి ఉంటుంది. ఈ రకంగా సర్వవర్ణములతోను శోభించు దేవిని సేవించుట శ్రేయస్కరము.

Tarunaditya - Sun in the afternoon. Patala - A shade with a mix of white and red. Divine mother shines with a shade that resembles the color of sun in the afternoon. It is not wrong to state that Divine mother glows in white, pink shades. It depends on the worshipper's state of mind.

It is said in Bruhadaaranyakopanishath that Mother's glow is in the following shades, 1. white woollen thread, 2. Blazing flame, 3. White lotus, 4. Lightening. Those who learns this will enjoy all wealth and happiness.

In vedas
Shantaa dhavalavarnaabhaa mokshadharma prakalpane
Streevasyeraajavasyecha janavasyecha paatalaa
peetaa dhanasya sampattaa krishnaa maaranakarmani
babhrurvidweshane proktaa srungaare paatalaakrutih
sarvavarnaa sarvalaabhe dhyeyaa jyothirmayee param ||

Mother's glow is while while given moksha. It is in a mix of white and red (Patala) while giving kingdoms, people etc, golden yellow while giving wealth and prosperity, dark blue while killing enemies, brown in enmity/grudge, Patala in passion. Like this she blesses us in various forms.

Popular