Search This Blog

663. అష్టమూర్తి:

ఎనిమిది స్వరూపాలుగా ఉన్నది. అనేక మూర్తి సముదాయాలు ఈ రకంగా ఉన్నాయి.

1. పంచభూతాని చంద్రార్కా వాత్మేతి మునిపుంగవ !
    మూర్తి రష్టా శివ స్యాహు ర్దేవదేవస్య ధీమతః
    ఆత్మా తస్యాం షమీ మూర్తి ర్యజమానాహ్వయా పరా ||
    పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు, యజ్ఞదీక్ష గల సోమయాజి. వీరు అష్టమూర్తులు.

2. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు.

3. భగవద్గీత:
    భూమి రాపో నలో వాయుః ఖం మనోబుద్ధి రేవ చ |
    అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టగా "
    పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము వీటిని అష్టమూర్తులంటారు.

4. శక్తిరహస్యంలో
    లక్ష్మీర్మేధా ధరా పుష్టి గౌరీ తుష్టిః ప్రభా ధృతిః
    ఏతాభిః పాహి తను రష్టాభి ర్మాం సరస్వతి !
    1. లక్ష్మీ 2 మేధ 3. ధర 4. పుష్టి 5. గౌరీ 6. తుష్టి 7. ప్రభ 8. ధృతి

5. యోగశాస్త్రంలో
    గుణ భేదాత్మమూర్తి : అష్టధాపరికీర్తితా
            జీవాత్మ చాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మల:
            శుద్ధాత్మ జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమఃస్మృతః
            అష్టమ స్తే షు భూతాత్మే త్యష్టాత్మానః ప్రకీర్తితాః
            గుణభేదములచే ఆత్మ ఎనిమిది రకాలుగా అవుతున్నది. అవి.
    1. జీవాత్మ 2. అంతరాత్మ 3. పరమాత్మ 4. నిర్మలాత్మ 5. శుద్ధాత్మ 6. జ్ఞానరూపాత్మ 7. మహాత్మ 8. భూతాత్మ

6. విష్ణుపురాణంలో

    1. సూర్యుడు 2. జలము 3. పృథివి 4. అగ్ని 5. వాయువు 6. ఆకాశము 7. దీక్షితుడైన బ్రాహ్మణుడు 8. చంద్రుడు
    వీరి భార్యలు వరుసగా
    1. సువర్చల 2. సోమ 3. సుకేశి 4. స్వాహా 5. పరాశివ 6. దితి 7. దీక్ష 8. రోహిణి
    వీరి కుమారులు
    1.శని 2 శుక్ర 3. లోహితాంగ 4. జీవ 5. స్కంద 6. స్వర్గ 7. సంతాన. 8. బుధ

7.
    1. అనంగకుసుమ 2. అనంగమేఖల 3. అనంగమదన 4. అనంగమదనాతుర 5. అనంగరేఖ 6. అనంగవేగిని
    7. అనంగాంకుశ 8. అనంగమాలిని

8.
    1. బ్రాహ్మి 2 మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. మాహేంద్రి 7. చాముండ 8. మహాలక్ష్మి

9.
    1.జ్ఞానేంద్రియాలు 2. కర్మేంద్రియాలు 3. అహంకార చతుష్టయం 4. ప్రాణపంచకం 5. భూతపంచకం 6. కామము
    7. కర్మ 8. అవిద్య,

ఈ రకంగా ఎనిమిదిగా ఉన్న స్వరూపమంతా ఆ పరమేశ్వరియే. అందుకే ఆమె అష్టమూర్తి అనబడుతోంది. అంతేకాకుండా
    1. కాదివిద్య 2. హాదివిద్య 3. సంఖ్యావిద్య 4. భూమావిద్య
    ఈ నాలుగు లింగభేదంతో ఎనిమిది అవుతున్నాయి. వీటి స్వరూపం కూడా పరమేశ్వరియే అందుకే ఆవిడ అష్టమూర్తి,

No comments:

Post a Comment

Popular