Search This Blog

709. Sarvopaadhivinirmuktha

ఏ రకమైన ఉపాదులు (శరీరములు) లేనట్టిది. అద్వైతమూర్తి. పరబ్రహ్మ స్వరూపిణి. కేవలము నిరాకారమైనది. చిన్నయ స్వరూపము. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. కాని అవిద్యతో భేదము ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉపనిషత్తులలో చెప్పినట్లుగా ఒకే కొమ్మ మీద ఒకే రూపం గల రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటేమో కర్మఫలాలను అనుభవిస్తోంది. రెండవది ప్రశాంతంగా కూర్చుని ఉన్నది. అవే జీవాత్మ పరమాత్మలు. వాటిలో జీవాత్మ కర్మఫలాలనుభవిస్తున్నది. ఆ రెండూ ఒక్కటే. తేడా లేదు. అయితే అవిద్య చేత రెండింటికీ భేదం ఉన్నది అనుకుంటోంది జీవాత్మ. అవిద్య తొలగిపోగానే తానే పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటుంది. పరబ్రహ్మలో లీనమయిపోతుంది.

అమ్మకి ఏరకమైన ఉపాధిలేదు. కాబట్టి సర్వోపాధివినిర్ముక్తా అనబడింది. ఆత్మకి గుణాలతో సంబంధం లేదు. అది నిరాకారము, నిర్గుణము. స్పటికమువలె స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. అయినప్పటికీ ప్రక్కన ఉన్న వస్తువుల నీడ అందులో ప్రతిఫలించి రంగులుగా కనిపిస్తుంది. అంతే. ఆ వస్తువులు లేకపోతే అది అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే అమ్మ కూడా.

Upadhi = a means to perform a task or achieve something. Like a job is the means to earn money. Divine Here they are describing the body as an upadhi given to jeevatma to attain moksha. Divine mother is Paramatma. Does not need a body. It can be understood with an illustration explained in upanishaths.

Two birds of exactly same type are sitting on the branch of a tree. One is struggling with the bonds of karma where the other one is enjoying absolute freedom. The one struggling with karma is Jeevatma. The other one is Paramatma. Due to ignorance, Jeevatma thinks it is bounded by karma. Ones it realizes its true nature, it becomes free and unites with paramatma.

Atma does not have any attributes, qualities, shape, form etc. Like a prism though color less on its own shows the color of the surrounding objects within, Atma also looks like it is bound by karma due to ignorance (Maya).

Popular