Search This Blog

401. Vividhaakaaraa

ఆ జగన్మాత నామ రూపాత్మకంగా జగత్తంతా వివిధాకారాలతో వ్యాపించి ఉన్నది. నామాత్మకంగా అంటే జగత్తులోని అన్ని నామాలూ అమ్మవే. రూపాత్మకము అంటే అన్నిరూపాలు అమ్మవే. కాబట్టి బ్రహ్మ మొదలు స్తంభము పర్యంతము నామరూప భేదాలతో విరాజిల్లుతున్నది అంతా మన అమ్మే. మీరు మేము కూడా ఆవిడ ప్రతిరూపాలే. తత్వశాన నామంలో చెప్పిన 25 తత్త్వములు ఆ పరమేశ్వరి రూపమే. అందుచేతనే ఆ దేవి వివిధాకారా అనబడుతోంది.

లోకంలో భగవంతుణ్ణి రాముడని, కృష్ణుడని, అని ఇలా అనేక పేర్లతో అనేక మతాలవారు ఆరాధిస్తుంటారు. ప్రపంచంలోని మానవులు ఎన్ని రకాల ఆభరణాలు ధరించినా, వాటిలోని బంగారం ఒకటే. అలాగే దేవతామూర్తి ఏదైనా అందులోని
పరమేశ్వరుడు ఒక్కడే, అంటే వివిధమైన జీవులుగా జన్మించి వారిచేత వివిధ ఆకారాలలో పూజించబడుతున్నాడు. ఈ రకంగా వివిధమైన ఆకారాలు ధరించి ఉన్నాడు. సృష్టి పదిరకాలుగా జరుగుతోంది. అవి 1. మహత్సృష్టి, 2. అహంకార సృష్టి, 3. భూతసృష్టి, 4. ఇంద్రియ సృష్టి, 5. అష్టవిధ దేవసృష్టి, 6. షడ్విధ తమస్సృష్టి, 7. వనస్పతి సృష్టి ఇది ఆరురకాలు, 8. తిర్యక్ సృష్టి ఇది 28 రకాలు, 9. మానవసృష్టి, 10. కుమారసృష్టి. వీటన్నింటియందు ఉన్నది జగన్మాతే. కాబట్టే ఆవిడ వివిధాకారా అనబడుతుంది.

The Divine mother is spread throughout the world in various names and forms. All the names in the world are Her's. All forms in the world are Her's. So everything in this world! From Brahma to a small pillar, which is divided by differences in name and form, is our Mother. Even You and I are also her replicas. The 25 Tattvams mentioned in the name of Tatwasana are the forms of that Parameshwari. That's why the goddess is called Vividhaakara. In the world, the Lord is worshiped as Ram, Krishna, etc. by many religions. No matter how many types of ornaments the human beings wear, the gold in them is the same. Similarly, the Lord inside any deity is one and same. He is born as different beings and is worshiped by them in different forms. In this way he wears different forms. But inherently God is the only one. Creation takes place in ten ways. They are 1. Mahatsrishti, 2. Ahamkara Srishti, 3. Bhutasrishti, 4. Indriya Srishti, 5. Ashtavidha Devasrishti, 6. Shadvidha Tamassrishti, 7. Vanaspati Srishti which is of six types, 8. Tiryak Srishti which is 28 types, 9. Manavsrishti, 10. Kumarasrishti. All these are filled with Divine Mother. That is why she is called Vividhakara.

No comments:

Post a Comment

Popular