301.Hrimkari - It is clear from 300th name that we cannot know Divine mother from textual readings( they are mere descriptions of name and form). She can be known by meditating with the sound 'Hrim'.'Srim', 'Hrim', 'Kleem', 'aim' and 'souh' are called shakti pranavas.
302.Hrimathi - Divine mother is modest for her capabilities and caliber. She does not like pomp and vanity
303-304. Hrudya Heyopadeyavarjita - We learnt about divine mother's greatness previously. Now let us learn about her kindness and generosity. When a child gets hurt in play, he shouts 'Amma' from there. Immediately his mother responds to that from kitchen to that shout. Similarly, Divine mother also responds to whoever calls her. She will be responding from our heart. She never thinks whether the caller is worthy of her grace.
301. హ్రీంకారీ - నామరూపాలతోనే మనం జ్ఞానం అలవర్చుకుంటాం. కానీ 300వ నామంలో అమ్మ నామరూపాలకి అతీతం అని చెప్పబడింది. మరి అలాంటప్పుడు ఆవిడను మనం ఎలా తెలుసుకుంటాం. అందుకనే హ్రిమ్ కారం ఉన్నది. హ్రిమ్ కార ధ్యానంతో మనం అమ్మను తెలుసుకోగలుగుతాము. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి ప్రణవాలు. వాటిలో రెండవది హ్రీంకారము.
302. హ్రీమతీ - అమ్మ ఎల్లపుడు లజ్జతో ఉంటుంది. అట్టహాసాలు నచ్చవు.
303-304. హృద్యా హేయోపాదేయవర్జితా - అమ్మ గొప్పతనం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఆవిడ ప్రేమ, ఔదార్యం వర్ణించబడుతోంది. ఇంట్లో పిల్లవాడు ఆడుకుంటూ ఏదైనా దెబ్బ తగిలించుకున్నపుడు వాడు అక్కడినుంచే 'అమ్మా' అని అరుస్తాడు. ఆ పిలుపువిన్న అమ్మ వెంటనే వంట గదిలోంచి 'ఎం బాబూ! ఎం జరిగింది అంటూ స్పందిస్తుంది. పిల్లవాడి ఆర్తి తప్ప ఇంకేమి ఆవిడ పట్టించుకోదు. లలితాంబ కూడా అంతే. ఆర్తితో పిలిచిన వెంటనే హృదయ స్థానం నుంచి ఆవిడ స్పందిస్తుంది. అర్ధించువాడికి పుణ్య బలం ఎంతవుంది, కుల గోత్రాలు ఏమిటి మొదలైనవి ఆమె చూడదు.
No comments:
Post a Comment