భక్త జనులకు కల్పలతవలె కోరికలు తీర్చునది. సగము భక్తిగలవారికి పూర్తి భక్తికలుగచేసేది. పరమభక్తులకు,జ్ఞానులకు మోక్షమునిచ్చేది. దేవీ భాగవతంలో భక్తిని గురించి అమ్మ హిమవంతుడికి వివరిస్తూ రాజా ! భక్తి మూడు రకాలు 1. డంభాచారంతో ఇతరులకు బాధ కలిగించేది తామసభక్తి., 2. స్వార్థం చూసుకోవటం రాజసభక్తి, 3. ధృడదీక్షతో భగవంతుని ప్రీతికోసం చేసేది సాత్వికభక్తి. తామస, రాజసభక్తులు పరాభక్తికి దోహదం చేస్తాయి. ఫలాపేక్షలేకుండా కేవలము సేవాభావంతో తనకు, పరదేవతకు భేదము లేదని భావించి జితేంద్రియుడై ఆ దేవిని ధ్యానించేవాడు ముక్తి పొందుతాడు.
భక్తులు నాలుగురకాలు. 1. జ్ఞానులు, 2. జిజ్ఞాసులు, 3. అర్థార్థులు, 4. వ్యాధిపీడితులు
అలాగే భక్తి సాధన తొమ్మిదిరకాలు. వీటినే నవవిధభక్తులు అంటారు. అవి 1. శ్రవణం(స్వామి కథలు సంగీతం వినుట), 2. పాదసేవనం (స్వామి పాదకమలములను సేవించుట), 3. దాస్యం(దాసునిగా స్వామి కార్యములన్నీ చిత్తశుద్ధితో చేయుట), 4. కీర్తనం(స్వామి గుణగణములను కీర్తించుట), 5.అర్చనం(వేద మంత్రాలతో అర్చించుట), 6.సఖ్యం(స్వామితో ఎదో ఒక మానవీయ సంబంధం పెనవేసుకుని జీవించుట), 7.స్మరణం(స్వామి నామ స్మరణం), 8.వందనం(నమస్కరించుట), 9. ఆత్మనివేదనం(తననుతాను పూర్తిగా అర్పించుట).
ఈ జన్మలో కొంతభక్తి ఉండి సరిగా అర్చన చేయలేకపోతే మరుజన్మలో పూర్ణభక్తి అలవడుతుంది. ఈ రకంగా అమ్మను అర్చించినవారికి ఇహపరసుఖాలు కలుగుతాయి. అందుచేతనే ఆమె భక్తిమత్కల్పలతికా అనబడుతుంది.
ఈ జన్మలో కొంతభక్తి ఉండి సరిగా అర్చన చేయలేకపోతే మరుజన్మలో పూర్ణభక్తి అలవడుతుంది. ఈ రకంగా అమ్మను అర్చించినవారికి ఇహపరసుఖాలు కలుగుతాయి. అందుచేతనే ఆమె భక్తిమత్కల్పలతికా అనబడుతుంది.
Divine Mother fulfills the desires of her devotees. She helps in promoting levels of devotion of her devotees. She aids self-realization to the pious and wise. Divine mother explained to Himavantu about devotion in Devi Bhagavatam like this. O king! devotion is of three types 1. Causing pain to others with extremely orthodox and irrational rituals is tamasabhakti, 2. Seeking selfish motives is rajasabhakti, 3. Serving God with strong determination and without any selfish motives is Sattvikabhakti. Tamasa and Rajashabhakti later leads to parabhakti. He who meditates on Divine Mother without succumbing to senses, thinking that there is no difference between himself and Paramata, without desire of profit, and only with a sense of service, attains liberation.
There are four types of devotees. 1.Gnanis(the wise), 2.Jijnasa(the inquisitive), 3.Artha(those with selfish motives), 4.Artho(Those who are suffering)
Also there are nine types of devotional practices. These are called Navavidhabhakti. They are 1.Sravanam(Listening to God's stories or music), 2.Padasevanam(Accept his greatness and pray his lotus feet), 3.Dasya(Serve Him like a slave), 4. Kirtan(Sing songs of his stories and past times), 5.Archanam(Perform ritualistic pujas), 6. Sakhyam(Maintain a reationship with Him and treat him as a member in your life), 7.Smaranam(Remember/chant Him alwasys), 8.Vandanam(Offer obeisance), 9. Self-confession(forgetting ones very identity and submit totally to Him)
If you have some devotion in this life and are not able to worship properly, you will become an ardent devotee in the next life. Those who worship Divine mother in this way will get her blessings. That is why she is called Bhaktimatkalpalatika.
No comments:
Post a Comment