భగవద్గీతలో ఇలా చెప్పారు
చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశహ్
మనుషులందరికీ జీవిత లక్ష్యం ఒక్కటే. అదే మోక్షం. కానీ దానిని చేరుకునే దారి పద్దతి వేరు. మోక్షాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనుషులు తమ తమ గుణములు మరియు కర్మలను బట్టి ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకోవచ్చు. అందుకే నేను సృష్టిలో స్వేచ్ఛను పెట్టాను. మీ లక్ష్యాన్ని తెలుసుకోండి, మీకు నచ్చిన మార్గమును మీరే ఎంచుకోండి. ఆ మార్గంలో పయనిస్తున్నపుడు ఏ కష్టం వచ్చినా నేను మిమ్ములను ఆదుకుంటాను.
బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్యహ్ కృతః
ఉరూతదస్య యద్వైస్య పదభాగ్o శూద్రో అజాయత
అమ్మ మనకొరకు నాలుగు వర్ణాలను సృష్టించింది. అవి 1.బ్రాహ్మణ, 2.క్షత్రియ, 3.వైశ్య, 4.శూద్ర. పుట్టుకచే అందరూ శూద్రులే. ఎందుకంటే పుట్టగానే ఏది ధర్మమో, ఏది అధర్మమో ఎవరికీ తెలియదు. ఎనిమిదవ ఏట ఉపనయనం చేసుకుని గురుకుల విద్యాభ్యాసం మొదలుపెట్టాక పిల్లవాడి వర్ణం మారుతుంది. అతని కర్మను బట్టి బ్రాహ్మణుడిగానో, వైస్యునిగానో, క్షత్రియుని గానో మారుతాడు.
వేద విజ్ఞానం తెలియని శూద్రులు తమ శరీరంలోని ఓజస్సు, సహస్సును వాడుకుని కాయకష్టం చేసి, మిగిలిన వర్ణాల వారిని పోషిస్తారు. అందుకే పదభాగ్o శూద్రో అజాయత అన్నారు
వేదవిద్యను బాగా అభ్యసించిన బ్రాహ్మణుడు తన ఓజస్సు తేజస్సు ఉపయోగించి నోటి ద్వారా యజ్ఞ యాగాది క్రతువులు, విద్యాబోధన మొదలైన కర్మలు చేస్తాడు అందుకే బ్రాహ్మణో స్య ముఖమాసీత్ అన్నారు
మంచి హస్తకౌశల్యం, వైదిక జ్ఞానం కలిగిన క్షత్రియుడు అనేక యుద్ధ విద్యలను అభ్యసించి, జనుల రక్షణకు తన ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అందుకే బాహూ రాజన్యహ్ కృతః అన్నారు
మంచి లౌకిక జ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వైశ్యుడు తన తెలివితేటలతో వ్యాపారం చేసిజనులకు తగిన కొలువులు ఇస్తాడు. తన పూర్వీకులవద్దనుండి, గురువుల వద్దనుండి వ్యాపార రహస్యాలను తెలుసుకుని వాటిని భద్రంగా భావితరాలవారికి అందజేస్తాడు. అందుకే ఉరూతదస్య యద్వైస్య అన్నారు. మరిన్ని వివరములకొరకు ఈ పోస్టు చదవగలరు.
మనందరికొరకు అమ్మ 5 ఆశ్రమాలను నియమించింది. అవి 1.బాల్యం, 2.బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, 4.వానప్రస్థం, 5.సన్యాసం
అనేక విధమైన బాలారిష్టాలు ఎదుర్కొని, తల్లిదండ్రులవద్ద ఇంగితజ్ఞానం నేర్చుకోవడమే బాల్యం. గురువుల వద్ద విద్యాభ్యాసము చేసి, పూర్ణాయుద్ధాయము మరియు మోక్షమునకు కావలిసిన జ్ఞానం సంపాదించుకోవడమే బ్రహ్మచర్యం. వివాహము చేసుకొని, ఒక గృహము ఏర్పరిచి, ధర్మబద్ధముగా జీవితము సాగిస్తూ పెద్దలను కడతేర్చి, బిడ్డలను కని, పెంచి పోషించి, వారిని ప్రయోజకులను చేయడమే గృహస్థాశ్రమం. ఐహిక బంధాలకు దూరంగా ఉంటూ మోక్ష సాధన చేయడమే వానప్రస్థం. పరమాత్మకు తనను తానూ అర్పించుకోవడమే సన్యాసం.
No comments:
Post a Comment