విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారిచే సేవించబడేది. అమ్మ మణిద్వీపంలో ఉంటుంది. దానికి 25 ప్రాకారాలుంటాయి. వాటిలోని 14వ ప్రాకారంలో ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఉంటారు. 16వ ప్రాకారంలో మరీచి మొదలైన ప్రజాపతులతో కలిసి బ్రహ్మ ఉంటాడు. 17వ ప్రాకారంలో విష్ణువు ఉంటాడు. 18వ ప్రాకారంలో శివుడు ఉంటాడు.
దేవీ భాగవతంలో
బ్రహ్మవిష్ణుస్తథా శంభుర్వాసవో వరుణో యమః
వాయురగ్ని, కుబేర శ్చ త్వష్టా పూషాశ్వినౌ భగః
ఆదిత్యా వసనో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః
సర్వే ధ్యాయన్తి తాం దేవీం సృష్టి స్థిత్యంతకారిణీమ్ ||
బ్రహ్మ, విష్ణువు, శంభుడు, రుద్రుడు ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని కుబేర, త్వష్ట పురుషులు, అశ్వనీ దేవతలు, భగుడు, ఆదిత్యుడు, వసువులు, విశ్వదేవతలు, మరుద్గణాలు అందరూ సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మని ధ్యానిస్తున్నారు.
కేనోపనిషత్ లో
ఆ జగన్మాతను దర్శించినందు వలనే అగ్ని వాయువు ఇంద్రుడు మిగిలిన వారికన్నా గొప్పవారైనారు. వారిలో మొదటివాడు ఇంద్రుడు. అందుకే అతను దేవతలకు రాజైనాడు.
Divine Mother stays in Manidweepa and served by Vishnu, Brahma, Indra etc. It has 25 ramparts. In the 14th rampart there are dikpaalakas like Indra etc. In the 16th rampart, Brahma is present along with Prajapatis like Marichi etc. Vishnu is in the 17th rampart and Lord Shiva is in 18th.
In Devi Bhaagavatam
brahmaviṣṇustathā śambhurvāsavō varuṇō yamaḥ
vāyu ragni, kubēra śca tvaṣṭā pūṣāśvinau bhagaḥ
ādityā vasanō rudrā viśvēdēvā marudgaṇāḥ
sarvē dhyāyanti tāṁ dēvīṁ sr̥ṣṭi sthityantakāriṇīm ||
Brahma, Vishnu, Shambhu, Rudra, Indra, Varuna, Yama, Vayu, Agni, Kubera, Twashtas, Ashwini devatas, Bhaga, Aditya, Vasu, Vishwadevatas, Marudganas - All these pray Divine Mother for help when they face challenges.
In Kenopahishath
Agni Vayu Indra became superior to the others because of saw Divine Mother in meditation . The first of them was Indra. That is why he became the king of the gods.
No comments:
Post a Comment