Search This Blog

376. Shrungararasasampoorna

శృంగారము అను రసముచే పూర్తిగా నిండినది. ఈ నామము పూర్ణగిరి పీఠాన్ని తెలియచేస్తోంది. శృంగ అంటే రెండు, అర అనగా ఆరు. అని గ్రహించాలి అంటున్నారు భాస్కరాచార్యులు. ఈ రకంగా చెబితే ఆరు రెళ్ళు పన్నెండుదళాలు గల పద్యము. అనాహతము కాబట్టి శృంగారరసము అంటే అనాహత పద్మము. అక్కడ సం - తరచుగా, పూర్ణ - ఉండునది. అనాహత పద్మమునందు ఉండేది పరమేశ్వరి. మొత్తం పీఠాలు నాలుగు. 1. కామగిరి. 2. పూర్ణగిరి 3. జాలంధర 4. ఓడ్యాణ పీఠాలు. ఇందులో రెండవదయిన పూర్ణగిరి పీఠము అనాహతమునందున్నది అని తంత్రశాస్త్రం చెబుతోంది. కాబట్టి శరీరంలోని అనాహతచక్రమే పూర్ణగిరి పీఠము.

పరమేశ్వరి బ్రహ్మాంనదస్వరూపిణి. ఆనందఘనస్వరూపిణి. శ్రీచక్రమే పరమేశ్వరి స్వరూపం. శృంగ - కోణములచేత, అర - దళములచేత, రస - తొమ్మిది రసములు లేక భావములచేత, సంపూర్ణా - నిండి ఉన్నది. శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలలోనూ చతుర్దశారము, దశారయుగ్మము, అష్టకోణము, త్రికోణము. అనేవి కోణచక్రాలు వీటిలో మొత్తం కలిపి 45 కోణాలుంటాయి. అలాగే షోడశదళము, అష్టదళము. ఈ రెండింటియందు కలిపి 24 దళాలుంటాయి. అలాగే శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణల యందు తొమ్మిది రకాల రసాలుంటాయి. వీటినే నవరసాలు అంటారు.

1. భూపురం -త్రైలోకమోహనచక్రం- శృంగారరసం

2. షోడశదళం -సర్వాశాపరిపూరక చక్రం -వీరరసం

3. అష్టదళం- సర్వసంక్షోభణచక్రం - కరుణరసం

4. చతుర్దశారం - సర్వసౌభాగ్యదాయకచక్రం - భయానకరసం

5. బహిర్దశారం - సర్వరక్షాకరచక్రం - రౌద్రరసం

6. అంతర్దశారం - సర్వార్ధసాధకచక్రం - భీభత్సరసం

7. అష్టకోణం - సర్వరోగహరచక్రం - హాస్యరసం

8. త్రికోణం - సర్వసిద్ధిప్రదచక్రం - అద్భుతరసం

9. బిందువు - సర్వానందమయచక్రం - శాంతరసం

ఈరకంగా శృంగారరసంతో పాటుగా మిగిలినరసాలు అన్నీ అంటే నవరసాలు కలిగినటువంటిది.

Full of romance. This name refers to Poornagiri Peetha. Shringa means two, Ara means six. said Bhaskaracharya . In this way, it is a poem of six and twelve stanzas. Thatmeans Anahata Padma. Here is sam - often, purna - present. Divine mother is in Anahata Padma. There are four peethas in total. 1. Kamagiri. 2. Purnagiri 3. Jalandhara 4. Odyana Peethas. Tantrashastra says that the second seat of Purnagiri is in Anahata. So the Anahata Chakra in the body is the Purnagiri Peetha.

Parameshwari is Brahmanandaswarupini. Anandaghanasvarupini. Sri Chakra is the embodiment of Parameshwari. sringa - by the angles, ara - by the forces, rasa - by the nine rasas or senses, sampurna - filled. Chaturdashara, Dasarayugma, Ashtakona and Trikonam are in the nine enclosures of Sri Chakra. They have angular wheels which have a total of 45 angles. Also there is Shodasadala and Ashtadala. Together these two have 24 angles. Similarly, there are nine types of rasas in the nine enclosures of Srichakra. These are called Navrasas.

1. Bhupuram -Trilokamohanachakram- Romance 2. Shodasadalam -Sarvashaparipuraka chakra -Valor 3. Ashtadalam- Sarvasankshobhanachakram - Mercy 4. Chaturdasharam - Sarvasaubhagyadayakachakram - Horror 5. Bahirdasharam - Sarvarakshakarachakram - Anger 6. Antardasharam - Sarvardhasadhakachakram - Destruction 7. Ashtakonam - Sarvarogaharachakram - Comedy 8. Trikonam - Sarvasiddhipradhachakram - Wonder 9. Bindu - Sarvanandamaya Chakra - Peace

In this way all the 9 rasas along with the romantic rasa are forms of Divine Mother.

No comments:

Post a Comment

Popular