Search This Blog

361. Tamopaha

జగన్మాత ఉపాసకుల యొక్క అజ్ఞానము పోగొట్టి బ్రహ్మజ్ఞాన్ని ఇస్తుంది. కర్మకాండలవల్ల మోక్షం వస్తుంది అనుకోవటం అజ్ఞానం. పూజలు, వ్రతాలు, అర్చనలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా ద్వైతభావనతో ఉన్నవే. ఈ కర్మలు చెయ్యటంవల్ల లౌకికమైన కోరికలు తీరతాయి. అంతేకాని మోక్షం మాత్రం రాదు.

ఈశావాశ్యోపనిషత్తులో

అంధంతమః ప్రవిశంతి యే2 విద్యాఉపాసతే |
తతో భూయ ఇవ తే తమోయఉ విద్యాయాగం రతాః ||

అవిద్యను ఆరాధించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. యజ్ఞతత్త్వ విజ్ఞానాన్ని ఆనందించేవారు అంతకన్న అంధకారంలో ప్రవేశిస్తారు.

యజ్ఞాలవల్ల, కర్మకాండలవల్ల, పుణ్యఫలితాలు వస్తాయి. వాటివల్ల ఉత్తమజన్మలు కలుగుతాయి. అంతేకాని మోక్షంరాదు. అందుకే వాటిని అవిద్య అన్నారు. అందుచేతనే అవిద్య నాశ్రయించినవారు అంధకారంలో పడిపోతారు. అటువంటి అవిద్యను నాశనంచేసి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి.

The divine mother bestows the wisdom of Brahman and dispels the followers' ignorance. To believe that rituals offer salvation is ignorance. Pujas, Vratas, Archanas, Yajna Yagas are all dualistic. These karmas help people achieve their material goals. But cannot lead to salvation.

In the Isavasyopanishat

andhantamaḥ praviśanti yē2 vidyā'upāsatē | tatō bhūya iva tē tamōya'u vidyāyāgaṁ ratāḥ ||

Those who worship ignorance descend into the depths of darkness. Those who take pleasure in Yajnatattva knowledge go into deeper darkness.


No comments:

Post a Comment

Popular