309.Ranjani - Lord shiva is like a spatika (color less prism). And divine mother is like a red flower. When you put red flower near spatika linga, the originally colorless crystal linga will also glow in red color.
310.Ramani - Divine mother stays in the hearts of her devotees. She makes them feel happy and joyous.
311.Rasya - 'Rasa' means the juice or gist of a substance. Divine mother is the 'Rasa' in everything in this 'Jagat'. But one has to do a lot of practice to understand it. Ghee is not directly visible in milk. Similarly, parameswara is not directly visible within us. Divine mother is in all beings in the form of the 'faculty of grasping' the gist
312.Ranathkinkinimekhala - Divine mother wears the golden waist band with tinkling bells.
309.రంజనీ - స్ఫటికమువలే ప్రకాశించు పరమశివుని, దాసాని పువ్వులా ఉన్న అమ్మ రంజింపచేస్తుంది. అనగా స్వచ్ఛమైన స్ఫటికము ప్రక్కన ఎర్రని రంగు పెట్టినట్లైతే, ఆ స్ఫటికంకూడా ఎర్రగానే ప్రకాశిస్తుంది.
310.రమణీ - భక్తజనుల హృదయములందు విహరించునది. భక్తులను రమింపచేయునది. ఆనందింపచేయునది.
311.రాస్యా - పదార్థంలో ఉండే సారాన్ని రసము అంటారు. జగత్తులోని ప్రతిపదార్ధంలోనూ కూడా ఉండే రసము అమ్మ యొక్క స్వరూపమే అయి ఉన్నది. పాలలోని నెయ్యిలాగా పరమేశ్వరుడు ప్రతిజీవిలోనూ అంతర్గతంగా ఆవరించి ఉన్నాడు. ఇక్కడ పాలలోని నేయిలాగా అనే పదానికి అర్ధం - నిజంగా చూస్తే పాలలో నెయ్యి కనిపించదు. వాటిని కాచి, తోడు పెట్టి వెన్న తీసి, ఆ వెన్నను కరగపెడితేనేగాని నెయ్యి రాదు. అంటే జీవి తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. అప్పుడే ఆత్మదర్శనమవుతుంది. ఆ రకంగా ప్రతిజీవిలోని రసగ్రహణ శక్తి ఆ అమ్మ అంశయే అని తెలుసుకోవాలి.
312.రనత్కింకిణిమేఖలా - మ్రోగుచున్న చిరుగంటలు గల మొలనూలు గలది.
No comments:
Post a Comment