Search This Blog

254-255 - DhyanaDhyatruDheyarupa DharmadharmaVivarjitha

254.DhyanaDhyathruDhyeyarupa - She who is personification of meditation, the one who meditates and what is being meditated upon.

Meditation plays a very important role in self-improvement. Keeping mind steadfast on God is Meditation. There is an easy technique for it. Take anything that you like the most as a support for your meditation. If you like a pudding, imagine that you are offering it to Mother in your meditation. Imagine that she tasted and offered the remaining to you. Or imagine that you are offering a saree of your favorite color to Mother. Imagine how she looks in that saree.  Anything that you like. Any poem, any scent, Gold, Silver, anything will do. Just imagine you and Mother in your mediation and try to feel her motherhood.

255.DharmadhramaVivarjitha - Dharma is one that takes you close to Moksha by reducing or destroying rebirths. Adharma is the opposite. It drags you backwards and increases the number of rebirths. Dharma/Adharma are decided based our karma. In the previous names, we learnt that Divine Mother does not do karma. So, she is beyond Dharma or Adharma.

254.ధ్యానధ్యాతృధ్యేయరూపా - ధ్యానం, ధ్యానించబడేది, ధ్యానం చేస్తున్నది అన్ని అమ్మే.

స్వీయ అభివృద్ధిలో ధ్యానం చాలా ముఖ్య భూమిక వహిస్తుంది. మనస్సును కదలకుండా భగవంతుని మీద నిలపడమే ధ్యానం. సులభంగా ధ్యానం చేయడానికి ఒక పధ్ధతి ఉంది. మీకు అన్నింటికన్నా ప్రీతిప్రదమైన విషయాన్ని మీ ధ్యానానికి ఆలంబనగా చేసుకోండి. మీకు ఏదైనా ఆహార పదార్థం ఇష్టమైతే అది వండి అమ్మకు ప్రసాదంగా ఇస్తున్నట్లు ఊహించుకోండి. ఆమె కొంత తిని మిగతాది మీకు ఇచ్చినట్లు ఊహించుకోండి. లేదా మీకు నచ్చిన రంగు పట్టుచీర అమ్మకు ఇచ్చినట్లు ఊహించుకోండి. ఆమె ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా శబ్ద, స్పర్శ, రస, రూప గంధములలో ఏ విషయం మీకు నచ్చుతుందో అదే అమ్మకు మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నట్లు ఊహించుకోండి. ఏదైనా ఒక పండు, ఒక శ్లోకం, ఒక అగరత్తు ఏదైనా ఫరవాలేదు. రోజూ ఒక సమయం అని అనుకుని ఆ సమయంలో ఇలా ధ్యానం చేయండి. ఆ ఊహలో అమ్మ ప్రేమానుభూతిని ఆస్వాదించండి. 

255.ధర్మాధర్మవివర్జితా - మోక్షపదంలో ముందుకు తీసుకువెళ్లేది ధర్మం. దీని వలన మనకు జన్మలు తగ్గి లేదా నశించి మోక్షము చెరువవుతుంది. అధర్మము వలన జన్మలు పెరుగుతాయి. మోక్షము ఇంకా దూరమవుతుంది. మనం చేసే కర్మలు బట్టి ధర్మాధర్మములు నిర్ణయించబడతాయి. అమ్మకు కర్మ చేయవలసిన అవసరమే లేదు అని ఇంతకు ముందు వచ్చిన నామాలలో చెప్పుకున్నాం. కర్మే లేనప్పుడు ధర్మం/అధర్మం ఆమెకు ఎలా వర్తిస్తుంది? అందుకే ధర్మాధర్మ వివర్జితా అన్నారు. 

No comments:

Post a Comment

Popular