Search This Blog

18. vaktralakshmi parivaha chalanminabha lochana

Amazon Molly

అమ్మవారి కన్నుల గురించి ఎంత చెప్పినా సరిపోదు. అందుకనే వ్యాసుల వారు ఒక గొప్ప ఉపమానం ఇచ్చి మేనల్నే ఊహించుకోమన్నారు.  చేపల లో కొన్ని జాతులు ఎటువంటి సంపర్కం లేకుండానే పిల్లలకు జన్మ నిస్తాయి. అవి కేవలం వాటికంటి చూపులతోనే తమ పిల్లల తాపాలను తీరుస్తాయి. అలాగే అమ్మ కనులు మనందరి తాపాన్ని తీర్చే చేపల వలే ఉన్నాయి. అమ్మ ముఖం ఈ చేపలు ఉండే మంచి నీటి సరస్సు వలే ఉంది.  అందుకే అమ్మకు మీనాక్షీ అని పేరు వచ్చింది. అంటే కేవలం ఆమె చూపు సోకినంత మాత్రం చేత మన కోరికలు తాపములు అన్ని శమించిపోతాయి. ఇది కేవలం కట్టుకథ కాదు అటువంటి చేపలు నిజంగానే ఉన్నాయి. అమెజాన్ మొల్లి అనే చేప ఎటువంటి సంపర్కం లేకుండానే పిల్లలను పుట్టిస్తుంది. మెక్సికో మరియు టెక్సాస్ మధ్యనున్న మంచి నీటి సరస్సులలో/ నదులలో ఇది నివసిస్తుంది.  భగవత్ సృష్టిలో ఒక చిన్న ప్రాణి అయిన చేపకే ఇది సాధ్యం అయినప్పుడు జగన్మాత అయిన మన అమ్మకు ఇది ఎంత పని? భక్తితో ఆమెను ప్రార్ధించండి  చాలు. ఆవిడ మీ కోరికలన్నీ తీరుస్తుంది. ఆవిడ తలచుకుంటే ఏదైనా చేయగలదు.

There are no words that can explain Divine Mother's eyes completely. Hence sage vedavyasa gave a great parable and left it to our imagination. Some species of fish give birth to offspring without any contact. They satisfy all the needs of their children with their mere looks. Mother's eyes are like that fish. Mother's face is like the fresh water lake where these fish live. That is why she got the name Meenakshi. That means, all our desires and cravings are quenched by the mere sight of her. It's not a myth. Such fish really exist. Amazon Molly, that lives freshwater lakes and rivers between Mexico and Texas gives birth to babies without any contact. It just looks at her children when they come to her. That's all the feeding it gives to those babies. If a small fish can do this, can't the omni present all powerful Divine mother do it? You just have to pray her with devotion. That will fulfill all your desires.

No comments:

Post a Comment

Popular