Search This Blog

152-155.Nishkarana...Nirishvara

152.Nishkarana - Kaarana means cause. Divine mother is the cause for the whole creation. But there is no cause for her existence. So, she is called Nishkarana.

153.Nishkalanka - 'kalankam' means sin. When you do actions to satisfy a desire, it becomes karma. When those actions are against vedic principles, they accrue sin. Divine mother does not do anything for herself. So, she doesn't perform any karma. Then how can sin ever be attributed to her? It is not possible.

154.Nirupadhih - 'Upadhi' means something that is given to you for following dharma. For a human soul, its body is its upadhi. And its Dharma is humanity. There are crores of living beings (jeevas) in this world. All of them will have a body so that they can follow Dharma. That is why Dharma is described as 

Dhriyateva janayaditi iti dharmah
If there is something that you must know and must follow, that is Dharma

The Dharma to be followed by a jeeva depends on its past karma. At the time of rebirth, the net effect of all the past actions is assessed in order to decide the dharma of a Jeeva.  It will be assigned a body based on this. That is why the body is called 'upadhi'. A jeeva with human body possess a great power called 'chaitanya'. By virtue of chaitanya, they are able to attain Moksha - A state where there is no need to accept another body. Nirupadhi means being in a state where no more re-births are required and hence no need of any 'upadhi'. That is why divine mother is called 'Nirupadhih'.

155.Nirishvara - Divine mother is the controller of the whole universe. There is no one above her to assign this responsibility. Nirishvara means she who does not have anyone controlling her.

152.నిష్కారణా - సృష్టి మొత్తానికి ఆవిడే కారణం. ఆవిడ వల్ల సృష్టి వచ్చింది. మరి ఇక ఆవిడ రావడానికి ఇంకో కారణం లేదు. అందుకే నిష్కారణ.

153నిష్కలంకా - కళంకం అంటే పాపం. వేదవిరుద్ధమైన కర్మల వలన పాపం కలుగుతుంది. అమ్మ కర్మలు చేయదు. ఎందుకంటే ఆవిడ ఏపని చేసినా అది లోక కళ్యాణం కోసమే. మనసులో కోరిక ఉంటేనే కర్మలు చేస్తాం. చేసిన కర్మ వేదం విరుద్ధమైనపుడు పాపం మూటగట్టుకుంటాం.

154.నిరుపాధిహ్ - ఉపాధి అంటే తన సమీపమునకు ధర్మాన్ని తీసుకువచ్చేది అని అర్ధం. ఈ విశ్వంలో కోటానుకోట్ల జీవములున్నవి. కానీ ఒక్కొక్క జీవికి తన పూర్వ జన్మ కర్మలవలన ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ  ధర్మాన్ని బట్టి దానికి ఓక శరీరం ఇవ్వబడుతుంది. అందుకే శరీరం జీవుడికి దేవుడిచ్చిన ఉపాధి.

ధ్రియతేవా జనయదితి ఇతి ధర్మః 
నీవు తప్పక తెలుసుకొనవలసినది, తెలుసుకుని ఆచరించవలసినది ఏదో అదే ధర్మం 

అయితే మానవ శరీరం కలిగిన జీవులకు చైతన్యం అనే ఓకే గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తితో వారు ఇక మళ్ళీ శరీరం పొందవలసిన అవసరం లేకుండా ఉండే మోక్ష ధామాన్ని చేరుకుంటారు. నిరుపాధి అంటే ఉపాధి అవసరంలేని స్థితిలో ఉండడం. అందుకే అమ్మను నిరుపాధి అన్నారు. 

155.నిరీశ్వరా - అమ్మే అన్నింటికీ ఈశ్వరి(ప్రభువు). ఆమె కన్నా పైన ఎవరు లేరు. అందుకే నిరీశ్వర.

No comments:

Post a Comment

Popular