Search This Blog

193-195 - Dushtadura Duracharashamani Doshavarjitha

193.Dushtadura
People with wicked nature think that this body is the representation of 'me'. Such people are egoistic. They cannot experience the pure love of divine mother. Those striving for self-realization should keep away from company of such people. Mingling with them can harm your spiritual growth.
194.Duracharashamani
'Aachaara' describes things one should do and things one should not do. It is a prescribed way to do karma. One has to learn aachaara from the vedas or puranas or epics like Ramayana or Mahabharata. Doing karma without following aachaara can accrue sin. If you realize your mistakes and beg pardon, Divine mother will rid you of all the sin accrued.
195.Doshavarjitha
'Dosha varjita' means defectless. Foolproof. 'Raaga' and 'Dwesha' are the seeds for defects within us. From these arise the 'Arishadvarga' due to which we are misguided, and our actions become flawed. But divine mother does not have these. Hence, she is 'Doshavarjita'

193.దుష్ఠదూరా
శరీరమే నేను అనే భావనలో ఉండేవారు దుష్టులు. వారు అహంకారులు. అటువంటి వారు అమ్మయొక్క అవ్యాజమైన ప్రేమకు పాత్రులుకాలేరు. కావున వారితో మైత్రి వద్దు. అటువంటి వారితో స్నేహం మీ సాధనకి ప్రమాదకరం. వారిని దూరంగా ఉంచడమే ఉత్తమం. 
194.దురాచారశమనీ
ఆచారంలో విహితకర్మ (చేయవలసిన పనులు) నిషిద్ధకర్మ (చేయకూడని పనులు) అని రెండు ఉంటాయి. ఇవి సుఖంగా సునాయాసంగా కర్మలు చేయడానికి సూచించిన మార్గాలు. వేదశాస్త్రాలలోను పురాణాలలోను రామాయణం వంటి కావ్యాలలోను వీటిని విపులంగా వర్ణించారు. వీటికి విరుద్ధంగా ప్రవర్తించడమే దురాచారం. దురాచారం వలన పాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరిన బిడ్డల పాప భారాన్ని అమ్మ తొలగించేస్తుంది. 
195.దోషవర్జితా
దోషవర్జితా అంటే దోషములు లేనిది అని అర్ధం. మనలోని దోషాలకు రాగ ద్వేషాలే మూలకారణం. వీటి నుండి అరిషడ్వార్గములు పుట్టుకొస్తాయి. వాటి వలన మనలో దోషములు పుట్టుకొస్తాయి. కానీ అమ్మ రాగ ద్వేషాలకి అతీతం. అందుకే దోష వర్జితా అన్నారు.

No comments:

Post a Comment

Popular