Search This Blog

212-214.maharupa...paathakanashini

212.Maharupa
'Rupa' means form. Everything in this universe has a name and form attributed to it. There is just abstract form in the beginning. From that came the Mahat. From it came the 'Ahankar'. Then came the universe with name and form. All these are forms of divine mother. Hence, she is called 'Maharupa'

213.Mahapujya
Great people like Brahma, Indra, Upendra did pujas for divine mother. Hence, she is called Mahapujya.

214.Mahapathakanasini
'Pataka' means sin. Mahapataka means dangerous/great sin. Sins are classified into 'Pancha maha patakas', 'Upa patakas', 'Sankalikaranas', 'Apatri karanas'. The process of penance for each of these is also described. One has to do puja to several devatas as part of this penance. Alternatively, one can do puja to Divine mother as penance. Those who meditate upon Divine Mother and experience her bliss are rid of all the sins.

212.మహారూపా
అమ్మ గొప్పదైనటువంటి, శ్రేష్ఠమైనటువంటి రూపం కలది. ఈ జగత్తు అంతా నామరూపాలతో ఉంటుంది. మొట్టమొదట అవ్యక్త రూపం ఉండేది. దాని నుండి మహత్ వచ్చింది. దాని నుండి అహంకారము వచ్చింది. ఆ తరువాత నామరూపాత్మకమైన ఈ జగత్తు వచ్చింది. ఇది అంతా అమ్మ స్వరూపమే. అందుకే మహారూప అన్నారు. 

213.మహాపూజ్యా
బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలగు వారిచే పూజించబడింది మన అమ్మ. అందుకే మహా పూజ్యా అన్నారు. 

214.మహాపాతకనాశినీ
పాతకం అంటే పాపం. మహా పాతకమంటే ఘోరమైన పాపం. పంచ మహా పతకాలు, ఉప పాతకాలు, సంకలీకరణములు, అపాత్రీకరణములు ఇలా పాపాలు ఎన్నో రకాలు. శాస్త్రంలో వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం తెలుపబడింది. వాటినే శాంతికర్మలు అంటారు. త్రికరణశుద్ధితో క్షమాపణ చెప్పి అమ్మను పూజించి, ఆమె దివ్య దర్శనం పొందినవారి పాపమంతా జ్ఞానాగ్నిలో  దగ్ధమైపోతుంది. 

No comments:

Post a Comment

Popular