Search This Blog

204-206. Sarvamantraswarupini - Sarvatantrarupa

204.Sarvamantraswarupini
There are 7 crore mantras. The are divided into 1. Purvamnaya, 2. Dakshinamnaya, 3. Paschimamnaya, 4. Uttaramnaya, 5. Oordhvamnaya, 6. Anuttaramnaya. Each mantra has a Rishi, Chandas, Devata, Beeja, Shakti and Keelakam. These are called Shadangas. On top of these each mantra can be described in 4 planes. They are 1.Tattva, 2.Artha, 3.Roopa, 4.Shabda. Divine mother is personification of all these mantras. Hence she is called Sarvamantra swaroopini.

205.Sarvayantrathmika
There are 3 types of Yantras. 1.Pooja yantras, 2.Pratishta yantras, 3.Dharana yantras. Each devata will have a yantra. But all these yantras are personified by Divine Mother. So, she is called Sarva yantratmika.

206.Sarvatantrarupa
Trantra means the sequence of actions to be done from the moment of taking Sankalpa (determination) till the end of the occasion(program). We do these to please devatas and satisfy our wants. There are total 64 tantras to help us satisfy our wants. The 65th one is Srividya tantra. This helps us to attain moksha. These tantras form the body of out Divine mother.

204.సర్వమంత్రస్వరూపిణీ
మనకు మొత్తం 7 కోట్లు మంత్రాలు ఉన్నాయి. ఇవి 6 ఆమ్నాయాలుగా ఉంటాయి. అవి 1.పూర్వామ్నాయ 2.దాక్షిణామ్నాయము , 3.పశ్చిమామ్నాయము 4.ఉత్తరామ్నాయము, 5.ఊర్ధ్వమ్నాయము 6.అనుత్తరామ్నాయముగా ఉంటాయి. ప్రతీ మంత్రానికి షడంగములు ఉంటాయి. అవి 1.ఋషి, 2.ఛందస్సు, 3.దేవత, 4.బీజము, 5.శక్తి, 6.కీలకం. ప్రతీ మంత్రానికి తత్వ భావం, అర్ధభావం, రూపభావం, శబ్దభావం ఉంటాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలే. అందుకే సర్వ మంత్రస్వరూపిణి అన్నారు. 

205.సర్వయంత్రాత్మికా
యంత్రములు మూడు రకములు. అవి పూజ యంత్రాలు, ప్రతిష్ట యంత్రాలు, ధారణా యంత్రాలు. యంత్రము దేవత ప్రతిరూపము. ఉపాసన చేయబడే ప్రతీ దేవతకి ఒక యంత్రమున్నది. అన్ని యంత్రాలు ఆ పరమేశ్వరి యొక్క ఆత్మ స్వరూపాలే. అందుకే సర్వ యంత్రాత్మిక అన్నారు. 

206.సర్వతంత్రరూపా
తంత్రం అంటే సంకల్పము చేసిన క్షణం నుండి కార్యం పరిసమాప్తమయ్యే దాకా చేయవలసిన విధివిధానము. మనయొక్క కోరికలు సాధించుకోవడానికి, దేవతలను తృప్తి పరచడానికి ఈ తంత్రాలు చెప్పబడ్డాయి. ఇలా 64 తంత్రాలు ఉన్నాయి. ఈ తంత్రాలవల్ల లోకంలో కావలిసినవన్నీ మనం సాధించుకోవచ్చు. శ్రీవిద్యా తంత్రం 65వది. అది మోక్షప్రదము. ఈ తంత్రములే శరీరముగా కలది మన అమ్మ.

No comments:

Post a Comment

Popular